న్యూఢిల్లీ: అన్ని రంగాల్లోనూ తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల వల్లే సులభతర వ్యాపార నిర్వహణకు సంబం ధించి ప్రపంచ బ్యాంకు ర్యాంకింగ్‌లో భారత్ 30 స్థానాలు మెరుగుపరచుకుందని ప్రధాని మోదీ అన్నారు. వ్యాపారానికి అను కూల వాతావరణం ఉండటం వల్ల పారిశ్రామిక వేత్తలకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అవకాశాలు ఏర్పడతా యన్నారు. ‘భారత్ 30 స్థానాలు మెరుగు పరచుకుని 100వ ర్యాంకును సాధించింది. ఇది గొప్ప గర్వకారణం’ అని మోదీ తన లింక్‌డ్ ఇన్ ఖాతాలో పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment