ధర్మశాల (హిమాచల్‌ప్రదేశ్): ఉచిత తాయిలాలకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. పారదర్శకమైన, సులభతర వ్యాపార నిర్వహణకు అనుగుణంగా నిబంధనలు ఉండాలేకానీ, ఉచిత విద్యుత్తు, చౌకగా భూమి, పన్ను రాయితీలు కాదన్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణకు ధర్మశాలలో ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సును ప్రధాని మోదీ గురువారం ప్రారంభించి మాట్లాడారు.
2025 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్ల (రూ.350 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న లక్ష్యంలో అన్ని రాష్ట్రాలు, జిల్లాల పాత్ర ఉంటుందన్నారు. ‘‘పరిశ్రమలు పారదర్శకత, స్వచ్ఛమైన వ్యవస్థను ఇష్టపడతాయి. అనవసర నిబంధనలు, అనవసర ప్రభుత్వ జోక్యం పరిశ్రమల వృద్ధికి విఘాతం కలిగిస్తుంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. పర్యాటకం, ఫార్మా రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు హిమాచల్‌ప్రదేశ్‌కు ఎన్నో సామర్థ్యాలు ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment