world champion ship
-
రవిశాస్త్రి, మియాందాద్ల గొడవకు కారణమైన 'ఆడి' కారు.?!
టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి అందరికి సుపరిచితమే. మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రవిశాస్త్రి.. ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత కామెంటేటర్‌గా, టీమిండియా హెడ్‌కోచ్‌గానూ సేవలందించాడు. ఒకే ఓవర్లో ఆరు సిక్సులు కొట్టిన బ్యాట్స్ మెన్ లిస్టులోనూ తనది ప్రత్యేక స్థానం. ఇక గొప్ప ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న రవిశాస్త్రి టీమిండియా తరపున 80 టెస్టులు, 150 వన్డేలు ఆడాడు. 1983 వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియా జట్టులో రవిశాస్త్రి సభ్యుడిగా ఉన్నాడు. విషయంలోకి వెళితే.. 1985లో ఆస్ట్రేలియా వేదికగా బెన్సన్ అండ్ హెడ్జెజ్ వరల్డ్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నీ ఫైనల్లో భారత్, పాకిస్తాన్‌లు తలపడ్డాయి. చిరకాల ప్రత్యర్థి పాక్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమిండియా కప్‌ను ఎగరేసుకుపోయింది. ఫైనల్ మ్యాచ్‌తో టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన రవిశాస్త్రి 182 పరుగులతో పాటు 8 వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన రవిశాస్త్రి ఆడి కారును సొంతం చేసుకున్నాడు. విజయం అనంతరం ఆడి కారును రవిశాస్త్రి ఎంతో ఇష్టంగా డ్రైవ్ చేయగా.. తోటి టీమిండియా ఆటగాళ్లు కారు మీద కూర్చోని సెలబ్రేషన్స్ చేసుకోవడం అప్పట్లో ట్రెండింగ్‌గా మారింది. ఈ నేపథ్యంలో అదే ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ తనను అవమానించిన ఒక సంఘటనను.. ఆడి కారు గెలుచుకోవడం వెనుక ఉన్న కథను తాజాగా రివీల్ చేశాడు. ''1985 బెన్సన్ అండ్ హెడ్జెస్ టోర్నమెంట్ ఫైనల్లో పాకిస్థాన్ ను ఓడించడానికి మాకు మరో 15-20 రన్స్ అవసరం ఉంది. ఆ సమయంలో జావెద్ మియాందాద్ సెట్ చేసిన ఫీల్డ్ ను తెలుసుకోవడానికి స్క్వేర్ లెగ్ వైపు చూస్తున్నాను. అప్పుడు మిడ్ వికెట్ లో ఉన్న మియాందాద్ నా దగ్గరికి వచ్చి.. నువ్వు మళ్లీ మళ్లీ అక్కడేం చూస్తున్నావ్ అని తనదైన స్టైల్లో అన్నాడు. కారును ఎందుకు చూస్తున్నావ్.. అది నీకు దక్కదు అంటూ వెటకారంగా మాట్లాడాడు. దీనికి కౌంటర్‌గా అవును జావెద్.. నేను అటు వైపు చూడడం లేదు.. ఆ కారే నా వైపు చూస్తుంది.. నా ఇంటికి వస్తుంది అని పేర్కొన్నా'' అంటూ తెలిపాడు. ఇక 1983 వరల్డ్ కప్ గెలిచిన రెండేళ్లకే వరల్డ్ సిరీస్ గెలవడం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నాడు. తన జీవితంలో తాను చేసిన ఎన్నో పనుల కంటే ఆడి కారు టాప్ స్థానంలో ఉంటుందని పేర్కొన్నాడు. ఆరు సిక్స్‌లు కూడా ఎప్పటికీ గుర్తొచ్చేదే అయినా.. తన కెరీర్లో మాత్రం 1985లో సాధించిన ఆడి కారుకే ఎక్కువ విలువుంటుందని తెలిపాడు. అప్పుడప్పుడే వన్డే క్రికెట్ లోకి రంగులు రావడం, డే నైట్ మ్యాచ్ లు, రంగుల దుస్తులు తొలిసారి ఇండియాకు రావడం లాంటివి ప్రత్యేకమైనవి. ఇక ఫైనల్లో పాకిస్థాన్ ను ఓడించడం అంటే అది పెద్ద అచీవ్మెంట్ కింద లెక్క అని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఇక రిటైర్మెంట్ అనంతరం కామెంటేటర్‌గా రాణిస్తున్నాడు. టీమిండియా హెడ్ కోచ్‌గా పనిచేసిన రవిశాస్త్రి కొన్ని అద్భుత విజయాల్లో భాగంగా నిలిచాడు. రవిశాస్త్రి హెడ్‌కోచ్‌గా టీమిండియా 43 టెస్టుల్లో 25 విజయాలు సాధించింది. ఇందులో రెండుసార్లు ఆసీస్ గడ్డపై సాధించిన టెస్టు సిరీస్ విజయాలు ఉండడం విశేషం. ఇక రవిశాస్త్రి 76 వన్డేల్లో 51 వన్డేలు, 65 టి20ల్లో 43 మ్యాచ్‌లు గెలిచింది. చదవండి: Arjun Tendulkar: తండ్రి పేరు తొలగించుకుంటే మంచిది.. కనీసం 50 శాతమైనా! Hardik Pandya-Ravi Shastri: ఇద్దరి బంధం ఎంతో ప్రత్యేకం.. అపూర్వ కలయిక -
సింధును చూసి భారత్ గర్విస్తోంది..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ విజేత పీవీ సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల సింగిల్స్ ఫైనల్లో అద్వితీయ ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించిన ఆమెకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ గవర్నర్ నరసింహన్, ఏపీ గవర్నర్ హరిచందన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులతో పాటు క్రీడాకారులు, బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.పీవీ సింధును చూసి భారత్ మరోసారి గర్విస్తోందంటూ ప్రధాని ట్వీట్ చేశారు. The stupendously talented @Pvsindhu1 makes India proud again! Congratulations to her for winning the Gold at the BWF World Championships. The passion and dedication with which she’s pursued badminton is inspiring. PV Sindhu’s success will inspire generations of players. — Narendra Modi (@narendramodi) August 25, 2019 Congratulations @Pvsindhu1 for winning the BWF World Championship. This is a proud moment for the entire country. Your magic on the court, hardwork and perseverance enthralls and inspires millions. Best wishes World Champion for all your future battles #PresidentKovind — President of India (@rashtrapatibhvn) August 25, 2019 సింధూను చూసి గర్విస్తున్నాం. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ...పీవీ సింధు విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చారిత్రాత్మక విజయం సాధించిన ఆమెకు అభినందనలు తెలిపారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి మొదటి భారతీయ క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించారన్నారు. ఆట మొదటి నుంచి చివరివరకూ అద్భుత ప్రతిభ ప్రదర్శించారని, ఆమె మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షిస్తూ ఈ మేరకు ట్వీట్ చేశారు. Historical Victory! Congratulations @Pvsindhu1 for becoming the first Indian to win the gold medal at #BWFWorldChampionships. Dominated right from the start and finished like a true champion. 👏👏 — YS Jagan Mohan Reddy (@ysjagan) August 25, 2019 -
ప్రపంచ చెస్ చాంపియన్ కార్లసన్
అనుకున్నంతా అయ్యింది. ఐదు సార్లు వరుసగా ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ సాధించిన భారత యోధుడు విశ్వనాథన్ ఆనంద్ తొలిసారి తలవంచాడు. నార్వే దేశానికి చెందిన మాగ్నస్ కార్ల్సన్ ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. చెన్నైలో జరుగుతున్న ఫిడే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ పోటీలలో భారత యోధుడు విశ్వనాథన్ ఆనంద్‌ను 6.5-3.5 పాయింట్ల తేడాతో ఓడించి ఈ నార్వే యువకుడు కిరీటాన్ని దక్కించుకున్నాడు. ఒకప్పుడు చెస్ అంటే రష్యన్లదేనని భావన ఉండేది. అప్పట్లో గ్యారీ కాస్పరోవ్, అనతొలి కార్పోవ్ దిగ్గజాల్లా ఉండి, వాళ్లే చెస్ కిరీటాలు సాధిస్తూ ఉండేవారు. అలాంటి సమయంలో మన దేశం నుంచి వెళ్లిన విశ్వనాథన్ ఆనంద్ వాళ్లిద్దరినీ మట్టికరిపించి, ప్రపంచ చెస్ విజేతగా నిలిచాడు. ఏకంగా 13 సంవత్సరాల పాటు ఆ టైటిల్ మరెవ్వరికీ దక్కకుండా నిలబెట్టుకున్నాడు. అయితే, తాజా పోటీలలో భాగంగా పదో గేమ్ డ్రా కావడంతోనే ఈ కిరీటం ఆనంద్ చేజారింది. నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్సన్ విశ్వవిజేతగా నిలిచాడు. 22 ఏళ్ల అతి పిన్న వయసులోనే ఈ ఘనతను సాధించి రికార్డు సృష్టించాడు. తన ఆటతీరు పట్ల చాలా అసంతృప్తి చెందానని ఓటమి తర్వాత విశ్వనాథన్ ఆనంద్ వ్యాఖ్యానించాడు. ఆనంద్ ఎప్పటికీ చాలా గొప్ప ఆటగాడని, తనకు ఆయనంటే ఎంతో గౌరవమని కార్ల్సన్ అన్నాడు. అలాగే ఆయనపై విజయం సాధించడమంటే చాలా గౌరవప్రదంగాను, సంతోషంగాను భావిస్తున్నట్లు తెలిపాడు. -
ఓడిపోతే రూ.3 కోట్లు!
న్యూఢిల్లీ: ఫిక్సింగ్.. సామాన్యంగా ఈ జాడ్యం ఎక్కువగా క్రికెట్లోనే కనిపిస్తుంటుంది. అయితే కాదేదీ ఫిక్సింగ్‌కు అనర్హం అన్నట్టుగా ఇది ప్రపంచ క్రీడలన్నింటికీ పాకింది. తాజాగా ప్రఖ్యాత రెజ్లర్ సుశీల్ కుమార్ సంచలనాత్మక విషయాన్ని బయటపెట్టాడు. 2010 మాస్కోలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తనకెదురైన ఫిక్సింగ్ అనుభవాన్ని వెల్లడించాడు. 66కేజీ ఫ్రీస్టయిల్ ఫైనల్ బౌట్లో రష్యా రెజ్లర్ అలన్ గొగేవ్ చేతిలో ఓడితే రూ.3 కోట్ల భారీ మొత్తం ముడుతుందని కొంత మంది ఆఫర్ చేసినట్టు సుశీల్ చెప్పాడు. అయితే ఈ విషయాన్ని అప్పుడే అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని అన్నాడు. ‘మా జట్టు విదేశీ కోచ్‌ల్లో ఒకరి ద్వారా ఈ ప్రతిపాదనను నా దగ్గరికి తెచ్చారు. ఫైనల్ బౌట్ ఓడితే రూ.3 కోట్లు ఇస్తామన్నారు. ఓ రెజ్లర్‌కు నిజంగా ఇది చాలా పెద్ద మొత్తం. రష్యాలో రెజ్లింగ్‌కు భారీ క్రేజ్ ఉంటుంది. వారు ఓ భారత ఆటగాడు ఫైనల్‌కు వస్తాడని ఊహించలేకపోయారు. వారి సొంత దేశంలో పోటీలు కాబట్టి అక్కడి వారే గెలవాలని వారు భావించారు. కానీ 3-1తో తనను ఓడించాను. డబ్బు విషయం ఇక్కడ ముఖ్యం కాదు. దేశ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. బౌట్ గెలిచాక అందరూ లేచి చప్పట్లు కొట్టారు. నాలుగైదు ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొన్నా మాస్కోలో నాకు లభించిన ఆదరణ అపూర్వం. అయితే ఈ ఫిక్సింగ్ గురించి 2010లోనే అధికారులకు సమాచారమిచ్చాను. కానీ ఎవరూ స్పందించలేదు’ అని ఓ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో సుశీల్ పేర్కొన్నాడు. మ్యాచ్ ఫిక్సర్లకు అత్యంత కఠిన శిక్షలు పడాలని ఆశించాడు. అలాగే అవినీతి అధికారులను రెజ్లింగ్ నుంచి తొలగించాలని కోరాడు. రెజ్లింగ్‌లో మామూలే: అధికారులు రెజ్లర్ సుశీల్ కుమార్ చెప్పిన ఫిక్సింగ్ అంశాన్ని భారత అధికారులు తేలిగ్గా తీసుకున్నారు. అసలు సుశీల్ అప్పట్లో ఈ విషయాన్ని ఫిర్యాదు చేయలేదని భారత రెజ్లింగ్ సమాఖ్య సెక్రటరీ జనరల్ రాజ్ సింగ్ చెప్పారు. అలాగే ఈ అంశంపై తానేమీ ఆశ్చర్యపోలేదని అన్నారు. ‘ఇలాంటివి గతంలోనే నేను విన్నాను. వీటిపై మనం మరింత జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు. ‘ఫిక్సింగ్‌కు సచిన్ దూరంగా ఉండమన్నాడు’ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారాలకు దూరంగా ఉండాలని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సలహా ఇచ్చాడని రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన సుశీల్ కుమార్ చెప్పాడు. ‘సచిన్‌తో కలిసి కూర్చున్నప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఒకసారి మేం ఓ ప్రమోషనల్ ఈవెంట్లో కలుసుకున్నాం. కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు ఫిక్సింగ్ గురించి మాట్లాడారు. ‘నీవు కనుక మరో పతకం గెలవాలని అనుకుంటే మాత్రం అలాంటి వారు చేస్తున్న పనులను మాత్రం చేయకు’ అని అక్కడే ఉన్న కొంత మందిని చూపిస్తూ సచిన్ అన్నాడు. ఎవరా అని నేను తలెత్తి వారి వైపు చూశాను. తన తోటి క్రికెటర్లను చూపిస్తూ సచిన్ అలా చెప్పాడు. వారి పేర్లు నేను చెప్పను. మీరే ఓ నిర్ధారణకు రండి’ అని సుశీల్ పేర్కొన్నాడు. -

ఏర్పాట్లు బాగున్నాయి: కార్ల్సన్
చెన్నై: డిఫెండింగ్ ప్రపంచ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌తో ఈ ఏడాది నవంబరులో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు సంబంధించిన ఏర్పాట్లపై అతని ప్రత్యర్థి మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) సంతృప్తి వ్యక్తం చేశాడు. 22 ఏళ్ల ఈ ప్రపంచ నంబర్‌వన్ తన తండ్రి హెన్రిక్ కార్ల్సన్, మేనేజర్ ఎస్పెన్ అగ్డెస్టియన్తో కలిసి పోటీల వేదికైన స్థానిక ఫైవ్ స్టార్ హోటల్లో ఏర్పాట్లను పర్యవేక్షించాడు. నవంబరు 7 నుంచి 28 వరకు జరిగే ఈ పోటీలో నెగ్గాలనుకునేవారు తమ సామర్థ్యంపై అపార విశ్వాసం కలిగి ఉండాలని భారత్‌లో తొలిసారి అడుగుపెట్టిన కార్ల్సన్ అన్నాడు. నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందంలో ‘అనారోగ్యం నిబంధన’ను చేర్చాకే ఆనంద్‌తో సొంతగడ్డపై ఆడేందుకు కార్ల్సన్ అంగీకరించాడు. ఈ నిబంధన ప్రకారం పోటీ సందర్భంగా తాను అస్వస్థతకు గురైతే రెండు రోజుల విశ్రాంతి ఇవ్వాలని కార్ల్సన్ షరతు విధించాడు. నిర్వాహకులు ఈ నిబంధనను అంగీకరించడంతో ఈ పోటీకి మార్గం సుగమమైంది. -
పదో ర్యాంక్‌కు సింధు
న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించిన ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను నమోదు చేసింది. గురువారం తాజాగా విడుదల చేసిన బీడబ్ల్యూఎఫ్ ర్యాంకుల్లో ఆమె పదో స్థానానికి ఎగబాకింది. 55172 పాయింట్లతో రెండు స్థానాలు మెరుగుపర్చుకుంది. సైనా నెహ్వాల్ నాలుగో ర్యాంక్‌లోనే కొనసాగుతోంది. పురుషుల విభాగంలో కశ్యప్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని 14వ ర్యాంక్‌లో నిలిచాడు. ఆర్ఎమ్వీ గురుసాయిదత్ 20వ, అజయ్ జయరామ్ 24వ ర్యాంకుల్లో ఉన్నారు.