పదో ర్యాంక్‌కు సింధు | PV Sindhu enters top-10 in world rankings | Sakshi
Sakshi News home page

పదో ర్యాంక్‌కు సింధు

Published Fri, Aug 16 2013 2:12 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM

PV Sindhu enters top-10 in world rankings

న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించిన ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను నమోదు చేసింది. గురువారం తాజాగా విడుదల చేసిన బీడబ్ల్యూఎఫ్ ర్యాంకుల్లో ఆమె పదో స్థానానికి ఎగబాకింది.

 

55172 పాయింట్లతో రెండు స్థానాలు మెరుగుపర్చుకుంది. సైనా నెహ్వాల్ నాలుగో ర్యాంక్‌లోనే కొనసాగుతోంది. పురుషుల విభాగంలో కశ్యప్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని 14వ ర్యాంక్‌లో నిలిచాడు. ఆర్‌ఎమ్‌వీ గురుసాయిదత్ 20వ, అజయ్ జయరామ్ 24వ ర్యాంకుల్లో ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement