గొప్ప ప్రపంచ శక్తిగా ఆవిర్భవించాలంటే..
అవలోకనం
పెద్ద సేనలు, అణ్వస్త్రాలు ఉన్నంత మాత్రాన ఆ దేశాలు గొప్ప శక్తులు అవుతాయనడానికి హామీ లేదు. లేకపోతే ఉత్తర కొరియా, పాకిస్తాన్‌లు గొప్ప శక్తులు అయ్యేవే. ఆరోగ్యవంతులైన, విద్యావంతులైన జనాభాను, సమర్థవంతమైన రాజ్యాన్ని పెంపొందింప జేసుకోగల దేశాలు మాత్రమే ఆధునిక యుగంలో గొప్పవి కాగలుగుతున్నాయి. భారత్ దీనిపై అసలు దృష్టిని కేంద్రీకరించడమే లేదని నా ఉద్దేశం. మౌలిక హక్కులు మనకు లభించే వరకు ఒక గొప్పశక్తిగా ఎదగడం కోసం మనం చేసే ప్రయాణం మెల్లగానే సాగుతుంది.
భారతదేశం ఒకప్పుడు ఆర్థికంగా స్వర్ణయుగంలో ఉండేదని తరచూ వింటూ ఉంటాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెద్ద భాగం భారత ఉపఖండానిదిగా ఉన్న నాటి సంగతి అది. ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో (జీడీపీ) నేడు 3 శాతంగా ఉన్న ఉపఖండం జీడీపీ నాడు 20 నుంచి 25 శాతం వరకు ఉండేది. ఆ స్థాయిని మనం తిరిగి సాధించగలమా?
యుగయుగాలుగా ఎలాంటి దేశాలు గొప్ప శక్తులుగా ఆవిర్భవించాయో ఒక్కసారి చూద్దాం. 2,500 ఏళ్ల క్రితం నాటి పర్షియా, మొట్టమొదటి గొప్ప ప్రపంచ శక్తి. ప్రపంచవ్యాప్తంగా ప్రాబల్యాన్ని నెరపగల నైపుణ్యం దానికి ఉండేది. ఇదే గొప్ప ప్రపంచ శక్తికి నిర్వచనం. పర్షియాకు చెందిన పార్సీ రాజులు కాందహార్ నుంచి టర్కీ వరకు విస్తరించిన సామ్రాజ్యాన్ని పరిపాలించారు. చరిత్రకారుడు హెరాడిస్ క్రీస్తు పూర్వం 479 నాటి ప్లటియా యుద్ధాన్ని నమోదు చేశాడు. పార్సీ రాజు జెరెక్సీజ్ గ్రీస్పైకి తనసేనలను నడిపాడు. అతడి సేనలలో భారత కిరాయి సైనికులు కూడా ఉన్నారు, వారు బహుశా పంజాబ్‌కు చెందిన వారు కావచ్చు, ప్రాచీన కాలపు గ్రీకులు పర్షియా రాజును ఎప్పుడూ ‘గొప్ప’ వానిగా సంబో ధిస్తూ ఉండేవారు రెండవ గొప్ప ప్రపంచ శక్తి ‘గొప్ప’ వాడైన అలెగ్జాండర్‌ది.
మాసిడోనియాకు చెందిన ఆ సైనిక యోధుడిని గొప్పవాడిగా పిలవడానికి కారణం ఆయన సాధించిన విజయాలు కావు. డారియస్‌ను ఓడించి అలెగ్జాండర్ ‘గొప్ప’ అనే అతని బిరుదాన్ని స్వీకరించాడు.ఇక మూడవ ప్రపంచ శక్తి రోమన్ సామ్రాజ్యం. అది మొదట ఇటలీ అంతటికీ, తర్వాత ఫ్రాన్స్, స్పెయిన్లు సహా యూరప్‌లోని చాలా భాగానికి, సుదూర ప్రాచ్యంలోని పాలస్తీనా వరకు కూడా విస్తరించింది. జూలియస్ సీజర్ రోమన్ సైన్యాలను బ్రిటన్‌లోకి (లండన్ ఆనాటిదే) ప్రవేశించాడు. కానీ రోమ్ ఒక నావికా శక్తి కాదు.
నాలుగవ పెద్ద ప్రపంచ శక్తిగా ఉండిన ముస్లింలు వివిధ దేశాలతో కూడిన వారు. అరబ్బులు ఉత్తర ఆఫ్రికాను, స్పెయిన్‌లో కొంత భాగాన్ని ఆక్రమించారు (ఈజిప్షియన్లు అరబ్బీ భాషను మాట్లాడేది అందువల్లనే). అయితే నిజంగానే బలమైన ముస్లిం శక్తులుగా ఉన్నవారు. టర్కులు, పర్షియన్లు, మధ్య ఆసియా వాసులు, అఫ్ఘాన్లే.
ముస్లిం శక్తులు కూడా నావికా శక్తులు కావు. మొత్తం ఉత్తర భారతాన్ని ఔరంగజేబు శాసిస్తున్న కాలంలో సైతం యూరోపియన్ శక్తులు గొప్ప ప్రభావాన్ని నెరపగలిగేవి. యూరోపియన్ల అధీనంలోని సముద్ర జలాల నుంచి రాజవంశీ కులు మక్కా హజ్ యాత్రకు పోవాల్సి ఉండటమే అందుకు కారణం.
పదిహేనవ శతాబ్దంలో స్పెయిన్, పోర్చుగల్, ఇంగ్లండ్, డచ్, ఫ్రాన్స్ వలస వాద శక్తులుగా ఆవిర్భవించాయి. వాటన్నిటి మధ్య ఉన్న సారూప్యత ఏమిటి? అవన్నీ అట్లాంటిక్ మహాసముద్ర తీర దేశాలే. అది అత్యంత దుర్గమమైన సముద్రం. ఆ సముద్రంపై ప్రయాణానికి అత్యంత నాణ్యమైన వస్త్రంతో తయారైన తెరచాపల సహాయంతో పయనించే దృఢమైన, పొడవాటి పెద్ద ఓడలు అవసరం. ఆ సముద్ర తీర దేశాలే ఆ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాయి. వారి నౌకలు పెద్దవిగా ఉండటం వల్ల శక్తివంతమైన, భారీ ఫిరంగులు చాలా వాటిని తీసుకు పోగలిగేవి. అందుకే ఆ దేశాలు సముద్రాలు దాటి అమెరికా ఖండాలను వలస లుగా మార్చుకోగలిగాయి. అట్లాంటిక్ తీరంలో లేని జర్మనీ, రష్యా, ఇటలీ, తది తర పెద్ద యూరోపియన్ దేశాలు పెద్ద వలస శక్తులు కాలేక పోయాయి.
ఆ సమయానికి ముందు ఏదైనా శతాబ్దంలో భారత్ ఒక గొప్ప ప్రపంచ శక్తిగా ఉన్నదా? భారత జీడీపీ ప్రపంచ జీడీపీలో ఐదో వంతు ఉండేది నిజమే. కానీ ప్రపంచ జనాభాలో ఐదో వంతు కూడా ఇక్కడ ఉండటం వల్లనే అది సాధ్యమైంది. చరిత్రలోని ఆ కాలానికి ప్రతి ఒక్కరూ వ్యవసాయదారులే. కుమ్మరిపని, నేత వంటి కొన్ని ప్రాథమిక వస్తువుల తయారీ కూడా ఉండేది. కానీ ఆర్థిక ఉత్పత్తిలో అత్యధిక భాగానికి మానవ శ్రమ శక్తే ఆధారం. ఒక దేశం లేదా ప్రాంతంలో ప్రజలు ఎక్కువ గా ఉంటే ప్రపంచ జీడీపీలో దాని వాటా కూడా ఎక్కువగా ఉండేది.
15వ శతాబ్దం తర్వాత, ప్రత్యేకించి న్యూటన్, హుక్, బాయల్ నేతృత్వంలో యూరప్‌లో జరిగిన విజ్ఞానశాస్త్ర విప్లవం తదుపరి మనం వెనుకబడిపోయాం. ఆర్థికంగా యూరోపియన్ దేశాలు ముందుకు దూసుకుపోగా మనం ఉన్నచోటే ఉండిపోయాం. అప్పటి నుంచి ఆ దేశాలే ఆర్థికంగా శక్తివంతమైనవిగా ఉంటూ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ ఉండేవి. అది అమెరికాతో అంతం అయింది. నేడు కేవలం పెద్దపెద్ద సేనలను, అణ్వస్త్రాలను సైతం కలిగి ఉన్నంత మాత్రాన ఆ దేశాలు గొప్ప శక్తులు అవుతాయనడానికి హామీ లేదు. లేకపోతే ఉత్తర కొరియా, పాకిస్తాన్‌లు గొప్ప శక్తులు అయ్యేవే. ఆధునిక యుగంలో ఆరోగ్యకరమైన, విద్యా వంతులైన జనాభాను, సమర్థవంతమైన రాజ్యాన్ని పెంపొందింపజేసుకోగల దేశాలు మాత్రమే గొప్పవి కాగలుగుతున్నాయి. జపాన్, కొరియా ఇటీవలి కాలంలో చైనా వాటిని సాధించగలిగాయి.
భారత్ ఈ విషయంపై అసలు దృష్టిని కేంద్రీకరించడమే లేదని నా ఉద్దేశం. మన పరిపాలన తరచుగా అసమర్థమైనదిగా ఉంటోంది. 2016లో సైతం దేశ వ్యతిరేక నినాదాలు, పొరుగు దేశాలతో కొట్లాటలు, సాంస్కృతిక, అస్తిత్వ సంబం ధమైన సమస్యలతో ప్రభుత్వం సతమతమౌతోంది. ఆరోగ్యం, విద్యలపై నిరంత రాయమైన, సునిశిత కేంద్రీకరణ లోపిస్తోంది. న్యాయం చేయగల, చట్టాన్ని అమ లుచేయగల శక్తి సైతం లోపిస్తోంది.
పాలనాపరమైన దక్షతకు అత్యంత ప్రాథమిక షరతులను సైతం మన ప్రభుత్వాలు నెరవేర్చలేకపోతున్నాయి. దీంతో హింసపై గుత్తాధిపత్యం నెలకొంటోంది. సామూహిక హింస, మారణకాండ సర్వ సాధార ణంగా మారడంతో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నదనేది అసలు పట్టించుకోవా ల్సిన పనేలేనిదిగా అవుతోంది. ఈ మౌలిక హక్కులు మనకు లభించే వరకు ఒక గొప్పశక్తిగా ఎదగడం కోసం మనం చేసే ప్రయాణం మెల్లగానే సాగుతుంది.
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com
- ఆకార్ పటేల్