World recrod
-
ప్రపంచకప్‌లో సంచలనం.. టీ20 చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
టీ20 వరల్డ్‌కప్-2024ను నమీబియా విజయంతో ఆరంభించింది. సోమవారం బార్బోడస్ వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో నమీబియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్.. నమీబియా బౌలర్ల దాటికి 19.4 ఓవర్లలో కేవలం 109 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నమీబియా కూడా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా 109 పరుగులు చేసింది.దీంతో మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన చేసిన నమీబియా.. డేవిడ్ వీస్, ఎరాస్మస్ చెలరేగడంతో 6 బంతుల్లో 21 పరుగులు చేసింది. అనంతరం 22 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ 6 బంతుల్లో వికెట్ కోల్పోయి కేవలం 10 పరుగులు మాత్రమే చేసింది.దీంతో నమీబియా విజయభేరి మ్రోగించింది. నమీబియా విజయంలో ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్ కీలక పాత్ర పోషించాడు.టీ20 క్రికెట్ చరిత్రలో..ఇక ఈ మ్యాచ్‌లో నమీబియా పేసర్ ట్రంపెల్మన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఒమన్ బ్యాటర్లకు ట్రంపెల్మన్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆది నుంచే ఒమన్ బ్యాటర్లకు ఈ నమీబియన్ ముప్పుతిప్పలు పెట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో ట్రంపెల్మన్ 21 పరుగులిచ్చి 4 వికెట్లు సాధించాడు.ఈ క్రమంలో ట్రంపెల్మన్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో తొలి ఓవర్ తొలి రెండు బంతుల్లోనే రెండు వికెట్లు తీసిన మొదటి ఆటగాడిగా ట్రంపెల్మన్ రికార్డులకెక్కాడు.ఇప్పటివరకు జరిగిన 2633 అంతర్జాతీయ టీ20ల్లో ఏ బౌలర్ కూడా ఈ ఘనత సాధించలేదు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి ఓవర్ వేసిన ట్రంపెల్మన్.. వరుసగా ప్రజాపతి, ఇలియాస్‌ను ఔట్ చేసి ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
చరిత్ర సృష్టించిన జయసూర్య.. 71 ఏళ్ల వరల్డ్ రికార్డు బద్దలు
టెస్టు క్రికెట్లో శ్రీలంక స్పిన్నర్ ప్రబాత్ జయసూర్య అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు సాధించిన స్పిన్నర్‌గా జయసూర్య నిలిచాడు. గాలె వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్‌తో పాల్ స్టిర్లింగ్‌ను ఔట్ చేసిన ప్రబాత్ జయసూర్య.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ రికార్డును కేవలం 7 మ్యాచ్‌ల్లోనే జయసూర్య సాధించాడు. ఈ వరల్డ్ రికార్డు ఇప్పటి వరకు వెస్టిండీస్ మాజీ స్పిన్నర్ ఆల్ఫ్ వాలెంటైన్ పేరిట ఉండేది. ఆల్ఫ్ వాలెంటైన్ ఎనిమిది టెస్టు మ్యాచ్‌ల్లో అద్భుతమైన రికార్డును సాధించాడు. వాలెంటైన్ 1951-52 మధ్య కాలంలో నెలకొల్పాడు. తాజా మ్యాచ్‌తో 71 ఏళ్ల ప్రపంచ రికార్డును ప్రబాత్ బ్రేక్ చేశాడు. అదే విధంగా ఈ ఘనత సాధించిన తొలి శ్రీలంక బౌలర్‌గా కూడా జయసూర్య రికార్డులకెక్కాడు. చదవండి: IPL 2023-Teamindia: కిషన్ వద్దు.. అతడికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్! విధ్వంసం సృష్టిస్తాడు.. అదే విధంగా ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్లో ఈ రికార్డు సాధించిన రెండో బౌలర్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన వెర్నాన్ ఫిలాండర్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ టామ్ రిచర్డ్‌సన్‌తో జయసూర్య సంయుక్తంగా నిలిచాడు. ఇక ఐరీష్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల హాల్ సాధించిన జయసూర్య.. రెండో ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు ఒక్క వికెట్ మాత్రమే సాధించాడు. చదవండి: IPL 2023: బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.. రాజస్తాన్‌కు దొరికిన ఆణిముత్యం! -
మహిళలే అధిగమించారు
మౌంట్ మాంగనుయ్: మహిళలు ఆకాశంలో సగమే కాదు... రికార్డుల్లోనూ ఘనమని చేతల్లో చాటారు. ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు పేరిట ఉన్న వరుస వన్డే విజయాల రికార్డును ఆ దేశ మహిళల క్రికెట్ జట్టు అధిగమించింది. న్యూజి లాండ్ పర్యటనలో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో మెగ్ లానింగ్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా వరుసగా 22 వన్డేల్లో గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా మహిళల జట్టు కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. దీంతో 2003లో రికీ పాంటింగ్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు నెలకొల్పిన 21 వరుస విజయాల రికార్డు తెరమరుగైంది. ఆస్ట్రేలియా మహిళల జట్టు జైత్రయాత్ర 2018 మార్చి 12న మొదలైంది. ఈ క్రమంలో ఆసీస్ 3–0తో భారత్‌పై... 3–0తో పాకిస్తాన్‌పై... 3–0తో న్యూజిలాండ్‌పై... 3–0తో ఇంగ్లండ్‌పై... 3–0తో వెస్టిండీస్‌పై... 3–0తో శ్రీలంకపై... 3–0తో న్యూజిలాండ్‌పై గెలిచి 2020 అక్టోబర్ 7న ఆస్ట్రేలియా పురుషుల జట్టు పేరిట ఉన్న 21 వరుస విజయాల రికార్డును సమం చేసింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై గెలుపుతో ఆస్ట్రేలియా మహిళల జట్టు కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో మొదట న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 212 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ లారెన్ డాన్ (90; 8 ఫోర్లు) సెంచరీ చేజార్చుకుంది. కెప్టెన్ అమీ సాటెర్వైట్ (32; 3 ఫోర్లు), అమెలియా కెర్ (33; 4 ఫోర్లు) రాణించారు. ఆసీస్ బౌలర్లలో మెగాన్ షుట్ 4, నికోలా క్యారీ 3 వికెట్లు తీశారు. తర్వాత ఆస్ట్రేలియా మహిళల జట్టు 38.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ అలీసా హీలీ (65; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), అష్లే గార్డ్నెర్ (53 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఎలీస్ పెర్రీ (56 నాటౌట్; 6 ఫోర్లు) ధాటిగా ఆడారు. కివీస్ బౌలర్లలో జెస్ కెర్, హన్నా రోవ్, అమెలియా కెర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. -
ఎంఎస్ ధోని వరల్డ్ రికార్డ్
సాక్షి, బెంగళూరు: టీమిండియా బ్యాట్స్‌మన్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్లో 5000 వేల పరుగులు సాధించిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. నిన్న ఆర్సీబీతో బెంగళూరులో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ధోని ఈ ఫీట్ సాధించాడు. 34 బంతుల్లో 70 పరుగులు చేసిన ధోని.. రాయుడితో కలిసి వీరోచిత ఇన్నింగ్స్ ఆడి 206 పరుగుల లక్ష్యాన్నిచేధించిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో నమోదైన ఐపీఎల్ రికార్డులను పరిశీలిస్తే... - సీఎస్కే గతంలోనూ(2012 చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో) 206 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీపై చేధించింది. - ఐపీఎల్లో ఆర్సీబీపై అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా ధోనీ రికార్డు. ఇంతకు ముందు ఇది గంభీర్ పేరిట ఉంది. - ఈ మ్యాచ్‌లో నమోదైన మొత్తం సిక్స్‌ల సంఖ్య 33. ఐపీఎల్లో ఇప్పటిదాకా ఇదే రికార్డు. - ఉమేశ్ యాదవ్‌కి ఇది 100వ ఐపీఎల్ మ్యాచ్. వంద వికెట్ల క్లబ్లో చేరాడు. - ఒక సీజన్లో 200 ప్లస్ పరుగుల టార్గెట్‌ను రెండుసార్లు చేధించిన రెండో జట్టుగా సీఎస్కే. (ఈ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 203 పరుగుల టార్గెట్‌ను చేధించింది) గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఈ ఫీట్ సాధించింది. 2014 సీజన్లో దక్కన్ ఛార్జర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలిచింది. వీటితోపాటు 5వ వికెట్ భాగస్వామ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ సెంచరీ పరుగులు సాధించటం ఇదే తొలిసారి. రాయుడు-ధోనీ కలిసి 59 బంతుల్లో 101 పరుగులు సాధించారు.