సాక్షి, బెంగళూరు: టీమిండియా బ్యాట్స్‌మన్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో 5000 వేల పరుగులు సాధించిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. నిన్న ఆర్‌సీబీతో బెంగళూరులో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ధోని ఈ ఫీట్ సాధించాడు. 34 బంతుల్లో 70 పరుగులు చేసిన ధోని.. రాయుడితో కలిసి వీరోచిత ఇన్నింగ్స్ ఆడి 206 పరుగుల లక్ష్యాన్నిచేధించిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో నమోదైన ఐపీఎల్ రికార్డులను పరిశీలిస్తే...
- సీఎస్‌కే గతంలోనూ(2012 చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో) 206 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీపై చేధించింది.
- ఐపీఎల్‌లో ఆర్‌సీబీపై అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా ధోనీ రికార్డు. ఇంతకు ముందు ఇది గంభీర్ పేరిట ఉంది.
- ఈ మ్యాచ్‌లో నమోదైన మొత్తం సిక్స్‌ల సంఖ్య 33. ఐపీఎల్‌లో ఇప్పటిదాకా ఇదే రికార్డు.
- ఉమేశ్ యాదవ్‌కి ఇది 100వ ఐపీఎల్ మ్యాచ్. వంద వికెట్ల క్లబ్‌లో చేరాడు.
- ఒక సీజన్‌లో 200 ప్లస్ పరుగుల టార్గెట్‌ను రెండుసార్లు చేధించిన రెండో జట్టుగా సీఎస్‌కే. (ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 203 పరుగుల టార్గెట్‌ను చేధించింది) గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఈ ఫీట్ సాధించింది. 2014 సీజన్‌లో దక్కన్ ఛార్జర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలిచింది.
వీటితోపాటు 5వ వికెట్ భాగస్వామ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ సెంచరీ పరుగులు సాధించటం ఇదే తొలిసారి. రాయుడు-ధోనీ కలిసి 59 బంతుల్లో 101 పరుగులు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment