పరిపూర్ణత సాధించలేం..
ద్వితీయ భాష విషయంలో పట్టుసాధించేది కొందరే..
మాతృభాషకు అనువుగానే మెదడు స్పందన
ప్రపంచస్థాయి భాషా సదస్సుకు ఎంపికైన అమలాపురం వాసి నక్కా సత్యప్రకాష్
‘‘మనిషి మెదడులోని ఐక్యూ మాతృభాషకు అనువుగా స్పందిస్తుంది. అందుకే ద్వితీయ భాషను మెదడు స్వీకరించేటప్పుడు మాతృభాష ప్రభావం పడుతోంది. ఈ కారణంగా ద్వితీయ భాష విషయంలో మనం పరిపూర్ణత సాధించలేం. చాలా కొద్దిమంది మాత్రమే ఇతర భాషలపై పట్టు సాధిస్తారు తప్ప, పరిపూర్ణతను సాధించలేరు’ అని చెబుతున్నారు అమలాపురానికి చెందిన నక్కా సత్యప్రకాష్. జర్మనీలో ప్రతిష్టాత్మకమైన గీస¯ŒS యూనివర్సిటీలో మార్చి 23 నుంచి 25 వరకు నిర్వహించే ప్రపంచ స్థాయి భాషా సదస్సుకు ఆయన ఎంపికయ్యారు. అక్కడ పేపర్ ప్రజంటేష¯ŒS చేయడంతోపాటు వర్క్‌షాపులో వక్తగా మాట్లాడనున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో న్యూరో లింగిస్టిక్స్ విభాగంలో పీహెచ్డీ చేస్తున్న ఆయన దక్షణాది ప్రధాన భాషలు తెలుగు, తమిళం, కన్నడం, మళయాలం భాషలు, వారు రెండో భాషగా ఎంపిక చేసుకునే ఇంగ్లిష్‌పై కొన్నేళ్లుగా పరిశోధన చేస్తున్నారు. జర్మనీలో జరిగే ప్రపంచస్థాయి భాషా సదస్సుకు ఎంపికైన ఆయన ‘సాక్షి’తో తన పరిశోధనా అనుభవాలను పంచుకున్నారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే...
– అమలాపురం
‘‘నా పరిశోధనలో కీలకాంశం మొదడు ఐక్యూపై మాతృభాష ప్రభావం ఎక్కువని గురించడమే. న్యూరో లింగిస్టిక్స్ రెండు రకాలు ఒకటి కాంప్రె¯Œ్స (ఎలా అర్థం చేసుకుంటున్నారు?) రెండు ప్రొడక్ష¯ŒS (ఎలా మాట్లాడతారు?) అనేవి రెండు విభాగాలు. వీటిలో బ్రోకాస్ ఏరియా, లెనికేస్ ఏరియా అని ఉంటుంది. దీని మీద పరిశోధనలు చాలా తక్కువ జరిగాయి. ఈ సబ్జెక్ట్ మీద నాకున్న ఆసక్తి నన్ను దీనిపై పీహెచ్డీ చేసేలా చేసింది.
∙నా పరిశోధన పూర్తి భిన్నం. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటి వరకు జరిగిన పరిశోధనాలకు నా పరిశోధన వ్యతిరేక దశలో సాగుతుంది. గతంలో చాలా మంది మాతృభాష పదాలను ఎక్కువగా వాడేవారు. ద్వితీయ భాష ఇంగ్లిష్ పదాల వాడుక తక్కువగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మాతృభాషలో ఇంగ్లిష్ పదాలు ఎక్కువయ్యాయి. దీని వల్ల మాతృభాషపై ఇంగ్లిష్ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై పరిశోధన చేస్తున్నా.
∙భాషకీ భాషకీ మధ్య వైవిధ్యంలో తేడా ఉంటుంది. ఉదాహరణకు ‘వచ్చాడు’ అని మనం తెలుగులో అంటాం. కాని ఇంగ్లిష్‌లో అయితే ‘హీ కమ్’ అని అనాలి. అంటే ఇంగ్లిష్ మాటల్లో కర్త, క్రియలను వాడితేకాని పదం సంపూర్ణం కాదు. కాని తెలుగులో వచ్చాడు అని క్రియతో చెప్పేయవచ్చు. ఈ కారణంగానే మాతృ భాష తెలుగైన వారు ద్వితీయ భాష ఇంగ్లిష్ మాట్లాడేటప్పుడు తడబడతారు. మన తెలుగువారే కాదు. మాతృభాష ఒకటి, ద్వితీయ భాష మరొకటి అయినప్పుడు తడబాటు తప్పదు.
∙అమలాపురం ఎస్కేబీఆర్ కాలేజీలో డిగ్రీ, ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్ చదివా. 2014 ఆగస్టులో ఐఎస్ఎల్యూ ఇంగ్లిష్‌లో టాపర్‌గా నిలిచి, కాకినాడ ఆదిత్య విద్యాసంస్థల్లో సాఫ్ట్‌స్కిల్ హెడ్‌గా పనిచేశా. న్యూరో లింగిస్టిక్స్పై ఆసక్తితో ఉద్యోగం నుంచి తప్పుకుని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నా. స్వతహాగా నాకు ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఆసక్తి. వివిధ భాషల్లో నిష్ణాతులైన స్పీకర్లను కలవడం, వారి అనుభవాలను, హావభావాలను పరిశీలించడం ద్వారా న్యూరో లింగిస్టిక్స్ పరిశోధనలు సాగిస్తున్నాను.
∙మాతృభాషే కాదు.. ఇతర భాషలపై పట్టు సాధించాలంటే ఎల్ఎస్ఆర్డబ్ల్యూ విధానంలో కష్టపడాలి. ఎల్–లిజనింగ్ (వినడం), ఎస్–స్పీకింగ్ (మాట్లాడడం), ఆర్ –రీడింగ్ (చదవడం), డబ్ల్యూ–రైటింగ్ (రాయడం). ఎవరైతే ఈ విషయాల్లో కఠోరంగా కృషి చేస్తారో వారే భాషపై çపట్టు సాధిస్తారు. 30 ఏళ్లు పాఠశాలల్లో, కళాశాలల్లో ఇంగ్లిష్ బోధించిన అధ్యాపకులు, ఉపాధ్యాయులు వేగంగా ఇంగ్లిష్ మాట్లాడలేరంటే అందుకు వినడం, మాట్లాడకపోవడంలో శ్రద్ధ చూపకపోవడమే కారణం.