మోస్ట్ పాపులర్ సీఈవో ఎవరో తెలుసా?
గూగుల్ తల్లి పుట్టుకకు కృషిచేసిన వారిలో ఒకరైన, దాని పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్స్‌కు సీఈవోగా వ్యవహరిస్తున్న లారీ పేజ్‌కి అరుదైన గౌరవం దక్కింది. ఫోర్బ్స్ ప్రకటించే ప్రపంచంలో అత్యంత ప్రముఖమైన సీఈవోల జాబితా- 2016లో ఆయన మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. లారీ పేజ్ తర్వాతి స్థానంలో ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ నిలిచారు. ఫోర్బ్స్ ప్రకటించిన ఈ జాబితాలో ఆన్లైన్ షాపింగ్ రిటైలర్‌గా పేరుగాంచిన అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ మూడో స్థానాన్ని పొందారు.
ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌కు నాలుగో స్థానం, ఆయన తర్వాత జేపీ మోర్గాన్ చేస్ సీఈవో, చైర్మన్ జామీ డిమోన్ ఉన్నారు. టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్ ఆరో స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే ఇతర ఉన్నత సీఈవో స్థానంలో ఉన్న ఉబర్ సీఈవో ట్రావిస్ కలానిక్, జనరల్ మోటార్స్ చీఫ్ మేరీ బర్రాలు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు.