worried
-
కెనడాలో పిల్లలు.. భారతీయ తల్లిదండ్రుల్లో ఆందోళన
ఢిల్లీ: కెనడా-భారత్ మధ్య వివాదంతో భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అక్కడ తమ పిల్లల భద్రత ప్రమాదకరంగా మారిందని భయపడుతున్నారు. జాతీయత ఆధారంగా తమ పిల్లలు వివక్షను ఎదుర్కొంటున్నారని కలత చెందుతున్నారు. కెనడాలో ఉన్న ఇండియన్ విద్యార్థులకు ఏదైనా హెల్ప్‌లైన్ క్రియేట్ చేయాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ని పంజాబ్ బీజేపీ చీఫ్ సునీల్ జఖ్కర్ కోరారు. ఇండియన్ కాన్సులేట్‌ను సంప్రదించి ఏదైనా సహాయం పొందవచ్చని స్పష్టం చేశారు. సలహాలు, సూచనల కోసం ఓ వాట్సాప్ గ్రూప్ నెంబర్‌ను కూడా రిలీజ్ చేశారు. Set up helpline for Indian students, NRIs in Canada: Punjab BJP chief urges Centre #India #Canada https://t.co/dT8lYAE9qm — IndiaToday (@IndiaToday) September 23, 2023 'నా కూతురు ఏడు నెలల క్రితం ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లింది. ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన కారణంగా నా కూతురు చదువుపై ఏకాగ్రత పెట్టలేకపోతోంది.' అని భల్విందర్ సింగ్ చెప్పారు. 'నా ఇద్దరు కూతుళ్లు కెనడాకు వెళ్లారు. కానీ భారత్-కెనడా ప్రభుత్వాల వివాదం ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశంపై త్వరగా ఏదైనా ఓ పరిష్కారానికి రావాలి' అని కుల్దీప్ కౌర్ కోరారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతవారం వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఇది రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. ఆ తర్వాత ఇరుదేశాలు ప్రయాణ హెచ్చరికలను జారీ చేశాయి. ఇరుపక్షాలు దౌత్య వేత్తలను బహిష్కరించాయి. కెనడా వీసాలను భారత్ రద్దు చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కెనడా ఆరోపణలు చేస్తోందని భారత్ మండిపడింది. అయితే.. ఖలిస్థానీ ఉగ్రవాదులు భారతీయ హిందువులపై హెచ్చరికలు కూడా జారీ చేశారు. కెనడా విడిచి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ పరిణామాల మధ్య ఇరు దేశాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన తమ పిల్లలు వివక్ష ఎదుర్కొంటున్నారని భారతీయ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లు ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే..? -
‘ఇండియా’ కూటమితో మోదీలో గుబులు: నితీశ్
పాటా్న: విపక్షాలతో ‘ఇండియా’ కూటమి ఏర్పాటు కావడంతో ప్రధాని మోదీలో గుబులు మొదలైందని జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ అన్నారు. ‘ఇండియా’ ఏర్పాటైన తర్వాత ఎన్డీయే పక్షాల సమావేశాలు నిర్వహిస్తున్నారని పరోక్షంగా ప్రధాని మోదీని ఎద్దేవా చేశారు. ఎన్డీయే పగ్గాలు మోదీ చేతుల్లోకి వచ్చాక భాగస్వామ్య పక్షాలను గౌరవించడం మానేశారన్నారు. ‘ఇండియా’ అధికారంలోకి వస్తే దేశానికి మంచి జరుగుతుందన్నారు. -
అభద్రతా భావంలో మెజారిటీ ఉద్యోగులు...
న్యూఢిల్లీ: కరోనా ప్రేరిత అంశాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ప్రజలు తమ ఉద్యోగ భద్రత విషయంలో ఆందోళనకు గురవుతున్నారు. వచ్చే 12 నెలల్లో తాము ఉపాధి కోల్పోయే అవకాశాలు ఉన్నాయని 54 శాతం మంది భావిస్తున్నారు. భారత్ విషయంలో ఇది 57 శాతంగా ఉంది. ఉద్యోగాలను కోల్పోతామని ఆందోళన పడుతున్న వారిలో దాదాపు 70 శాతం మంది... కొత్త ఉపాధి అవకాశాలను పొందడంలో తమ యాజమాన్యాలు సహకరిస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుండడం మరో విశేషం. ఆన్లైన్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ‘జాబ్స్ రిసెట్ సమ్మిట్’లో విడుదలైన ఒక గ్లోబల్ సర్వే ఈ అంశాలను తెలియజేసింది. దేశాల వారీగా సర్వే అంశాలను పరిశీలిస్తే... దాదాపు 27 దేశాల్లో 12,000కుపైగా ఉద్యోగులపై ఈ సర్వే జరిగింది. రష్యాలో సగటున ప్రతి నలుగురు ఉద్యోగుల్లో ముగ్గురు ఉద్యోగ అభద్రతా భావంలో ఉన్నారు. జర్మనీ విషయంలో ఈ సంఖ్య ఒకటిగా ఉంది. భారత్‌లో 57 శాతం మంది తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన ఉంటే, వీరిలో 25 శాతం మంది ఆందోళన తీవ్రంగా ఉంది. 31 శాతం మందిలో ఒక మోస్తరుగా ఉంది. ఉపాధి అవకాశాలపై ఆందోళనకు సంబంధించి 75 శాతంతో రష్యాలో టాప్‌లో ఉంది. తరువాతి స్థానంలో స్పెయిన్ (73 శాతం), మలేషియా (71 శాతం) ఉన్నాయి. అత్యంత తక్కువగా ఉన్న కింద స్థాయి నుంచి చూస్తే, జర్మనీ (26 శాతం), స్వీడన్ (30 శాతం), నెథర్లాండ్స్, అమెరికా (36 శాతం) ఉన్నాయి. తమ ప్రస్తుత యాజమాన్యం ద్వారా భవిష్యత్ ఉద్యోగం పొందడానికి తగిన, అవసరమైన నైపుణ్యతను పెంచుకోగలుగుతున్నట్లు ప్రపంచవ్యాప్తంగా 67 శాతం మంది ఉద్యోగులు పేర్కొన్నారు. ఈ విషయంలో మొదటి స్థానంలో మొదటి స్థానంలో స్పెయిన్ (86 శాతం) ఉంది. తరువాతి స్థానాల్లో పెరూ (84%), మెక్సికో (83%), భారత్ (80%) ఉన్నాయి. జపాన్ ఈ విషయంలో 45 శాతంగా ఉంటే, స్వీడన్ 46 శాతంగా ఉంది. రష్యా విషయంలో ఇది 48 శాతం. ఆశావాదమే అధికం : గత రెండేళ్లతో పోల్చితే ప్రస్తుతం ఉపాధి కల్పన గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం ప్రధాన సంక్షోభం ఇదే. ఈ నేపథ్యంలో ఉద్యోగ భద్రతపై ఆందోళన ఉంది. అయితే అంతకన్నా ఎక్కువగా ఆశావాదమే కనిపిస్తుండడం ఇక్కడ ప్రధానాంశం -సాదియా జహాదీ, డబ్ల్యూఈఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ -
‘మున్నాభాయ్’ వైరల్ పిక్ : షాక్‌లో ఫ్యాన్స్
సాక్షి,ముంబై : ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (61) ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎయిర్‌పోర్టులో ఓ అభిమాని ఆయనతో తీసుకున్న ఫొటో చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఆ ఫొటోలో సంజయ్‌దత్ చాలా బలహీనంగా కనిపిస్తున్నారు. దీంతో సంజయ్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ‘మున్నాభాయ్ ఎంబీబీస్’ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో ఆకాంక్షిస్తున్నారు. తన ఆరోగ్యం బాగా లేదని చికిత్స నిమిత్తం కొంత కాలం విరామం తీసుకుంటున్నట్టు ఆగస్టు 11న సంజయ్ ట్వీట్ చేశారు. నాలుగో దశ ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ముంబైలో తొలి దశ కీమోథెరపీని పూర్తి చేసుకున్నారు. అనంతరం భార్య మాన్యతో కలిసి దుబాయ్‌లో ఉంటున్న పిల్లలతో కొన్ని రోజులు గడిపిన సంజయ్ ఇటీవల ముంబైకి తిరిగి వచ్చారు. ఆయనకు రెండో దశ కీమోథెరపీ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. (దుబాయ్‌లో సంజయ్ దత్ ఫ్యామిలీ..) He looks so different gosh.... lost so much weight?? Uff... so sad. #SanjayDutt pic.twitter.com/7Fimr7KWAP — IkraaaShahRukh💕 (@Ikra4SRK) October 3, 2020 -
ఐపీఎల్ లేకపోతే ఎలా?
ఐపీఎల్ అంటే కొత్త కుర్రాళ్లకు ఒక కలల ప్రపంచం... తొలిసారి లీగ్‌లో ఆడే అవకాశం రావడంతో పాటు గుర్తింపు కోసం ఇది మంచి అవకాశం. ఆర్థికంగా ఆయా ఆటగాళ్లను ఆర్థికంగా స్థిరపరిచేందుకు ఒక్క సీజన్ సరిపోతుంది. అలాంటిది లీగ్ జరగకపోతే ఇక ఈ ఏడాది ఆట గురించి, డబ్బు గురించి మరచిపోవడమే! ముంబై: కరోనా కారణంగా ఈసారి 2020 ఐపీఎల్ నిర్వహించడం దాదాపు అసాధ్యంగా మారింది. అంతా చక్కబడితే సెప్టెంబరు–అక్టోబరు సమయంలో లీగ్ జరగవచ్చని వినిపిస్తున్నా... అది అంత సులువు కాదు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆటగాళ్లకు రూపాయి కూడా చెల్లించలేమని ఫ్రాంచైజీలు చెబుతున్నాయి. లీగ్ నిబంధనల ప్రకారం ఒక ప్లేయర్ జట్టుతో పాటు ఉన్న మ్యాచ్‌లకే లెక్కగట్టి డబ్బులు ఇస్తారు. ఇక టోర్నీనే ఉండకపోతే సహజంగానే డబ్బులు చెల్లించేందుకు ఫ్రాంచైజీలు ఇష్టపడవు. ‘ఐపీఎల్‌కు సంబంధించి బీసీసీఐ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. దీని ప్రకారం లీగ్ ఆరంభానికి వారం ముందు కాంట్రాక్ట్ మొత్తంలో 15 శాతం, టోర్నీ జరిగే సమయంలో 65 శాతం, టోర్నీ ముగిశాక మిగిలిన 20 శాతం ఇవ్వాల్సి ఉంటుంది. తాజా పరిస్థితి అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ఒక్క ఆటగాడికి కూడా రూపాయి ఇవ్వలేం’ అని ఒక టీమ్ యజమాని స్పష్టం చేశారు. కరోనాలాంటి విపత్తు గురించి ఇన్సూరెన్స్ ఒప్పందాల్లో కూడా లేదు. ‘బీమా నిబంధనల్లో కరోనా గురించి ప్రస్తావనే లేదు. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఎలాంటి చెల్లింపులు జరపవు. ప్రతీ ఫ్రాంచైజీ ఆటగాళ్లకు చెల్లించాల్సిన మొత్తం సుమారు రూ. 75 కోట్లనుంచి రూ. 80 కోట్ల వరకు ఉంటుంది. ఆటనే జరగకపోతే మేం ఎక్కడినుంచి తెస్తాం’ అని మరో ఫ్రాంచైజీ యజమాని వెల్లడించారు. చర్చించాల్సి ఉంది! కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినడంతో ఆదాయం తగ్గి ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు తమ క్రికెటర్ల వేతనాల్లో కోత విధించేందుకు సిద్ధమవుతున్నాయి. భారత్‌లోనూ అలా జరిగితే ఐపీఎల్ మాత్రమే కాదు, దేశవాళీ క్రికెటర్లకు కూడా పూర్తి మొత్తం అందకపోవచ్చు. ప్రపంచంలో అత్యంత ధనిక బోర్డు అయిన బీసీసీఐ యువ ఆటగాళ్ల సంక్షేమం గురించి ఆలోచించాలని ఒక మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు. ‘ఐపీఎల్ రద్దయితే కోహ్లి, ధోనిలాంటి వారికి కూడా దెబ్బే. అయితే దానిని వారు తట్టుకోగలరు. మొదటి సారి లీగ్ ఆడబోతున్నవారికే ఆర్థికంగా సమస్య. ఏడాదంతా కష్టపడి అవకాశం దక్కించుకున్న రూ. 20 లక్షలు, రూ. 30 లక్షలు, రూ. 40 లక్షల కేటగిరీలో ఉన్న క్రికెటర్లకు మాత్రం చాలా కష్టం. బోర్డు వీరి గురించి ఆలోచిస్తే బాగుంటుంది’ అని ఆయన సూచించారు. అయితే బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ మాత్రం దీనిపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. ‘బీసీసీఐకి సంబంధించి ఐపీఎల్ అతి పెద్ద టోర్నమెంట్. అయితే కోతల గురించి ఇంకా చర్చ జరగలేదు. మున్ముందు మాట్లాడతాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లెక్కలు, నష్టాల గురించి అంచనాలు వేయడం అంత సులువు కాదు. ఆఫీస్ బేరర్లందరూ సమావేశమైతే తప్ప గణాంకాల గురించి ఇప్పుడే చెప్పలేం’ అని ఆయన స్పష్టం చేశారు. ఐపీఎల్ జరగకపోతే బీసీసీఐకి సుమారు 3 వేల కోట్ల వరకు నష్టం జరుగుతుందని ఒక అంచనా. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ అశోక్ మల్హోత్రా మాత్రం బోర్డును సమర్థించారు. ‘బోర్డుకు డబ్బు వచ్చేదే క్రికెట్ నుంచి. అసలు ఆట జరగకపోతే ఆదాయం ఎలా. మనం కాస్త బుర్ర పెట్టి ఆలోచించాలి. ఆటగాళ్లపైనే కాదు దీని ప్రభావం చాలా మందిపై ఉంటుంది. అయితే ఇది బోర్డు తప్పు కాదు. ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి’ అని ఆయన అభిప్రాయపడ్డారు. -
గోవా సీఎం పారికర్ అనారోగ్యంపై బీజేపీలో ఆందోళన
-
నోట్ల రద్దుపై లోలోన కుమిలిపోతున్న నేతలు
న్యూఢిల్లీ: తానొకటి తలిస్తే దైవమొకటి తలచిదన్నట్లు నరేంద్ర మోదీ ఒకటి తలిస్తే జరిగింది మరొకటని బీజేపీ నాయకులే లోలోన కుమిలిపోతున్నారు. దేశంలో నల్లకుబేరుల కోరలు పీకేసేందుకు పెద్ద నోట్లను మోదీ పెద్ద మనసుతోనే రద్దు చేసినప్పటికీ సామాన్యులే సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని బీజేపీ నేతలు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితులను సకాలంలో పరిష్కరించకపోయినట్లయితే అసలుకే మోసం వచ్చేట్లు ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ కూడా పార్టీకి సమర్పించిన నివేదికలో ఇదే అభిప్రాయపడిందని వారు చెప్పారు. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గుజరాత్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో పెద్ద నోట్ల రద్దు ఫలితాలను, పర్యవసానాలను, వివిధ వర్గాల స్పందనలను తెలుసుకొని నివేదికను సమర్పించడం కోసం బీజేపీ చార్టర్డ్ అకౌటెంట్లతో ఇటీవల ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సోమవారం నాడే తన నివేదికను సమర్పించినప్పటికీ అందులోని అంశాలను ఆధికారికంగా ఇంతవరకు వెల్లడించలేదు. పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన సంక్షోభ పరిస్థితులను మరి కొన్ని రోజుల్లో చక్కదిద్దకపోయినట్లయితే మోదీ తీసుకున్న నిర్ణయం బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉందని ఆ కమిటీ తన నివేదికలో వెల్లడించినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. ఎనిమిదవ తేదీన మోదీ ప్రకటన వెలువడిన వెంటనే పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఈ కమిటీని ఏర్పాటు చేశారని వారు చెప్పారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా, ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో నల్ల ధనంపై మోదీ యుద్ధం, పాక్ భూభాగంలో సర్జికల్ స్ట్రైక్స్ పై ఆకర్షణీయమైన పోస్టర్లు రూపొందించి విస్తృతంగా ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలని పార్టీ ఎంపీలకు అమిత్ షా పిలుపునిచ్చారని వారు చెప్పారు. అయితే ఈ విషయంలో ఏ ఎంపీ కూడా ఇప్పటివరకు ముందుకు రాలేదని, పార్టీలో అందరి పరిస్థితి ఇప్పుడు మింగాలేని, కక్కాలేని పరిస్థితి ఏర్పడిందని వారంటున్నారు. ‘మేము చీకటి లోయలోకి ప్రవేశించాం. ఈ లోయ చివరలో వెలుతురు ఉంటుందో, లేదో కూడా తెలియదు’ అని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని బీజేపీ ప్రధాన కార్యదర్శి ఒకరు మీడియాతో వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటి వరకు బహిరంగంగా విమర్శించిందీ పోరుబందర్ పార్టీ ఎంపీ విఠల్ రాడాడియా ఒక్కరే. దేశంలో నల్లడబ్బును అరిక ట్టేందుకు తాను తీసుకున్న నిర్ణయం విజయం సాధిస్తుందన్న నమ్మకం నరేంద్ర మోదీకి తప్పా, పార్టీ నాయకుల్లో ఎవరికీ లేదని విఠల్ వ్యాఖ్యానించారు. -
అకాల వర్షంతో రైతుల్లో ఆందోళన
నిజాంసాగర్: నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం రైతన్నకు తీవ్ర నష్టం కలిగించింది. శుక్రవారం తెల్లవారు జామున జిల్లాలోని నిజాంసాగర్, పిట్లం, ఎల్లారెడ్డి మండలాల్లో అకాల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవటంతో రైతులు రోడ్లపైనే ధాన్యాన్ని కుప్పలుగా పోసి ఉంచారు. వర్షం దెబ్బకు రోడ్లపై ఉన్న ధాన్యం కొట్టుకుపోయాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఆందోళనలో ఆ ముగ్గురు నేతలు?
-
రుణమాఫీ పై ప్రభుత్వం కాలయాపన
-
గాలింపు చర్యల పై తీవ్ర ఆసంతృప్తి