worth Rs 1 crore
-
కమీషన్‌కు బ్యాంకు క్యాషియర్ కక్కుర్తిపడి..
చామరాజనగర్: ప్రజలు కరెన్సీ కోసం క్యూలలో గంటల తరబడి నిల్చుని కష్టాలు పడుతుంటే.. కొందరు బ్యాంకు అధికారులు కమీషన్‌కు కక్కుర్తిపడి అడ్డదారుల్లో నోట్ల మార్పిడి చేస్తున్నారు. తాజాగా కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా కొల్లెగల్ ఎస్బీఎం బ్రాంచ్ క్యాషియర్ పరశివమూర్తి దాదాపు కోటి రూపాయల విలువైన పాతనోట్లను తీసుకుని కొత్త నోట్లు ఇచ్చాడు. ఇందుకు 30 శాతం కమీషన్ అంటే 30 లక్షల రూపాయలు లంచంగా తీసుకున్నాడు. గత ఆదివారం సాయంత్రం ఆయన బ్యాంకుకు వచ్చి అక్రమాలకు పాల్పడ్డాడు. బ్యాంకులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో క్యాషియర్‌ను సస్పెండ్ చేశారు. తప్పు చేసినట్టు పరశివమూర్తి ఉన్నతాధికారుల ముందు ఒప్పుకున్నట్టు సమాచారం. పోలీసులు బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకుని, విచారణ చేస్తున్నారు. -
మాజీ డీజీపీ బంధువుల ఇంట్లో భారీ చోరీ
బంజారాహిల్స్ (హైదరాబాద్) : మాజీ డీజీపీ దినేష్ రెడ్డి సోదరుడి కుమార్తె ఇంట్లో దొంగలు పడి విలువైన బంగారు ఆభరణాల చోరీ జరిగింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. మంగళవారం పోలీసులు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... జూబ్లీహిల్స్ రోడ్ నెం.58లో నివసించే దివ్యారెడ్డి గత నెల 4వ తేదీన అమెరికా వెళ్తూ ఉంగరాలు, గాజులు ఇంట్లో ఉంచి వెళ్లారు. అయితే గత నెల 17వ తేదీన తిరిగి వచ్చిన ఆమె.. కొన్ని రోజుల తర్వాత వాటి కోసం వెతకగా కనిపించలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఆభరణాల విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. దివ్యారెడ్డి నివాసంలో ఎలాంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులకు నిందితుల ఆచూకి కనిపెట్టడం కష్టతరంగా మారింది. -
ఎల్బీనగర్లో కేజీ హెరాయిన్ పట్టివేత
హైదరాబాద్ : హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో సోమవారం సుమారు ఒక కేజీ హెరాయిన్‌ను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన హెరాయిన్ విలువ కోటి రూపాయలు ఉంటుందని అంచనా. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హెరాయిన్‌ను నార్కొటిక్ సెంట్రల్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.