3 నుంచి రెజ్లింగ్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 3 నుంచి రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ చాంపియన్షిప్ జరుగనుంది. పురానాపూల్లోని జీహెచ్ఎంసీ ప్లేగ్రౌండ్లో మూడు రోజుల పాటు ఈ టోర్నీ జరుగుతుంది. అండర్-17 బాలికలకు ఫ్రీస్టయిల్, అండర్-17, 19 బాలురకు ఫ్రీస్టయిల్, గ్రీకో రోమన్ విభాగంలో పోటీలు నిర్వహిస్తారు. ఇందులో రాణించిన రెజ్లర్లు తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికవుతారు.
ఈ జట్టు జనవరి 2 నుంచి 7 వరకు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో పాల్గొంటుంది. మరిన్ని వివరాల కోసం హెచ్డీఎస్జీఎఫ్ అండర్-17 ఆర్గనైజింగ్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి (7075462287), అండర్-19 జూనియర్ కాలేజ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. లక్ష్మ య్య 9290049752), రెజ్లింగ్ సెక్షన్ సెక్రటరీ శ్రీనివాస్ (9652828811)లను ఫోనులో సంప్రదించవచ్చు.