Xiaomi company phone
-
షావోమి ఫ్యాన్స్‌కు వాలెంటైన్స్ డే కానుక
వాలెంటైన్స్ డే కానుకగా షావోమి ఫ్యాన్స్ ముందుకు ఓ కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. రెడ్మి నోట్ 5 ను షావోమి రేపు విడుదల చేయబోతుంది. ఇప్పటికే ఈ ఈవెంట్‌కు సంబంధించి ఆహ్వానాలను కూడా కంపెనీ పంపించేసింది. రేపు విడుదల కాబోతున్న స్మార్ట్‌ఫోన్ పేరు రెడ్మి నోట్ 5 అని షావోమి వెబ్సైట్ ధృవీకరించింది. తొలుత ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లోనే విక్రయానికి రానుంది. రెడ్మి ఫోన్ లాంచ్ ఈవెంట్ గురించి, ఈ ఈ-కామర్స్ వెబ్సైట్ ఓ బ్యానర్‌ను లిస్టు చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే ఈ రెడ్మి నోట్ 5 ఈవెంట్‌ను షావోమి లైవ్ స్ట్రీమ్ చేయనుంది. లైవ్‌స్ట్రీమ్ కోసం యూజర్లు తమ షావోమి అకౌంట్‌తో ఎం.కామ్ వెబ్సైట్లో రిజిస్ట్రర్ అవ్వాలి. లేదా ఫేస్బుక్ అకౌంట్ ద్వారా కూడా వీక్షించవచ్చు. రెడ్మి నోట్ 5తో పాటు కంపెనీ తొలి టీవీని కూడా లాంచ్ చేస్తోందని తెలుస్తోంది. ఎంఐ టీవీ 4 పేరుతో దీన్ని మార్కెట్లోకి తీసుకొస్తోంది. షావోమి లాంచ్ చేస్తున్న ఈ టీవీ 49 అంగుళాలు, 55 అంగుళాలు లేదా 65 అంగుళాలు ఉండబోతుందని టాక్. -
షియోమి ఫోన్లు విక్రయించుకోవచ్చు
ఒక్కో ఫోన్‌కు రూ.100 రాయల్టీగా డిపాజిట్ చేయాలి ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు న్యూఢిల్లీ: చైనాకు చెందిన షియోమి కంపెనీ ఫోన్లు దిగుమతి చేసుకొని, విక్రయించుకోవడానికి ఢిల్లీ హైకోర్ట్ మంగళవారం అనుమతిచ్చింది. క్వాల్కామ్ ప్రాసెసర్‌పై నడిచే చిప్సెట్లతో తయారైన ఫోన్లకు మాత్రమే వచ్చే నెల 8 వరకూ ఈ అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. భారత్‌లో వచ్చే నెల 5 వరకూ విక్రయించే ప్రతి ఫోన్‌కు రూ.100 చొప్పున రాయల్టీగా డిపాజిట్ చేయాలని జస్టిస్ప్రదీప్ నంద్రజోగ్, జస్టిస్ ఆర్.కె గౌబలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు అనుమతచ్చింది. జనవరి 8న తదుపరి విచారణ జరగనున్నది. షియోమి సంస్థ పేటెంట్ల ఉల్లంఘనకు పాల్పడిందంటూ స్వీడన్‌కు చెందిన ఎరిక్సన్ సంస్థ కోర్టులో కేసు దాఖలు చేసింది. దీనిని విచారించిన ఏక సభ్య ధర్మాసనం భారత్‌లో షియోమి ఫోన్ల విక్రయాలపై నిషేధం విధిస్తూ ఈనెల 8న ఆదేశాలు జారీ చేసింది. తాము ఎలాంటి పేటెంట్ల ఉల్లంఘనకు పాల్పడలేదంటూ షియోమి కంపెనీ మంగళవారం ఈ తీర్పును సవాలు చేస్తూ పిటిషన్‌ను దాఖలు చేసింది. క్వాల్కామ్ సంస్థ తన పేటెంట్ టెక్నాలజీకి ఎరిక్సన్ నుంచి లెసైన్స్ పొందిందని షియోమి పేర్కొంది.