Xiaomi Mi MIX 2
-
మూడు నిమిషాలలోపే..హాట్ కేకుల్లా..
సాక్షి, న్యూఢిల్లీ: ఆకర్షణీయ ఫీచర్లు, అద్బుతమైన స్మార్ట్ఫోన్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న చైనా మొబైల్ మేకర్ షావోమి మరోసారి తన సత్తాను చాటింది. తాజా హై ఎండ్ వెర్షన్ డివైస్ కూడా హాట్ కేకుల్లా అమ్ముడు పోయింది. బెజెల్-లెస్ డిస్ప్లేతో విడుదలైన షావోమి ఎంఐ మిక్స్ 2 ఫోన్ విక్రయానికి ఉంచిన కేవలం మూడు నిమిషాల్లోపే పూర్తి అమ్మకాలను సాధించింది. దీంతో తదుపరి సేల్ అక్టోబర్ 24ను చేపట్టనున్నట్టు షావోమి తెలిపింది. మూడు నిమిషాలలోపే ఎంఐ మిక్స్ 2 అన్ని యూనిట్లను విక్రయించినట్టు షావోమి ఎండీ మను కుమార్ జైన్ ప్రకటించారు. ఇంకా లక్షమందికి పైగా వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఆసక్తిని కనబర్చినట్టు తెలిపారు. రూ.35,999కు ఎంఐ మిక్స్2 స్మార్ట్‌ఫోన్ గత వారం భారత్‌లో విడుదలైంది. ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కాం ద్వారా తొలిసారిగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను నేడు (అక్టోబర్ 17) విక్రయానికి ఉంచింది. కాగా గతంలో కూడా షావోమి స్మార్ట్ఫోన్లు నిమిషాల వ్యవధిలోనే రికార్డు అమ్మకాలను సాధించిన సంగతి తెలిసిందే. ఎంఐ మిక్స్2 ఫీచర్లు 5.99 అంగుళాల డిస్ప్లే 2.4 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ 6జీబీ/8జీబీ ర్యామ్ 64జీబీ/128జీబీ, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 12 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఫింగర్ ప్రింట్ సెన్సార్ 3400 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఎంఐ మిక్స్2 వచ్చేసింది
న్యూఢిల్లీ : చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారి షావోమి తన బెజెల్ లెస్ స్మార్ట్‌ఫోన్ ఎంఐ మిక్స్2ను భారత్‌లోకి విడుదల చేసింది. ఢిల్లీ వేదికగా దీన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.35,999గా కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లోనే అందుబాటులో ఉంచుతోంది. ఎంఐ మిక్స్2 ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లోనే అందుబాటులో ఉంటుందనే విషయాన్ని వీడియా ట్వీట్ ద్వారా అంతకమున్నుపే చెప్పింది. గత నెలలో ఈ ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. కంపెనీ నుంచి విడుదలైన తొలి బెజెల్ లెస్ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. ఎంఐ మిక్స్2 ఫీచర్లు... 5.99 అంగుళాల డిస్ప్లే 2.4 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ 6జీబీ/8జీబీ ర్యామ్ 64జీబీ/128జీబీ, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 12 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఫింగర్ ప్రింట్ సెన్సార్ 3400 ఎంఏహెచ్ బ్యాటరీ 4జీ, వాయిస్ఓవర్ ఎల్టీఈ -
తొలి సేల్‌లోనే ఎంఐ మిక్స్2 అదరగొట్టింది..
షావోమి ఫోన్లకు వచ్చే డిమాండ్ అంతా ఇంతా కాదు. విక్రయానికి వచ్చిన ఈ కంపెనీ స్మార్ట్ఫోన్లు సెకన్లలోనే సంచలనాలు సృష్టిస్తుంటాయి. బెజెల్-లెస్ ఎడ్జ్-టూ-ఎడ్జ్ డిస్ప్లేతో ఇటీవల షావోమి తీసుకొచ్చిన ఎం మిక్స్2 స్మార్ట్‌ఫోన్, చైనాలో తొలి ఫ్లాష్ సేల్కు వచ్చింది. ఫ్లాష్ సేల్కు వచ్చిన సెకన్ల వ్యవధిలోనే ఈ స్మార్ట్‌ఫోన్ పూర్తిగా అమ్ముడుపోయింది. కేవలం 58 సెకన్లలోనే ఈ ఫోన్లన్నీ అమ్ముడుపోవడం విశేషం. అయితే ఎన్ని యూనిట్లు అమ్ముడుపోయాయో కంపెనీ వెల్లడించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఎంఐ నోట్ 3 కూడా విక్రయానికి వచ్చింది. చైనీస్ వెబ్సైట్ మైడ్రైవర్స్ రిపోర్టు ప్రకారం కేవలం 58 సెకన్లలలో షావోమి ఎంఐ మిక్స్2 యూనిట్లన్నీ పూర్తిగా అమ్ముడుపోయినట్టు తెలిసింది. ఈ వారం మొదట్లోనే ఎంఐ మిక్స్2కు భారీగా రిజిస్ట్రేషన్ల వెల్లువ కొనసాగిన సంగతి తెలిసిందే. ఐదు లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లను ఇది అధిగమించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు భారీ ఎత్తున్న డిమాండ్ పెరుగుతున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ తర్వాత సేల్ సెప్టెంబర్ 19న అందుబాటులోకి రానుంది. ఎంఐ మిక్స్ 2 స్పెషిఫికేషన్లు.... 5.99 అంగుళాల ఫుల్-హెచ్డీ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ఎస్ఓసీ 6జీబీ ర్యామ్ స్పెషల్ ఎడిషన్‌కు 8జీబీ వరకు ర్యామ్ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 4జీ ఎల్టీవీ