హోదా వచ్చేదాకా పోరాడుదాం
గుంతకల్లు టౌన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉవ్వెత్తున ఎగిసిన సమైక్యాంధ్ర ఉద్యమ పోరాట స్ఫూర్తితో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడుదామని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో మంగళవారం మున్సిపల్ ఆఫీసు ఎదుట పద్మశాలీయ యువజన సంఘం ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్షను చేపట్టారు. సంఘం అధ్యక్షుడు జి.నాగరాజు, ప్రధాన కార్యదర్శి కుళ్లాయప్ప, ఉపాధ్యక్షుడు జయకృష్ణ, వీరేష్, అప్పయ్య, కార్యదర్శులు వాసు, రాఘవ, రాజా, సుబ్బు, కసాపురం ట్రస్ట్‌బోర్డు సభ్యుడు ఆంజనేయులు, సాక్షి ఏజెంట్ రఘు, నాయకులు సత్యనారాయణ, శ్రీనివాసులు, బాలరాజు, ప్రకాష్, రఘులు దీక్ష చేశారు.
ఈ దీక్షకు వైఎస్సార్సీపీ సమన్వయకర్త వైవీఆర్, పద్మశాలీయ మహాజన సంఘం కార్యదర్శి, వైఎస్సార్సీపీ కౌన్సిలర్ టి.గోపిలు పూలమాలలు వేసి సంఘీభావం తెలిపారు. అనంతరం వైవీఆర్ మాట్లాడుతూ ప్రత్యేకహోదా ఉద్యమం రోజురోజుకి ఉధృతమవుతోందన్నారు. యువకులు, విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే హోదా ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఐదు కోట్ల ప్రజలను మోసం చేసిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబులకు తగిన బుద్ధిచెప్పాలన్నారు.
పద్మశాలీయ మహాజన సంఘం అధ్యక్షుడు గోపాల్, కార్యదర్శి తాడూరు గోపి, వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల రామాంజినేయులు, కౌన్సిలర్ రంగన్న, టౌన్ కన్వీనర్ సుంకప్ప, మాజీ కన్వీనర్ శంకర్, అధికార ప్రతినిధి దశరథరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి వైఎస్.బసిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జ్ ప్రభాకర్, సీపీఐ పట్టణ కార్యదర్శి వీరభద్రస్వామి, చేనేతలు, తదితరులు దీక్షకు సంఘీభావం తెలిపారు.
దీక్షకు సంఘీభావం తెలుపుతున్న
వైఎస్సార్సీపీ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి