yalahanka
-
కారు డ్రైవర్‌కు మద్యం తాగించి.. ఈ జంట చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే
సాక్షి, బెంగళూరు: కారు డ్రైవర్‌కు మద్యం తాగించి కారుతో పరారైన రౌడీషీటర్ మేకె మంజ (27), అతని భార్య వేదవతి అలియాస్ జ్యోతి (25)ని యలహంక ఉపనగర పోలీసులు అరెస్టు చేశారు. డిసిపి అనూప్ శెట్టి తెలిపిన మేరకు వీరు ఇటీవల రాత్రి 10.30 సమయంలో నాగేనహళ్లి గేట్ దగ్గర ఓలా కార్‌ను బుక్ చేసి నగరంలోని వివిధ ప్రదేశాలు తిరిగారు. డ్రైవర్ శివశంకర్‌తో మంచిగా మాట్లాడుతూ డాబాలో పార్టీ చేసుకుందామని తీసుకెళ్లి అతనికి ఫుల్లుగా మద్యం తాగించారు. మత్తులో డ్రైవర్ కారులో పడుకుని ఉండగా మంజ తాళాలు తీసుకుని నడుపుకొంటూ వెళ్లి రాజనుకుంటె దగ్గర డ్రైవర్‌ను బయటికి తోసేసి, అతని మొబైల్‌ను తీసుకుని ఉడాయించారు. మత్తు నుంచి తేరుకున్న డ్రైవర్ యలహంక ఉపనగర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు జరిపి ఘరానా జంటను అరెస్టు చేసి కారు, రెండు మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. మంజపై హత్య, హత్యాయత్నం, దోపిడీ కేసులు ఉన్నాయి. చదవండి: (లేవరా.. ఒక్కసారి నన్ను చూడరా!) -
ప్రశ్నించిన పాపానికి ప్రాణం తీశాడు!
బెంగళూరు(యలహంక): ఇంటికి ఆలస్యంగా ఎందుకు వస్తున్నావంటూ నిలదీసిన పాపానికి ఓ ఇల్లాలు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన బెంగళూరులోని యలహంక న్యూటౌన్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు... ఇక్కడి మునిస్వామి లేఔట్లో ప్రతాప్, నళిని (23) దంపతులు నివాసం ఉంటున్నారు. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న ప్రతాప్‌ను నళిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. ఇదిలా ఉంటే ప్రతాప్ క్యాబ్ డ్రైవర్ కావడంతో నిత్యం ఇంటికి ఆలస్యంగా వచ్చేవాడు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ప్రతాప్ ఇంటికి రావడంతో నళిని భర్తను నిలదీసింది. దీంతో ఆవేశానికి గురైన ప్రతాప్ భార్య గొంతు నులిమి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
సిగ్నల్ పడగానే ట్రిగ్గర్ నొక్కారు !
బెంగళూరు: పట్టపగలు యలహంకలోని కోగిల్ సిగ్నల్ వద్ద శుక్రవారం సినీఫక్కీలో ఇద్దరు దుండగులు కారులోని వ్యక్తులపై కాల్పులు జరిపిన ఘటన కలకలం సృష్టించింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... బెంగళూరు నగర జిల్లా, దాసనపుర హోబళి ఏపీఎంసీ అధ్యక్షుడు కడబగెరె శ్రీనివాస్ శుక్రవారం తన హోండా సిటీ కారులో బసవేశ్వరనగర్ నుంచి దేవనహళ్లి వైపు వెళుతున్నారు. ఈ క్రమంలో వాహనం మధ్యాహ్నం 12 గంటలకు కోగిల్క్రాస్కు చేరుకోగానే సిగ్నల్ పడింది. దీంతో కారును ఆపారు. కారును నంబర్‌ప్లేట్ లేని బ్లాక్పల్సర్లో కొంత దూరం నుంచి వెంబడిస్తున్న ఇద్దరు దుండగులు ఒక్కసారిగా వాహనం ఎడమ వైపునకు చేరుకున్నారు. వెంటనే తుపాకీతో డ్రైవర్ పక్కసీట్లో కుర్చొన్న కడబగెరె శ్రీనివాస్‌పై కాల్పులు జరిపారు. అంతేకాకుండా సాక్షులు ఉండకూడదన్న ఉద్దేశంతో డ్రైవర్ మెయిలీతో పాటు కారు వెనుక సీట్లో కుర్చొన్న గన్‌మెన్ శ్రీధర్‌పై కూడా కాల్పులు జరిపారు. ప్రాథమిక సమాచారం మేరకు మొత్తం 8 రౌండ్ల కాల్పుల్లో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన కన్ను, ఎడమ చేయితో పాటు పొట్ట భాగంలో మొత్తం మూడు తూటాలు దూసుకుపోయాయి. ఇక మొయిలీ, శ్రీధర్‌లు స్పల్పంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన వెంటనే దుండగులు ద్విచక్రవాహనంపై దేవనహళ్లి వైపు వెళ్లిపోయారు. ఘటన నుంచి తేరుకున్న వెంటనే డ్రైవర్ మెయిలీ అదే కారులో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌తోపాటు గన్‌మేన్ శ్రీధర్‌కు హెబ్బాళలోని కొలంబియా ఏషియా ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం శ్రీనివాస్ శరీరం నుంచి మూడు బులెట్లను బయటికి తీసి ఐసీయూలో ఉంచారు. ఇక ఘటనలో గాయపడిన మిగిలిన ఇద్దరు కూడా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఘటనకు సంబంధించి మూడు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించినట్లు నగర పోలీస్ కమిషనర్ ప్రవీణ్‌సూద్ తెలిపారు. గతంలో కేసులు... కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కడబగెరె శ్రీనివాస్ ఆయన తమ్ముడు పాయిజన్ రామపై నగరంలోని వివిధ పోలీస్స్టేషన్లలో రౌడీషీట్‌తో పాటు కొన్ని కేసులు కూడా నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా రెండు నెలల క్రితం పాయిజన్ రామ ఓ వ్యక్తిని హత్య చేసిన కేసుకు సంబంధించి సాక్షులైన జైరామ్శెట్టి, ప్రేమ్శెట్టిలపై హత్యాయత్నం చేసినట్లు పోలీసు వర్గాల సమాచారం. అంతే కాకుండా గతంలో బీజేపీలో పని చేసిన కడబగెరె శ్రీనివాస్ కొద్ది కాలం క్రితం కాంగ్రెస్‌లోకి చేరి అనంతరం జరిగిన ఏపీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఇది రాజకీయ వైషమ్యం లేదా వ్యక్తిగత కారణాలతో జరిగిన ప్రతీకార దాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. -
చూతము రారండి
బాగళూరు క్రాస్‌లో నేటి నుంచి సీతారాముల కల్యాణ వేడుకలు బాగళూరుక్రాస్లో స్వామి వారి కళ్యాణం జరుగనున్న దేవాలయం యలహంక : యలహంక సమీపంలోని బాగళూరు క్రాస్‌లో ఉన్న సీతారామస్వామి దేవాలయంలో బుధవారం నుంచి శుక్రవారం వరకు సీతారాముల కల్యాణ వేడుకలు నిర్వహించనున్నారు. ఆలయ ప్రధానఅర్చకుడు శ్రీహరిశర్మ మంగళవారం వివరాలు వెల్లడించారు బుధవారం ఉదయం మహా గణపతి పూజ, స్వస్తీవాచన, ధ్వజారోహణ, గురువారం ఉదయం కలస స్థాపన, గోపూజ, మూల మంత్ర జపం, సుదర్శన హోమం, మూల వీరాట్‌కు పంచామృతాలతో అభిషేకం, సాయంత్రం దేవాలయం ఆవరణంలో భక్తి గీతాల ఆలాపన ఉంటుంది. శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు సీతారాముల వారి కల్యాణ మహోత్సవం వేడుకలు జరుగునున్నాయి. ఇందు కోసం అన్ని ఎర్పాట్లు సిద్ధం చేసినట్లు శ్రీహరిశర్మ తెలిపారు వేడుకల్లో పాల్గోనే సుమారు 6 వేల ఆరువేల మందికి అన్న దానం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటి సభ్యులు తెలిపారు.