వృద్ధురాలి అదృశ్యం
మొయినాబాద్: కూతురు వద్దకు వెళ్తానంటూ ఇంటి నుంచి బయలుదేరిన ఓ వృద్ధురాలు కనిపించకుండా పోయింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం సురంగల్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సురంగల్‌కు చెందిన యాలాల లలితమ్మ(80) జూలై 30న చేవెళ్లలో ఉండే తన కూతురు వద్దకు వెళ్తానంటూ ఇంటి నుంచి బయలుదేరింది. కానీ, అక్కడకు వెళ్లలేదు.
తిరిగి ఇంటికి కూడా రాలేదు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువుల వద్ద ఆరా తీసినా ఫలితం కనిపించలేదు. దీంతో ఆమె కొడుకు శ్రీనివాస్‌రెడ్డి మొయినాబాద్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే 9848984356 సెల్ నంబర్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.