Yamaha Company
-
మళ్ళీ మార్కెట్ లోకి యమహా RX 100
-
ఎన్ని ఉన్నా ఈ బైక్ క్రేజ్ వేరబ్బా.. యమహా నుంచి ఆ మోడల్ మళ్లీ వస్తోంది!
యూత్‌లో బైక్‌లకు ఉన్న క్రేజ్ వేరు. ప్రస్తుతం ఇంటర్నెట్ యుగంలో బోలెడన్ని బైకులు దర్శనమిస్తున్నాయి. అయితే ఎన్ని ఉన్నా మార్కెట్లో యమహా ఆర్ఎక్స్ 100కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 90 దశకంలో యువతని ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. ఈ బైక్‌లను నిలిపేసి 25 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ అవి రోడ్లపై దర్శనమిస్తున్నాయి. అయితే ఆ మోడల్ బైక్ కోసం కలలు కనే వారి కోసం తాజాగా యమహా కంపెనీ ఓ శుభవార్త తీసుకువచ్చింది. ఆర్ఎక్స్ 100 బైక్‌ను ఆధునిక హంగులతో మళ్లీ మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. యువత కలల బైక్ రానుంది యమహా ఇండియా చైర్మన్ ఐషిన్ చిహానా మాట్లాడుతూ.. కొత్తగా రాబోతున్న యమహా RX100 ఆధునిక డిజైన్ , స్టైలిష్ లుక్‌తో మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ బైక్ పాత మోడల్‌కి మార్కెట్లో ఇప్పటికీ డిమాండ్ ఉంది, వాటిని దృష్టిలో పెట్టుకుని బైక్ లవర్స్‌ని ఆకట్టుకునేలా డిజైన్, తయారీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 2026 తర్వాత మార్కెట్లోకి కొత్త వెర్షన్ ఆర్ఎక్స్100 బైక్‌ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఎందుకంటే వచ్చే మూడేళ్లలో యమహా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలోకి అడుగుపెట్టాలని యోచిస్తోందని చిహానా పేర్కొన్నారు. ప్రస్తుతానికి, రాబోయే యమహా ఎలక్ట్రిక్ స్కూటర్లు టెస్టింగ్ దశలో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం యమహాకు భారత్‌లో గ్రేటర్ నోయిడా, చెన్నైలో ప్రొడక్షన్ యూనిట్లు ఉన్నాయి. ఇక్కడ తయారయ్యే వాటితో 30 దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. కాగా యమహా కంపెనీ 1985 నుంచి ఉత్పత్తి ప్రారంభించి ఆర్ఎక్స్100బైక్‌ను 1996 వరకు కొనసాగించారు. చదవండి: 2022 ఆల్టో: ఎక్సైటింగ్ సర్ప్రైజ్ అంటున్న మారుతి -
యమహా.. సెల్యూటో బైక్
* ధర రూ.52,000 మైలేజీ 78 కి.మీ. * 125 సీసీ కేటగిరీలో తేలికైన బైక్ చెన్నై: యమహా కంపెనీ 125 సీసీ కేటగిరీలో కొత్త బైక్, సెల్యూటోను శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.52,000(ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ)గా నిర్ణయించామని యమహా మోటార్ ఇండియా సేల్స్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) రాయ్ కురియన్ చెప్పారు. బ్లూ కోర్ ఇంజిన్ టెక్నాలజీతో ఈ బైక్‌ను రూపాందించామని, 78 కి.మీ. మైలేజీనిస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాది 60 వేల సెల్యూటో బైక్‌లను విక్రయించగలమన్న అంచనాలున్నాయని వివరించారు. ఈ సెల్యూటో బైక్ 125 సీసీ కేటగిరీలో హోండా షైన్, హీరో మోటొకార్ప్ గ్లామర్, బజాజ్ డిస్కవర్ 125 ఎస్టీ బైక్‌లతో పోటీ పడాల్సి ఉంటుంది. 125 సీసీ కేటగిరీలో అత్యంత తేలికైన టూవీలర్ ఇదే. ఈ బైక్‌లో సింగిల్-సిలిండర ఎయిర్‌కూల్డ్ ఇంజిన్, 4 గేర్లు, మైలేజీ కంపెనీ పేర్కొంది. వెనకా, ముందు డ్రమ్ బ్రేక్‌లు, ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, వెనక వైపు స్విన్‌గ్రామ్ సస్పెన్షన్ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. చెన్నైలో మూడో ప్లాంట్తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని వల్లం వడగల్లో మూడో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని రాయ్ కురియన్ చెప్పారు. ప్రస్తుతం ట్రయల్ రన్ జరుగుతోందని, వచ్చే నెల నుంచి ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించినున్నామని పేర్కొన్నారు. ఈ ప్లాంట్‌పై దశలవారీగా రూ.1,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని తెలిపారు. ప్రస్తుతం తమ కంపెనీకి హరియాణా, ఉత్తర ప్రదేశ్‌లో ప్లాంట్లు ఉన్నాయన్నారు. ఇంతకు ముందు వరకు ఏడాదికి 5.5 లక్షల టూవీలర్లను విక్రయించేవాళ్లమని, దీన్ని ఈ ఏడాది 8 లక్షలు, 2018 నాటికి 17 లక్షలకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. -
యమహా చౌక బైక్ వస్తోంది..!
ధర రూ.30 వేల లోపు ఉండొచ్చు ఎఫ్‌జెడ్ సిరీస్‌లో రెండు కొత్త వేరియంట్లు విడుదల ధరలు రూ.76,250-రూ.78,250 న్యూఢిల్లీ: యమహా కంపెనీ త్వరలో చౌక బైక్(500 డాలర్లు-రూ.30,000)ను మార్కెట్లోకి తేనున్నది. ఎఫ్‌జెడ్ బైక్‌ల్లో (150 సీసీ కేటగిరీ) రెండు కొత్త వేరియంట్లను అందిస్తోంది. ఎఫ్‌జెడ్, ఎఫ్‌జెడ్-ఎస్‌ల్లో అప్‌గ్రేడెడ్ వేరియంట్లను సోమవారం ఆవిష్కరించింది. ఎఫ్‌జెడ్ సిరీస్‌ను 2008లో భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టామని యమహా ఇండియా వైస్ ప్రెసిడెంట్(సేల్స్, మార్కెటింగ్) రాయ్ కురియన్ తెలిపారు. నేటి(మంగళవారం)నుంచి ఎఫ్‌జెడ్ వెర్షన్ 2.0(ధర రూ.76,250), ఎఫ్‌జెడ్-ఎస్ వెర్షన్ 2.0(రూ.78,250- ఈ రెండు ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)ను విక్రయిస్తామని వివరించారు. ప్రస్తుతం ఫేజర్‌తో సహా ఎఫ్‌జెడ్ సిరీస్ బైక్‌లను నెలకు 18వేల వరకూ విక్రయిస్తున్నామన్నారు. తాజాగా అందిస్తున్న ఈ అప్‌గ్రేడెడ్ వేరియంట్లతో కలుపుకొని అమ్మకాలు నెలకు 24 వేలకు పెరుగుతాయని అంచనాలున్నాయని చెప్పారు. రూ. 1,500 కోట్ల పెట్టుబడులతో నిర్మిస్తోన్న చెన్నై ప్లాంట్ నిర్మాణం షెడ్యూల్ ప్రకారమే జరుగుతోందని, ఈ ఏడాది నవంబర్ నుంచి ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభిస్తామని వివరించారు. ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 18 లక్షలని పేర్కొన్నారు. 500 డాలర్ల యమహా బైక్: త్వరలో చౌక బైక్ (500 డాలర్లు-రూ.30,000)ను అందించనున్నామని యమహా మోటార్ ఆర్ అండ్ డీ ఇండియా ఎండీ తొషికజు కొబయాషి చెప్పారు. ఈ చౌక బైక్‌పై కసరత్తు జరుగుతోందని, ధర విషయం ఇప్పుడే నిర్ణయాత్మకంగా చెప్పలేమని పేర్కొన్నారు. 500 డాలర్ల ధరకే అందించాలని బెంచ్‌మార్క్‌గా పెట్టుకున్నామని తెలిపారు. అయితే ఈ బైక్‌ను ఎప్పుడు మార్కెట్లోకి తెచ్చేది వెల్లడించలేదు. ఈ చౌక బైక్ కారణంగా తమ మార్కెట్ వాటా మరింతగా పెరగగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. స్కూటర్లు, 150 సీసీ కేటగిరీ బైక్‌ల్లో పటిష్టమైన స్థానానికి చేరిన తర్వాత ఇతర సెగ్మెంట్లలోకి ప్రవేశిస్తామని రాయ్ కురియన్ వివరించారు. ఈ ఏడాది జనవరి-మార్చి కాలానికి తమ అమ్మకాలు 32% పెరిగాయని, ఇదే జోరు కొనసాగనున్నదని కురియన్ పేర్కొన్నారు. గతేడాది 4.47 లక్షల టూవీలర్లను విక్రయించామని, ఈ ఏడాది 6 లక్షల టూవీలర్లను విక్రయించనున్నామని చెప్పారు. ప్రస్తుతం 1,300గా ఉన్న డీలర్ల సంఖ్యను ఈ ఏడాది చివరికల్లా 1,600కు పెంచనున్నామని ఆయన పేర్కొన్నారు.