Yameen Abdul Gayoom
-
మహ్మద్ నషీద్కు ఊరట
జెనీవా: మాల్దీవులు మాజీ ఆధ్యక్షుడు మహ్మద్ నషీద్కు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఊరటనిచ్చింది. నషీద్పై 16 సంవత్సరాల నిషేధాన్ని ఎత్తివేస్తూ రానున్న ఎన్నికల్లో పోటీ చేయవచ్చునని యూఎన్హెచ్ఆర్సి తెలిపింది. తీవ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటూ అధికారానికి దూరమైన నషీద్ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు. సోమవారం సమావేశమైన సివిల్, రాజకీయ హక్కుల స్వతంత్ర కమిటీ మాజీ అధ్యక్షుడిపై ఆరోపణలు అస్పష్టంగా ఉన్నందున ఆయనపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేస్తూ... తదుపరి ఎన్నికల్లో పోటికి అనుమతినిచ్చింది. ‘రాజకీయ హక్కులు కేవలం అసాధారణమైన, నిర్థిష్టమైన పరిస్థితుల్లో మాత్రమే నియంత్రించబడతాయి. న్యాయ విచారణ పేరిట నషీద్ రాజకీయ హక్కులను నియంత్రించడం సబబు కాదు’ అని కమిటీ సభ్యుడు సారా క్లెవ్యాండ్ ఒక ప్రకటనలో తెలిపారు. తీవ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న నషీద్ 13 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. తన అనారోగ్య పరిస్థితుల రీత్యా వైద్య సేవల కోసం ప్రస్తుతం బ్రిటన్లో చికిత్స పొందుతున్నారు. దేశ చరిత్రతో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన మొదటి అధ్యక్షుడు మహ్మాద్ నషీద్ కావడం విశేషం. కాగా ప్రస్తుత ఆధ్యక్షుడు అబ్దుల్ యామీన్ మాల్దీవులులో అత్యయిక పరిస్థితిని విధించారు. తొమ్మిది మంది ప్రతిపక్ష నేతలను విడుదల చేయవలసిందిగా అబ్దుల్ యమీన్కు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేసి ప్రధాన న్యాయమూర్తితో సహా ప్రతిపక్ష నేతలను ఆయన జైలులో నిర్భంధించిన విషయం తెలిసిందే. -
రూ. 8,400 కోట్ల నష్టపరిహారం రావాల్సిందే: జీఎంఆర్
న్యూఢిల్లీ: విమానాశ్రయ అభివృద్ధి ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు విషయంలో తలెత్తిన వివాదంలో మాల్దీవుల ప్రభుత్వం నుంచి తమకు 1.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8,400 కోట్లు) నష్ట పరిహారం రావాల్సిందేనని జీఎంఆర్ స్పష్టం చేస్తోంది. ‘తమ ప్రభుత్వం భారతీయ కంపెనీకి పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. అయితే చెల్లించాల్సిన మొత్తాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. న్యాయ సమ్మతమైనంత మొత్తానికి దీనిని కుదిస్తాం’ అంటూ మల్దీవుల అధ్యక్షుడు యమీన్ అబ్దుల్ గయూం చేసిన ప్రకటన నేపథ్యంలో జీఎంఆర్ పై విధంగా స్పందించింది. పరిహారం చెల్లిస్తామని మాల్దీవుల ప్రభుత్వం తొలిసారిగా ప్రకటించడం విశేషం. మరోవైపు చట్టబద్ద కాంట్రాక్టు రద్దు చేసినందున నష్ట పరిహారం 1.4 బిలియన్ డాలర్లను చెల్లించాల్సిందేనని జీఎంఆర్ పట్టుబడుతోంది. కోర్టు వెలుపల పరిష్కారం కోసం మాల్దీవుల ప్రభుత్వం యత్నిస్తోందన్న వార్తలను జీఎంఆర్ ఖండించింది. కాగా, మాలె విమానాశ్రయ కాంట్రాక్టు రద్దు వివాద కేసు సింగపూర్ మధ్యవర్తిత్వ కోర్టులో నడుస్తోంది. గత వారం ప్రాథమిక విచారణ ప్రారంభమైంది. ఇరువాదనలు విని కాంట్రాక్టు చట్టబద్దమా కాదా అన్నది విచారణ తొలిదశలో తేలుస్తారు. మే చివరి కల్లా ఈ ప్రక్రియ ముగియనుంది. ఆ తర్వాత ఎంత నష్ట పరిహారం చెల్లించాలో నిర్ణయమవుతుంది.