ఇంటిపై నుంచి పడి బాలుడి మృతి
పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామంలో ఇంటిపై నుంచి పడి మణికంఠ అనే ఐదేళ్ల బాలుడు మృతిచెందాడు. శనివారం సాయంత్రం ఇంటి రెండో అంతస్తులో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ జారి కింద పడ్డాడు. హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే అక్కడ చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందాడు. బాలుడి తల్లి శశికళ విజయవాడ సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. బాలుడి మృతితో తల్లి శోకంలో మునిగిపోయింది.