yellow leaders
-
వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్: పచ్చ బ్యాచ్.. పరువుపాయే..!
అది సినిమా ఫంక్షన్ అని మరిచారు..ఎప్పటిలాగే పచ్చ బ్యాచ్ చీప్ ట్రిక్స్‌కు తెరతీసింది. వేదిక పేరుతో టీడీపీ రచ్చ..రచ్చ చేసింది. ఇక ఎల్లో మీడియా అసత్య కథనాలను వండి వార్చేసింది. ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ ఊదరగొట్టింది. వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికగా జరిగిన ఈ హైడ్రామాను రక్తి కట్టించబోయిన ఈ బ్యాచ్ బోర్లాపడింది. హీరో, చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ, దర్శకుడు మలినేని గోపీచంద్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. సాక్షిప్రతినిధి, ఒంగోలు: మలినేని గోపీచంద్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను సినిమా బృందం ఒంగోలు నగరంలో నిర్వహించాలని నిర్ణయించింది. తొలుత వేదికను రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఏబీఎం గ్రౌండ్లో జరుపుకోవాలని నిర్వాహకులు తలంచారు. అందుకోసం ఏర్పాట్లు చేసుకునే ప్రయత్నంలో బందోబస్తు, సభ అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఎంతమంది అభిమానులు, ప్రజలు వస్తారని పోలీసులు నిర్వాహకులను అడిగారు. 35 వేల మందికి పైగా పాసులు ఇవ్వాలని భావిస్తున్నామని చెప్పారు. దీంతో పోలీస్ అధికారులు ఈ గ్రౌండ్ కేవలం 15 వేల మందికి మాత్రమే సరిపోతుందని, ఇంకెక్కడైనా విశాలమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలని సూచించారు. దీంతో వారు ఉత్తర బైపాస్‌లోని ఒక విశాలమైన ప్రాంతాన్ని ఎంచుకొని అనుమతుల కోసం పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇది ఒకపక్క జరుగుతుంటే మరో పక్క ఎల్లో గ్యాంగ్ అసత్య ప్రచారానికి పూనుకుంది. ఏబీఎం గ్రౌండ్లో నిర్వహించుకునేందుకు ఇచ్చిన అనుమతులను పోలీసులు రద్దు చేశారంటూ నానా రభస చేసింది. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒక అడుగు ముందుకేసి దీన్ని రాజకీయంగా వాడుకోవటానికి, తనకు అనుకూలంగా మలుచుకోవటానికి సిద్ధమైపోయారు. వెంటనే విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి తమ హీరో సినిమా ఫంక్షన్‌కు అన్యాయం జరిగిపోతోందంటూ తనదైన శైలిలో నానా యాగీ చేశాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వచ్చే జనాలకు ఏబీఎం గ్రౌండ్ సరిపోదని నిర్వాహకులకు పోలీస్ అధికారులు సూచించారే తప్ప వ్యతిరేకించలేదన్న సంగతి కూడా పూర్తిగా వినకుండానే రాజకీయ కోణాన్ని ఆవిష్కరించారు. దీనిని ఆసరాగా తీసుకుని ఎల్లో మీడియా రెచ్చిపోయింది. కావాలనే ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను అటు పోలీసులు, ఇటు వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అడ్డుకుంటున్నాడని జోరుగా ప్రచారం కూడా చేసింది. ఎలాగైనా రాజకీయంగా వాడుకోవాలని చూసిన దామచర్ల చివరకు విఫలమయ్యాడు. దీంతో జనాల్లో కొద్దో గొప్పో ఉన్న పరువును కూడా పోగొట్టుకున్నాడు. ఇదిలా ఉంటే శుక్రవారం రాత్రి ఒంగోలు నగరంలో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్రశాంతంగా ముగిసింది. కార్యక్రమం విజయవంతంగా సాగిందని ఫంక్షన్ వేదికగా సినిమా డైరెక్టర్ మలినేని గోపీచంద్ ప్రకటించారు. నా కల సాకారం కావడానికి, ప్రీ రిలీజ్ ఫంక్షన్ విజయవంతానికి మా బాలినేని వాసన్నే కారణమని స్వయంగా వేదిక సాక్షిగా ప్రశంసించారు. దీంతో అసలు వాస్తవం ఏమిటో ప్రజలకు కుండబద్దలు కొట్టినట్లు అర్థమైంది. హీరో బాలకృష్ణ కూడా పోలీసులు బాగా సహకరించారని స్వయంగా ప్రశంసించారు. అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అటు బాలకృష్ణ కానీ, ఇటు సినిమా డైరెక్టర్ గోపీచంద్ కానీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల పేరును కూడా ప్రస్తావించలేదు. దీంతో ప్రతిదాన్నీ రాజకీయం చేయాలనుకునే దామచర్ల పరువు నిలువునా పోయినట్లయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దామచర్లను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. -
ఇదే అదును.. లూటీకి పదును!
♦ ఇసుకను లూఠీ చేస్తున్న పచ్చనేతలు ♦ ప్రొక్లైయిన్లతో తోడేయడం...లారీలతో తరలించడం ♦ ఆదినిమ్మాయపల్లెలో రేటు ఫిక్స్ చేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ ♦ కొండాపురంలో 8లారీలు సీజ్...మరో 15లారీలను విడిపించిన టీడీపీ నేత అధికారం అండ ఉంది..అవకాశం వచ్చింది.. ఇంకేముంది వీలైనంత దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు పచ్చనేతలు. పోలీసుల మద్దతుతో ఓ చోట.. సొంత మందితో మరోచోట విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు. అడ్డూ అదుపు లేకుండా ఇష్టారాజ్యంగా సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. ఇసుక క్వారీలు రద్దు చేయడంతో పచ్చ నేతలు చెలరేగిపోతున్నారు. ఆదినిమ్మాయపల్లె వద్ద ముగ్గురు నేతలు ముచ్చటగా మూడుచోట్ల టోల్గేట్ విధించి బలవంతంగా లాక్కుంటున్నారు. ఇందుకు ఏకంగా ఓ హెడ్‌కానిస్టేబుల్ వత్తాసు పలుకుతున్నాడు. సాక్షి ప్రతినిధి, కడప: ఇసుక క్వారీలు రద్దు చేయడం అధికారపార్టీ నేతలకు కలిసొచ్చింది. జిల్లాలో పలు క్వారీల నుంచి ఇసుకను ఉచితంగా తరలించుకోవచ్చుని అధికారికంగా ఉత్తర్వులు వెలుబడ్డాయి. అందులో ఆదినిమ్మాయపల్లె ఇసుక క్వారీ కూడా ఉంది. అక్కడ టీడీపీ నేతలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. మూడు చోట్ల ముగ్గురు నాయకులు టోల్‌ఫ్లాజా నిర్వహిస్తున్నారు. మూడు చోట్ల ముడుపులు చెల్లించడం సబబేనని వల్లూరు పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ హెడ్‌కానిస్టేబుల్ వత్తాసుగా నిలుస్తుండడం విశేషం. పొలాలకు వ్యక్తిగత అవసరాలకు తీసుకెళ్లుతున్నా.. అనధికారికంగా నిర్వహిస్తున్నా.. టోల్‌ఫ్లాజాలో సొమ్ము చెల్లించకపోతే సదరు హెడ్‌కానిస్టేబుల్ దాడులు చేయడం.. కేసు నమోదు చేస్తామని బెదిరిస్తూ అండగా నిలుస్తున్నట్లు సమాచారం. ఆదినిమ్మాయపల్లె క్వారీ నుంచి జేసీబీ ద్వారా రాత్రిపూట యధేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నట్లు సమచారం. క్వారీని అనధికారికంగా పచ్చనేతలు నడుపుతున్నారు. వీరిలో ఓ మాజీ ఎమ్మెల్యే మేనల్లుడు, మరోటీడీపీ నేత సమీప బంధువు ఉన్నట్లు తెలుస్తోంది. వారితోపాటుగా తమకు సైతం చెల్లించాల్సిందేనని స్థానిక టీడీపీ నేతలు ఓ జట్టుగా ఏర్పడ్డట్లు తెలుస్తోంది. పెన్నానదీ లూటీ.. జల్లా సరిహద్దులు కొండాపురం నుంచి ప్రొద్దుటూరు వరకూ పెన్నానదీని పచ్చ నేతలు యథేచ్ఛగా లూఠీ చేస్తున్నారు. కొండాపురం మండలంలో గ్రామస్థాయి నాయకులు పోటీపడి ఇసుకను కొల్లగొట్టుతున్నారు. నిత్యం నంద్యాల, బెంగుళూరుకు ఇసుక తరలివెళుతోంది. లారీలను తనిఖీ లేకుండా పట్టలు కట్టుకొని ఇసుకను తరలిస్తున్నారు. అధికారులు అండదండలతో యధేచ్చగా అక్రమవ్యవహారం సాగుతోంది. ఈక్రమంలో సోమవారం సాయంత్రం విజిలెన్సు అధికారులకు కొండాపు రం క్వారీలో 8లారీలు పట్టుబడ్డట్లు సమాచారం. మరో 15లారీలను స్థానిక టీడీపీ నేత అక్కడి నుంచి తరలించి నట్లు తెలుస్తోంది. పట్టుబడ్డ వాహనాల్లో ఆన్ గవర్నమెం ట్ డ్యూటీ అని ఉన్న టిప్పర్ కూడా ఉన్నట్లు సమాచారం. హనుమాన్‌గుత్తి టు ఆర్టీపీపీ.... ఓ ఎంపీ సోదరుడి నేతృత్వంలో హనుమాన్‌గుత్తి నుంచి ఆర్టీపీపీకి ప్రతిరోజు 30ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. పోట్లదుర్తికి చెందిన వ్యక్తులు పెన్నానదిలో తిష్టవేసి ఆ ట్రాక్టర్లు మినహా మరే ట్రాక్టర్ నదిలో దిగేందుకు వీలులేదని ఆంక్షలు విధించినట్లు సమచారం. ఆర్టీపీపీ కట్టడాలకు మొత్తం తామే ఇసుకను సరఫరా చేస్తామని, మరెక్కడా కొనుగోలు చేయరాదంటూ హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇసుకక్వారీలు రద్దు కావడం పచ్చ నేతలకు వరంగా మారిందని పరిశీలకులు భావిస్తున్నారు.