Yellow River
-
చైనా మారథాన్లో పెను విషాదం
బీజింగ్: చైనాలో శనివారం జరిగిన మారథాన్ పెను విషాదన్ని మిగిల్చింది. ఉత్సాహంగా పరుగు పెట్టేందుకు వచ్చిన వారిలో ఏకంగా 21 మంది ఆల్ట్రా మారథాన్ రన్నర్లు దుర్మరణం పాలయ్యారు. గాన్జు ప్రావిన్సులోని యెల్లో రివర్ స్టోన్ ఫారెస్ట్ కొండప్రాంతంలో నిర్వహించిన 100 కి.మీ. క్రాస్ కంట్రీ మౌంటెన్ మారథాన్లో ప్రతికూల వాతావరణం ఒక్కసారిగా మిన్నువిరిగి మీద పడినంత పని చేసింది. నిమిషాల వ్యవధిలోనే భీకర వేగంతో గాలివాన సృష్టించిన బీభత్సంలో 21 మంది అథ్లెట్లు మృతి చెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఇందులో 172 మంది పాల్గొన్నారు. 8 మంది మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బీభత్సం తాలుకూ సమాచారం తెలియగానే 1200 మంది రెస్క్యూ టీమ్ కొన్ని గంటలపాటు నిరంతరాయంగా శ్రమించి 151 మంది అథ్లెట్లను సురక్షిత ప్రదేశానికి తరలించింది. -
హఠాత్తుగా మారిన వాతావరణం: పెనువిషాదం
బీజింగ్: మారథాన్లో పెను విషాదం చోటు చేసుకుంది. అప్పటిదాకా ఎండగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకోవడంతో 21 మంది మరణించారు. ఈశాన్య చైనా హువాంగే షిలిన్ పర్వతాల దగ్గర శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం ఉదయం హవాంగే పర్వత ప్రాంతంలో 100 కిలోమీటర్ల అల్ట్రామారథాన్ మొదలైంది. ఆ టైంలో వాతావరణం పొడిగా ఉంది. అయితే మధ్యాహ్నం ఒంటిగంట టైంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన గాలులు, చలి తీవ్రత పెరిగిపోవడం, ఉన్నట్లుండి వడగళ్ల వానతో మారథాన్లో పాల్గొన్నవాళ్లు తట్టుకోలేకపోయారు. యెల్లో రివర్ స్టోన్ఫారెస్ట్ వెంట పరుగులు తీస్తున్న వాళ్లలో చాలామంది హైపోథెర్మియాకు గురయ్యారు. చాలామంది కనిపించకుండా పోయారు. దీంతో పోటీని ఆపేసిన నిర్వాహకులు.. సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. గడ్డకట్టుకుపోయి.. మొత్తం 172 మంది ఈ అల్ట్రామారథాన్లో పాల్గొన్నారు. వీళ్ల ఆచూకీ కోసం 1200 రెస్క్యూ టీంలుగా ఏర్పడ్డాయి. ఆదివారం ఉదయం కల్లా 151 మందిని సురక్షితంగా కాపాడగా, వీళ్లలో ఎనిమిది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 21 మంది చనిపోయారని రెస్క్యూ టీం వర్గాలు వెల్లడించాయి. వీళ్లంతా చలిని తట్టుకోలేక గడ్డకట్టుకుని చనిపోయారని అధికారులు వెల్లడించారు. మారథాన్లో పాల్గొన్నవాళ్లు షార్ట్స్ ,టీషర్ట్స్ ధరించడం కూడా వాళ్ల మృతికి ఒక కారణమైందని అధికారులు అంటున్నారు. పరిగెడుతున్న టైంలో హఠాత్తుగా చీకటి అలుముకుందని తన నాలుకతో పాటు వేలు గడ్డకట్టాయని, వెంటనే ఓ చెట్టు తొర్రలోకి వెళ్లి దాక్కున్నానని ట్రీట్మెంట్ పొందుతున్న ఓ బాధితుడు వెల్లడించాడు. తనతో పాటు మరో పదిమంది దాక్కోగా.. రెస్క్యూ టీం కాపాడిందని తెలిపాడు. -
చేపల వేటపై నిషేధం.. షరతులు!
బీజింగ్: నదీజలాల్లో లభ్యమయ్యే జీవ సంపదను సంరక్షించేందుకుగానూ చైనా ప్రభుత్వం నడుం బిగించింది. అందులో భాగంగా ప్రతి ఏడాది మూడు నెలలపాటు చైనాలోని పొడవైన నదుల్లో రెండోదైన ఎల్లో రివర్ (పసుపు నది), లేక హోయాంగ్లో చేపల వేటను నిషేధిస్తూ సోమవారం నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు మత్స్యకారులు, ఇతరులు పసుపు నది తీరంలో వేటకు వెళ్లొద్దని వ్యవసాయ మంత్రిత్వశాఖ అధికారులు ఓ ప్రకనటలో వెల్లడించారు. చైనాలో అతిపొడవైన నది యాంగ్ట్జే లో 2002నుంచి పూర్తి స్థాయిలో చేపలు, ఇతర జలచరాల వేటను అధికారులు నిషేధించారు. పెరల్ నది తీరంలోనూ ఫిషింగ్ నిషేధిస్తూ చైనా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో చేపలవేట నిషేధించిన మూడోనదిగా ఎల్లో రివర్ (పసుపు నది) నిలిచింది. ఈ ఏప్రిల్ నుంచి చేపలవేటపై నిషేధం అమల్లోకి వస్తుంది. మూడు పెద్ద సరస్సులు, 13 పెద్ద కాలువలు ఎల్లో రివర్తో అనుసంధానమై ఉన్నాయి. కాగా, మత్స్యసంపదకు ఆటంకాలు తలెత్తుతున్నాయన్న కారణంతో ప్రతి ఏడాది కొంతకాలం చేపల వేటపై నిషేధం విధిస్తున్నట్లు వ్యవసాయ మంత్రిత్వశాఖ అధికారులు వివరించారు. అనుమతి లేకుండా ఎక్కడైనా చేపలవేట కొనసాగించినట్లు గుర్తిస్తే ఆ మత్స్యకారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.