బీజేపీకి యెన్నం రాజీనామా
హైదరాబాద్ : మహబూబ్నగర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి సోమవారం బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీతో పాటు సభ్యత్వానికి రాజీనామా చేసిన యెన్నం తన లేఖను తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో ప్రత్యామ్నాయాలు కాలేవన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వారు కేసుల్లో ఇరుక్కుని కోర్టులు చుట్టు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో రెండు రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని యెన్నం తెలిపారు. కాగా 2014 ఎన్నికల్లో కొద్ది ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలయిన విషయం తెలిసిందే.