బీజేపీకి యెన్నం రాజీనామా | Yennam Srinivas reddy resigns BJP party | Sakshi
Sakshi News home page

బీజేపీకి యెన్నం రాజీనామా

Published Mon, Nov 23 2015 11:27 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బీజేపీకి యెన్నం రాజీనామా - Sakshi

బీజేపీకి యెన్నం రాజీనామా

హైదరాబాద్ : మహబూబ్నగర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి సోమవారం బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీతో పాటు సభ్యత్వానికి రాజీనామా చేసిన యెన్నం తన  లేఖను తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తెలంగాణలో ప్రత్యామ్నాయాలు కాలేవన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వారు కేసుల్లో ఇరుక్కుని కోర్టులు చుట్టు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  మరో రెండు రోజుల్లో  తన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని యెన్నం తెలిపారు. కాగా 2014 ఎన్నికల్లో కొద్ది ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలయిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement