'వెంకయ్యపై వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా' | with draw words on venkaiah naidu, says bjp mla yennam srinivas reddy | Sakshi
Sakshi News home page

'వెంకయ్యపై వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా'

Published Wed, Feb 12 2014 12:20 PM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి - Sakshi

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. బుధవారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే తనకు ముఖ్యమని, ఆ తర్వాతే ఏదైనా అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసమే తాను తెలంగాణలో చేరిన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

 

తెలంగాణ ఏర్పాటు విషయంలో బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడుపై మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బహిరంగ విమర్శలు చేశారు. ఆ యువ ఎమ్మెల్యే వ్యాఖ్యల పట్ల బీజేపీ అగ్రనాయకత్వం వెంటనే స్పందించింది. అందుకోసం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందులోభాగంగా రాజనాథ్ సింగ్ ఇప్పటికే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

 

వెంకయ్యనాయుడికి వెంటనే శ్రీనివాస రెడ్డి క్షమాపణలు చెప్పించాలని కిషన్ రెడ్డిని రాజనాథ్ సింగ్ ఆదేశించారు. అయితే ఆ విషయంలో వెంకయ్య వెంటనే జోక్యం చేసుకుని, క్షమాపణలు అవసరం లేదని తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పని చేసేలా యెన్నం శ్రీనివాస్ రెడ్డికి హితబోధ చేయాలని కిషన్ రెడ్డికి సూచించినట్లు సమాచారం. ఆ క్రమంలో భాగంగానే వెంకయ్యనాయుడిపై చేసిన వ్యాఖ్యాలను వెనక్కి తీసుకుంటున్నట్లు యెన్నం శ్రీనివాస రెడ్డి ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement