yennam srinivas reddy
-
హరీశ్ నీచ రాజకీయాలతో బీఆర్ఎస్ ఖతం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు హరీశ్‌రావు చేస్తున్న నీచ రాజకీయాలతో ఖతం అవుతుందని మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హరీశ్‌రావు.. కౌశిక్‌రెడ్డిని అడ్డం పెట్టుకుని శిఖండి రాజకీయాలకు తెరలేపారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న చిల్లర వ్యవహారాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలసి ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష నేత పత్తా లేకుండా పోయారని విమర్శించారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో తన సోదరి కవితకు బెయిల్ రాగానే కేటీఆర్ అమెరికాకు చెక్కేశారని, ఇక్కడ వరదలతో ప్రజలు కష్టాల్లో ఉంటే ఏమాత్రం సోయి లేకుండా అమెరికాలో ఎంజాయ్ చేయడానికి వెళ్లడం సిగ్గుచేటని మండిపడ్డారు.తెలంగాణ ఉద్యమంలో ఆ కుటుంబం చేసిన క్షుద్ర ఆలోచనలతో ఎంతో మంది యువకులు బలి అయ్యారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఉన్మాదిలా తయారయ్యారని అన్నారు. మహిళల ఆత్మగౌరావన్ని దెబ్బతీసేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వైఖరి ఉందని విమర్శించారు. ఆ పారీ్టలో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉంటే కౌశిక్‌రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అరికెçపూడి గాంధీ బీఆర్ఎస్ సభ్యుడే అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ కేసీఆర్ పదేళ్ల పాలన అంతా కమీషన్ల కోసమే సాగిందని, కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాతో కేసీఆర్ కుటుంబం ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు.ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేక రాజకీయ డ్రామాలు చేస్తున్నారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విమర్శించారు. కౌశిక్రెడ్డివి పిల్ల చేష్టలని, ఆయన బీఆర్ఎస్ పార్టీ పరువు తీస్తుంటే హరీశ్‌రావు ప్రోత్సహిస్తున్నట్లు ఉందని అన్నారు. గతంలో గవర్నర్ తమిళిసై మీద ఇష్టానుసారంగా మాట్లాడి కౌశిక్‌రెడ్డి మహిళలను అగౌరవపర్చాడన్నారు. కౌశిక్‌రెడ్డి తన ప్రవర్తన మార్చుకోకపోతే బడిత పూజ ఖాయమని హెచ్చరించారు. -
ఉత్సవాలకు అన్ని పార్టీలకు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ఉద్యమకారులకు, అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వా నం అందజేయాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించిందని మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. శనివారం ఆయన గాం«దీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ కారణంగా పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించే ఉత్సవ కార్యక్రమాన్ని పరిమితంగా నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే వేడుకలకు ఎలాంటి పరిమితులు లేవని చెప్పారు. ఉద్యమకారులను ఆ హ్వానించామని, ఉద్యమకారులే ముఖ్యు లుగా ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్నా మని చెప్పారు. అనేకమంది ఉద్యమ కారులు ఎఫ్ఐఆర్ కాపీలు పంపించారని, హైదరాబాద్‌కు రాలేని వారు ఆయా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో నిర్వహించే వేడుకల్లో పాల్గొనాలని కోరారు. -
39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై.?
-
యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఏడో గ్యారంటీ
-
బీజేపీకి మాజీ ఎమ్మెల్యే యెన్నం రాజీనామా
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ మాజీ శాసనసభ్యుడు, బీజేపీ నేత యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గత సాధారణ ఎన్నికల తర్వాత పార్టీకి అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్న యెన్నం తన రాజీనామాను సోమవారమిక్కడ ప్రకటించారు. పార్టీ ద్వారా వచ్చిన అన్ని స్థాయిల్లోని బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డికి ఫ్యాక్సు ద్వారా రాజీనామా లేఖ పంపానని విలేకరులతో చెప్పారు. ఏ లక్ష్యాల కోసం తెలంగాణ సాధించామో వాటిని ఎవరూ పట్టించుకోవడంలేదని విమర్శించారు. అస్తవ్యస్త పాలన, లక్ష్యంలేని విధానాలను ఓ తెలంగాణ బిడ్డగా, ఉద్యమకారునిగా చూస్తూ కూర్చోలేక ప్రజాక్షేత్రంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ‘ఒక కుటుంబపాలన బంగారు సంకెళ్ల నుంచి తెలంగాణ విముక్తి కోసం మరో పోరాటం అవసరం. 2001 నాటి పరిస్థితులే మరోసారి కొత్తరూపంలో తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నాయి. ఇప్పటిదాకా ప్రాంతేతరులపై ఎక్కుపెట్టిన ఉద్యమాస్త్రాన్ని ప్రాంతీయులపై సంధించాల్సిన సమయం ఇదే. విలువలతో కూడిన రాజకీయం కోసం, పేదల అవసరాలు తీర్చే పరిపాలనకోసం, స్థూలంగా మెజారిటీ ప్రజలకు అధికారం కోసం ఉద్యమిస్తా. దీనికోసం ప్రజావ్యతిరేక ప్రభుత్వపాలనపై వ్యక్తులుగా, సంఘాలు, సంస్థలుగా, పార్టీలుగా ఉన్న అందరినీ సమాయత్తపరిచే బాధ్యత తీసుకుంటున్నా’ అని యెన్నం వెల్లడించారు. ఉద్యమ ఫలాలను అనుభవిస్తున్న ఉద్యోగసంఘాల నేతలు, పార్టీలన్నీ పోరాటయోధులను విస్మరిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ అమరులను బంగారు తెలంగాణ సాధన కార్యానికి విఘ్నేశ్వరుల్లాగా స్మరించుకోవాలన్నారు. తెలంగాణ రక్షణకోసం ప్రారంభిస్తున్న ఉద్యమంలో మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డితో పాటు చాలామంది నాయకులు ఉంటారని పేర్కొన్నారు. -
బీజేపీకి యెన్నం రాజీనామా
హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి సోమవారం బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీతో పాటు సభ్యత్వానికి రాజీనామా చేసిన యెన్నం తన లేఖను తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో ప్రత్యామ్నాయాలు కాలేవన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వారు కేసుల్లో ఇరుక్కుని కోర్టులు చుట్టు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో రెండు రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని యెన్నం తెలిపారు. కాగా 2014 ఎన్నికల్లో కొద్ది ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలయిన విషయం తెలిసిందే. -
'వెంకయ్యపై వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా'
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. బుధవారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే తనకు ముఖ్యమని, ఆ తర్వాతే ఏదైనా అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసమే తాను తెలంగాణలో చేరిన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడుపై మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బహిరంగ విమర్శలు చేశారు. ఆ యువ ఎమ్మెల్యే వ్యాఖ్యల పట్ల బీజేపీ అగ్రనాయకత్వం వెంటనే స్పందించింది. అందుకోసం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందులోభాగంగా రాజనాథ్ సింగ్ ఇప్పటికే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వెంకయ్యనాయుడికి వెంటనే శ్రీనివాస రెడ్డి క్షమాపణలు చెప్పించాలని కిషన్ రెడ్డిని రాజనాథ్ సింగ్ ఆదేశించారు. అయితే ఆ విషయంలో వెంకయ్య వెంటనే జోక్యం చేసుకుని, క్షమాపణలు అవసరం లేదని తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పని చేసేలా యెన్నం శ్రీనివాస్ రెడ్డికి హితబోధ చేయాలని కిషన్ రెడ్డికి సూచించినట్లు సమాచారం. ఆ క్రమంలో భాగంగానే వెంకయ్యనాయుడిపై చేసిన వ్యాఖ్యాలను వెనక్కి తీసుకుంటున్నట్లు యెన్నం శ్రీనివాస రెడ్డి ప్రకటించారు.