Yerevan
-
సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణ.. ఎదురుకాల్పులు
ఎరెవాన్: వివాదాస్పద నగొర్నొ–కరబక్ ప్రాంతంపై పట్టు కోసం ఆర్మేనియా, అజర్బైజాన్ మధ్య ఆది, సోమవారాల్లో తీవ్ర ఘర్షణ జరిగింది. ఘర్షణలకు నువ్వంటే నువ్వు కారణమని ఇరు దేశాలు దుమ్మెత్తి పోసుకున్నాయి. దాదాపు చిన్నపాటి యుద్ధాన్ని తలపించే ఈ ఘర్షణల్లో ఇరుపక్షాల్లో కలిపి దాదాపు 20–30 వరకు మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. సోమవారం తర్‌తర్ నగరంపై ఆర్మేనియా ఆర్మీ కాల్పులు జరిపిందని అజర్బైజాన్ రక్షణ మంత్రి ఆరోపించారు. ప్రతిగా తాము జరిపిన ఎదురుకాల్పుల్లో దాదాపు 550 మంది ఆర్మేనియా సైనికులు మరణించారని చెప్పగా ఈ ఆరోపణలను, మరణాలను ఆర్మేనియా తోసిపుచ్చింది. (చదవండి: డ్రాగన్‌కు కౌంటర్ ఇచ్చేందుకు భారత్ సిద్ధం!) కాగా ఘర్షణలకు దిగుతున్న ఆర్మేనియా, అజర్బైజాన్ రెండింటితో భారత్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. ఈనేపథ్యంలో ఘర్షణపై భారత్ ఆచితూచి స్పందించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అజర్బైజాన్, ఆర్మేనియా మధ్య ఎన్నో ఏళ్లుగా నగర్నొ–కబరక్ ప్రాంత ఆధిపత్యంపై ఘర్షణ జరుగుతూనే ఉంది. దట్టమైన అడవులు, పర్వతాలుండే ఈ ప్రాంతం ఇరుదేశాలకు మధ్యన ఉంది. పేరుకు ఈ ప్రాంతం అజర్బైజాన్ ఆధీనంలో ఉన్నట్లు చెబుతున్నా, పాలన రిపబ్లిక్ ఆఫ్ అర్ట్‌సక్ ప్రభుత్వం జరుపుతుంది. -
అర్మేనియా అల్లకల్లోలం
యెరెవాన్: ప్రతిపక్ష నేత సహా ఇతర రాజకీయ ఖైదీలను విడుదల చేయాలంటూ కొనసాగుతున్న ఆందోళనలతో పశ్చిమ ఆసియా దేశం అర్మేనియా అల్లకల్లలంగా మారింది. వివాదాస్పద 'నాగోర్నో-కరాబఖ్' ప్రాంతంపై ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య తలెత్తిన వివాదం.. అల్లర్లు, సాయుధపోరుగా మారింది. అధ్యక్షుడు షెర్జ్ సర్గ్ శ్యాన్.. ప్రతిపక్ష నాయకుడైన జిరాయిర్ సెఫిల్యాన్ ను జైలుకు పంపడంతో గొడవలు ముదిరి పాకానపడ్డాయి. శుక్రవారం ఓ పోలీస్ స్టేషన్ కేంద్రంగా భద్రతా బలగాలకు, ఆందోళనకారులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి. ఇరుపక్షాలకు చెందిన వందలమంది గాయాలపాలయ్యారని అర్మేనియా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పోలీస్ స్టేషన్ ఆక్రమణ.. బాంబుల మోత జైలులో ఉన్న ప్రతిపక్ష నేత సెఫిల్యాన్ ను విడుదల చేయాలంటూ ఆయన అనుకూలురైన 40 మంది సాయుధులు.. జులై 17న దేశ రాజధాని యెరెవాన్ లోని ఓ పోలీస్ స్టేషన్ పై దాడిచేసి, పోలీసులను బందీలుగా పట్టుకున్నారు. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు పోలీస్ స్టేషన్ ను చుట్టుముట్టి కాల్పులు జరుపగా కొందరు సాయుధులు చనిపోయారు. మిగిలవారు గత 13 రోజుల నుంచి అదే పోలీస్ స్టేషన్ లో దాక్కొని...బందీలను ఒక్కొక్కరిగా విడుదల చేశారు. కాగా, శుక్రవారం పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. ప్రతిపక్ష పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని, భద్రతా బలగాలతో తలపడ్డారు. ఇదే అదనుగా పోలీస్ స్టేషన్ లోని సాయుధులు.. భద్రతా బలగాలపై బాంబులు విసిరారు. ఇటు నుంచి కూడా కాల్పులు జరిగాయి. గంటల తర్వాతగానీ హోరాహోరీ ఘర్షణలు ఆగలేదు. చివరకు 26 మంది అరెస్ట్ అయినట్లు, వందలమంది గాయపడ్డట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికీ 24 మంది సాయుధులు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. పొరుగుదేశం టర్కీలో సైనిక తిరుగుబాటు విఫలమైన తర్వాత అర్మేనియాలోనూ రాజకీయ అస్థిరత, అంతర్యుద్ధ సూచనలు పెరుగుతున్నాయి. 'నాగోర్నో-కరాబఖ్'వివాదం.. యూఎస్ఎస్ఆర్ పతనమైన తర్వాత స్వతంత్ర్య దేశాలుగా విడిపోయిన అర్మేనియా, అజర్బైజాన్ దేశాల మధ్య రావణకాష్ట్రంలా రగులుతున్నది 'నాగోర్నో-కరాబఖ్' వివాదం. ప్రస్తుతం అజర్బైజాన్ దేశంలో అంతర్భాగంగా ఉన్న ఈ ప్రాంతంలో అర్మేనియన్లదే మెజారిటీ. దీంతో ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని అర్మేనియాలోని కొన్ని రాజకీయ పక్షాలు డిమాండ్ లేవనెత్తాయి. క్రమంగా 'నాగోర్నో-కరాబఖ్'వివాదమే అక్కడి రాజకీయపార్టీల మనుగడకు ప్రధానాంశంగా మారింది. -
కొండంత ఆణిముత్యం!
ఆర్మేనియా నాగరికత తొలి ఆనవాళ్లను కథలు కథలుగా చెప్పే దేశం. సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన తరువాత సొంత దారి వెదుక్కొని తనదైన ప్రత్యేకతను నిలుపుకుంటున్న దేశం... ఆర్మేనియా అనే పేరుకు ఏ అర్థం ఉన్నా... ఆర్మేనియా అంటే ఆణిముత్యంలాంటి దేశం! తూర్పు యూరప్, పశ్చిమ ఆసియాల మధ్య ఉన్న దేశం ఆర్మేనియా. ఈ దేశానికి పశ్చిమంలో టర్కీ, ఉత్తరంలో జార్జియా, తూర్పులో అజర్బైజాన్, దక్షిణంలో ఇరాన్ దేశాలు ఉన్నాయి. భౌగోళికంగా రెండు ఖండాల మధ్య ఉండడం వల్ల ఎన్నో జాతులు ఆర్మేనియాపై దండెత్తాయి. గ్రీకులు, ఒట్టమన్లు, ఇరానీయులు, రష్యన్లు... ఆర్మేనియా ప్రాంతాలపై దండెత్తారు. ఒకప్పుడు సోవియట్ రిపబ్లిక్లో భాగమైన ఆర్మేనియా, సోవియట్ యూనియన్ పతనం తరువాత ‘ఆర్మేనియా రిపబ్లిక్’గా అవతరించింది. పది పరిపాలనా విభాగాలుగా ఆర్మేనియా విభజించబడింది. అవి: 1. అగ్రాట్సన్, 2. అరాత్, 3. అర్మవిర్, 4. జెఘర్కునిక్, 5. కోతక్, 6.లొరి, 7.సిరక్, 8. సియునిక్, 9. తవుష్ 10.వయొత్స్ద్జర్... ఈ విభాగాల నిర్వహణాధికారిని మర్జ్‌పెట్ అంటారు. వీరిని ప్రభుత్వం నియమిస్తుంది. యెరెవన్ నగరానికి రాజధాని నగరంగా స్వయంప్రతిపత్తి ఉంది. ఆర్మేనియా రిపబ్లిక్‌గా అవతరించిన తరువాత వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఉపాధికల్పనలో వ్యవసాయరంగం వాటా పెరిగింది. ఆహారభద్రత పెరిగింది. పర్యాటకరంగంలో ఎన్నో అనుబంధ పరిశ్రమలు వెలిశాయి. పర్యావరణ సంబంధిత అంశాలపై ఆర్మేనియా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంది. గాలి, నీటి కాలుష్యంపై విధించే పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు వినియోగిస్తుంది. ‘నేచర్ ప్రొటెక్షన్’ పేరుతో ఒక మంత్రిత్వశాఖను కూడా ఏర్పాటు చేసింది. టర్కీ, అజర్బైజాన్ మినహా ప్రపంచంలోని ప్రతి దేశంతో ఆర్మేనియా సత్సంబంధాలను కొనసాగిస్తుంది. ‘ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్’, ‘కౌన్సిల్ ఆఫ్ యూరప్’తో సహా నలభై అంతర్జాతీయ సంస్థలలో ఆర్మేనియాకు సభ్యత్వం ఉంది. ఆర్థిక సంస్కరణల వల్ల ద్రవ్యోల్బణం తగ్గి స్థిరమైన అభివృద్ధి దిశలో సాగిపోతుంది ఆర్మేనియా. టాప్ 10 1. ఆర్మేనియన్ భాషలో దేశం పేరు హయక్. హయక్ అనేది ఆర్మేనియన్ మూల పురుషుడి పేరు. 2. ఆర్మేనియాలోని ‘అపోస్టోలిక్ చర్చి’ ప్రపంచంలోనే పురాతనమైన చర్చి. 3. ‘క్రిస్టియన్ కంట్రీ’గా తనను తాను ప్రకటించుకున్న తొలిదేశం ఆర్మేనియా. 4. రాజధాని యెరెవన్లో ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఒపెరా హౌస్ ఉంది. 5. ‘టూరిస్ట్ ఫ్రెండ్లీ కంట్రీ’గా ఆర్మేనియాకు మంచి పేరు ఉంది. 6. ఆర్మేనియా జాతీయ చిహ్నం మౌంట్ ఆరాత్. అయితే భౌగోళికంగా ఇది టర్కీలో ఉంది. 7. అరస్... ఆర్మేనియాలో పొడవైన నది. 8. రాజధాని నగరం యెరెవన్కి ‘పింక్ సిటీ’ అని పేరు. 9. మద్యం జన్మస్థలం ఆర్మేనియా అని కొందరు శాస్త్రవేత్తల నమ్మకం. 10. ఆర్మేనియాలో అత్యధిక ఆదరణ ఉన్న క్రీడ... మల్లయుద్ధం. దేశం : రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా రాజధాని : యెరెవన్ అధికార భాష : ఆర్మేనియన్ కరెన్సీ : డ్రామ్ జనాభా : 29 లక్షల 99 వేలు (సుమారుగా) అక్షరాస్యత : 99 శాతం