yerpedu Lorry Accident
-
నోట్లో ఇసుక కొట్టారు!
నోట్లో ఇసుక కొట్టారు! నోట్ల కోసం కొట్టారు... కోట్ల కోసం కొట్టారు. కాటికెక్కించారు... కాల్చిపారేశారు.అంతకుముందు.. విషం కక్కారు... లారీలతో తొక్కారు. ఇసుక మాఫియా జేబులో ఉండే డబ్బుకు అన్నీ రక్తపు మరకలే. మనుషులు మాంసం ముద్దలైనా పర్వాలేదు. దానికో లెక్కుండాలి! అది జేబులో పడాలి! ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబానికి 5 లక్షలు పారేస్తామన్నారు. ప్రాణాన్ని ఇసుకలో పూడ్చేశారు. తాళిని ఇసుకతో తెంపేశారు. ఇసుకను పిండి నూనెనైనా తియ్యొచ్చేమో కానీ ఈ దుర్మార్గుల గుండెల్లో మానవత్వం అనే ఒక్క చుక్కను కూడా పిండలేం. కడుపుకు తింటున్నది అన్నమా? నోట్ల కట్టలా? కానీ మన నోట్లో కొడుతున్నది మాత్రం ఇసుకే. మగానుభావులు... లీడర్లు, ప్రభుత్వాలు.. వీళ్లలో... ఇసుమంత దయ ఉండదా? ఇసుక రేణువంత కరుణ ఉండదా? శ్రీకాళహస్తి, తిరుపతి రోడ్డుమార్గంలోని ఏర్పేడు నడిబొడ్డున ఈ నెల 21న జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో పదిహేను మంది ప్రాణాలు కోల్పోయారు! వాళ్లు రోడ్డు ప్రమాదంలో చనిపోయారనేకన్నా ఇసుక మాఫియా వాళ్లను పొట్టన పెట్టుకుంది అనడం సబబు. స్వర్ణముఖి నది పక్కనే మునగలపాళెం .. ఆ ఊరి ప్రజలు కలిమిలేములను కలిసి పంచుకుంటూ.. ఉన్న దాంతో తృప్తిపడుతూ సంతోషంగానే ఉంటున్నారు. కాని రెండేళ్లుగా మనసుల్లో కలతను నింపి మొహాల మీద చిరునవ్వు లేకుండా చేసింది ఇసుక మాఫియా. కంటి మీద కునుకును దూరం చేసింది. నేపథ్యం స్వర్ణముఖిలోని ఇసుకను తోడేస్తూ ఆ నదీమతల్లికి గుండెకోత పెడుతుంటే చూడలేక ఊరు ఊరంతా కలిసి న్యాయపోరాటానికి దిగింది. అయితే అధికార యంత్రాంగం ఇసుకను తోడుతున్న వారికే అండగా నిలిచింది. అయినా అధైర్యపడలేదు వాళ్లు. అలుపెరగక పోరాటం చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే.. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా నినదించేందుకు ఇంటికొక్కరు చొప్పున ఊళ్లోవాళ్లంతా కలిసి మొన్న మండల కేంద్రమైన ఏర్పేడుకు వెళ్లారు. తిరిగి వస్తుంటేనే ప్రమాదం జరిగి న్యాయపోరాటానికి దిగిన వాళ్లలో పదిహేను మంది మరణించారు. అందులో కుటుంబ పెద్దలున్నారు. వాళ్లు లేని లోటుతో ఆ ఇల్లు రోడ్డున పడే పరిస్థితి ఉన్న వ్యక్తులు. కొడుకులున్నారు.. తల్లిదండ్రులకు చెట్టంత నీడనిచ్చేవాళ్లు. ఆడవాళ్లున్నారు.. దీపం పెట్టి ఇంట్లో వెలుగు నింపే వాళ్లు.. భర్తల బరువు, బాధ్యతలను సగం మోస్తున్న సహధర్మచారిణులు. ఒక్కో కుటుంబానిది ఒక్కో విషాదం. తీరని వ్యథ. కన్నీళ్లు పెట్టించే కథ. వీళ్ల మరణాలతో ఆ ఊరు దిగ్భ్రాంతికి గురైంది. కన్న బిడ్డలను పోగొట్టుకుని గుండెపగిలేలా ఏడుస్తోంది. ఆ ఊరి కష్టం ఎవరు తీరుస్తారు? ఆ బిడ్డలకు తల్లుల్ని, తండ్రులను ఎవరు తెచ్చిస్తారు? పోయిన బిడ్డలకు ఊపిరిలూది ఆ తల్లిదండ్రుల పేగుబంధాన్ని ఎవరు నిలుపుతారు? న్యాయం మీరే చెప్పండి ‘ఇసుక దందా మీద మేం చెప్పినప్పుడే మీరు చర్యలు తీసుకొని ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదు కదయ్యా.. ఇంత మంది ఉసురు పోయేది కాదు. ఒక్కసారి ఎనిమిది మంది ఆడవాళ్ల తాళ్లు తెగిపడ్డాయి. నష్టపరిహారంగా ఒక్కో కుటుంబానికి అయిదు లక్షల రూపాయలు ఇస్తామంటున్నారు. మేమే మీకు పది లక్షల రూపాయలు ఇస్తాం. చచ్చిపోయిన మా వాళ్లను తిరిగి తెచ్చివ్వగలరా అయ్యా..? మీరు ఎన్ని లక్షలస్తే పోయిన ప్రాణాలు వస్తాయి? లేని మనుషుల లోటు తెలుస్తుంది? చెప్పండి? జరుగుతున్న అన్యాయం మీ దృష్టిలో పడాలంటే ఇంతమంది ప్రాణాలు బలిపెట్టాలా? ఇన్ని కుటుంబాలు రోడ్డున పడాలా? మీరే ఆలోచించండి. న్యాయం మీరే చెప్పండి’ అంటూ అధికార నేతను నిలదీశారు. ఆవిడ వేసిన ఒక్కో ప్రశ్న మానవత్వమున్న వాళ్లను తలదించుకునేలా చేసింది. ఆవిడ ఆవేదన కంటతడి పెట్టించింది. అందుకే మౌనమే సమాధానంగా వెనుదిరిగారు. బహుశా.... ప్రభుత్వం తెలుసుకుందో.. పశ్చాత్తాపం కలిగిందో.. లేక వేరే దారి తోచిందో! వీటికి జవాబు ప్రభుత్వం ఇసుక మాఫియా మీద తీసుకోబోయే చర్య ద్వారానే తెలుస్తుంది. పోయిన ప్రాణాలు పోయాయి.. కనీసం ఉన్న వాళ్లకైనా మంచి జరగాలి. ఊరుతల్లి హాయిగా ఊపిరి పీల్చుకోవాలి. చివరి చూపు కూడా అందలేదు ఏర్పేడు రోడ్డు ప్రమాద మృతుల్లో జయచంద్ర కూడా ఒకరు. కడు పేదరికంలో మగ్గుతోంది ఆయన కుటుంబం. భర్త సంపాదన సరిపోకపోవడంతో పిల్లల (మోక్షిత్, యజ్ఞ) పోషణ భారమై రెండు నెలల కిందట జయచంద్ర భార్య రేణుక సౌదీకి వెళ్లింది. ఇక్కడ ఊరి బాగు కోసం ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా గళమెత్తాడు జయచంద్ర. అందులో భాగంగానే ఊళ్లో వాళ్లతో కలిసి ఏర్పేడు ప్రయాణమయ్యాడు. అదే ఆయనకు చివరి ప్రయాణమైంది. తండ్రిని కోల్పోయి వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ చిన్నారులను అక్కున చేర్చుకొని సముదాయించాల్సిన తల్లి ఎక్కడో సౌదీలో ఉంది. భర్తను చివరిసారిగా చూసుకునే అవకాశం కూడా లేని దుస్థితిలో ఉంది. రేణుకను పనిలో పెట్టుకోవడానికి తనకు రెండు లక్షల 70 వేల రూపాయలు ఖర్చు అయ్యాయని ఆ మొత్తం చెల్లిస్తే తప్ప ఆమెను ఇండియాకు పంపించే ప్రసక్తి లేదని తేల్చేశాడు యజమాని. దాంతో అటు భర్త మరణాన్ని తట్టుకోలేక, తల్లీ ఉన్నా లేనిచందంగా అనాథలైన పిల్లలను తలచుకుంటూ కుమిలిపోతోంది రేణుక. ఊరికోసం వెళ్లి ఇంటివారికి దూరమై.. భాస్కరయ్య రజక వృత్తిలో ఉన్నాడు. కుటుంబ పోషణకు అదే ఆధారం. తొమ్మిదేళ్ల కిందట భాస్కరయ్య భార్య అనారోగ్యంతో కన్నుమూసింది. అప్పటి నుంచి ఇద్దరు పిల్లలకు అన్నీ తానే అయ్యాడు. ఉన్నంతలో కూతురు బత్తెమ్మకు పెళ్లి చేశాడు. తండ్రి కష్టం చూడలేక భాస్కరయ్య కొడుకు సురేష్ రెండేళ్ల కిందట కువైట్‌కు వెళ్లాడు కార్మికుడిగా. ఈలోగా ఇసుక దందాకు వ్యతిరేకంగా ఇంటికొకరు ఆందోళనలో పాల్గొనాలని ఊరిపెద్దలు చెప్పడంతో .. తనకు సెంటు భూమి లేకున్నా, సమస్య తనది కాకున్నా ఊరి క్షేమం కోసం ముందుకు కదిలాడు భాస్కరయ్య. గ్రామస్తులతో పదం కలిపాడు. ఏర్పేడు రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. సర్జరీ వల్ల ఆగాను.. లేకుంటే నేనే ... రామచంద్రనాయుడికి ఈ మధ్యే కంటి సర్జరీ అయింది. దాంతో ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో రామచంద్రనాయుడి స్థానంలో ఆయన భార్య ప్రభావతమ్మ వెళ్లింది. ఏముంది.. ఏర్పేడు రోడ్డు ప్రమాదానికి బలైంది. భార్య మరణంతో కుప్పకూలిపోయాడు రామచంద్రనాయుడు. ‘మాకు ఒక్కగానొక్క కొడుకు. వాడి క్షేమం కోసం, వాడిని ఉన్నతస్థాయిలో చూడాలని అనుక్షణం తపించిపోయింది నా భార్య. ఇకపై మా మంచిచెడ్డలు ఆలోచించేవాళ్లు, మా బాగు కోసం తపించిపోయే వాళ్లెవరు?’ అంటూ కన్నీరు మున్నీరవుతున్నాడు రామచంద్రనాయుడు. ఉప్పరపల్లి చెంచురెడ్డి సాక్షి, శ్రీకాళహస్తి చింత మునిశేఖర్, సాక్షి, రేణిగుంట అయిదు లక్షల రూపాయలు ఇస్తామంటున్నారు. మేమే మీకు పది లక్షల రూపాయలు ఇస్తాం.చచ్చిపోయిన మా వాళ్లను తిరిగి తెచ్చివ్వగలరా? -
ఏర్పేడు తహసీల్దార్ సస్పెండ్
ఏర్పేడు: చిత్తూరు జిల్లా ఏర్పేడు మండల తహశీల్దార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. మండల కేంద్రంలో ఐదు రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతిచెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇసుక అక్రమ రవాణాపై గ్రామస్థులు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా తహశీల్దార్ పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో అతన్ని సస్పెండ్ చేయడంతో పాటు అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలమైన రేణిగుంట రూరల్ సీఐని బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏర్పేడు పోలీస్ స్టేషన్ ఎదుట గత శుక్రవారం లారీ దూసుకెళ్లి 15 మంది నిరసనకారులు మృతిచెందారు. ఇసుక అక్రమార్కులపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిపైకి లారీ దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. -
'ఏర్పేడు' కారకులను వదిలిపెట్టొద్దు
-
'ఏర్పేడు' కారకులను వదిలిపెట్టొద్దు: మోహన్‌బాబు
ఏర్పేడు: చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద మూడు రోజుల క్రితం లారీ దూసుకొచ్చిన ఘటనలో మృతి చెందిన 17 మంది కుటుంబాలను నటుడు మోహన్‌బాబు, సీపీఐ నేత నారాయణ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటూ ప్రాణాలర్పించిన మునగలపాలెం రైతులు చరిత్రలో నిలిచిపోతారన్నారు. నారాయణ మాట్లాడుతూ ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదానికి తిరుపతి అర్బన్ ఎస్పీదే బాధ్యత అంటూ, ఆయనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కోరారు. -
‘ఏర్పేడు’పై సీబీఐ విచారణ
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ - బాధితులు ప్రమాదం కాదు.. హత్యేనంటున్నారు - ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి - ‘ఏర్పేడు’ బాధిత కుటుంబాలకు ప్రతిపక్షనేత పరామర్శ సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఏర్పేడు దుర్ఘటన లారీ ప్రమాదం వల్ల కాదనీ, పథకం ప్రకారం జరిగిన హత్యలేనని మృతుల కుటుంబాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ అన్నారు. దుర్ఘటన జరిగిన రోజున పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరును బట్టి సందేహాలు తలెత్తుతున్నాయని,ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీబీఐ చేత విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మూడేళ్లుగా స్వర్ణముఖినదిలో ఇసుక దోపిడీకి పాల్పడుతున్న టీడీపీ నేతలు ధనుంజయ లనాయుడు, చిరంజీవినాయుడులపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా కేసులు నమోదు చేయకపోవడం, మునగలపాలెం రైతులు ఫిర్యాదు చేయడానికి వెళ్లినపుడు తహశీల్దార్ లేకపోవడం, పోలీస్‌స్టేషన్ గేట్లు మూసి రైతులను రోడ్డు మీద నిలబెట్టడం, ఆ తరువాత లారీ వచ్చి గుద్దేసి పోవడం చూస్తే.. దీని వెనుక కుట్ర కోణం కనిపిస్తోందన్నారు. బాధిత కుటుంబాలు, బంధువులు కన్నీటితో ఇవే సందేహా లను వ్యక్తం చేశారని వైఎస్ జగన్ అన్నారు. ఆదివా రం ఆయన ఏర్పేడు మండలం మునగలపాళ్యం, ముసిలిపేడు, రావెల కండ్రిగ గ్రామాలకు వెళ్లి మృ తుల కుటుంబాలను పరామర్శించారు. మూ డేళ్లుగా స్వర్ణముఖినదీ తీరంలో జరుగుతున్న ఇసుక దోపిడీని ప్రస్తావించి అధికార పార్టీ అరాచకాలను జగన్ ఎండగట్టారు. మునగల పాలెంలో జగన్ మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. ఇసుకమాఫియాతో కుమ్మక్కు ‘‘గ్రామంలో ఎంతో విషాదం నెలకొంది. ఈ దారుణ పరిస్థితికి కారణమేంటి? అందరూ చెప్పేది ఏమంటే.. అన్నా.. మూడేళ్లుగా పక్కనున్న ఏట్లో ఇసుక దోపిడీ జరుగుతోంది. ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా ఎమ్మార్వో, పోలీసులు పట్టించుకోవడం లేదు.దీంతో యథేచ్ఛగా ఇసుక దోపిడీ జరుగుతోం దని. ఇదే నియోజకవర్గంలో 8 చోట్ల, జిల్లాలో 100 చోట్ల ఇసుక దందా సాగుతోంది. ఫిర్యాదు చేసేందుకు పోతే ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పారు. ఆరునెలల క్రితం సీపీఎం, వైఎస్సార్ సీపీ నేతలు 600 ట్రాక్టర్లను, లారీలను, జేసీబీలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు, అయినా అధికారుల్లో చలనం రాలేదు. మునగల పాలెం పక్కన ఇసుక దోపిడీకి పాల్పడుతున్న వ్యక్తులు హైలైట్ కావడం లేదు.మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ధనుం జయలనాయుడు, చిరంజీవి నాయుడు, మణినా యుడుల పేర్లు అందరూ చెబుతున్నారు. ఎమ్మార్వో, పోలీసులు వీరితో కుమ్మక్కయ్యారు. ఈ కుమ్మక్కు ఏ స్థాయిలో ఉందంటే..రైతులు ఫిర్యాదు చేసేందుకు పోతే అధికారులు కార్యాలయాల్లో ఉండరు. గేట్లు మూసే స్తారు. లేదా ఎక్కడికైనా పోతారు. ఏర్పేడులో దుర్ఘటన జరిగిన రోజు రైతులు రోడ్డు మీద ఎందుకున్నారంటే.. ఆసమయంలో వారిని లోనికి పోనీయకుండా పోలీస్‌స్టేషన్ గేట్లు మూశారు. ఎస్పీని కలుద్దామని పోతే బయటే ఉండమన్నారు. లోపల ఎస్పీ ఉండగానే రైతులకు ఈ అవమానం జరిగింది. తర్వాత లారీ వచ్చి గుద్దింది. అసలు బాధితులు చెబుతుందేమంటే...లారీ ఢీకొట్టడం కాదు.. అది హత్యేనంటున్నారు. పథకం ప్రకారం జరిగినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటి వరకూ ఎందుకు ధనుంజయలునాయుడు, చిరంజీవినాయుడులపై కేసులు నమోదు చేయలేదు? అసలు ఆ రోజు ఎస్పీ ఎందుకలా చేశారు.? ఎమ్మార్వో ఎందుకు ఆఫీస్‌లో లేకుండా పోయారు? ఇవన్నీ అనుమానాలే. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే పోలీస్, రెవెన్యూ అధికారలందరూ ఇసుక మాఫియాతో బాగా కుమ్మక్కయినట్లు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో.. జరిగిన దుర్ఘటనపై సీబీఐ విచారణ జరిపిస్తేనే నిజానిజాలు బయటకొస్తాయి. మాఫియా నుంచి రూ.200 కోట్లు రికవరీ చేయాలి ఒకవైపు బోర్లలో నీరులేదు. స్వర్ణముఖి నదిలో 30 అడుగులు, 40 అడుగులు విచ్చలవిడిగా తవ్వేయడంతో నీళ్లు లేక పంటలు ఎండిపోయాయి. దిక్కుతోచని పరిస్థితిలో రైతులు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన పరిస్థితుల్లో ఏర్పేడు దారుణం జరిగింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ప్రాణాలకు వెలకట్టి ఎక్స్‌గ్రేషియా ఇచ్చింది. అసలు మానవత్వం ఉందా ఈ ప్రభుత్వానికి? మూడేళ్లుగా ఇసుక దందాతో కోట్లు సంపాదించిన ధనుంజయలనాయుడు, చిరంజీవినాయుడుల నుంచి రూ.200 కోట్లు రికవరీ చేసి మృతుల కుటుంబానికో రూ.50 లక్షలు ఇవ్వాలి. అది కూడా సరిపోతుందని నేననుకోవడం లేదు. ఇవాళ నేను అడుగుతున్నా...ఏమయ్యా చంద్రబాబూ ! ఇసుక ఫ్రీ అంటున్నారు. ఇసుక నుంచి, మట్టి నుంచి కోట్లు గడించవచ్చన్న పరిస్థితిని ఇక్కడే చూస్తున్నాం. మంత్రుల కింత, ఎమ్మెల్యేలకింత, ముఖ్యమంత్రి కొడుకుకింతని కమీషన్లు తీసుకోవడం నేర్పిన ప్రభుత్వమిది. ఇసుక నుంచి దోపిడీ..మట్టినుంచి దోపిడీ..మద్యం నుంచి దోపిడీ...రాజధాని భూముల నుంచి దోపిడీ...చివరకు పోలవరం ప్రాజెక్టు నుంచీ దోపిడీనే. ఏది ముట్టుకున్నా కూడా లంచాలు, దోపి డీ, అవినీతే. ఆఖరికి ఎన్సీఏఈఆర్ రాష్ట్రాన్ని అవినీ తిలో నెంబర్ వన్ రాష్ట్రంగా «ధృవీకరించింది. అన్యా యాన్ని అరికట్టకపోతే తీవ్రంగా స్పందిస్తాం. మీడియా కీలక పాత్ర పోషించాలి మీడియా ఫోర్త్ ఎస్టేట్. ఇక్కడ మునగల పాలెం వాసులకు జరిగిన అన్యాయాన్ని బయటకు తేవాలి. అధికారులను ప్రశ్నించాలి. జరుగుతున్న అన్ని పరిణామాలకు ఆధారాలు చూపాలంటే ఎలా సాధ్యం? ఇదేమన్నా నిన్వెస్టి గేషన్ ఏజెన్సీనా? ఇసుక దోపిడీకి పాల్పడుతోం ది ధనుంజయలునాయుడు, చిరంజీవినాయు డులని గ్రామస్తులు చెప్పడం లేదా, కొన్నాళ్ల కిందట 600 లారీల ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్నది నిజం కాదా, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం వాస్త వం కాదా..మొన్న గేట్లు మూసేసి రైతులు లోనికి రాకుండా చేయలేదా? ఇంతకన్నా ఏం కావాలి. నేనేమన్నా కెమెరాలు పెట్టి చంద్రబాబుకి డబ్బు లిచ్చే ఫోటోలు తీయాలా? అసలా రోజు ఎస్పీ ఎందుకలా చేశారు? ఎందుకు ఎమ్మార్వో తన కార్యాలయంలో లేడు, ఇవన్నీ సందేహాలు కావా? ఇసుక తరలింపునకు వ్యతిరేకంగా మా పార్టీ సమన్వయకర్త బియ్యపు మధు 8 సార్లు ధర్నా చేశారు. అసలు ప్రభుత్వ కార్యాలయా ల్లోకి పోకుండా ప్రజలను ఎవరన్నా ఆపుతారా? మీడియా దీన్ని ప్రశ్నించాలి. ఇవన్నీ నేను అడగ లేదు. బాధితులు అడిగారు. గేట్లు మూసేశారు కాబట్టి లారీ ఢీకొట్టడానికి అవకాశం ఏర్ప డింది.’’ అని జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు.