'ఏర్పేడు' కారకులను వదిలిపెట్టొద్దు: మోహన్‌బాబు
Published Mon, Apr 24 2017 2:00 PM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM
ఏర్పేడు: చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద మూడు రోజుల క్రితం లారీ దూసుకొచ్చిన ఘటనలో మృతి చెందిన 17 మంది కుటుంబాలను నటుడు మోహన్‌బాబు, సీపీఐ నేత నారాయణ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటూ ప్రాణాలర్పించిన మునగలపాలెం రైతులు చరిత్రలో నిలిచిపోతారన్నారు. నారాయణ మాట్లాడుతూ ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదానికి తిరుపతి అర్బన్ ఎస్పీదే బాధ్యత అంటూ, ఆయనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కోరారు.
Advertisement
Advertisement