రష్యా అభిమానులకు జైలు
యూరో కప్‌లో అల్లర్లు సృష్టించిన రష్యా అభిమానులపై ఫ్రాన్స్ ప్రభుత్వం కఠినచర్యలకు దిగింది. ఇందులో భాగంగా గత మంగళవారం 43 మంది అభిమానులను పోలీసులు అరెస్ట్ చేయగా ముగ్గురికి ఫ్రెంచ్ కోర్టు జైలుశిక్షను విధించింది. ఓ వ్యక్తిని ఇనుపరాడ్‌తో బాదిన యెరునోవ్ అనే అభిమానికి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష విధించగా మరో ఇద్దరికి ఏడాదిన్నర, ఏడాది పాటు శిక్ష వేసింది.
అయితే తమ దేశస్థుల అరెస్ట్‌ను రష్యా ప్రభుత్వం ఖండించింది. ఈవిషయంలో ఫ్రాన్స్ రాయబారికి సమన్లు పంపింది. అలాగే 20 మంది రష్యా అభిమానులను పోలీసులు ఫ్రాన్స్ నుంచి బహిష్కరించారు.