స్పోర్ట్స్ మీట్ విజేతలకు బహుమతి ప్రదానం
ఏలూరు సిటీ : ఏపీ ప్రైవేటు స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్(అపుస్మా) ఆధ్వర్యంలో ఏలూరు జోన్ స్పోర్ట్స్ మీట్–16కు సంబందించి బహుమతి ప్రదానోత్సవ వేడుక స్థానిక వైఎంహెచ్ఏ హాలులో శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేసీ–2 ఎంహెచ్ షరీఫ్, జిల్లా విద్యాశాఖాధికారి డి.మదుసూధనరావు, డీఎస్డీవో ఎండీ సిరాజ్, అపుస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంబీఎస్ శర్మ హాజరయ్యారు. స్పోర్ట్స్‌మీట్‌లో ఆయా విభాగాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. 25 పాఠశాలల నుంచి 2,305 మంది విద్యార్థులు వివిధ ఈవెంట్లలో పోటీపడ్డారు. అలాగే అంతర్జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని అపుస్మా 15 మంది రైతులను ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రాము సూర్యారావు, వ్యవసాయ శాఖ జేడీ వై.సాయి లక్ష్మీశ్వరి ముఖ్య అతిథులుగా హాజరుకాగా అపుస్మా జోన్ అధ్యక్షుడు ఎంఎన్.శ్రీకాంత్, సెక్రటరీ కె.విజయలక్ష్మి, కోశాధికారి ఎస్.రాజ్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్‌ఆర్‌కేఎ ప్రసాద్, జోనల్ కన్వీనర్ కె.వెంకటేశ్వరరావు, స్పోర్ట్స్ ఇన్చార్జి జి.రవిశంకర్ పాల్గొన్నారు.