రేపు రాష్ట్రస్థాయిలో జానపద సంబరాలు
Published Thu, Aug 18 2016 11:09 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కళాకారుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20న జానపద సంబరాలు నిర్వహించనున్నట్టు ఆహ్వాన సంఘ కన్వీనర్ దువ్వి రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక వైఎంహెచ్‌ఎ హాలులో మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన జానపద కళాకారులు డప్పు నృత్యం, బుర్రకథ, చెక్క భజన, పల్లెసుద్దులు వంటి జానపద కళలు ప్రదర్శిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, ఏలూరు ఎంపీ మాగంటి బాబు, జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్యే బడేటి బుజ్జి, నగర మేయర్ షేక్ నూర్జహాన్ తదితరులు పాల్గొంటారని చెప్పారు.
Advertisement
Advertisement