ఫోటో దిగుతూ నదిలో పడి యువకుడు గల్లంతు
తూర్పు గోదావరి(పి. గన్నవరం): నదిలో ఫోటోలకు ఫోజులిస్తూ ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని కె. ముంజవరం గ్రామానికి చెందిన చంద్రస్వామి నాయుడు(19), గుంటూరులో సీఏ చదువుతున్నాడు.
అయితే ఇటీవలే ఇంటికి వచ్చిన స్వామి నాయుడు స్నేహితులతో కలసి గోదావరి నది స్నానానికి వెళ్లాడు. నదిలో ఫోటోలు దిగుతుండగా చంద్రస్వామి గల్లంతయ్యాడు. స్థానికులు గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు.