Youth attacked
-
ప్లాన్ ప్రకారమే ప్రాణం తీశారు.. ఆనంద్ భార్య లీల ఎక్కడ?
పటాన్చెరు టౌన్: కూతురిని ప్రేమిస్తున్న యువకుడిని యువతి కుటుంబ సభ్యులు పథకం ప్రకారం హత్య చేశారు. శుక్రవారం పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ భీంరెడ్డి ఆ వివరాలు వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు గ్రామానికి చెందిన శివకుమార్ అదే గ్రామానికి చెందిన భారతి ప్రేమించుకుంటున్నారు. భారతి వాట్సాప్‌లో శివకుమార్‌తో చాటింగ్ చేసింది. చాట్ విషయం చిన్నాన్న ఆనంద్‌కు తెలిసింది. భారతిని తండ్రి బాలపీరు ఎదుటే మందలించాడు. అయినా పరిస్థితి మార్పు రాలేదు. దీంతో తండ్రి బాలపీరు, బాబాయి ఆనంద్ కలసి పథకం వేశారు. ప్రణాళికలో భాగంగా కూతురు భారతితో ఈనెల 7వ తేదీ రాత్రి ఫోన్ చేయించారు. అమీర్‌పేట్‌కు రమ్మని చెప్పించారు. డబ్బులు లేవని శివకుమార్ చెప్పడంతో యువతికి వరుసకు బావ అయిన బాలకృష్ణతో రూ.200 ఆన్లైన్లో వేయించారు. శివకుమార్ అమీర్‌పేట్‌కు వచ్చాక అతడిని బలవంతంగా ఆటోలో ఎక్కించుకున్నారు. హుస్సేన్‌సాగర్ దిగువనున్న గోశాల దగ్గరలో గల శ్మశాన వాటికకు తీసుకెళ్లి గొంతు నులిమి చంపారు. మృతదేహాన్ని పక్కనే ఉన్న హుస్సేన్‌సాగర్ నుంచి మూసీ నదికి వెళ్లే కాలువలో పడివేశారు. కాలువలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మృతదేహం కొట్టుకుపోయింది. పోలీసులు సీసీ కెమెరాలు, ఫోన్ డేటా ఆధారంగా ముషీరాబాద్ బొలక్పూర్కు చెందిన భారతి బాబాయి ఆనంద్, తండ్రి బాలపీరు, తల్లి బాలకిష్టమ్మ, బావ బాలకృష్ణను గురువారం అదుపులోకి తీసుకొని విచారించారు. యువకుడిని హత్య చేసి కాలువతో పడేసినట్టు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న ఆనంద్ భార్య లీలను త్వరలో పట్టుకుంటామన్నారు. కాగా శివకుమార్ మృతదేహం కోసం ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ బృందాలతో గాలింపు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు కీలక పాత్ర పోషించిన పటాన్చెరు సీఐ వేణుగోపాల్‌రెడ్డి, క్రైం సీఐ బీసన్న, ఎస్ఐలు రామానాయుడు, ప్రసాద్‌ను ఎస్పీ రమణకుమార్ అభినందించినట్టు డీఎస్పీ తెలిపారు. ఇది కూడా చదవండి: షాకింగ్ ఘటన.. కాలేజీ విద్యార్థిని ఈడ్చుకెళ్లిన ఆటో డ్రైవర్, వీడియో వైరల్ -
‘తపాడియా’ దారుణ హత్య.. సీఎం సంచలన నిర్ణయం
రాజస్తాన్‌లో రోజురోజుకు ఉద్రిక్తర పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా భిల్వారాలో ఓ వర్గానికి చెందిన యువకుడిని మరో వర్గానికి చెందినవారు దారుణ చంపడంతో ఆ ప్రాంతంలో టెన్షన్ నెలకొంది. దీంతో సీఎం అశోక్ గెహ్లాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను గురువారం ఉదయం వరకు నిలిపివేశారు. వివరాల ప్రకారం... భిల్వారాకు చెందిన ఆదర్శ్ తపాడియా(22)ను ఓ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి కత్తితో పొడిచి చంపారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని తపాడియాను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో తపాడియాను పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో భిల్వారాలో పోలీసు బలగాలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులకు అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. తపాడియా మృతి కారణంగా ఉద్రిక్తతల నేపథ్యంలో ముందు జాగ్రత చర్యల్లో భాగంగా రాజస్తాన్ ప్రభుత్వం భిల్వారాలో గురువారం ఉదయం వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఈద్ పండుగ సందర్భంగా సీఎం అశోక్ గెహ్లాట్ స్వస్థలమైన జోధ్‌పూర్‌లో మత ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉద్రిక్తతలను అదుపు చేసేందుకు కర్ఫ్యూ, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. Rajasthan | A 22-year-old man was allegedly stabbed to death in Kotwali Police Station area of Bhilwara last night. Police forces deployed in the area. Internet services in Bhilwara to remain suspended till 6 am on Thursday, 12th May in wake of the incident. pic.twitter.com/lStcjtqiNP — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 11, 2022 ఇది కూడా చదవండి: నెల్లూరు కాల్పుల ఘటన.. బిహార్‌లో పిస్టల్ కొన్న సురేష్‌రెడ్డి! -
అమ్మాయి కోసం కొట్టుకున్నారు...
సాక్షి, బెంగళూరు : అమ్మాయి కోసం ఇద్దరు యువకులు నడిరోడ్డుపై కొట్టుకున్న సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి హలసూరు గేట్ సమీపంలోని ధర్మరాయ దేవాలయం వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే... హలసూరు ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు. ఇదే విషయమై ఇద్దరి మధ్య చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. గతంలో కూడా అమ్మాయి కోసం ఇద్దరు యువకులు ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో మొన్న రాత్రి హలసూరు గేట్ సమీపంలోని ధర్మరాయ దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన కరగ ఉత్సవం చూడడానికి వెళ్లిన ఇద్దరు యువకులు ఎదురెదురుగా తారసపడ్డారు. దీంతో మరోసారి అమ్మాయి విషయమై ఇద్దరి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం శృతి మించడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. హలసూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. -
కుమార్తెను ప్రేమిస్తున్నాడని..
సాక్షి, హైదరాబాద్: తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని ఓ యువకుడిని యువతి కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేయడమేగాక ఇంట్లో బంధించి తీవ్రంగా కొట్టిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. యూసుఫ్‌గూడ జవహర్‌నగర్‌కు చెందిన మహేందర్, భరత్‌నగర్ కాలనీకి చెందిన వెంకటేష్ యాదవ్ కుమార్తెను ప్రేమిస్తున్నాడు. ఈ నెల 21న అఖిల్, సాయి అనే ఇద్దరు యువకులు మహేందర్‌ను బలవంతంగా కారులో వెంకటేష్ ఇంటికి తీసుకెళ్లి ఓ గదిలో బంధించారు. మల్లేష్, సాయి, వెంకటేష్ అతడిని తీవ్రంగా కొట్టడంతో మహేందర్ సృహతప్పి పడిపోవడంతో 22వ తేదీ తెల్లవారుజామున యూసుఫ్‌గూడ రహదారిపై పడేసి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న అతని తండ్రి బాలమణి కుమారుడిని కేర్ ఆసుపత్రిలో చేర్చించాడు. బుధవారం కోలుకున్న మహేందర్ తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు తమ పరిధిలోకి రాదంటూ సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు పంపగా, వారు తమ పరిధి కాదంటూ జూబ్లీహిల్స్ కు పంపారు. చివరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుడి గొంతు కోసిన హిజ్రాలు
నెల్లూరు జిల్లాలో హిజ్రాల ఆగడాలు రోజురోజూకు అధికమవుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని నాయుడుపేటలో రైలు కోసం వేచి ఉన్న ప్రయాణికుడిని హిజ్రాలు నగదు డిమాండ్ చేశారు. అందుకు అతడు నిరాకరించాడు. దాంతో హిజ్రాల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నగదు అడిగితే ఇవ్వవా అంటూ ప్రయాణికుడి గొంతు కోశారు. దాంతో అతడు రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. అతడి వద్ద ఉన్న బంగారాన్ని హిజ్రాలు దోచుకుని, అక్కడి నుంచి పరారైయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడిని స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య సహాయం కోసం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని పోలీసులకు సూచించారు. దాంతో అతడిని నెల్లూరు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు పూడేరుకు చెందిన చిట్టిబాబుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.