Youth booked
-
స్టేడియంలో హల్చల్: ఆరుగురు బుక్
సాక్షి, హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ సందర్భంగా ఆదివారం కొంతమంది యువతీ యువకులు హల్ చల్ చేశారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోలకతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. పెద్ద సంఖ్యలో యువతీ యువకులు తమకు ఇబ్బంది కలిగించారని ఆరోపిస్తూ భరత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ శాంటోష్ ఉపాధ్యాయ్, ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్పొరేట్ బాక్స్ 22 నుంచి మ్యాచ్ చూడకుండా వికృత చేష్టలతో అసభ్యంగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. ఉపాధ్యాయ్ ఫిర్యాదు ఆధారంగా సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు ముగ్గురు యువతులతో సహా నగరంలోని ఆరుగురు వ్యక్తులను నిందితులుగా చేర్చారు. ప్రముఖ టీవీ యాంకర్ ప్రశాంతితోపాటు పూర్ణిమ, ప్రియ, శ్రీకాంత్ రెడ్డి, సురేశ్, వేణుగోపాల్‌పై కేసు నమోదైంది. -
నగ్న ఫొటోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడు
ఫరీదాబాద్: హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఇంటర్ విద్యార్థిని (16) అత్యాచారం చేసి, బ్లాక్మెయిల్ చేసిన కేసులో లలిత్ (21) అనే యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మెడికల్ స్టోర్‌లో పనిచేస్తున్న లలిత్ కొంతకాలంగా వేధిస్తున్నట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది. గత నెలలో లలిత్ తనను బలవంతంగా అతని స్నేహితుడు గౌరవ్ ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను నగ్నంగా ఫొటోలు తీసి, ఈ విషయం బయటచెబితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని లలిత్ బెదిరించినట్టు తెలిపింది. ఈ నగ్న ఫొటోల ద్వారా బ్లాక్మెయిల్ చేసి మరోసారి ఆ అమ్మాయిని అత్యాచారం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తానని బెదిరించినట్టు బాధితురాలు వెల్లడించింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కాగా నిందితుడిని ఇంకా అరెస్ట్ చేయలేదు.