నగ్న ఫొటోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడు
ఫరీదాబాద్: హరియాణాలోని ఫరీదాబాద్లో ఇంటర్ విద్యార్థిని (16) అత్యాచారం చేసి, బ్లాక్మెయిల్ చేసిన కేసులో లలిత్ (21) అనే యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మెడికల్ స్టోర్లో పనిచేస్తున్న లలిత్ కొంతకాలంగా వేధిస్తున్నట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది.
గత నెలలో లలిత్ తనను బలవంతంగా అతని స్నేహితుడు గౌరవ్ ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను నగ్నంగా ఫొటోలు తీసి, ఈ విషయం బయటచెబితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని లలిత్ బెదిరించినట్టు తెలిపింది. ఈ నగ్న ఫొటోల ద్వారా బ్లాక్మెయిల్ చేసి మరోసారి ఆ అమ్మాయిని అత్యాచారం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తానని బెదిరించినట్టు బాధితురాలు వెల్లడించింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కాగా నిందితుడిని ఇంకా అరెస్ట్ చేయలేదు.