breaking news
Youth ODIs
-
IND vs AUS: వైభవ్ సూర్యవంశీ విఫలం.. అయినా భారత్ భారీ స్కోరు
ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో నామమాత్రపు మూడో యూత్ వన్డే (IND U19 vs AUS U19 3rd ODI)లో భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) విఫలమయ్యాడు. గత రెండు మ్యాచ్‌లలో అదరగొట్టిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఈసారి మాత్రం పదహారు పరుగులకే పరిమితమయ్యాడు.ఇక.. మరో ఓపెనర్, కెప్టెన్ ఆయుశ్ మాత్రే (6, 0, 4)బ్యాట్‌తో తన వైఫల్యాన్ని కొనసాగించాడు. టాపార్డర్‌లో ఇలా ఓపెనర్లు నిరాశపరిచినా వన్‌డౌన్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా (40) మాత్రం ఫర్వాలేదనిపించాడు.అదరగొట్టిన వేదాంత్, రాహుల్అయితే, ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ.. మిడిలార్డర్లో వేదాంత్ త్రివేది, రాహుల్ కుమార్ (Rahul Kumar) అదరగొట్టడంతో.. భారత్ భారీ స్కోరు చేయగలిగింది. వేదాంత్ 92 బంతుల్లో 86, రాహుల్ కుమార్ 84 బంతుల్లో 62 పరుగులు సాధించారు. మిగతా వారిలో వికెట్ కీపర్ బ్యాటర్ హర్వన్ష్ పంగాలియా 23, ఖిలాన్ పటేల్ 20* పరుగులు చేశారు.ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్ల ఆట ముగిసే సరికి భారత అండర్-19 జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. ఆసీస్ యువ బౌలర్లలో విల్ బిరోమ్, కేసీ బార్టన్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. చార్ల్స్ లాచ్మండ్, బెన్ గోర్డాన్, కెప్టెన్ విల్ మలాజుక్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఇప్పటికే సిరీస్ 2-0తో కైవసంకాగా మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్-19 క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న వన్డేల్లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆయుశ్ మాత్రే సేన.. ఇప్పటికే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఇక శుక్రవారం నాటి మూడో యూత్ వన్డేలోనూ బ్యాటింగ్ పరంగా మరోసారి దుమ్మురేపింది. ఇక బౌలర్ల పనే మిగిలి ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‌లో తొలి వన్డేలో వైభవ్ సూర్యవంశీ 22 బంతుల్లో 38 పరుగులు చేశాడు. రెండో వన్డేలో 68 బంతుల్లో 70 పరుగులు సాధించాడు.చదవండి: అందుకే షమీని సెలక్ట్ చేయలేదు: కుండబద్దలు కొట్టిన అగార్కర్ -
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సరికొత్త చరిత్ర సృష్టించాడు. యూత్ వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అవతరించాడు. ఈ క్రమంలో ఉన్ముక్త్ చాంద్ (Unmukt Chand) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలుకొట్టాడు.ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో రెండో యూత్ వన్డే (IND U19 vs AUS U19) సందర్భంగా వైభవ్ సూర్యవంశీ ఈ ఘనత సాధించాడు. కాగా భారత అండర్-19 క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఇందులో భాగంగా మూడు మ్యాచ్‌ల యూత్ వన్డే సిరీస్‌లో ఆడుతోంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్‌లో గెలిచి భారత్ 1-0తో ఆధిక్యం సంపాదించింది.300 పరుగులుఈ క్రమంలో బుధవారం నాటి రెండో యూత్ వన్డేలోనూ భారత్ అదరగొట్టింది. 49.4 ఓవర్లలో 300 పరుగులు చేసి ఆలౌట్ అయింది. వైభవ్ సూర్యవంశీ (70), విహాన్ మల్హోత్రా (70), అభిగ్యాన్ కుందు (71) అద్భుత అర్థ శతకాల కారణంగా ఈ మేర భారీ స్కోరు సాధ్యమైంది. 41వ సిక్స్ఇక ఈ మ్యాచ్‌లో పద్నాలుగేళ్ల వైభవ్ 68 బంతుల్లో ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో యూత్ వన్డేల్లో తన 41వ సిక్స్‌ను నమోదు చేశాడు. తద్వారా ఉన్ముక్త్ చాంద్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును బ్రేక్ చేసి.. అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పాడు.కాగా భారత్‌కు అండర్-19 వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్ ఉన్ముక్త్ చాంద్. అయితే, టీమిండియాలో ఆడేందుకు అవకాశం రాకపోవడంతో అతడు అమెరికాకు వలస వెళ్లాడు. యూఎస్ఏ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. ఇక ఉన్ముక్త్ పేరు మీద భారత్ తరఫున ఉన్న ఈ ప్రపంచ రికార్డును చిచ్చరపిడుగు వైభవ్ తాజాగా బద్దలు కొట్టేశాడు.✨⚡Vaibhav Suryavanshi 🏏🔥💥#vaibhavSuryavanshi #IndiU19 pic.twitter.com/ioAyWm4n6X— Cric Insights (@cricinsights1) September 24, 2025 యూత్ వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు🏏వైభవ్ సూర్యవంశీ (ఇండియా)- 41 సిక్స్‌లు*- 2024-25🏏ఉన్ముక్త్ చాంద్ (ఇండియా)- 38 సిక్స్‌లు- 2011-12🏏జవాద్ అబ్రార్ (బంగ్లాదేశ్)- 35 సిక్స్‌లు- 2025-25🏏షాజైబ్ ఖాన్ (పాకిస్తాన్)- 31 సిక్స్‌లు- 2022-24🏏యశస్వి జైస్వాల్ (ఇండియా)- 30 సిక్స్‌లు- 2018-20.యూత్ క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ సాధించిన అరుదైన రికార్డులు🏏యూత్ వన్డేల్లో 52 బంతుల్లోనే శతకం🏏యూత్ వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (10) బాదిన ఇండియన్ బ్యాటర్🏏170 ఏళ్ల క్రికెట్ చరిత్రలో 13 ఏళ్ల 188 రోజుల వయసులోనే సెంచరీ (కాంపిటేటివ్ క్రికెట్) బాదిన ఆటగాడిగా ఘనత🏏రంజీ ట్రోఫీలో 12 ఏళ్ల 284 రోజుల వయసులోనే అడుగుపెట్టిన ఆటగాడిగా రికార్డు🏏ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో) చేసిన అత్యంత పిన్న వయస్కుడు🏏యూత్ టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (58 బంతుల్లో) చేసిన భారత ఆటగాడు.చదవండి: IND vs AUS: ఆసీస్ భారీ స్కోరు.. కేఎల్ రాహుల్ ఫెయిల్ -
IND vs AUS: మరోసారి దుమ్మురేపిన వైభవ్ సూర్యవంశీ.. భారత్ భారీ స్కోరు
భారత్ అండర్-19 క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టు (IND U19 vs AUS U19)తో రెండో యూత్ వన్డేలో ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు అద్భుత అర్ధ శతకం సాధించాడు. కాగా మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత యువ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఆదివారం జరిగిన తొలి యూత్ వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 22 బంతుల్లో 38 పరుగులతో రాణించాడు. Vaibhav Suryavanshi's first game in Australia was seriously entertaining 👏Highlights: https://t.co/hfQabdpRwD pic.twitter.com/TdGijK0ZpG— cricket.com.au (@cricketcomau) September 22, 2025 ఆసీస్‌పై 1-0తో ఆధిక్యంఇక నాలుగు, ఐదు స్థానాల్లో వచ్చిన వేదాంత్ త్రివేది (61 నాటౌట్), అభిగ్యాన్ కుందు (87 నాటౌట్) అజేయ అర్ధ శతకాలతో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు.ఫలితంగా ఆసీస్‌పై 1-0తో ఆధిక్యం సాధించిన భారత్.. తాజాగా బుధవారం నాటి రెండో వన్డేలోనూ అదరగొట్టింది. బ్రిస్బేన్ వేదికగా రెండో యూత్ వన్డేలో టాస్ గెలిచిన ఆతిథ్య ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది.ఆయుశ్ మాత్రే డకౌట్ఓపెనర్, కెప్టెన్ ఆయుశ్ మాత్రే డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ.. వన్‌డౌన్ బ్యాటర్ విహాన్ మల్హోత్రాతో కలిసి ఇన్నింగ్స్ గాడిలో పెట్టాడు. వీరిద్దరు అద్భుత అర్ధ శతకాలతో రాణించారు.వైభవ్, విహాన్ హాఫ్ సెంచరీలువైభవ్ మొత్తంగా 68 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 70 పరుగులు సాధించగా.. విహాన్ 74 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ బాది 70 పరుగులు రాబట్టాడు. మిగతా వారిలో వేదాంత్ త్రివేది 26 పరుగులు చేయగా.. వికెట కీపర్ బ్యాటర్ అభిగ్యాన్ కుందు మరోసారి హాఫ్ సెంచరీతో అలరించాడు.అభిగ్యాన్ మరోసారిఅభిగ్యాన్ 64 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టి 71 పరుగులు సాధించాడు. అయితే, అనూహ్య రీతిలో అతడు రనౌట్ అయ్యాడు. ఏదేమైనా టాపార్డర్, మిడిలార్డర్ చెలరేగడంతో టీమిండియా 300 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, లోయర్ ఆర్డర్ విఫలం కావడంతో 49.4 ఓవర్లలో ఆలౌట్ అయింది.ఆస్ట్రేలియా అండర్-19 బౌలర్లలో విల్ బైరోమ్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. కెప్టెన్ యశ్ దేశ్‌ముఖ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మిగతా వారిలో కాసే బార్టన్, హైడెన్ షీలర్, జాన్ జేమ్స్, ఆర్యన్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. భారత్ ఘన విజయంఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా అండర్-19 జట్టు.. 47.2 ఓవర్లలో 249 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా 51 పరుగుల తేడాతో గెలిచిన భారత యువ జట్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే.. రెండో యూత్ వన్డేలో భారత బౌలర్లలో కెప్టెన్ ఆయుశ్ మాత్రే మూడు వికెట్లతో రాణించగా.. కనిష్క్ చౌహాన్ రెండు, కిషన్ కుమార్, ఆర్ఎస్ అంబరీశ్, ఖిలాన్ పటేల్, విహాన్ మల్హోత్రా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: బీసీసీఐకి శ్రేయస్ అయ్యర్ లేఖ!.. ఇకపై నేను... -
IND vs AUS: వైభవ్ సూర్యవంశీ ధనాధన్.. ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్
భారత్ అండర్-19 క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా (AUS U19 Vs IND U19 ) పర్యటనలో శుభారంభం చేసింది. ఆసీస్ యువ జట్టుతో జరిగిన తొలి యూత్ వన్డేలో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) సారథ్యంలో మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లింది.పరుగుల ఖాతా తెరవకుండానేఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా ఆదివారం తొలి యూత్ వన్డే జరిగింది. ఇయాన్ హేలీ మైదానంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా అండర్-19 జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. భారత బౌలర్ల దాటికి ఆసీస్ పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్లు అలెక్స్ టర్నర్ (0), సీమోన్ బడ్జ్ (0) వికెట్లు కోల్పోయింది. వీరిద్దరిని కిషన్ కుమార్ (Kishan Kumar) అవుట్ చేసి.. ఆసీస్‌కు ఆరంభంలోనే గట్టి షాకిచ్చాడు.ఇక మిగిలిన ఆసీస్ బ్యాటర్లలో స్టీవెన్ హోగన్ 39, టామ్ హోగన్ 41 పరుగులతో రాణించగా.. జాన్ జేమ్స్ 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్ కారణంగానే ఆసీస్ మెరుగైన స్కోరు చేయగలిగింది. నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 225 పరుగులు సాధించింది. భారత యువ బౌలర్లలో కిషన్ కుమార్, కనిష్క్ చౌహాన్ రెండేసి వికెట్లు తీయగా.. హెనిల్ పటేల్ మూడు వికెట్లతో చెలరేగాడు. ఆర్ఎస్ అంబరీష్ కు ఒక వికెట్ దక్కింది.వైభవ్ సూర్యవంశీ ధనాధన్‌ఈ క్రమంలో ఆసీస్ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టుకు ఆదిలోనే షాకులు తగిలాయి. ఆసీస్ పేసర్ చార్లెస్ లాచ్మండ్ ఓపెనర్, కెప్టెన్ ఆయుశ్ మాత్రే (6), వన్‌డౌన్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా (9)లను సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం చేశాడు. అయితే, మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మాత్రం మరోసారి తన మార్కు చూపించాడు.ధనాధన్ బ్యాటింగ్‌తో దంచికొట్టి.. ఇన్నింగ్స్ గాడిన పెట్టాడు. మొత్తంగా 22 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 38 పరుగులు సాధించాడు. వేదాంత్, అభిగ్యాన్ అదుర్స్ఈ క్రమంలో అతడికి జతైన వేదాంత్ త్రివేది అర్ధ శతకం (61 నాటౌట్) తో ఆకట్టుకున్నాడు. ఇక వేదాంత్‌తో పాటు అభిగ్యాన్ కుందు దుమ్ములేపాడు. 74 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 87 పరుగులతో అజేయంగా నిలిచాడు.వేదాంత్‌తో కలిసి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. 30.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 227 పరుగులు సాధించిన భారత్.. ఆసీస్ జట్టును ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. సూపర్ ఫిఫ్టీ సాధించిన అభిగ్యాన్ కుందు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. -
వైభవ్ సూర్యవంశీ మిస్సయ్యాడు! సౌతాఫ్రికా స్టార్ ప్రపంచ రికార్డు
సౌతాఫ్రికా యువ క్రికెటర్ జోరిచ్ వాన్ షాల్విక్ (Jorich Van Schalkwyk) సరికొత్త చరిత్ర సృష్టించాడు. యూత్ వన్డేల్లో డబుల్ సెంచరీ (Double Century) సాధించిన తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. జింబాబ్వే అండర్-19 జట్టుతో మ్యాచ్ సందర్భంగా జోరిచ్ ఈ ఘనత సాధించాడు.విధ్వంసకర ఇన్నింగ్స్మూడు మ్యాచ్‌ల యూత్ వన్డే సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా అండర్-19 జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో మొదటి వన్డేలో జోరిచ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ టీ20 మాదిరి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు.కేవలం 153 బంతుల్లోనే 215 పరుగులు సాధించాడు జోరిచ్. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 19 ఫోర్లతో పాటు 6 సిక్సర్లు ఉన్నాయి. జోరిచ్ వీరోచిత ఇన్నింగ్స్ కారణంగా సౌతాఫ్రికా 385 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో జింబాబ్వే 107 పరుగులకే ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలగా.. 278 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించింది.యూత్ వన్డేల్లో తొలి ద్విశతకంఈ మ్యాచ్ సందర్భంగా యూత్ వన్డేల్లో తొలి ద్విశతకం బాదిన క్రికెటర్‌గా జోరిచ్ రికార్డు సాధించాడు. గతంలోనూ అతడు 200 పరుగుల మార్కుకు దగ్గరగా వచ్చి మిస్సయ్యాడు. బంగ్లాదేశ్ అండర్-19 జట్టుతో జరిగిన యూత్ వన్డేలో జోరిచ్ 156 బంతుల్లో 164 పరుగులు సాధించాడు.నాటి మ్యాచ్‌లో బంగ్లా విధించిన లక్ష్యాన్ని సౌతాఫ్రికా 44.4 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టపోయి ఛేదించింది. అలా ఆరోజు బంగ్లాపై విజయంలో కీలక పాత్ర పోషించిన జోరిచ్ వాన్ షాల్విక్.. తాజాగా జింబాబ్వేతో రికార్డు డబుల్ శతకంతో మెరిశాడు.వైభవ్ సూర్యవంశీ మిస్సయ్యాడుఇదిలా ఉంటే.. భారత్ అండర్-19 జట్టు ఇటీవల ఇంగ్లండ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాలుగో యూత్ వన్డేలో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ కేవలం 52 బంతుల్లోనే శతకం సాధించి.. ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. మొత్తంగా 78 బంతుల్లో 143 పరుగులు సాధించాడు. 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో ఈ మేర భారీ శతకం నమోదు చేశాడు. అయితే, దీనిని డబుల్ సెంచరీగా మలచలేకపోయాడు.అలా వైభవ్ మిస్సయిన ప్రపంచ రికార్డును జోరిచ్ తాజాగా తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా భారత్ తరఫున యూత్ వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా అంబటి రాయుడు కొనసాగుతున్నాడు.ఇంగ్లండ్‌తో 2002 నాటి మ్యాచ్‌లో రాయుడు 177 పరుగులు సాధించాడు. అతడి తర్వాతి స్థానాల్లో రాజ్ అంగద్ బవా (2022లో ఉగాండాపై 162), మయాంక్ అగర్వాల్ (160), శుబ్‌మన్ గిల్ (160), వైభవ్ సూర్యవంశీ (143) ఉన్నారు.చదవండి: ‘పది కుట్లు పడ్డాయి.. టీమిండియాలోకి వచ్చే ఛాన్స్ లేదు’ -
BCCI: వైభవ్ సూర్యవంశీ ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?
భారత క్రికెట్ జట్లు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాయి. శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని పురుషుల జట్టు టెస్టు సిరీస్ ఆడుతుంటే.. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని మహిళల టీమ్ పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆతిథ్య జట్టుతో తలపడుతోంది.మరోవైపు.. ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ వంటి నయా ఐపీఎల్ సంచనాలతో కూడిన భారత అండర్-19 జట్టు కూడా ప్రస్తుతం ఇంగ్లండ్‌లోనే ఉంది. ఇంగ్లండ్ యువ జట్టుతో ఐదు యూత్ వన్డేలు పూర్తి చేసుకున్న ఈ టీమ్ 3-2తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.ధనాధన్.. ఫటాఫట్ఈ సిరీస్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ మరోసారి హాట్‌టాపిక్ అయిపోయాడు. అతడి ఆటను చూసేందుకు వందల కిలోమీటర్లు ప్రయాణించి అభిమానులు స్టేడియాలకు వస్తున్నారంటే అతడి క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకు తగ్గట్లుగానే ధనాధన్ దంచికొడుతూ క్రికెట్ ప్రేమికులకు కనువిందు చేస్తున్నాడు వైభవ్.ముఖ్యంగా ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో నాలుగో వన్డేలో వైభవ్ సూర్యవంశీ 52 బంతుల్లోనే శతక్కొట్టడం ఇంగ్లండ్ టూర్ మొత్తంలో హైలైట్‌గా నిలిచింది. ఇక భారత్- ఇంగ్లండ్ మధ్య తొలి యూత్ టెస్టులోనూ పద్నాలుగేళ్ల ఈ చిచ్చరపిడుగు రాణించాడు. తొలి ఇన్నింగ్స్ (14)లో విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం (56) సాధించాడు. అంతేకాదు.. ఈ పార్ట్‌టైమ్ స్పిన్నర్ రెండు వికెట్లు కూడా పడగొట్టాడు.ఇప్పటికే కోటీశ్వరుడిగాఇదిలా ఉంటే.. వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే కోటీశ్వరుడైన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2025 మెగా వేలం సందర్భంగా ఈ బిహార్ కుర్రాడిని రాజస్తాన్ రాయల్స్ ఏకంగా 1.1 కోట్లకు కొనుగోలు చేసింది. అందుకు తగ్గట్లుగానే ఫాస్టెస్ట్ సెంచరీతో పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు వైభవ్.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా వైభవ్ ఎంత సంపాదిస్తున్నాడన్న అంశంపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిబంధనల ప్రకారం.. స్లాబుల ప్రకారం అండర్-19 ప్లేయర్లకు రోజుకు రూ. 20 వేల చొప్పున ఫీజు అందుతుంది. అయితే, తుదిజట్టులో ఉన్న ఆటగాళ్లకే ఈ మొత్తం దక్కుతుంది. రిజర్వు ప్లేయర్లకు ఇందులో సగం అంటే రూ. 10 వేలు మాత్రమే ఇస్తారు.ఇప్పటికి రూ. 1.80 లక్షలుఈ లెక్కన వైభవ్ ఐదు యూత్ వన్డేల్లోనూ ఆడాడు కాబట్టి.. ఒక్కో మ్యాచ్‌కు రూ. 20 వేల చొప్పున ఐదింటికి రూ. లక్ష లభిస్తుంది. అదే విధంగా.. నాలుగు రోజుల యూత్ టెస్టుగానూ రోజుకు రూ. 20 వేల చొప్పున ఎనభై వేలు అతడికి ఫీజు రూపంలో దక్కుతాయి. వైభవ్‌తో పాటు తుదిజట్టులో ఆడిన ప్రతి ఒక్క ప్లేయర్‌కు ఈ మేర ఫీజు లభిస్తుంది.సీనియర్ జట్ల ప్రదర్శన ఇలాఇదిలా ఉంటే.. శుబ్‌మన్ గిల్ సేన ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల్లో మూడు పూర్తి చేసుకుంది. లీడ్స్‌లో ఓడిన టీమిండియా.. ఎడ్జ్‌బాస్టన్‌లో తొలిసారి గెలుపు జెండా ఎగురవేసిది. అయితే, లార్డ్స్‌లో ఓటమిపాలు కావడంతో ఇంగ్లండ్ 2-1తో ముందంజ వేసింది. మరోవైపు.. మహిళల జట్టు ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి టీ20 సిరీస్ గెలిచింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది. ఇక మూడు వన్డేల సిరీస్‌లోనూ తొలి మ్యాచ్ గెలిచి.. శుభారంభం అందుకుంది.చదవండి: సిరాజ్ సింహం లాంటోడు.. కానీ ఒక్కోసారి మేమే వారిస్తాం: టీమిండియా కోచ్ -
వైభవ్ సూర్యవంశీ క్రేజ్ మామూలుగా లేదుగా!.. టీనేజ్ స్టార్ కోసం ఏకంగా..
భారత క్రికెట్ వర్గాల్లో టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)తో పాటు అండర్-19 ఆటగాడు వైభవ్ సూర్యవంశీ పేరు మారుమ్రోగిపోతోంది. ఇంగ్లండ్ గడ్డ మీద వరుస శతకాలు బాదుతూ ఎడ్జ్‌బాస్టన్‌లో తొలిసారి జట్టును గెలిపించి గిల్ చరిత్ర సృష్టించగా.. అండర్-19 యూత్ వన్డే సిరీస్‌ను భారత్ గెలుచుకోవడంలో వైభవ్‌ది కీలక పాత్ర.ఇంగ్లండ్ గడ్డపై యాభై ఓవర్ల ఫార్మాట్లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. టీ20 మాదిరి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. తొలి మ్యాచ్‌లో 19 బంతుల్లోనే 48 పరుగులు సాధించిన ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు.. రెండో వన్డేలో 34 బంతుల్లో 45 రన్స్ రాబట్టాడు.సునామీ శతకంఇక మూడో యూత్ వన్డేల్లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ 31 బంతుల్లోనే 86 పరుగులతో దుమ్ములేపాడు. అయితే, ఆ తర్వాతి వన్డేలో మాత్రం వైభవ్ సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ బౌలింగ్‌ను చిత్తు చేశాడు. వోర్సెస్టర్ వేదికగా కేవలం 52 బంతుల్లోనే వంద పరుగులు పూర్తి చేసుకుని.. యూత్ వన్డేల్లో అత్యంత పిన్న వయసు (14 ఏళ్ల వంద రోజుల వయసు)లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సాధించాడు.అయితే, ఆఖరిదైన ఐదో వన్డేలో మాత్రం వైభవ్ 42 బంతుల్లో 33 పరుగులే చేయగలిగాడు. అయితేనేం.. ఇంగ్లండ్‌తో ఐదు వన్డేల్లో ఓవరాల్‌గా 29 సిక్సర్లు బాది.. 355 పరుగులు సాధించాడు. దీంతో క్రికెట్ ప్రేమికుల్లో ఎక్కడ చూసినా వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్ గురించే చర్చ.వైభవ్ సూర్యవంశీ క్రేజ్ మామూలుగా లేదుగా!ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ గడ్డ మీద వైభవ్ సూర్యవంశీ మేనియా ఏ రేంజ్లో ఉందో తెలిపేలా.. అతడి ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్ ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ఆరు గంటల పాటు కారులో ప్రయాణించి వోర్సెస్టర్‌కు చేరుకున్నారు. పింక్ జెర్సీ ధరించి వచ్చి వైభవ్‌తో పాటు టీమ్ ఇండియాకు మద్దతు పలికారు.ఆన్య, రివా.. వైభవ్ వయసు వారే. తమ అభిమాన ఆటగాడి కోసం వారు ఇంత దూరం వచ్చి.. మధురజ్ఞాపకాలు పోగు చేసుకున్నారు’’ అంటూ వైభవ్‌తో ఇద్దరమ్మాయిలు దిగిన ఫొటోలను రాజస్తాన్ రాయల్స్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.ఐపీఎల్‌లోనూ సరికొత్త చరిత్రకాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో భాగంగా రాజస్తాన్ రాయల్స్ బిహార్‌కు చెందిన వైభవ్‌ను.. రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ ఫిట్‌నెస్‌లేమి కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరం కాగా.. అతడి స్థానంలో తుదిజట్టులోకి వచ్చాడు వైభవ్. రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో ఆకాశమే హద్దుగా చెలరేగి క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యంత పిన్న వయసులోనే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 14 ఏళ్ల 32 రోజుల వయసులో వైభవ్ 35 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదు యూత్ వన్డేల సిరీస్‌ను భారత్ 3-2తో గెలుచుకుంది. చదవండి: IND vs ENG: తుది జట్టులోకి బుమ్రా.. అతడిపైనే వేటుProof why we have the best fans 🫡🚗 Drove for 6 hours to Worcester👚 Wore their Pink🇮🇳 Cheered for Vaibhav & Team IndiaAanya and Rivaa, as old as Vaibhav himself, had a day to remember 💗 pic.twitter.com/9XnxswYalE— Rajasthan Royals (@rajasthanroyals) July 9, 2025 -
ఇంగ్లండ్ గడ్డ మీద ఇరగదీసిన వైభవ్ సూర్యవంశీ.. ఇక డబుల్ సెంచరీ బాకీ!
ఐపీఎల్-2025లో అదరగొట్టిన యువ క్రికెటర్, రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. భారత అండర్-19 జట్టు తరఫునా అదరగొట్టాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో తన అరంగేట్ర సీజన్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు.. ఇంగ్లండ్ గడ్డ మీదా వేగవంతమైన శతకంతో మెరిశాడు.తద్వారా యూత్ వన్డేల్లో అత్యంత పిన్న వయసులో, తక్కువ బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న తొలి క్రికెటర్‌గా వైభవ్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లంగ్ పర్యటనలో అతడి ప్రదర్శన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్న మాజీ క్రికెటర్లు.. ఇలాగే కొనసాగితే త్వరలోనే టీమిండియా తరఫున అరంగేట్రం చేయడం ఖాయమంటున్నారు.252కు పైగా స్ట్రైక్రేటుతోఐదు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత యువ జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ ఆరంభం కాగా.. హోవ్‌లో మొదటి మ్యాచ్ జరిగింది. ఇందులో వైభవ్ సూర్యవంశీ ధనాధన్ దంచికొట్టాడు. కేవలం 19 బంతుల్లోనే 3 ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 252కు పైగా స్ట్రైక్‌రేటుతో 48 పరుగులు సాధించాడు.ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడంలో వైభవ్‌ది కీలక పాత్ర. ఇక రెండో యూత్ వన్డేలోనూ ఈ ఓపెనింగ్ బ్యాటర్ రాణించాడు. 34 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 45 పరుగులు రాబట్టాడు.సునామీ శతకంతో చెలరేగి..అయితే, మూడో వన్డేలో ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టిన వైభవ్.. ఈసారి ఏకంగా 31 బంతుల్లోనే 86 పరుగులతో దుమ్ములేపాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లతో పాటు తొమ్మిది సిక్స్‌లు ఉండటం విశేషం.ఇవన్నీ ఒక ఎత్తయితే.. నాలుగో వన్డేలో మాత్రం వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్‌ను ప్రశంసించేందుకు మాటలు చాలవు. మంచి బంతిని గౌరవిస్తూనే.. లూజ్ బాల్ పడ్డప్పుడల్లా బౌండరీలతో ఇరగదీశాడు ఈ చిచ్చరపిడుగు. 24 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న వైభవ్.. ఇందులో 46 పరుగులు కేవలం బౌండరీల ద్వారానే రాబట్టడం విశేషం.Highlights of Vaibhav Suryavanshi's superb 143 off 78 against England Under-19s 🙌(via @WorcsCCC) pic.twitter.com/alFqUTxNHL— ESPNcricinfo (@ESPNcricinfo) July 5, 2025 ఫాస్టెస్ట్ సెంచరీఆ తర్వాత కూడా ఇదే జోరును కొనసాగించిన వైభవ్.. కేవలం 52 బంతుల్లోనే శతక్కొట్టాడు. తద్వారా యూత్ వన్డేలో 14 ఏళ్ల 100 రోజుల వయసులోనే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు వైభవ్. ఇక ఈ మ్యాచ్ వైభవ్ (143)తో పాటు మరో ఆటగాడు విహాన్ మల్హోత్రా (129) కూడా శతకం బాదడంతో భారత్.. ఇంగ్లండ్‌పై ఏకపక్ష విజయం సాధించి 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది.ఇక ఆఖరిదైన ఐదో యూత్ వన్డేలో మాత్రం వైభవ్ నామమాత్రంగానే ఆడాడు. 42 బంతులు ఎదుర్కొని కేవలం 33 పరుగులే చేశాడు. మిగతా వారిలో ఆర్ఎస్ అంబరీష్ అజేయ అర్ధ శతకం (66)తో రాణించాడు. ఈ క్రమంలో 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసిన భారత జట్టు.. ఈ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. భారత బౌలర్లు తేలిపోవడంతో 31.1 ఓవర్లలోనే ఇంగ్లండ్ పనిపూర్తి చేసి.. ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.ఏదేమైనా ఈ పర్యటన ద్వారా వైభవ్ సూర్యవంశీ తన సత్తా ఏమిటో మరోసారి నిరూపించుకున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మారి.. భారత్ సిరీస్ కైవసం చేసుకోవడంలో ప్రధాన భూమిక పోషించాడు. ఈ ఐదు వన్డేల సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ మొత్తంగా 355 పరుగులు సాధించగా... ఇందులో 29 సిక్సర్లు ఉండటం విశేషం.ఇక డబుల్ సెంచరీ బాకీ..ఇక తన ఫాస్టెస్ట్ సెంచరీ తర్వాత బీసీసీఐతో మాట్లాడుతూ వైభవ్ సూర్యవంశీ.. ‘‘ఈ రికార్డు గురించి నాకసలు తెలియదు. మా టీమ్ మేనేజర్ అంకిత్ సర్ దీని గురించి చెప్పారు. శుబ్‌మన్ గిల్ (డబుల్ సెంచరీ)ను చూసి నేను ఎంతో స్ఫూర్తి పొందాను.సెంచరీని డబుల్ సెంచరీగా మార్చిన తీరును గమనించాను. అప్పుడే నేను కూడా సుదీర్ఘ ఇన్నింగ్స్ ఎలా ఆడాలో అర్థం చేసుకున్నాను. అయితే, సెంచరీ తర్వాత నేను తప్పుడు షాట్ సెలక్షన్‌తో అవుటయ్యాను. లేదంటే గిల్ మాదిరే డబుల్ సెంచరీ ఇన్నింగ్స్ కోసం ప్రయత్నించేవాడిని.నేనేం చేసినా జట్టు ప్రయోజనాల కోసమే!..తదుపరి మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించేందుకు ప్రయత్నిస్తా’’ అని చెప్పుకొచ్చాడు. అయితే, 33 పరుగులకే అవుట్ కావడంతో వైభవ్ ఆశ నెరవేరలేదు. అయినప్పటికీ ఈ సిరీస్‌లో వైభవ్ కనబరిచిన ఆట తీరు అద్భుతమనే చెప్పవచ్చు. వన్డే ఫార్మాట్లో అతడు టీ20 మాదిరి విధ్వంసం సృష్టించడం విశేషం. ఇక తదుపరి ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో యూత్ టెస్టులలోనైనా వైభవ్ తన డబుల్ సెంచరీ కోరికను నెరవేర్చుకుంటాడేమో చూడాలి!చదవండి: MCC: ఆకాశ్ దీప్ డెలివరీ.. రూట్‌కు అన్యాయం?.. ఎంసీసీ స్పందన ఇదే -
సునామీ శతకంతో విరుచుకుపడ్డ వైభవ్.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్
భారత యువ క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. నాలుగో యూత్ వన్డేలో ఇంగ్లండ్ అండర్-19 జట్టును చిత్తు చేసింది. ఏకంగా 55 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.వోర్సెస్టర్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ అండర్-19 జట్టు.. తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ఆయుశ్ మాత్రే విఫలం కాగా.. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi), వన్‌డౌన్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా (Vihaan Malhotra) దుమ్ములేపారు. వైభవ్ సునామీ శతక ఇన్నింగ్స్‌వైభవ్ కేవలం 52 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మొత్తంగా 78 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 143 పరుగులు సాధించాడు. అయితే, బెన్ మేయ్స్ బౌలింగ్‌లో జోసెఫ్ మూర్స్‌కు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్ సునామీ శతక ఇన్నింగ్స్‌కు తెరపడింది.ఇక విహాన్ 121 బంతుల్లో 15 ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 129 పరుగులు సాధించాడు. మిగతా వారిలో కెప్టెన్ అభిజ్ఞాన్ ముకుంద్.. 23 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. రాహుల్ కుమార్, హర్వన్ష్ పంగాలియా డకౌట్ అయ్యారు. కనిష్క్ చౌహాన్ (2), ఆర్ఎస్ అంబరీష్ (9), దీపేశ్ దేవేంద్రన్ (3) విఫలం కాగా.. యుధాజిత్ గుహ 15, నమన్ పుష్పక్ 2 పరుగులతో అజేయంగా నిలిచారు.ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది.రాకీ ఫ్లింటాఫ్ అద్భుత సెంచరీ వృథాఇంగ్లండ్ బౌలర్లలో జాక్ హోమ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. సెబాస్టియన్ మోర్గాన్ మూడు వికెట్లు తీశాడు. బెన్ మేయ్స్, జేమ్స్ మింటో చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఇక భారత్ విధించిన 364 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ 308 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు బెన్ డాకిన్స్ (67), జోసెఫ్ మూర్స్ (52) అర్ధ శతకాలు బాదగా.. రాకీ ఫ్లింటాఫ్ అద్భుత సెంచరీ (91 బంతుల్లో 107) వృథాగా పోయింది. భారత బౌలర్లలో నమన్ పుష్పక్ మూడు వికెట్లు, ఆర్ అంబరీష్ రెండు వికెట్లు కూల్చి ప్రత్యర్థిని దెబ్బకొట్టగా.. దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇరుజట్ల మధ్య నామమాత్రపు ఐదో యూత్ వన్డే సోమవారం వోర్సెస్టర్లోనే జరుగనుంది.ఇక ఐదు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లింది భారత జట్టు. మొదటి, మూడు, నాలుగో యూత్ వన్డేల్లో గెలిచిన 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. చదవండి: వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు.. -
వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు.. విహాన్ శతకం.. భారత్ భారీ స్కోరు
ఇంగ్లండ్ గడ్డ మీద భారత యువ జట్టు అదరగొడుతోంది. ఆతిథ్య అండర్-19 జట్టుతో ఐదు యూత్ వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్.. నాలుగో మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించింది.వోర్సెస్టర్ వేదికగా శనివారం యూత్ వన్డేలో టాస్ ఓడిన భారత అండర్-19 జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అయితే, ఆదిలోనే భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఆయుశ్ మాత్రే 14 బంతులు ఎదుర్కొన్ని కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు.దీంతో ఆదిలోనే వికెట్ తీసినందుకు ఇంగ్లండ్ సంబరాలు చేసుకోగా.. ఆ ఆనందాన్ని భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కాసేపట్లోనే ఆవిరి చేశాడు. మరోసారి బ్యాట్‌తో వీర విహారం చేసిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.ఆ తర్వాత కూడా ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు.. 52 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా యూత్ వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీని తన పేరిట నమోదు చేసుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 78 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ బౌలింగ్‌ను చితక్కొడుతూ 143 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టాండర్ బౌలింగ్‌లో పదమూడు ఫోర్లతో పాటు ఏకంగా పది సిక్సర్లు ఉండటం విశేషం.ఇక వైభవ్ వరుసగా ఇలా నాలుగో మ్యాచ్‌లో సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడితే.. వన్‌డౌన్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా కూడా శతకంతో చెలరేగాడు. 121 బంతుల్లో 15 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 129 పరుగులు సాధించాడు. అయితే, వీరిద్దరు అవుటైన తర్వాత భారత ఇన్నింగ్స్ నెమ్మదించింది.మిగతా వారిలో కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు 23 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. రాహుల్ కుమార్ (0), హర్వన్ష్ పంగాలియా (0), కనిష్క్ చౌహాన్ (2) పూర్తిగా విఫలమయ్యారు. ఇక ఆర్ఎస్ అంబరీష్ (9), దీపేశ్ దేవేంద్రన్ (3) కూడా చేతులెత్తేయగా.. యుధాజిత్ గుహ 15, నమన్ పుష్పక్ రెండు పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు.ఫలితంగా భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 363 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ అండర్-19 బౌలర్లలో జాక్ హోమ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. సెబాస్టియన్ మోర్గాన్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇతరులలో బెన్ మేయ్స్, జేమ్స్ మింటో ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇదిలా ఉంటే.. తొలి యూత్ వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలవగా.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఒక వికెట్ తేడాతో గట్టెక్కింది. ఈ క్రమంలో మూడో వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించి సిరీస్‌లో 2-1తో ముందంజలో ఉంది. కీలకమైన నాలుగో మ్యాచ్‌లో గెలిచి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. కాగా భారత్ విజయాల్లో వైభవ్ సూర్యవంశీ ( 48 (19) - 45 (34)- 86 (31))దే కీలక పాత్ర.వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు..యూత్ వన్డే చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. 14 ఏళ్ల 100 రోజుల వయసులోనే ఈ ఘనత సాధించాడు. ప్రపంచంలో ఈ ఫీట్ అందుకున్న తొలి ఆటగాడు వైభవ్. అంతేకాదు.. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ నజ్ముల్ షాంటో (2009లో 14 ఏళ్ల 241 రోజుల వయసులో శతకం) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కూడా ఈ సందర్భంగా బద్దలు కొట్టాడు. -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం.. మరోసారి సునామీ ఇన్నింగ్స్
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అద్భుత ఫామ్ కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో యూత్ వన్డేల్లో పద్నాలుగేళ్ల ఈ చిచ్చరపిడుగు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. హోవ్ వేదికగా ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో తొలి వన్డేలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ దుమ్ములేపిన విషయం తెలిసిందే. కేవలం 19 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో.. 252కు పైగా స్ట్రైక్‌రేటుతో 48 పరుగులు సాధించాడు.వరుసగా నాలుగో మ్యాచ్‌లో..ఇక రెండో యూత్ వన్డేలో 34 బంతుల్లో 45 పరుగులతో ఫర్వాలేదనిపించిన వైభవ్.. మూడో మ్యాచ్‌లో మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించాడు. నార్తాంప్టన్ వేదికగా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ 31 బంతుల్లో ఆరు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు బాది 86 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.వైభవ్ వీరబాదుడుతాజాగా వోర్సెస్టర్ వేదికగా నాలుగో యూత్ వన్డేలో వైభవ్ సూర్యవంశీ మరోసారి బ్యాట్ ఝులిపించాడు. ఇంగ్లండ్ బౌలింగ్‌ను చితక్కొడుతూ కేవలం 24 బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు. ఇందులో 46 పరుగులు బౌండరీల ద్వారానే రావడం విశేషం. దీనిని బట్టి వైభవ్ వీరబాదుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.ఫాస్టెస్ట్ సెంచరీఅంతటితో వైభవ్ పరుగుల దాహం తీరలేదు. అర్ధ శతకాన్ని సెంచరీగా మార్చేశాడు యువ సంచలనం. కేవలం 52 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని.. తన వీరవిహారాన్ని కొనసాగిస్తున్నాడు. కాగా యూత్ వన్డేలలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ అని తెలుస్తోంది.కాగా ఐదు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్-19 క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా తొలి మూడు యూత్ వన్డేల్లో రెండు గెలిచిన ఆయుశ్ మాత్రే సేన.. శనివారం నాలుగో మ్యాచ్‌లోనూ దుమ్ములేపుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్.. సగం ఆట అంటే 25 ఓవర్లు పూర్తయ్యే సరికి వికెట్ నష్టానికి 216 పరుగులు సాధించింది. ఓపెనర్ ఆయుశ్ మాత్రే (5) మరోసారి నిరాశపరచగా.. వైభవ్ 74 బంతుల్లో 140, విహాన్ మల్హోత్రా 62 బంతుల్లో 47 పరుగులతో ఆడుతున్నారు.143 పరుగులు చేసి అవుట్..ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 78 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ.. 143 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లతో పాటు 10 సిక్సర్లు ఉన్నాయి. అయితే, బెన్ మాయెస్ బౌలింగ్‌లో జోసెఫ్ మూరేస్కు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్ విధ్వంసకర శతక ఇన్నింగ్స్‌కు తెరపడింది. చదవండి: కోహ్లి, రోహిత్ కాదు!.. వైభవ్ సూర్యవంశీ రోల్‌మోడల్ ఆ సూపర్‌స్టారే!