YSR Jagananna Videshi Vidya Deevena
-
పేద పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట
ప్రజలకు ఉపయోగపడే పథకాలను అమలు చేయడంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డిల పాలనలు తిరుగులేని తార్కాణం. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకం వైసీపీ పాలనలో వెలువడిన మరో ఆణిముత్యం. చంద్రబాబు నాయుడు హయాంలో అమలు చేసిన విదేశీ విద్యా దీవెన పథకానికి నిర్దుష్టమైన నియ మాలు లేవు. ఏడాదికి 100 మంది ఎస్టీలకు, 300 మంది ఎస్సీలకు, 400 మంది కాపులకు, 500 మంది మైనారిటీలకు, 1,000 మంది బీసీలకు పరిమితం చేశారు. పేదల్లో ఉన్న అగ్ర వర్ణాల వారిని అనర్హులుగా చేశారు. మొత్తం మీద ఏడాదికి 2,300 మందికి మించకుండా విద్యార్థులను ఎంపిక చేశారు. అయితే ఈ కొద్ది మంది ఎంపికలోనూ అనేక అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకున్నాయి. పరిమితికి మించిన ఆదాయం కలిగిన కుటుంబాల పిల్లలకు కూడా ఈ పథకం వర్తింప చేశారు. అలాగే ఎంపికైన విద్యార్థులలో కొంత మంది అనుమతి లేకుండానే చదివే యూనివర్సిటీలు, దేశాలూ మార్చుకున్నారు. కొంత మంది అయితే అసలు కోర్సు పూర్తి చేయకుండానే ఆర్థిక సహాయాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే విదేశీ విద్యా పథకంలో ఉన్న లోపాలన్నింటినీ సరిదిద్ది, అక్రమాలకు తావు లేకుండా పూర్తిగా పారదర్శక విధానంలో ప్రతిభ కలిగిన పేద విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా ముఖ్యమంత్రి జగన్ ‘జగనన్న విదేశీ విద్య’ పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకంలో ముందుగా యూనివర్సిటీల నాణ్యతా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటూ ప్రపంచ స్థాయిలో ఇచ్చే క్యూఎస్ (క్వాక్వరెల్లి సిమండ్స్) ర్యాంకింగ్‌లో 1 నుంచి 200 లోపు ర్యాంకులు కలిగిన యూనివర్సిటీల్లో చదవడం వల్ల విద్యా ర్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 1 నుంచి 100 దాకా క్యూఎస్ ర్యాంకులు కలిగిన యూనివర్సిటీల్లో చదవడానికి సీట్లు సంపాదించిన విద్యార్థులకు పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలనీ, అదే విధంగా 101 నుంచి 200 దాకా క్యూఎస్ ర్యాంకింగ్ కలిగిన యూని వర్సిటీలకు ఎంపికైన విద్యార్థులకు రూ. 50 లక్షల వరకూ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలనీ నిర్ణయించారు. బాబు హయాంలో అమలు చేసిన విదేశీ విద్యా పథకంలో ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు రూ. 15 లక్షలు, కాపులు, బీసీలకు రూ.10 లక్షలు మాత్రమే ఆర్థిక సహాయం చేసే వారు. దీన్ని బట్టి చంద్రబాబు ప్రభుత్వంలో అమలు చేసిన విదేశీ విద్యా పథకం కంటే జగనన్న విదేశీ విద్యా పథకంలో విద్యా ర్థులకు అందించే ఆర్థిక సాయాన్ని ఎంత ఎక్కువగా పెంచారో గమనించవచ్చు. అంతే కాదు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమలు చేసిన విదేశీ విద్యా పథకంలో ఏడాదికి 2,300 మందిని మాత్రమే ఎంపిక చేయాలన్న పరిమితి ఉండేది. కానీ జగనన్న విదేశీ విద్యా పథకంలో అలాంటి పరిమితి ఏదీ లేదు. క్యూఎస్ 200 లోపు ర్యాంకులు కలిగిన యూనివర్సిటీలకు ఎంతమంది విద్యార్థులు ఎంపికైతే అంత మందికీ కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఇది కాకుండా గతంలో కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికే పరిమితమైన ఈ పథకాన్ని అగ్రకులాల్లో పరిమిత ఆదాయం కలిగిన వారికి కూడా వర్తింపజేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీనికితోడుగా గతంలో ఉన్న ఆర్థిక పరిమితి రూ. 6 లక్షలను రూ. 8 లక్షలకు కూడా పెంచారు. ఈ విధంగా పేద పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అపరిమితమైన ప్రయోజనాలతో ఈ పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసు కొచ్చింది. ప్రతి యేటా సెప్టెంబర్ – డిసెంబర్, జనవరి–మే మాసాల్లో అర్హుల గుర్తింపు కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేయడం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే విదేశీ విద్యా పథకాన్ని నిలిపివేశారని చంద్రబాబు నాయుడు విమర్శించడం దారుణం. ఆయనకు ప్రజా ప్రయో జనాల కంటే రాజకీయాలే ప్రధానమని ఈ పథకాన్ని విమర్శించడం బట్టి అర్థమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంత మంచి పథకాన్ని తీసుకురావడంతో సరిపెట్టకుండా టాప్ 200 యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించడంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారి పిల్లలు ఇబ్బంది పడకుండా వారికి ప్రత్యేకమైన శిక్షణను ఇప్పించాలని కూడా యోచిస్తుండటం ఆయన విశాల ధృక్పథానికి నిదర్శనం. (క్లిక్: అనవసర ఉద్యమాలు ఎందుకు?) - డాక్టర్ మేరుగు నాగార్జున ఏపీ సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు -
ఏది నిజం?: విదేశీ విద్యా దీవెన అందిందెవరికి?
టీడీపీ నేతల సిఫారసులతో... కనీసం ఒక్కశాతం కూడా పారదర్శకత లేకుండా నడిచిన ‘విదేశీ విద్యా దీవెన’ ఆగిపోయిందంటూ ‘ఈనాడు’ గుండెలు బాదేసుకుంటోంది. దాన్ని చంద్రబాబే బకాయిలు పెట్టేసి నిలిపేశాడన్న వాస్తవాన్ని మాత్రం ఆ పత్రిక ప్రస్తావించడమే లేదు. పైపెచ్చు ఆ పథకం అమల్లో వెలుగుచూసిన అవకతవకలు... సోషల్ ఆడిట్లో బయటపడ్డ నకిలీ లబ్ధిదారులు... ఇవేవీ ‘ఈనాడు’ అధిపతి రామోజీరావుకు పట్టవు. ఇప్పుడు అధికారంలో ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి... ఇచ్చిన మాట తప్పకుండా ముందుకెళుతున్నందుకు నానాటికీ ప్రజాదరణ పెరుగుతోంది కాబట్టి... ఏదో ఒకరకంగా బురద జల్లడమే ఆయన పని. దాన్లో భాగమే ఈ కథనాలు. ‘ఈనాడు’ రాతల్లో నిజమెంతో ఒకసారి చూద్దాం... విదేశాల్లో చదువుకునే పేద విద్యార్థులకు ప్రభుత్వ పరంగా సహకారమందించడానికి ఉద్దేశించిందే ‘విదేశీ విద్యాదీవెన’ పథకం. చంద్రబాబు దీన్ని ఎంత ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నా... వాస్తవంగా అమలు చేసింది మాత్రం తక్కువ మందికే. పైపెచ్చు పారదర్శకతకు తావే లేకుండా... తమ పార్టీ నాయకుల సిఫారసులుంటే చాలన్న రీతిలో వ్యవహరించారు. ఇన్ని చేసి కూడా... ఒకటి రెండేళ్లు అమలు చేశాక 2017–18 నుంచి పూర్తిస్థాయిలో చెల్లింపులు నిలిపేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, బ్రాహ్మణ, మైనారిటీలకు బాబు సర్కారు పూర్తి స్థాయిలో బకాయిలు పెట్టేసింది. ఫలితంగా విదేశీ విద్య కోసం 3,326 మందికి ఈ పథకాన్ని వర్తింపజేసి కూడా... వారికి చెల్లించాల్సిన రూ.318.80 కోట్లు బకాయిలు పెట్టేసింది. ఆ బకాయిలు చెల్లించకుండానే... రెండేళ్ల తరవాత 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయింది. 2019లో అధికారం చేపట్టిన సీఎం జగన్.. విదేశీ విద్యా కానుక పథకం అమలు తీరును సమీక్షించారు. దీనిపై సోషల్ ఆడిట్‌కు ఆదేశించారు. ఈ ఆడిట్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ప్రపంచంలో ఎక్కడో ఉన్నాయో లేవో తెలియని యూనివర్సిటీల నుంచి కూడా.. ఐ–20 ఫారం తెచ్చి సబ్మిట్ చేస్తే చాలు. వారు చదువుతున్నారా? లేదా? అసలు ఆ యూనివర్సిటీ ఎలాంటిది? ఇవేవీ చూడకుండానే టీడీపీ నేతల ఒత్తిళ్లతో చాలామందిని అర్హులుగా చేశారు. నిజమైన పేద విద్యార్థులు అర్హులైనా కూడా దీనికి నోచుకోలేదు. ఈ పథకం అమల్లో పారదర్శకత లేశమాత్రమైనా లేదని, అత్యంత లోపభూయిష్టంగా ఉందని ఆడిట్లో గుర్తించారు. దీంతో ఈ పథకం లబ్దిదారులు, దరఖాస్తు చేసుకున్న వారి వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ అధికారులు ఈ పథకం అమలులో అక్రమాలు జరిగాయని గుర్తించారు. పేద విద్యార్థులకు అందాల్సిన పథకం... టీడీపీ నేతల సిఫారసులతో సంపన్న వర్గాలకిచ్చి దుర్వినియోగం చేశారని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి... ఆ తరవాతే తగిన నిర్ణయం తీసుకోవాలని సీఎం భావించారు. అయితే ఇప్పటికే ఈ పథకం ద్వారా విదేశీ విద్యకు వెళ్లిన విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే పెద్ద మనస్సుతో గత ప్రభుత్వ బకాయిలను కూడా చెల్లిస్తున్నారు. ఇప్పటికే రూ.112.46 కోట్ల బకాయిలు చెల్లించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీల బకాయిలైతే పూర్తిగా చెల్లించేశారు. ‘ఈనాడు’ మాత్రం ఇవేవీ ఎరగనట్లు హద్దుల్లేని దుష్ప్రచారానికే ప్రాధాన్యమిచ్చింది. పథకంలో జరిగిన అక్రమాల ప్రస్తావన కూడా తేకుండా.. బాబు బకాయిల గురించి తెలియనట్లుగా... జగన్ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపిస్తోంది. ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో చదువుకునేలా... గత ప్రభుత్వ హయాంలో ఊరూపేరూ లేని విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ చూపించి అర్హులను ఎంపిక చేయడం... పేదలకు ఇవ్వకుండా నిధులు దుర్వినియోగం చేయటం వంటి పరిణామాలతో ప్రభుత్వం ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలనే సంకల్పంతో ఉంది. ప్రపంచంలోని టాప్–200 విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు సాధించిన విద్యార్థులకు ‘విదేశీ విద్యా కానుక’ అందించేలా పథకంలో మార్పులు చేస్తోంది. ఈ మేరకు కసరత్తు దాదాపుగా పూర్తిచేసిన అధికారులు... త్వరలో తగిన ఉత్తర్వులివ్వనున్నారు కూడా. రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం... విదేశీ విద్యలోనూ ‘నాణ్యత’కు పెద్దపీట వేసి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో చేరిన వారికే దీన్ని వర్తింపజేయాలని చూస్తోంది. తేడా తెలుసుకోండి రామోజీరావు గారూ!!.