నేడు ఉచిత కంటివైద్య శిబిరం
గోపాల్పేటః స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు చేస్తున్నట్లు ఆఫ్తాలమిక్ ఆఫీసర్ యుగేందర్ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.