నోబెల్ వేదికపై మెరిసిన భారత ఉపఖండం
సత్యార్థి, మలాలాకు శాంతి పురస్కారం
నోబెల్ వేదికపై 2014లో భారత ఉపఖండం మెరిసింది. బాలల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న భారత్‌కు చెందిన కైలాశ్ సత్యార్థి(60), పాక్ బాలిక మలాలా యూసఫ్‌జాయ్(17) ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారాన్ని సంయుక్తంగా స్వీకరించారు.ఓస్లొలో డిసెంబర్ 10న వైభవంగా జరిగిన నోబెల్ప్రదాన కార్యక్రమంలో 2014 సంవత్సరానికిగాను వారిరువురికి ఈ అవార్డ్‌ను అందించారు.
కైలాశ్ తాను నిర్వహిస్తున్న ‘బచ్పన్ బచావో ఆందోళన్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా 80 వేలమంది బాలకార్మికులను రక్షించి పాఠశాలల్లో చేర్పించారు. బాలికల విద్యా హక్కు కోసం ఉద్యమించినందుకు తాలిబాన్ ఉగ్రవాదులు మలాలాపై కాల్పులు జరిపారు. మలాలా తలకు తీవ్ర గాయమైనా జంకకుండా పిల్లల హక్కుల కోసం ఉద్యమిస్తోంది.