యువకుడి ఆత్మహత్య
తిరుమలగిరి : పురుగులమందు తాగి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తిరుమలగిలో చోటు చేసుకుంది. గుండాల మండలం పెద్దపడిశాల గ్రామానికి చెందిన బుర్ర నాగలక్ష్మి, భిక్షంల కుమారుడు బుర్ర మహేష్(23) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఇంటి వద్దనే పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు తిరుమలగిరి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మధ్యాహ్నం వరకు చికిత్స నిర్వహించిన వైద్యులు అతడిని సూర్యాపేటకు తీసుకెళ్లాలని సూచించారు. బంధువులు అక్కడికి తరలిస్తుండగానే మార్గమధ్యలో మతిచెందాడు. దీంతో ఆగ్రహించిన బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సరైన చికిత్స అందించకపోవడం కారణంగానే మహేష్ మతిచెందాడని ఆరోపించారు. అనంతరం ఆస్పత్రిలో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు.
యువకుడి ఆత్మహత్య
టuటజీఛ్ఛీ జీn p్ఛఛీఛ్చీp్చఛీజీటజ్చిl్చ
టuటజీఛ్ఛీ, p్ఛఛీఛ్చీp్చఛీజీటజ్చిl్చ, yuఠ్చిజుuఛీu
యువకుడు, ఆత్మహత్య, పెద్దపడిశాల