తిమ్మయ్య స్థానంలో యువరాజ్ వాల్మీకి
ప్రపంచకప్ హాకీ జట్టులో మరో మార్పు
హేగ్ (నెదర్లాండ్స్): హాకీ ప్రపంచకప్ మొదలుకాక ముందే భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తొడ కండరాల గాయంతో ఫార్వర్డ్ నికిన్ తిమ్మయ్య టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతని స్థానంలో యువరాజ్ వాల్మీకిని తీసుకున్నారు. కుడి తొడ కండరంలో చీలిక వల్ల తిమ్మయ్యకు నాలుగు వారాలపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
రెండు రోజుల కిందట ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడటంతో స్ట్రయికర్ రమణ్‌దీప్ కూడా ప్రపంచకప్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. వాల్మీకి మంగళవారం రాత్రి హేగ్‌కు బయలుదేరి వెళ్లాడు. వరల్డ్‌కప్‌లో తన సత్తా మేరకు రాణించేందుకు ప్రయత్నిస్తానని చెప్పిన వాల్మీకి 2011లో అరంగేట్రం చేసి 38 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.