దేశానికి స్వాతంత్ర్యం, రాజ్యాంగం రెండు కళ్లు
వైవీయూ :
భారతదేశానికి స్వాతంత్య్రం, రాజ్యాంగం రెండూ రెండు కళ్లవంటివని వైవీయూ వీసీ ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం వైవీయూలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ మనదేశానికి లభించిన స్వాతంత్య్రం, ఏర్పాటుచేసుకున్న రాజ్యాంగం రెండూ మనకు లభించిని విలువైన బహుమతులన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా స్వాతంత్య్రం లభిస్తే, పేద, వెనుకబడిన తరగతుల అభ్యున్నతిని కాంక్షిస్తూ రాజ్యాంగం అవతరించిందన్నారు. ఇంత గొప్ప రాజ్యాంగ నిర్మాణానికి ఊపిరిలూదిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిరస్మరణీయుడన్నారు. అనంతరం పలువురు వక్తలు రాజ్యంగం విశిష్టత, అంబేద్కర్ గొప్పతనం గురించి ప్రసంగించారు. అనంతరం కేంద్ర గ్రంథాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఆయన చిత్రపటంతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వై. నజీర్అహ్మద్, ప్రిన్సిపల్ ఆచార్య కె. సత్యనారాయణరెడ్డి, వైవీయూ అధ్యాపక సంఘం అధ్యక్షుడు ఆచార్య కంకణాల గంగయ్య, అధ్యాపకులు ఆచార్య టి. వాసంతి, డాక్టర్ వై. సుబ్బరాయుడు, డా. రామబ్రహ్మం, రామసుబ్బారెడ్డి, మార్గరేట్, పీఆర్ సెల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎన్. ఈశ్వరరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.