ఎవరీ జైనాబ్ అబ్బాస్.. సిరాజ్‌కు పెద్ద ఫ్యాన్ అని హడావుడి చేస్తోంది..!
లండన్: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. రోజురోజుకు తన ఆటతీరు మెరుగుపరుచుకుంటున్న ఈ హైదరాబాదీ యువ పేసర్.. ఫ్యాన్స్ సంఖ్యను కూడా అదే రేంజ్లో పెంచుకుంటూ వెళ్తున్నాడు. తాజా మనోడి ఫ్యాన్స్ ఖాతాలో పాకిస్తాన్ స్పోర్ట్స్ యాంకర్, జర్నలిస్ట్ జైనాబ్ అబ్బాస్ చేరింది. తాను సిరాజ్ బౌలింగ్‌కు పెద్ద ఫ్యాన్ నంటూ ఈ అమ్మడు తెగ హడావుడి చేస్తుంది. ఈ విషయాన్ని ఆమే చాలా సార్లు బాహాటంగా వ్యక్తపరిచింది. దీంతో వీరి మధ్య ఏదో నడుస్తుందని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. సిరాజ్.. ఏంటీ సంగతి అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. సిరాజ్ కూడా బుమ్రా దారిలోనే వెళ్తున్నాడని చెవులు కొరుక్కుంటున్నారు
33 ఏళ్ల జైనాబ్ అబ్బాస్ పాకిస్థాన్‌లోని లాహోర్‌లో జన్మించింది. ఆమె తండ్రి నసీర్ కూడా క్రికెటర్ కావడంతో ఆమె ఇదే రంగంలో ఉపాధిని ఎంచుకుంది. జైనాబ్ తండ్రి దేశవాళీ టోర్నీల్లో ఆడాడు. ఆమె ఇంగ్లండ్‌లోని వార్విక్ యూనివర్సిటీలో మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీలో ఎంబీఏ పూర్తి చేసింది. జైనాబ్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది. ఆమెకు సోషల్ మీడియాలో భారీ ఫాలోవర్స్ ఉన్నారు. కాగా, జైనాబ్.. సిరాజ్ సహా టీమిండియా పేసు గుర్రాలైన బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీలకు కూడా అభిమానినేనని ప్రకటించడం కొసమెరుపు.
చదవండి: ENG Vs IND: మళ్లీ వచ్చేశాడు.. ప్యాడ్స్ కట్టుకొని కోహ్లి స్థానంలో