Top Stories
ప్రధాన వార్తలు

కూటమి సర్కార్ కక్ష సాధింపు.. కాకాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
సాక్షి, నెల్లూరు: ఏపీలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కాకాణిపై మైనింగ్ పేరుతో పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డిని రెండు నెలలుగా పోలీసులు టార్గెట్ చేశారు.రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని గాలికొదిలేసి.. చంద్రబాబు సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. పొదలకురు మండలం రుస్తుం మైన్ కేసులో కాకాణిని పోలీసులు ఇరికించారు. ప్రభుత్వం వైఫల్యాలు, చంద్రబాబు దోపిడీ విధానాలను విమర్శించినందుకు కక్ష కట్టిన ప్రభుత్వం.. మాజీ మంత్రి సోమిరెడ్డి మైనింగ్‌ని బయటపెట్టినందుకు ఎదురు కేసులు పెట్టించి వేధిస్తోంది.క్వార్జ్ మైనింగ్ మైనింగ్‌పై తప్పుడు నివేదికతో కాకాణిపై కేసు నమోదు చేశారు. రుస్తుంలో ఎలాంటి అక్రమ మైనింగ్ జరగలేదని గతంలోనే మైనింగ్ అధికారులు నివేదిక ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం రాగానే అదే మైనింగ్ డీడీ బాలాజీ నాయక్ ద్వారా అక్రమ మైనింగ్ జరిగిందంటూ ఫిర్యాదు చేయించారు. ఓ వైపు క్వార్జ్‌ను టీడీపీ నేతలు యథేచ్ఛగా దోచుకుంటున్నారు. మరోవైపు, వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తోంది. కాకాణిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం పట్ల వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అనుష్కతో సన్నిహితంగా పెద్ద కుమారుడు.. లాలూ సంచలన నిర్ణయం
పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొద్ది సేపటి క్రితం తన పెద్ద కుమారుడు తేజ ప్రతాప్ యాదవ్‌ను ఆర్జేడీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. తేజ్ ప్రతాప్‌ను ఆర్జేడీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. తేజ్ ప్రతాప్‌ను పార్టీ నుంచి బహిష్కరణకు కారణం శనివారం ఆయన ఫేస్బుక్లో ఓ పోస్టు పెట్టారు. ఆ సోషల్ మీడియా పోస్టే లాలూ కుటుంబంలో చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. निजी जीवन में नैतिक मूल्यों की अवहेलना करना हमारे सामाजिक न्याय के लिए सामूहिक संघर्ष को कमज़ोर करता है। ज्येष्ठ पुत्र की गतिविधि, लोक आचरण तथा गैर जिम्मेदाराना व्यवहार हमारे पारिवारिक मूल्यों और संस्कारों के अनुरूप नहीं है। अतएव उपरोक्त परिस्थितियों के चलते उसे पार्टी और परिवार…— Lalu Prasad Yadav (@laluprasadrjd) May 25, 2025శనివారం తేజ్ ప్రతాప్ ఫేస్బుక్లో అకౌంట్లో ఓ పోస్టు ప్రత్యక్షమైంది. ఆ ఫొటోలో తేజ్ ప్రతాప్ ఓ యువతితో సన్నిహితంగా ఉన్నారు. ఆ యువతి పేరు అనుష్క యాదవ్ అని, తాము గత 12ఏళ్లుగా రిలేషన్లో ఉన్నట్లు ప్రకటించారు. ఆ పోస్టుపై దుమారం చెలరేగడంతో కొద్ది సేపటికే దానిని డిలీట్ చేశారు. తన ఫేస్‌బుక్‌ను ఎవరో హ్యాక్ చేశారన్నారు. ఆ పోస్టు తాను చేయలేదని స్పష్టం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. గతంలో, తేజ్ ప్రతాప్ యాదవ్, అనుష్క యాదవ్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు,వీడియోలో వెలుగులోకి వచ్చాయి. ये वीडियो भी फेक है? 🤔 pic.twitter.com/XdTgZHbZ8b— Ankur Singh (@iAnkurSingh) May 24, 2025దీంతో తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రకటనపై లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించడం, సామాజిక న్యాయం కోసం పార్టీ (ఆర్జేడీ) సమిష్టి పోరాటాన్ని బలహీన పరుస్తోంది. తేజ్ ప్రతాప్ ప్రవర్తన కుటుంబ విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా లేవని ఎక్స్ వేదికగా అభిప్రాయం వ్యక్తం చేశారు.‘వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించడం, సామాజిక న్యాయం కోసం మన సమిష్టి పోరాటాన్ని బలహీన పరుస్తుంది. పెద్ద కుమారుడి కార్యకలాపాలు, ప్రజా ప్రవర్తన, బాధ్యతారహిత ప్రవర్తన మన కుటుంబ విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా లేవు. అందువల్ల, పైన పేర్కొన్న పరిస్థితుల కారణంగా, నేను అతన్ని ఆరేళ్ల పార్టీ పార్టీతో పాటు కుటుంబం నుంచి బహిష్కరిస్తున్నాను. నేటి నుంచి పార్టీకి, కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఆరేళ్ల పాటు పార్టీ నుండి బహిష్కరిస్తున్నాను’ అని లాలూ యాదవ్ హిందీలో రాసిన పోస్ట్‌లో తెలిపారు.కాగా, తేజ్ ప్రతాప్ 2018లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా రాయ్ మనవరాలు ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు. అయితే, వీరి మధ్య విభేదాలు రావడంతో ఐశ్వర్య ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

‘కాజీపేట’కు రెడ్‌సిగ్నల్!
అది ప్రధాని మోదీ 2023 జూలై 8న స్వయంగా శంకుస్థాపన చేసిన రైల్వే ప్రాజెక్టు. కానీ విచిత్రంగా రైల్వే బోర్డు మాత్రం ఇప్పటివరకు ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు మూడొంతులు పూర్తయినా ఆధునిక యంత్రాల కోసం దిగుమతి ఆర్డర్ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. వెరసి.. మరికొద్ది నెలల్లో ఉత్పత్తి ప్రారంభం కావాల్సిన యూనిట్ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చేలా కనిపించట్లేదు. ఇదీ కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ (మినీ కోచ్ ఫ్యాక్టరీ) దుస్థితి.సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల దశాబ్దాల కలల ప్రాజెక్టు అయిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై ఏళ్ల తరబడి నాన్చుతూ వచ్చిన కేంద్రం చివరకు దానికి పచ్చజెండా ఊపింది. తొలుత రైల్వే వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్‌షాపుగా మంజూరైన ప్రాజెక్టును కోచ్ తయారీ యూనిట్‌గా అప్‌గ్రేడ్ చేసింది. ఇందులో ఎలక్ట్రిక్ మెమూ యూనిట్లు (ఈఎంయూ), సరుకు రవాణా వ్యాగన్లు తయారవుతాయని ప్రకటించింది. దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లను వేగంగా పట్టాలెక్కించే ఉద్దేశంతో వీలైనన్ని ప్రాంతాల్లో ఆ కోచ్‌లను తయారు చేయాలని నిర్ణయించి కాజీపేట యూనిట్‌ను కూడా అందుకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని ఆ తర్వాత నిర్ణయించింది. భవిష్యత్తులో కాజీపేట యూనిట్‌లోనూ వందేభారత్ కోచ్‌ల తయారీకి వీలుగా మౌలిక వసతులు సిద్ధం చేయాలనుకుంది. దీనికి సంబంధించిన ఆధునిక యంత్రాలను జపాన్‌కు చెందిన టైకిషా కంపెనీ నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు ప్రకటించింది.ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే పరిస్థితి తలకిందులైంది. ప్రధాని శంకుస్థాపన చేసిన తర్వాత.. ఈ యూనిట్ నిర్మాణ బాధ్యతను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్)కు రైల్వేశాఖ అప్పగించింది. ఈ యూనిట్‌ను ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్‌గా ప్రతిపాదించినప్పుడే ఆర్వీఎన్ఎల్ టెండర్లు పిలవగా పవర్‌మెక్–టైకిషాలతో కూడిన జాయింట్ వెంచర్ దీన్ని దక్కించుకుంది. తొలుత రూ. 269 కోట్ల యూనిట్ వ్యయాన్ని ఆ తర్వాత రూ. 362 కోట్లకు పెంచిన కేంద్రం.. మినీ కోచ్ ఫ్యాక్టరీగా అప్‌గ్రేడ్ చేశాక దాన్ని రూ. 530 కోట్లకు పెంచింది. అనంతరం ప్రధాని మోదీ ఈ యూనిట్ పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే మూడొంతుల పనులు పూర్తవగా వచ్చే మార్చికల్లా యూనిట్ పూర్తిగా సిద్ధం కానుంది. వీలైతే ఈ ఏడాది చివరికల్లా సిద్ధం చేసే వీలుందని అధికారులు చెబుతున్నారు. ఓవైపు షెడ్లు సిద్ధమవుతున్న నేపథ్యంలో నిర్మాణ సంస్థతో ఉన్న ఒప్పందం మేరకు జపాన్‌కు చెందిన టైకిషా కంపెనీ నుంచి అత్యాధునిక పరికరాలు, యంత్రాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంది. ఆ మేరకు అనుమతి కోరుతూ ఆర్వీఎన్ఎల్ ఇటీవల రైల్వే బోర్డు అనుమతి కోరగా బోర్డు అనూహ్యంగా షాక్ ఇచ్చింది. కొర్రీలతో బ్రేకులు! కాజీపేటలో రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌కు అనుమతే ఇవ్వలేదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. పెంచిన అంచనా వ్యయానికి తాము అనుమతి ఇవ్వనిదే యంత్రాలు ఎలా కొంటారని ఎదురు ప్రశ్నించింది. పైగా అన్ని షెడ్లు, యంత్రాలు ఎందుకో చెప్పడంతోపాటు జపాన్ నుంచి కొనాల్సిన అవసరం ఏమిటో లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆదేశించింది. దీంతో ఆర్‌వీఎల్‌ఎల్ అధికారులు ఒక్కో దానికి సమాధానం ఇస్తూ వచ్చారు. ఇంతలో ఈ వ్యవహారాలు చూసే రైల్వే బోర్డు ఉన్నతాధికారి బదిలీ కావడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. పాత అధికారి స్థానంలో వచ్చిన కొత్త అధికారి మరిన్ని కొర్రీలు పెడుతున్నారు. ఆ యూనిట్ లేఅవుట్ పంపాలని.. దాన్ని చూశాక మరిన్ని సందేహాలు తీర్చాలంటూ ఐదారు రోజుల క్రితం అడిగారు. ఈ నేపథ్యంలో ఆ యూనిట్లో ఉత్పత్తి ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రైల్వే బోర్డు తీరు చూస్తే ఇప్పట్లో ఉత్పత్తి మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. ప్రధాని శంకుస్థాపన చేసిన ఓ ప్రాజెక్టు విషయంలో రైల్వే బోర్డు ఇలా వ్యవహరిస్తుండటం స్థానిక అధికారులనే అయోమయానికి గురిచేస్తోంది.

కశ్మీరీలతో ఇలాగేనా వ్యవహరించేది?
మనలో చాలా మందికి పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్, 4 రోజుల ‘యుద్ధం’ గురించి ఎక్కువగానే తెలుసు. తెలుసుకోవడం మనం ఒక పనిగా పెట్టుకున్నాం. కానీ ఈ కాలంలో జరిగిన ఇతర వాస్తవాలు చాలా బాధ కలిగిస్తున్నాయి. ఏప్రిల్ 27, మే 8 మధ్య భారతదేశ వ్యాప్తంగా వివిధ రకాలుగా 184 ముస్లిం వ్యతిరేక దాడులు జరిగాయని పౌర హక్కుల రక్షణ సంఘం నివేదించింది. వాటిలో 19 విధ్వంసక చర్యలు, 39 దాడులు, 42 వేధింపుల సంఘటనలు, 84 ద్వేషపూరిత ప్రసంగ సంఘటనలు ఉన్నాయి. వీటిలో 106 దాడులు పహల్గామ్ ద్వారా ‘ప్రేరేపితం’ అని అంచనా. వీటిలో ఎక్కువ భాగం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలలో జరిగాయి.కశ్మీరీలను, ఇతర ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడం సర్వసాధారణం కాబట్టి ఈ వాస్తవాలు మనకు తెలియలేదా? అవి మన అసహనం, నిరాశ, కోపానికి బాక్సింగ్ బ్యాగులుగా మారాయా? పత్రికలు వాటిని ఎందుకు నివేదించవు? వాటి గురించి తెలుసు కోవడానికి మనం ఎందుకు ప్రయత్నించడం లేదు?కశ్మీర్లో ఏమి జరిగిందో పరిశీలించండి. కేవలం అనుమానం ఆధారంగా, ఎటువంటి ప్రక్రియా లేకుండా, బుల్డోజర్ న్యాయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ఉల్లంఘించి, ఉగ్రవాదులుగా చెప్పబడుతున్న వారి ఇళ్లను కూల్చివేశారు. చట్ట పాలనను అనుసరించే ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం తనను తాను చెప్పు కోవడాన్ని ఇది అపహాస్యం చేయడం లేదా?అంతే కాదు. బహుశా 2,000 మందిని అనుమానంతో అరెస్టు చేశారు. పాశ్చాత్య పత్రికలు వారిలో అనేక మందిని హింసించారని నివేదించాయి. ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. ఇది కశ్మీరీలు, ముస్లింలు అనే కారణంగా కశ్మీరీ ముస్లింల పట్ల అనుమానాస్పద దృక్పథంతో వ్యవహరించడమేనని అనిపించడం లేదా?కశ్మీరీలు ఎలా స్పందించారు?ఇప్పుడు, కశ్మీరీలు పహల్గామ్ ఘటన పట్ల ఎలా స్పందించారో పోల్చి చూద్దాం. హోటల్ బుకింగ్‌లు లేని వారికి పడకలు అందించ డానికి మతాధికారులు మసీదులను తెరిచారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల నుండి ఛార్జీలు వసూలు చేయడానికి ట్యాక్సీ డ్రైవర్లు నిరాకరించారు. బాధితుల పట్ల సానుభూతి వ్యక్తం చేయడా నికి దుకాణాలు, హోటళ్ళు, కళాశాలలు, పాఠశాలలు మూసివేయడంతో పూర్తి హర్తాళ్ జరిగింది. అధికారంలో ఉన్నా, లేదా ప్రతిపక్షంలో ఉన్నా అన్ని రాజకీయ పార్టీలూ ఉగ్రవాదులను ఖండిస్తూ ర్యాలీలు నిర్వహించాయి. దీని గురించి మనకు వివరంగా తెలియాలి కానీ మనకు తెలియలేదు. లేదా దీని గురించి చాలా తక్కువగా చెప్పడం జరిగింది. ఎందుకు? కచ్చితంగా కశ్మీర్ నుండి మనం వినాలనుకున్న, వినవలసిన సందేశం ఇది కాదా?లోయలోని కశ్మీరీల ప్రవర్తనకు పూర్తి విరుద్ధంగా, భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలలో కశ్మీరీలను ఎలా చూశారో పరిశీలిద్దాం. పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో కశ్మీరీ విద్యార్థులను కొట్టారు. వారు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం పారిపోవలసి వచ్చింది. ముస్సోరీలో, దశాబ్దాలుగా అక్కడ పనిచేస్తున్న‘షాల్ వాలాస్’ బల వంతంగా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళవలసి వచ్చింది. అయినప్పటికీ ఈ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు వారిని ఏమాత్రం పట్టించుకోకుండా కనిపించాయి. మళ్ళీ ప్రశ్నిస్తున్నాను... ఎందుకు? వీరు మీలాగే, నాలాగే హక్కులతో కూడిన భారత పౌరులు కాదా?బహుశా, అన్నింటికంటే ఘోరంగా, అధికార స్థానాల్లో ఉన్నవారు కశ్మీరీలనూ, ముస్లింలనూ రక్షించడానికి బదులుగా దాడి చేయడాన్ని ఎంచుకున్నారు. ‘కశ్మీర్లో జరిగిన దాడి హిందువులపై జరిగిన దాడి. మేము కూడా అదే విధంగా స్పందిస్తాం. కశ్మీరీలపై మాత్రమే కాదు, భారతదేశంలోని ప్రతి ముస్లింపైనా’ అని హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ గిరిజన వ్యవహారాల మంత్రి విజయ్ షా, కల్నల్ సోఫియా ఖురేషీని ‘ఉగ్రవాదుల సోదరి’ అన్నారు. అయినా వీరంతా తప్పించుకున్నారు. వారిని ఏ రకంగానూ హెచ్చరించలేదు. వారిని కచ్చితంగా శిక్షించలేదు.ఇప్పుడు నేను రాసిన దాని గురించి ఆలోచించండి. ముస్లింలపై ప్రధానంగా దాడులు జరిగిన రాష్ట్రాలు ఏవి? అక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏవి? ఏ పార్టీ సభ్యులు లేదా సైద్ధాంతిక మద్దతుదారులు అలా వ్యవహరించారో మీకే తెలుస్తుంది.అదేమీ రహస్యం కాదు. నిజానికి, ఇది కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది.ఇదీ నాగరిక పద్ధతి!దేశ విభజన తర్వాత హత్యలు తారస్థాయికి చేరుకున్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ 1947 అక్టోబర్ 15న రాష్ట్ర ముఖ్యమంత్రులకు రాసిన లేఖ నుండి నన్ను ఉటంకించనివ్వండి: ‘మన దగ్గర ముస్లిం మైనారిటీ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారు కోరుకున్నా, వేరే చోటికి వెళ్లలేరు. వారు భారతదేశంలోనే నివసించాలి’. తరువాత స్పష్టంగా ఇలా జోడించారు: ‘పాకిస్తాన్ నుండి ఏదైనా రెచ్చగొట్టడం జరిగినా... మనం ఈ మైనారిటీతో నాగరిక పద్ధతిలో వ్యవహరించాలి.’ఆ సలహా 80 సంవత్సరాల క్రితం ఉన్నంత సందర్భోచితంగానే ఇప్పుడు కూడా లేదా? మిస్టర్ మోదీ నుండి మనం వినవలసిన సందేశం ఇది కాదా? పైగా ప్రధానమంత్రి మౌనం వ్యూహాత్మక ప్రతిస్పందన అని చాలామంది విశ్వసిస్తున్నట్లయితే మనం ఎలాంటి దేశంగా మారాం?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్

ఆఖర్లో అదరహో
‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి తప్పుకున్న జట్లు... తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌ల్లో దంచికొట్టాయి. గుజరాత్ టైటాన్స్‌తో పోరులో చెన్నై దుమ్మురేపి 230 పరుగులు చేస్తే... కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 278 పరుగులతో విరుచుకుపడింది. అంచనాల ఒత్తిడి లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడిన ఈ రెండు జట్లు విజయాలతో సీజన్‌ను ముగించాయి. గుజరాత్‌తో పోరులో చెన్నై బ్యాటర్లు కాన్వే, బ్రెవిస్ హాఫ్ సెంచరీలతో విజృంభిస్తే... నైట్ రైడర్స్ బౌలర్లను క్లాసెన్, హెడ్ చీల్చి చెండాడారు. సీజన్ ఆరంభ పోరులో రాజస్తాన్ రాయల్స్‌పై 286 పరుగులు చేసి అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ... తమ ఆఖరి మ్యాచ్‌లో మరోసారి మూడొందలకు చేరువైంది. అభిషేక్ శర్మ, హెడ్ మెరుపులతో భారీ స్కోరుకు పునాది వేస్తే... క్లాసెన్ దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. మధ్యలో నిలకడలేమితో పరాజయాలు మూటగట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ... చివరి మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. న్యూఢిల్లీ: విధ్వంసకర ఆటతీరుతో ఐపీఎల్లో భారీ స్కోర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సీజన్‌కు వీడ్కోలు పలికింది. ఆదివారం జరిగిన పోరులో సన్‌రైజర్స్ 110 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)పై విజయం సాధించింది. మొదట సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెన్రిచ్ క్లాసెన్ (39 బంతుల్లో 105 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) అజేయ శతకంతో కదంతొక్కగా... ట్రావిస్ హెడ్ (40 బంతుల్లో 76; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) దంచికొట్టాడు. బంతి తన పరిధిలో ఉంటే చాలు దానిపై ఆకలిగొన్న సింహంలా విరుచుకుపడిన క్లాసెన్ 37 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అభిషేక్ శర్మ (16 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కూడా రాణించాడు. లక్ష్యఛేదనలో కోల్‌కతా నైట్‌రైడర్స్ 18.4 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. దంచుడే... దంచుడు మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ తొలి ఓవర్లో 2 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాతి నుంచి వెనుదిరిగి చూసుకోని రైజర్స్... ఫోర్లు, సిక్స్‌లతో మైదానాన్ని మోతెక్కించింది. రెండో ఓవర్లో హెడ్ సిక్స్‌తో ఖాతా తెరవగా... అభిషేక్ రెండు ఫోర్లు బాదాడు. మూడో ఓవర్లో 6, 4, 2, 6 బాదిన హెడ్... నాలుగో ఓవర్లో మరో మూడు ఫోర్లు కొట్టాడు. నోర్జే ఓవర్లో అభిషేక్ 2 ఫోర్లతో చెలరేగడంతో పవర్‌ప్లే ముగిసేసరికి రైజర్స్ 79 పరుగులు చేసింది. నరైన్ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన అభిషేక్... మరో షాట్ ఆడే ప్రయత్నంలో ఔట్ కాగా... క్లాసెన్ రాకతో విధ్వంసం మరో స్థాయికి చేరింది. ఒకవైపు హెడ్, మరోవైపు క్లాసెన్ బౌలర్‌తో సంబంధం లేకుండా భారీ షాట్లతో విరుచుకుపడటంతో... 10 ఓవర్లు ముగిసేసరికి ఆరెంజ్ ఆర్మీ 139/1తో నలిచింది. ఈ క్రమంలో హెడ్ 26 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... హర్షిత్ ఓవర్లో 4, 6, ,6తో క్లాసెన్ 17 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ అందుకున్నాడు. హెడ్‌ను ఔట్ చేయడం ద్వారా నరైన్ ఈ జోడీని విడదీయగా ... ఇషాన్ కిషన్ వేగంగా ఆడలేకపోయాడు. నరైన్ ఓవర్లో 2 సిక్స్‌లు కొట్టిన క్లాసెన్... వరుణ్‌కు అదే శిక్ష వేసి సెంచరీకి సమీపించాడు. రసెల్ ఓవర్లో 6, 4 కొట్టిన క్లాసెన్... అరోరా బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) రింకూ (బి) నరైన్ 32; హెడ్ (సి) రసెల్ (బి) నరైన్ 76; క్లాసెన్ (నాటౌట్) 105; ఇషాన్ కిషన్ (సి) నోర్జే (బి) వైభవ్ 29; అనికేత్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 278. వికెట్ల పతనం: 1–92, 2–175, 3–158. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–39–1; నోర్జే 4–0–60–0; హర్షిత్ రాణా 3–0–40–0; నరైన్ 4–0–42–2; వరుణ్ చక్రవర్తి 3–0–54–0; రసెల్ 2–0–34–0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) మనోహర్ (బి) మలింగ 9; నరైన్ (బి) ఉనాద్కట్ 31; రహానే (సి) అభిషేక్ (బి) ఉనాద్కట్ 15; రఘువంశీ (సి) నితీశ్ (బి) మలింగ 14; రింకూ (సి) నితీశ్ (బి) హర్ష్ దూబే 9; రసెల్ (ఎల్బీ) (బి) హర్ష్ దూబే 0; మనీశ్ పాండే (సి) మనోహర్ (బి) ఉనాద్కట్ 37; రమణ్‌దీప్ (బి) హర్ష్ దూబే 13; హర్షిత్ (సి అండ్ బి) మలింగ 34; వైభవ్ అరోరా (రనౌట్) 0; నోర్జే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 168. వికెట్ల పతనం: 1–37, 2–55, 3–61, 4–70, 5–70, 6–95, 7–110, 8–162, 9–162, 10–168. బౌలింగ్: కమిన్స్ 2–0–25–0; ఉనాద్కట్ 4–0–24–3; హర్షల్ 2–0–21–0; ఇషాన్ మలింగ 3.4–0– 31–3; హర్ష్ దూబే 4–0–34–3; నితీశ్ రెడ్డి 1–0–6–0; అభిషేక్ 2–0–25–0. 278/3 ఐపీఎల్లో ఇది మూడో అత్యధిక స్కోరు. తొలి రెండు స్థానాల్లోనూ సన్‌రైజర్స్ జట్టే ఉంది. 2024లో బెంగళూరుపై 287/5 స్కోరు చేసిన హైదరాబాద్... ఈ ఏడాది తమ తొలి మ్యాచ్‌లో రాజస్తాన్‌పై 286/5 పరుగులు చేసింది. 37 సెంచరీకి క్లాసెన్ తీసుకున్న బంతులు. ఐపీఎల్లో ఇది మూడో వేగవంతమైన శతకం. క్రిస్ గేల్ (30 బంతుల్లో), వైభవ్ సూర్యవంశీ (35 బంతుల్లో), యూసుఫ్ పఠాన్ (37 బంతుల్లో) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. అహ్మదాబాద్: ఐపీఎల్ 18వ సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయంతో ముగించింది. పాయింట్ల పట్టికలో చివరిదైన పదో స్థానంలో నిలిచిన ధోనీ బృందం... ఆదివారం తమ చివరి లీగ్ మ్యాచ్‌లో 83 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై గెలుపొందింది. మొదట చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డెవాల్డ్ బ్రెవిస్ (23 బంతుల్లో 57; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), కాన్వే (35 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఆయుశ్ మాత్రే (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఉర్విల్ పటేల్ (19 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. అర్షద్ ఖాన్ వెసిన రెండో ఓవర్లో ఆయుశ్ చెలరేగి వరుసగా 2, 6, 6, 4, 4, 6తో 28 పరుగులు రాబట్టాడు. క్రీజులో అడుగుపెట్టిన ప్రతీ బ్యాటర్ దంచికొట్టడమే పనిగా పెట్టుకోవడంతో చెన్నై భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 18.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సాయి సుదర్శన్ (28 బంతుల్లో 41; 6 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లు ఆకట్టుకోలేకపోయారు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్ చెరో 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌తో ధోని ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతాడని జోరుగా చర్చ సాగగా... మహీ తనకు అలవాటైన రీతిలో ‘వేచి చూద్దాం’ అని ముక్తాయించాడు. సంక్షిప్త స్కోర్లుచెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: 230/5 (20 ఓవర్లలో) (ఆయుశ్ 34; కాన్వే 52; ఉర్విల్ 37; బ్రెవిస్ 57, ప్రసిధ్ కృష్ణ 2/22) గుజరాత్ టైటాన్స్: 147 ఆలౌట్ (18.3 ఓవర్లలో) (సాయి సుదర్శన్ 41; అర్షద్ ఖాన్ 20, అన్షుల్ కంబోజ్ 3/13, నూర్ అహ్మద్ 3/21, జడేజా 2/17).ఐపీఎల్లో నేడుముంబై X పంజాబ్‌వేదిక: జైపూర్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో

ఆ నలుగురిలో నేను లేను
సాక్షి, హైదరాబాద్: ‘రెండ్రోజుల నుంచి ఆ నలుగురు.. ఆ నలుగురు అని వినిపిస్తోంది. ఆ నలుగురుకి నాకు సంబంధం లేదు. ఆ నలుగురిలో నేను లేను. పదిహేనేళ్ల క్రితం ఆ నలుగురు అని మొదలైంది. ఆ తర్వాత ఆ నలుగురు కాస్తా పదైంది. అది ఎవరూ పట్టించుకోవడం లేదు. ఓ పది మంది దగ్గర థియేటర్లు ఉన్నాయి. ఆ నలుగురి వ్యాపారంలో నేను లేను. కోవిడ్ టైమ్ నుంచే నేను బయటకు వచ్చాను. తెలుగు రాష్ట్రాల్లో 1,500 థియేటర్లు ఉన్నాయి. కానీ.. తెలంగాణలో నాకున్నది ఒకే ఒక్క థియేటర్. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అన్నింటినీ వదిలేసుకుంటూ వస్తున్నాను. ప్రస్తుతం 15లోపు థియేటర్లు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. వీటి లీజులు అయిపోయిన తర్వాత రెన్యువల్ చేయొద్దని నా సిబ్బందితో చెప్పాను. పాత అలవాటు ప్రకారం ఆ నలుగురిలో నా ఫొటోను వాడుకుంటున్నారు. నన్ను విమర్శిస్తున్నారు. దయచేసి మీడియా మిత్రులు ఆ నలుగురు న్యూస్‌లో నన్ను కలపకండి. నేను వాళ్లలో లేను. వారితో వ్యాపారంలో లేను’అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుతం థియేటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల సెక్టార్స్‌లో థియేటర్ల రెవెన్యూ షేరింగ్, థియేటర్స్‌లో అద్దె చెల్లింపులు వంటి అంశాల నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్‌ను మూసివేస్తారనే అంశంపై ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పందించిన విధానం చాలా సమంజసంగా ఉందని నాకనిపించింది. ఇక ఈ థియేటర్స్ క్లోజ్ అంశానికి సంబంధించి ఇటీవల జరిగిన సమావేశాలకు నేను కావాలని, ఇష్టం లేకనే వెళ్లలేదు. అలాగే నా గీతా డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన వ్యక్తులు కానీ, నాతో అసోసియేట్ అయిన వ్యక్తులు కానీ ఈ మీటింగ్‌కు వెళ్లొద్దని చెప్పాను. థియేటర్స్‌కు చాలా కష్టాలు ఉన్నప్పుడు ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడి, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. కానీ కొందరు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంపై నాకు చిరాకు కలిగి వెళ్లలేదు. థియేటర్లు మూసివేస్తున్నాం అనడం సరైంది కాదు. పవన్‌కళ్యాణ్ సినిమా విడుదల సమయంలో థియేటర్లు మూసివేస్తామని చెప్పడం దుస్సాహసం. గతంలో అశ్వనీదత్ సినిమా విషయంలో పవన్‌ను కలిశాం. అప్పుడు ఆయన ఫిల్మ్ చాంబర్ తరపున వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబును కలవండన్నట్టు హింట్ ఇచ్చారు. అయితే మన వాళ్లు పట్టించుకోలేదు. ఆ విషయాన్ని విస్మరించారు. అధికారికంగా అందరం కలవాలి. కానీ కలవలేదు. ఎవరో ఇటీవల మనది ప్రభుత్వానికి సంబంధం లేని రంగం అని అంటుంటే విన్నాను. ప్రభుత్వానికి సంబంధం లేని పరిశ్రమ అయితే గత చీఫ్ మినిస్టర్‌ను సినీ పరిశ్రమలోని పెద్దపెద్ద వాళ్లంతా వెళ్లి ఎందుకు కలిశారు? ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వ సహకారం లేకుండా జరగదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని వెళ్లి కలవకపోవడం సరికాదు. మనకు కష్టం వస్తే తప్ప మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్లమా? నిజంగానే సింగిల్ స్క్రీన్ థియేటర్లకు సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి తప్ప.. ఇలా థియేటర్స్ మూసివేస్తున్నామని చెప్పడం సరికాదు’అని అరవింద్ వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యల్ని అరవింద్ ఖండించారంటున్న నెటిజన్లు ‘ప్రైవేట్ పెట్టుబడితో మేం సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటాదేంటి’అని గత ప్రభుత్వ హయాంలో పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘ఏ వ్యాపారమైనా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వ సహకారం లేకుండా జరగదు. అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఏంటి. మాది ప్రైవేట్ వ్యాపారం అనడం సరికాదు. ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది. ప్రభుత్వం కో–ఆపరేషన్ కావాలి’అంటు అరవింద్ తాజాగా చేసిన వ్యాఖ్యల్ని నెటిజన్లు ప్రముఖంగా చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని అల్లు అరవింద్ పరోక్షంగా ఖండించినట్టు ఉన్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అప్పట్లో పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు.. తాజాగా అరవింద్ చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్‌ను జతచేసి సోషల్ మీడియా వేదికలపై వైరల్ చేస్తున్నారు.

వీడియో వైరల్: టీడీపీ కీలక నేతతో విజయసాయిరెడ్డి రహస్య భేటీ
సాక్షి, తాడేపల్లి: విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడనడానికి పక్కా ఆధారాలు ఉన్నాయంటూ వీడియోతో సహా వైఎస్సార్సీపీ సంచలన ట్వీట్ చేసింది. టీడీపీ కీలకనేత టీడీ జనార్ధన్‌ను మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిసిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘మద్యం కుంభకోణంపై సీఐడీ విచారణకు కొన్ని గంటల ముందు రహస్య సమావేశం జరిగింది. తాడేపల్లి పార్క్ విల్లాలో విల్లా నెం 27కు సాయంత్రం 5:49కు విజయసాయిరెడ్డి వచ్చారు.. 13 నిమిషాల తర్వాత అదే విల్లాకు చంద్రబాబు నమ్మినబంటు టీడీ జనార్ధన్ వచ్చారు. 45 నిమిషాల పాటు రహస్య మంతనాలు జరిపారు’’ అని వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది.‘‘విచారణ ముగిసిన వెంటనే మీడియా ముందు వైఎస్ జగన్‌పై విమర్శలు, విషపు వ్యాఖ్యలు.. విజయసాయిరెడ్డిని వైఎస్ జగన్ నమ్మి.. దగ్గర పెట్టుకుని పార్టీలో క్రియాశీలక పదవులతో పాటు రాజ్యసభకు పంపించి గౌరవిస్తే ఇంకా మూడేళ్లు పదవీ కాలం ఉన్నా చంద్రబాబుకు మేలు చేసేందుకు విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఇది నమ్మకం ద్రోహం కాదా?’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీ నిలదీసింది.విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడనడానికి పక్కా ఆధారాలు..మద్యం కుంభకోణంపై సీఐడీ విచారణకు కొన్ని గంటల ముందు రహస్య సమావేశంతాడేపల్లి పార్క్ విల్లాలో..విల్లా నెం 27కు సాయంత్రం 5:49కు విజయసాయిరెడ్డి13 నిమిషాల తర్వాత అదే విల్లాకు @ncbn నమ్మినబంటు టీడీ జనార్ధన్.… pic.twitter.com/XYgtZsJSE4— YSR Congress Party (@YSRCParty) May 25, 2025

సంచలన నివేదిక, భారత్ టార్గెట్‌గా.. అణ్వాయుధాలను అప్డేట్ చేస్తున్న పాక్
వాషింగ్టన్: ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్ పహల్గాంలో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడికి, ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (డీఐఏ) సంచలన నివేదికను విడుదల చేసింది. భారత్ తన అస్తిత్వానికి పాక్ ముప్పుగా భావిస్తుందని, అందుకే దాయాది దేశం తన అణ్వాయుధాలను ఆధునీకరిస్తుందనేది డీఐఏ నివేదిక సారాంశం. 2025 worldwide threat assessment report పేరుతో డీఐఏ రిపోర్టును విడుదల చేసింది. అందులో భారత్‌ను ఇప్పటికీ పాక్ తన అస్తిత్వానికి ముప్పుగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. భారత సైనిక శక్తిని దృష్టిలో ఉంచుకొని.. అణ్వాయుధాల అభివృద్ధి సహా సైనిక ఆధునీకరణ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా పాక్ విదేశీ సరఫరాదారుల, మధ్యవర్తుల ద్వారా భారీ విధ్వంసాలను సృష్టించే పదార్థాలను weapons of mass destruction (WMDs) సంపాదిస్తుందని, ఆ అణు పదార్ధాలతో పాటు, అందుకు కావాల్సిన సాంకేతికతను చైనా నుండి పొందుతుందని తెలిపింది. వీటి ట్రాన్స్ఫర్ హాంకాంగ్, సింగపూర్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల ద్వారా జరుగుతోందని హైలెట్ చేసింది. భారత్‌పై అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక డీఏఐ తన నివేదికలో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్.. పాక్‌లోని ఉగ్రస్థావరాలపై క్షిపణులతో దాడిచేసింది. మే 7 నుండి 10 వరకు రెండు దేశాలూ క్షిపణులు, డ్రోన్లు, ఇతర ఆయుధాలతో పరస్పర దాడులకు పాల్పడ్డాయి. మే 10 నాటికి రెండు సైనిక బలగాలు పూర్తి కాల్పుల విరమణపై అంగీకరించాయి’ అని డీఐఏ తన నివేదికలు తెలిపింది.

ఓ వ్యక్తి వీర్యదానం.. 67మంది పిల్లలో 10మంది పిల్లలకు క్యాన్సర్
వాటికన్ సిటీ: ఓ వ్యక్తి వీర్య దానం పదిమంది పిల్లల ప్రాణాల మీదకు తెచ్చింది. జన్యు పరివర్తన కారణంగా సదరు వ్యక్తి దానం చేసిన వీర్యం వల్ల 65 మంది పిల్లల్లో పది మంది పిల్లలకు క్యాన్సర్ సోకింది.ఓ వ్యక్తి 2008 నుండి 2015 మధ్య ఐరోపాలోని ఎనిమిది దేశాలకు వీర్య దానం చేశారు. అతని స్పెర్మ్ ద్వారా 67 మంది పిల్లలు పుట్టారు. అయితే, కొంత కాలానికి ఆ వ్యక్తిలో అరుదైన క్యాన్సర్ కలిగించే జన్యు మ్యూటేషన్ ఉన్నట్టు గుర్తించారు. ఫలితంగా వీరిలో ఇప్పటివరకు 10 మంది పిల్లలకు క్యాన్సర్ సోకినట్లు తేలింది. వీర్య దానంతో 67మంది పిల్లల్లో 23 మందికి టీపీ53 అనే జన్యు మ్యూటేషన్ ఉందని గుర్తించారు. ఈ జన్యు మ్యూటేషన్ ఉన్నవారికి జీవితకాలంలో ల్యూకేమియా, నాన్-హాడ్జ్కిన్ లింఫోమా వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని ముందుగా రెండు కుటుంబాలు తమ పిల్లల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్యుల్ని సంప్రదించారు. వైద్యుల సలహా మేరకు ఫెర్టిలిటీ క్లినిక్స్‌ను సంప్రదించాయి. విచారణలో యూరోపిన్ స్పెర్మ్ బ్యాంక్ డోనర్ ద్వారా వచ్చిన శాంపిళ్లలో టీపీ53 మ్యూటేషన్ ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. 2008లో డొనేషన్ జరిగిన సమయంలో ఈ మ్యూటేషన్ క్యాన్సర్ కలిగించేది అన్న విషయం వెలుగులోకి రాలేదు. కారణం సాధారణ స్క్రీనింగ్ ద్వారా ఇది గుర్తించేది కాదు. ఈ మ్యూటేషన్ ఉన్న పిల్లలు ప్రస్తుతం వైద్యుల సంరక్షణలో ఉన్నారు. ఫుల్ బాడీ ఎంఆర్ఐ స్కాన్లు, మెదడు, ఛాతీ స్కాన్లు, అలాగే కడుపు అల్ట్రాసౌండ్లు తీస్తున్నారు.

నోటి దురుసు వ్యాఖ్యలు చేయొద్దు.. నేతలకు ప్రధాని మోదీ వార్నింగ్
సాక్షి,ఢిల్లీ: బీజేపీ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరికలు జారీ చేశారు. సున్నితమైన అంశాలపై మాట్లాడే విషయంలో నేతలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆదివారం ఢిల్లీలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో సమావేశం జరిగింది. ఈ భేటీలో నేతలు నిర్లక్ష్యంగా వ్యాఖ్యలు చేయొద్దని మోదీ వార్నింగ్ ఇచ్చారు. వివాదాస్పద విషయాలపై మౌనంగా ఉండాలని తెలిపారు. ప్రజా సమక్షంలో నాయకులు చేసే వ్యాఖ్యల్లో అణుకువ, బాధ్యత ఉండాలని హితవు పలికారు. ఎక్కడైనా, ఏదైనా మాట్లాడవచ్చు అనే ధోరణికి దూరంగా ఉండాలని, అనవసర వ్యాఖ్యలు పార్టీకి ప్రతికూలంగా మారతాయని హెచ్చరించారు. ఇటీవలి కాలంలో మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల బీజేపీ నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ‘ఆపరేషన్ సిందూర్’పై చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించాయని పేర్కొన్నారు. PM Narendra Modi tweets, "Participated in the NDA Chief Ministers' Conclave in Delhi. We had extensive deliberations about various issues. Various states showcased their best practices in diverse areas, including water conservation, grievance redressal, strengthening… pic.twitter.com/9Hd03QrWXG— ANI (@ANI) May 25, 2025మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే విజయ్ షా కల్నల్ సోఫియా ఖురేషీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. అలాగే మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్డా చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ‘యావత్తు దేశ ప్రజలు, జవాన్లు తలలు వంచి ప్రధాని మోదీ పాదాల వద్ద మోకరిల్లారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్ జవాబిచ్చిన తీరును ప్రశంసించడానికి మాటలు చాలవు అని వ్యాఖ్యానించారు. ఇలా ఆపరేషన్ సిందూర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాజా, ఎన్డీయే సమావేశంలో బీజేపీ నేతలకు ప్రధాని మోదీ పై ఆదేశాలు జారీ చేశారు. ఈ ఎన్డీయే సమావేశంలో ఆపరేషన్ సిందూర్‌పై స్పష్టత ఇచ్చిన మోదీ.. కాల్పుల విరమణ ఒప్పందంలో దేశానిదే తుది నిర్ణయం. పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకు సీజ్‌ఫైర్‌కు అంగీకరించాం. భారత్-పాక్ కాల్పుల విరమణ ఒప్పందంలో మరే ఇతర దేశం జోక్యం చేసుకోలేదన్నారు.
బీసీల సాధికారతపై నేడు కాంగ్రెస్ సమావేశం
సబలెంకా సులువుగా...
‘గొప్ప గౌరవం... పెద్ద బాధ్యత’
కేబినెట్లో బీసీలే అత్యధికంగా ఉండాలి
ముంబై X పంజాబ్
స్వప్నం సాకారం
కుల గణనతో బడుగుల సాధికారత
పరిశ్రమలు రాష్ట్రం దాటకుండా చూడండి
కేసీఆర్ అవినీతిని ఈటల బయట పెట్టాలి
ఆపరేషన్ సిందూర్ బలమైన భారత్‌కు ప్రతీక
గంట సేపు సముద్రం చీలుతుంది
ఐఏఎస్, ఐపీఎస్‌లుగా రైతు బిడ్డలు
ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)
పారిపోండ్రోయ్..!!
అప్పుడు రూ.1.25 లక్షల జీతం.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ ఉద్యోగం..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
పాక్ సరుకు రవాణా అస్తవ్యస్తం!
కూటమి పార్టీలకు ఓటేసినందుకు మాదీ అదే పరిస్థితి
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు.
'డబ్బు ఆదా చేయొద్దు.. పేదవారవుతారు': రాబర్ట్ కియోసాకి
వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన మంత్రులు
ముగ్గెట్టా పోసేది..?!
కవితకు కేటీఆర్ స్వీట్ వార్నింగ్
మళ్లీ కరోనా
ఏఐ వ్యవస్థలు రూపొందించి వాటివల్లే ఉద్యోగాలు కోల్పోతున్న టెక్ సంస్థల సిబ్బంది
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. సంఘంలో గౌరవం
సాక్షి కార్టూన్ 24-05-2025
బెంగళూరు వద్దు బాబోయ్.. ఆఫీస్ తరలిస్తున్న టెకీ..
రచ్చకెక్కిన డాక్టర్‌బాబు కాపురం
సారీ బాబు గారు.. ఇక్కడ బిల్డింగులు కట్టలేం
బీసీల సాధికారతపై నేడు కాంగ్రెస్ సమావేశం
సబలెంకా సులువుగా...
‘గొప్ప గౌరవం... పెద్ద బాధ్యత’
కేబినెట్లో బీసీలే అత్యధికంగా ఉండాలి
ముంబై X పంజాబ్
స్వప్నం సాకారం
కుల గణనతో బడుగుల సాధికారత
పరిశ్రమలు రాష్ట్రం దాటకుండా చూడండి
కేసీఆర్ అవినీతిని ఈటల బయట పెట్టాలి
ఆపరేషన్ సిందూర్ బలమైన భారత్‌కు ప్రతీక
గంట సేపు సముద్రం చీలుతుంది
ఐఏఎస్, ఐపీఎస్‌లుగా రైతు బిడ్డలు
పారిపోండ్రోయ్..!!
అప్పుడు రూ.1.25 లక్షల జీతం.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ ఉద్యోగం..
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
పాక్ సరుకు రవాణా అస్తవ్యస్తం!
కూటమి పార్టీలకు ఓటేసినందుకు మాదీ అదే పరిస్థితి
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు.
'డబ్బు ఆదా చేయొద్దు.. పేదవారవుతారు': రాబర్ట్ కియోసాకి
వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన మంత్రులు
ముగ్గెట్టా పోసేది..?!
కవితకు కేటీఆర్ స్వీట్ వార్నింగ్
మళ్లీ కరోనా
ఏఐ వ్యవస్థలు రూపొందించి వాటివల్లే ఉద్యోగాలు కోల్పోతున్న టెక్ సంస్థల సిబ్బంది
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. సంఘంలో గౌరవం
సాక్షి కార్టూన్ 24-05-2025
బెంగళూరు వద్దు బాబోయ్.. ఆఫీస్ తరలిస్తున్న టెకీ..
రచ్చకెక్కిన డాక్టర్‌బాబు కాపురం
డీఎస్సీ పరీక్షను వాయిదా వేయలేం
ఆధార్ అప్డేట్ గడువు జూన్ 14 వరకే..
సినిమా

ప్రెగ్నెన్సీ ప్రకటించిన ప్రముఖ నటి.. పోస్ట్ వైరల్
ప్రముఖ బాలీవుడ్ మాళవిక రాజ్ అభిమానులకు శుభవార్త చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. ఇద్దరం ఉన్న మేము ఇప్పుడు ముగ్గురం అయ్యామంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.కాగా.. బాలీవుడ్లో 'కభీ ఖుషీ కభీ ఘమ్' చిత్రంలో పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది. మాల్వికా రాజ్ రింజిన్ డెంజోంగ్పాతో కలిసి 'స్క్వాడ్' అనే యాక్షన్ చిత్రంలో కూడా నటించింది. కాగా.. 2023లో ప్రణవ్ బగ్గాతో ప్రేమలో పడింది మాల్వికా రాజ్. కొన్ని డేటింగ్ తర్వాత పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. బీచ్‌లో జరిగిన వీరిద్దరి పెళ్లి వేడుకలో పలువురు సినీతారలు హాజరయ్యారు. View this post on Instagram A post shared by Malvika Raaj Bagga (@malvikaraaj)

నాకు ఎలాంటి సంబంధం లేదు.. ఆ నలుగురితో కలపకండి: అల్లు అరవింద్
సినిమా థియేటర్ల వివాదంపై టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. థియేటర్ల మూసివేత అనేది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమన్నారు. ఏపీలో 1500 థియేటర్లు ఉంటే తనవి కేవలం 15 మాత్రమే ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో తనకు కేవలం ఒక్క థియేటర్ మాత్రమే ఉందన్నారు. స్టాండ్ అలోన్ థియేటర్లకు సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని అల్లు అరవింద్ అన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేముందు కూర్చుని మాట్లాడుకోవాలని.. ఏకపక్షంగా వెళ్లడం సరికాదన్నారు.అల్లు అరవింద్ మాట్లాడుతూ..'రెండు రోజుల నుంచి ఆ నలుగురు అనే వార్తలు వస్తున్నాయి. ఆ నలుగురిలో నేను లేను. ఆ నలుగురు అనేది 10 సంవత్సరాలక్రితం ఇప్పుడు 10 మంది పైనే ఉన్నారు. తెలంగాణలో నాకు ఉన్న ఒక్క థియేటర్ ట్రిపుల్ ఏ సినిమాస్ మాత్రమే. ఏపీలో కూడా 15 థియేటర్ల లోపు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. థియేటర్లకు సంబంధించి జరిగిన మూడు సమావేశాలకు నేను వెళ్లలేదు. దయచేసి ఆ నలుగురిలో నన్ను కలపకండి.' అని అన్నారు.

అదుర్స్ నటుడు మృతి.. జూనియర్ ఎన్టీఆర్ సంతాపం
బాలీవుడ్ నటుడి మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ సంతాపం తెలిపారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా ఆయనకు నివాళులర్పించారు. ముకుల్ దేవ్ మృతి చెందడం బాధాకరం.. ఈ విషాద సమయంలో అదుర్స్ మూవీలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నామని రాసుకొచ్చారు. కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.. ఓం శాంతి అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.కాగా..బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్(54) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. సీరియల్ నటుడిగా కెరీర్ ప్రారంభించిన ముకుల్ దేవ్ (Mukul Dev) బాలీవుడ్ మూవీ ‘దస్తక్’తో వెండితెరకి పరిచయం అయ్యాడు. హిందీతో పాటు తెలుగు, పంజాబీ, కన్న చిత్రాల్లోనూ నటించాడు.ముకుల్ దేవ్‌కి టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు ఉంది. తెలుగులో కృష్ణ, ఏక్ నిరంజన్, కేడీ, అదుర్స్, నిప్పు, భాయ్ తదితర సినిమాల్లో నటించాడు. కృష్ణ సినిమాలో పోషించిన విలన్ పాత్ర మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2022లో విడుదలైన ‘అంత్ ది ఎండ్’ తర్వాత ఆయన సినిమాల్లో కనిపించలేదు. సింహాద్రి, సీతయ్య, అతడు చిత్రాల్లో నటించారు. Saddened by the passing of Mukul Dev garu. Remembering our time in Adhurs and his commitment to the craft. My condolences to his family. Om Shanti. 🙏 pic.twitter.com/Rp4HsrLR2I— Jr NTR (@tarak9999) May 24, 2025

శేఖర్ కమ్ముల కుబేర.. టీజర్ వచ్చేసింది!
నాగార్జున, ధనుశ్ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం కుబేర. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. ట్రాన్స్ ఆఫ్ కుబేర పేరుతో టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించాయి. హీరో ధనుష్ కుబేరలో సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో సందడి చేయనుంది.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

రన్నరప్ శ్రీకాంత్
కౌలాలంపూర్: కెరీర్లో మరో అంతర్జాతీయ టైటిల్ సాధించాలని ఆశించిన భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌కు నిరాశ ఎదురైంది. మలేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ శ్రీకాంత్ రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 65వ ర్యాంకర్ శ్రీకాంత్ 11–21, 9–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. 36 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ అడపాదడపా మెరిపించినా చివరకు చైనా ప్లేయర్‌దే పైచేయి అయింది. రన్నరప్‌గా నిలిచిన శ్రీకాంత్‌కు 18,050 డాలర్ల (రూ. 15 లక్షల 35 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ‘మళ్లీ పోడియంపైకి వచ్చి పతకం అందుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఫైనల్ ఫలితం నిరాశపరిచినా, ఓవరాల్‌గా ఈ టోర్నీలో నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా’ అని 32 ఏళ్ల శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. 2017లో ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ సాధించిన తర్వాత శ్రీకాంత్ మరో అంతర్జాతీయ టైటిల్ నెగ్గలేకపోయాడు. 2019లో ఇండియా ఓపెన్‌లో, 2021 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరిన శ్రీకాంత్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.

ఆఖర్లో అదరహో
‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి తప్పుకున్న జట్లు... తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌ల్లో దంచికొట్టాయి. గుజరాత్ టైటాన్స్‌తో పోరులో చెన్నై దుమ్మురేపి 230 పరుగులు చేస్తే... కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 278 పరుగులతో విరుచుకుపడింది. అంచనాల ఒత్తిడి లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడిన ఈ రెండు జట్లు విజయాలతో సీజన్‌ను ముగించాయి. గుజరాత్‌తో పోరులో చెన్నై బ్యాటర్లు కాన్వే, బ్రెవిస్ హాఫ్ సెంచరీలతో విజృంభిస్తే... నైట్ రైడర్స్ బౌలర్లను క్లాసెన్, హెడ్ చీల్చి చెండాడారు. సీజన్ ఆరంభ పోరులో రాజస్తాన్ రాయల్స్‌పై 286 పరుగులు చేసి అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ... తమ ఆఖరి మ్యాచ్‌లో మరోసారి మూడొందలకు చేరువైంది. అభిషేక్ శర్మ, హెడ్ మెరుపులతో భారీ స్కోరుకు పునాది వేస్తే... క్లాసెన్ దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. మధ్యలో నిలకడలేమితో పరాజయాలు మూటగట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ... చివరి మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. న్యూఢిల్లీ: విధ్వంసకర ఆటతీరుతో ఐపీఎల్లో భారీ స్కోర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సీజన్‌కు వీడ్కోలు పలికింది. ఆదివారం జరిగిన పోరులో సన్‌రైజర్స్ 110 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)పై విజయం సాధించింది. మొదట సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెన్రిచ్ క్లాసెన్ (39 బంతుల్లో 105 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) అజేయ శతకంతో కదంతొక్కగా... ట్రావిస్ హెడ్ (40 బంతుల్లో 76; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) దంచికొట్టాడు. బంతి తన పరిధిలో ఉంటే చాలు దానిపై ఆకలిగొన్న సింహంలా విరుచుకుపడిన క్లాసెన్ 37 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అభిషేక్ శర్మ (16 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కూడా రాణించాడు. లక్ష్యఛేదనలో కోల్‌కతా నైట్‌రైడర్స్ 18.4 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. దంచుడే... దంచుడు మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ తొలి ఓవర్లో 2 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాతి నుంచి వెనుదిరిగి చూసుకోని రైజర్స్... ఫోర్లు, సిక్స్‌లతో మైదానాన్ని మోతెక్కించింది. రెండో ఓవర్లో హెడ్ సిక్స్‌తో ఖాతా తెరవగా... అభిషేక్ రెండు ఫోర్లు బాదాడు. మూడో ఓవర్లో 6, 4, 2, 6 బాదిన హెడ్... నాలుగో ఓవర్లో మరో మూడు ఫోర్లు కొట్టాడు. నోర్జే ఓవర్లో అభిషేక్ 2 ఫోర్లతో చెలరేగడంతో పవర్‌ప్లే ముగిసేసరికి రైజర్స్ 79 పరుగులు చేసింది. నరైన్ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన అభిషేక్... మరో షాట్ ఆడే ప్రయత్నంలో ఔట్ కాగా... క్లాసెన్ రాకతో విధ్వంసం మరో స్థాయికి చేరింది. ఒకవైపు హెడ్, మరోవైపు క్లాసెన్ బౌలర్‌తో సంబంధం లేకుండా భారీ షాట్లతో విరుచుకుపడటంతో... 10 ఓవర్లు ముగిసేసరికి ఆరెంజ్ ఆర్మీ 139/1తో నలిచింది. ఈ క్రమంలో హెడ్ 26 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... హర్షిత్ ఓవర్లో 4, 6, ,6తో క్లాసెన్ 17 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ అందుకున్నాడు. హెడ్‌ను ఔట్ చేయడం ద్వారా నరైన్ ఈ జోడీని విడదీయగా ... ఇషాన్ కిషన్ వేగంగా ఆడలేకపోయాడు. నరైన్ ఓవర్లో 2 సిక్స్‌లు కొట్టిన క్లాసెన్... వరుణ్‌కు అదే శిక్ష వేసి సెంచరీకి సమీపించాడు. రసెల్ ఓవర్లో 6, 4 కొట్టిన క్లాసెన్... అరోరా బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) రింకూ (బి) నరైన్ 32; హెడ్ (సి) రసెల్ (బి) నరైన్ 76; క్లాసెన్ (నాటౌట్) 105; ఇషాన్ కిషన్ (సి) నోర్జే (బి) వైభవ్ 29; అనికేత్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 278. వికెట్ల పతనం: 1–92, 2–175, 3–158. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–39–1; నోర్జే 4–0–60–0; హర్షిత్ రాణా 3–0–40–0; నరైన్ 4–0–42–2; వరుణ్ చక్రవర్తి 3–0–54–0; రసెల్ 2–0–34–0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) మనోహర్ (బి) మలింగ 9; నరైన్ (బి) ఉనాద్కట్ 31; రహానే (సి) అభిషేక్ (బి) ఉనాద్కట్ 15; రఘువంశీ (సి) నితీశ్ (బి) మలింగ 14; రింకూ (సి) నితీశ్ (బి) హర్ష్ దూబే 9; రసెల్ (ఎల్బీ) (బి) హర్ష్ దూబే 0; మనీశ్ పాండే (సి) మనోహర్ (బి) ఉనాద్కట్ 37; రమణ్‌దీప్ (బి) హర్ష్ దూబే 13; హర్షిత్ (సి అండ్ బి) మలింగ 34; వైభవ్ అరోరా (రనౌట్) 0; నోర్జే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 168. వికెట్ల పతనం: 1–37, 2–55, 3–61, 4–70, 5–70, 6–95, 7–110, 8–162, 9–162, 10–168. బౌలింగ్: కమిన్స్ 2–0–25–0; ఉనాద్కట్ 4–0–24–3; హర్షల్ 2–0–21–0; ఇషాన్ మలింగ 3.4–0– 31–3; హర్ష్ దూబే 4–0–34–3; నితీశ్ రెడ్డి 1–0–6–0; అభిషేక్ 2–0–25–0. 278/3 ఐపీఎల్లో ఇది మూడో అత్యధిక స్కోరు. తొలి రెండు స్థానాల్లోనూ సన్‌రైజర్స్ జట్టే ఉంది. 2024లో బెంగళూరుపై 287/5 స్కోరు చేసిన హైదరాబాద్... ఈ ఏడాది తమ తొలి మ్యాచ్‌లో రాజస్తాన్‌పై 286/5 పరుగులు చేసింది. 37 సెంచరీకి క్లాసెన్ తీసుకున్న బంతులు. ఐపీఎల్లో ఇది మూడో వేగవంతమైన శతకం. క్రిస్ గేల్ (30 బంతుల్లో), వైభవ్ సూర్యవంశీ (35 బంతుల్లో), యూసుఫ్ పఠాన్ (37 బంతుల్లో) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. అహ్మదాబాద్: ఐపీఎల్ 18వ సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయంతో ముగించింది. పాయింట్ల పట్టికలో చివరిదైన పదో స్థానంలో నిలిచిన ధోనీ బృందం... ఆదివారం తమ చివరి లీగ్ మ్యాచ్‌లో 83 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై గెలుపొందింది. మొదట చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డెవాల్డ్ బ్రెవిస్ (23 బంతుల్లో 57; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), కాన్వే (35 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఆయుశ్ మాత్రే (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఉర్విల్ పటేల్ (19 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. అర్షద్ ఖాన్ వెసిన రెండో ఓవర్లో ఆయుశ్ చెలరేగి వరుసగా 2, 6, 6, 4, 4, 6తో 28 పరుగులు రాబట్టాడు. క్రీజులో అడుగుపెట్టిన ప్రతీ బ్యాటర్ దంచికొట్టడమే పనిగా పెట్టుకోవడంతో చెన్నై భారీ స్కోరు చేయగలిగింది. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 18.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సాయి సుదర్శన్ (28 బంతుల్లో 41; 6 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లు ఆకట్టుకోలేకపోయారు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్ చెరో 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌తో ధోని ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతాడని జోరుగా చర్చ సాగగా... మహీ తనకు అలవాటైన రీతిలో ‘వేచి చూద్దాం’ అని ముక్తాయించాడు. సంక్షిప్త స్కోర్లుచెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: 230/5 (20 ఓవర్లలో) (ఆయుశ్ 34; కాన్వే 52; ఉర్విల్ 37; బ్రెవిస్ 57, ప్రసిధ్ కృష్ణ 2/22) గుజరాత్ టైటాన్స్: 147 ఆలౌట్ (18.3 ఓవర్లలో) (సాయి సుదర్శన్ 41; అర్షద్ ఖాన్ 20, అన్షుల్ కంబోజ్ 3/13, నూర్ అహ్మద్ 3/21, జడేజా 2/17).ఐపీఎల్లో నేడుముంబై X పంజాబ్‌వేదిక: జైపూర్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో

కోల్‌కతాపై సన్‌రైజర్స్ గ్రాండ్ విక్టరీ..
ఐపీఎల్-2025 సీజన్ తమ ఆఖరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 110 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.క్లాసెన్ 39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 105 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. క్లాసెన్‌తో పాటు ట్రావిస్ హెడ్(40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76), అభిషేక్ శర్మ(16 బంతుల్లో 32), ఇషాన్(29) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు, వైభవ్ ఆరోరా ఓ వికెట్ సాధించారు.అనంతరం లక్ష్య చేధనలో కేకేఆర్ 18.4 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది. కేకేఆర్ బ్యాటర్లలో మనీశ్ పాండే(37) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హర్షిత్ రాణా(34), సునీల్ నరైన్(31) పర్వాలేదన్పించారు. మిగితా కేకేఆర్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జయ్‌దేవ్ ఉనద్కట్, మలింగ మూడు వికెట్లు పడగొట్టగా.. హర్ష్‌దూబే తలా రెండు వికెట్లు సాధించారు.

హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసం.. 37 బంతుల్లో సెంచరీ! వీడియో
ఐపీఎల్-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అద్బుత సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన క్లాసెన్ విధ్వంసం సృష్టించాడు. ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు ప్రత్యర్ధి బౌలర్లను ఊతికారేశాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు.అతడి బ్యాటింగ్ ధాటికి ఫీల్డర్లు కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించారు. ఈ క్రమంలో క్లాసెన్ కేవలం 37 బంతుల్లోనే తన రెండో ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. క్లాసెన్ ఓవరాల్‌గా 39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 105 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. దీంతో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్లాసెన్‌తో పాటు ట్రావిస్ హెడ్(40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76), అభిషేక్ శర్మ(16 బంతుల్లో 32), ఇషాన్(29) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు, వైభవ్ ఆరోరా ఓ వికెట్ సాధించారు. కాగా ఇది ఐపీఎల్లో మూడో అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఐపీఎల్లో అత్యధిక టోటల్ నమోదు చేసిన రికార్డు కూడా ఎస్ఆర్హెచ్ పేరిటే ఉంది. ఐపీఎల్-2024లో బెంగళూరుపై సన్‌రైజర్స్ 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగులు చేసింది.HEINRICH KLAASEN - Fastest Century by an SRH player 🔥🫡 #SRHvKKR pic.twitter.com/glWohcuB4x— Arun Vijay (@AVinthehousee) May 25, 2025
బిజినెస్

జపాన్ను అధిగమించిన భారత్: మరో మూడేళ్ళలో..
2047 నాటికి వికసిత భారత్ సాధ్యమవుతుందని 'నరేంద్ర మోదీ' చాన్నాళ్లకు ముందే పేర్కొన్నారు. ఈ దిశగానే కేంద్రం కూడా అడుగులు వేస్తోంది. కాగా ఇప్పుడు.. జపాన్ను అధిగమించి.. భారతదేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతి ఆయోగ్ సీఈఓ 'బీవీఆర్ సుబ్రహ్మణ్యం' పేర్కొన్నారు.నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ.. మొత్తం భౌగోళిక, రాజకీయ, ఆర్థిక వాతావరణం భారతదేశానికి అనుకూలంగా ఉన్నాయని సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం.. ప్రస్తుతం భారతదేశం కంటే.. అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే పెద్ద ఆర్ధిక వ్యవస్థను కలిగి ఉన్నాయి.మనం ఇప్పటికే వేసుకున్న ప్రణాళికలకు కట్టుబడి ముందుకు సాగితే.. మరో మూడేళ్ళలో మనం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తామని సుబ్రహ్మణ్యం వెల్లడించారు. తయారీ రంగం అభివృద్ధి, వ్యాపార నిర్వహణ ఖర్చులు తగ్గడం వంటివి మాత్రమే కాకుండా.. ప్రపంచ మార్కెట్‌పై దృష్టి సారించడం వంటివి దేశాభివృద్ధికి కీలకమని ఆయన అన్నారు.ఇదీ చదవండి: ఒక్కసారి చెల్లిస్తే చాలు!.. ఏడాదంతా ఫ్రీ జర్నీభారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. వికసిత భారత్‌లో ఇది పెద్ద అడుగు. ఇలా జరిగేలా చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు అంటూ కేంద్ర మంత్రి 'జితేంద్ర సింగ్' తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.India Overtakes Japan, Becomes World's 4th Largest EconomyA rapid stride, a giant leap …towards #ViksitBharat! Thanks PM @narendramodi for making this happen.— Dr Jitendra Singh (@DrJitendraSingh) May 25, 2025

ఇలా అయితే బంగారం అందరూ కొనుక్కోవచ్చు..!
బంగారం ధర రోజురోజుకూ పెరుగుతూ సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరింది. నెల రోజుల క్రితం అయితే ఏకంగా రూ.లక్షను దాటేసింది. ఆ తర్వాత కాస్త తగ్గినా ఇప్పటికీ రూ.లక్షకు చేరువలోనే ఉంది. దీంతో బంగారం కొనుక్కోవాలని ఆశ ఉన్నప్పటికీ సామాన్యులు మనం కొనలేములే అని ఆగిపోతున్నారు.సాధారణంగా బంగారం అంటే ఆభరణాల రూపంలోనే ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అసలే పెరిగిపోయిన ధరకు తోడు ఆభరణాలకు విధించే తరుగు, తయారీ చార్జీలతో కొనుగోలుదారులపై మరింత భారం పడుతోంది. దీంతో కాస్తంత బంగారం కొనాలన్నా అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే దీనికో పరిష్కారం ఉందంటున్నారు నిపుణులు.అధిక బంగారం ధర ద్రవ్యోల్బణం వంటిది. డబ్బులు అవే కానీ వాటికి వచ్చే వస్తు ప్రతిఫలం తగ్గిపోతుంది. 2020లో మీ దగ్గర రూ.50,000 ఉంటే పది గ్రాముల బంగారాన్ని కొనుక్కునేవారు. కానీ ఇప్పుడు 5 గ్రాములు మాత్రమే వస్తుంది. బంగారం కొనడం అనేది ఒక్కసారి చేసే వ్యాయామం కాదు. ఆర్థిక ప్రణాళికలో భాగంగా కాలక్రమేణా దానిని కూడబెట్టుకుంటూ ఉండాలి.అయితే బంగారాన్ని ఎందుకు కొనాలనుకుంటున్నారో స్పష్టత ఉండాలి. అంటే పెట్టుబడి ప్రయోజనాల కోసమా లేదా నగల కోసమా లేకుంటే వివాహ నిమిత్తమా అన్నది ఎరుక ఉండాలి. బంగారాన్ని ఆభరణాల రూపంలో కొంటే 5 నుండి 20 శాతం 'మేకింగ్ ఛార్జీలు' ఉంటాయి. అదే నాణేల రూపంలో కొంటే ఈ అనవసరమైన భారం ఉండదు.బంగారు నాణేలు కొంటే ప్రయోజనాలు🔸బంగారు నాణేలు ధ్రువీకరించిన స్వచ్ఛతతో వస్తాయి. సాధారణంగా ఇవి 24 కేరట్లు (99.99 శాతం స్వచ్ఛత)లలో లభిస్తాయి.🔸కావాల్సినప్పుడు అమ్మి నగదుగా మార్చుకోవచ్చు. వీటిని సులువుగా విక్రయించుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా వీటిని తీసుకుంటారు.🔸బంగారం ఆభరణాలతో పోలిస్తే వీటిని భద్రపరచుకోవడం సులువు.🔸బంగారు నాణేలు ధ్రువీకరణతో రావడం వల్ల స్వచ్ఛత, బరువుకు సంబంధించి ఎలాంటి భయం ఉండదు.🔸ఆర్థిక అనిశ్చితి సమయాలలో బంగారం విలువకు ఢోకా ఉండదు.🔸బంగారు నాణేలు అర గ్రాము నుంచి 100 గ్రాముల వరకు వివిధ బరువుల్లో లభిస్తాయి. కాబట్టి స్తోమతను బట్టీ ఎవరి ఎంత కావాలో అంత కొనుక్కోవచ్చు.🔸నగల దుకాణాలు, ప్రభుత్వ సంస్థల నుంచి ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో బంగారు నాణేలను కొనుగోలు చేయవచ్చు.

పరుపు కింద జేమ్స్ బాండ్.. వంకరగా కూర్చుంటే కొడుతుంది!
జీవితంలో ఆనందం కావాలంటే, ఆరోగ్యం ఎంతో ముఖ్యం. అలాంటి ఆరోగ్యం కోసం నిత్యం మీతోనే ఉంటూ మీకు సలహాలు సూచనలు ఇచ్చే మినీ డాక్టర్స్ ఈ హెల్త్ హెల్ప్ గాడ్జెట్స్.పిండేసిన శరీరాన్ని హీల్ చేస్తుంది ఎంతో హుషారుగా కొత్తగా జిమ్ జాయిన్ అయితే, ఆ తర్వాతి రోజే వర్కౌట్స్ నొప్పులు, ‘ఇంకా ఒక్క అడుగు కూడా వేయలేం’ అంటూ మిమ్మల్ని మొండికేస్తున్నాయా? అయితే, ఆ నొప్పుల పోరు తీర్చడానికి వచ్చింది ఈ ‘థెరాగన్ రిలీఫ్’. ఇది వర్కౌట్స్ చేయగా వచ్చే కండరాల నొప్పుల నివారణకు ఉపయోగపడే ఒక సరైన మసాజ్ థెరపీ. సాధారణ మసాజ్ గన్ కంటే ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులోని మూడు రకాల అటాచ్మెంట్లు శరీర భాగాలకు తగ్గట్టుగా ప్రొఫెషనల్ మసాజ్ చేస్తూ చాలా త్వరగా నొప్పిని పోగొడతాయి. ఒక్కసారి దీనిని వాడిన తర్వాత, శరీరం ‘ఇంకా చేద్దాం వర్కౌట్.. థెరాగన్ ఉందిగా’ అంటుంది. ధర 149 డాలర్లు (రూ. 12,725) మాత్రమే!స్లీప్ అనలైజర్వాచ్ వేసుకోమని బలవంతం చేయదు, రింగ్ పెట్టుకోమని అడగదు. కాని, మెల్లగా మీరు పడుకునే పరుపు కింద ఉండి, గుట్టుగా మిమ్మల్ని గమనిస్తూనే ఉంటుంది. చూడ్డానికి ఒక సాధారణ ప్యాడ్లాగా కనిపిస్తుంది. కాని, దీని పనితీరు చూస్తే ఎంతటివారైనా షాక్ తింటారు. ఎందుకంటే, మీ నిద్ర చరిత్ర అంతా ఒక్కసారికే చెప్పేయగలదు ఈ ‘వితింగ్స్ స్లీప్ అనలైజర్’. సాధారణ స్లీప్ ట్రాకర్ మాదిరి కాకుండా, నిద్ర ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ముగిసింది, మధ్యలో మీకు వచ్చే కలలు, వాటి వలన మీలో కలిగే మార్పులు, హార్ట్ బీట్, ఒత్తిడి, నిద్రలో మీరెలా ఫీల్ అవుతున్నారు, గురక పెడుతున్నారా, గురక శబ్దం ఎంత గట్టిగా ఉంటోంది– ఇలా నిద్రకు సంబంధించిన మరెన్నో విషయాలను విశ్లేషించి వివరాలను అందిస్తుంది. అవసరమైన సలహాలు, సూచనలను కూడా ఇస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది నిద్ర ర హస్యాలను బయటపెట్టే ఒక జేమ్స్‌బాండ్. ధర 129 డాలర్లు (రూ. 11,011) మాత్రమే!పోశ్చర్ ట్రైనర్అందరికీ తెలిసిన రహస్యం, కుర్చీలో ఎలా పడితే అలా వంకరగా కూర్చొవడం కారణంగానే వెన్ను నొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని. మరి, తెలిసిన విషయమే అయినా, సరిగ్గా కూర్చోలేకున్నారా? అయితే, ఇకపై ఎప్పుడైనా వంకరగా కూర్చుంటే వెంటనే మీ వీపు పై ‘టప్’మని కొట్టి, హెచ్చరిస్తుంది ఈ ‘పోశ్చర్ ట్రైనర్’. చిన్న లాకెట్ రూపంలో చైన్‌తో పాటు ఉంటుంది. దీనిని మెడకు ధరించి లాకెట్‌ను వీపుకు వేలాడదీసుకుంటే, చాలు ఎప్పటికప్పుడు మీ కూర్చునే పోశ్చర్‌ను వైబ్రేషన్స్‌తో సూచిస్తూ, కుర్చీలో మీరు ఒక రాజులా ఠీవిగా కూర్చునేలా చేస్తుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు ముప్పయి గంటలపాటు పనిచేస్తుంది. ధర రూ. 11,389.

అప్పుడు రూ.1.25 లక్షల జీతం.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ ఉద్యోగం..
జీవితం అందరికీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎత్తుపల్లాలు.. ఒడిదుడుకులు ఉంటాయి. ఒక్కోసారి నిచ్చెనెక్కించి గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. కొన్నిసార్లు ఊహించని విధంగా కిందకు పడేస్తుంది. ఉన్నత స్థాయికి చేరి ఉత్తమ జీవనం గడుపుతున్నప్పటికీ ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. అందుకే అన్నింటికీ సిద్ధమై ఉండాలి. ఏది ఎదురైనా ఆనందంగా స్వీకరించాలి.. సంతోషంగా ఆస్వాదించాలి.. ఈ ఫుడ్ డెలివరీ ఉద్యోగి జీవితం చెబుతున్న పాఠం ఇదే..ఒక ఫుడ్ డెలివరీ రైడర్ తనకు ఆహారం మాత్రమే కాదు.. జీవిత పాఠాన్ని అందించారంటూ ఆయన స్ఫూర్తిదాయకమైన కథను ఫేస్బుక్లో షేర్ చేశారు పుణెకు చెందిన శ్రీపాల్ గాంధీ. ఈ జీవితగాథ సోషల్ మీడియాలో నెటిజనులను హత్తుకుంటోంది. ప్రశంసలు వెల్లువను అందుకుంటోంది. ప్రస్తుతం ఆన్లైన్ ఫుడ్ డెలివరీలు మన దైనందిన జీవితంలో భాగమయ్యాయి. చాలా మంది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి ఆహారం తెప్పించుకుంటుంటారు. ఏదైనా మిస్ అయినా, పొరపాటు జరిగినా ఆ తెచ్చిన వ్యక్తి మీద అరుస్తుంటారు. కానీ శ్రీపాల్ గాంధీ డెలివరీ రైడర్‌ను మెల్లగా కదిలించి అతని జీవితం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు.శ్రీపాల్ గాంధీ సబ్వే నుండి లంచ్ ఆర్డర్ పెట్టారు. ఫుడ్ డెలివరీ రైడర్ ఆహారాన్ని తీసుకొచ్చాడు. కానీ పాకెట్ చూడగానే అందులో శాండ్విచ్ మాత్రమే ఉందని, మిగిలిన పదార్థాలు మిస్ అయ్యాయని శ్రీపాల్ గుర్తించి డెలివరీ రైడర్‌కు చెప్పారు. కాసేపు కంగారు పడిన డెలివరీ రైడర్ "రెస్టారెంట్ లేదా జొమాటోకు కాల్ చేయండి సార్" అంటూ వినయంగా జవాబిచ్చాడు. దీంతో శ్రీపాల్ సబ్వే వారిని సంప్రదించగా క్షమాపణలు చెప్పి 'రైడర్ ను వెనక్కి పంపగలరా?' మిస్ అయిన వాటిని తిరిగిపంపుతాం.. అతనికి రూ.20 చెల్లిస్తాం' అని బదులిచ్చారు.ఎంత వినయం?ఫుడ్ అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్ జొమాటో ఆదేశిస్తే తప్ప డెలివరీ భాగస్వాములు రెస్టారెంట్‌కు తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తమ రైడర్లకు చెల్లించేది జొమాటో. రెస్టారెంట్ కాదు. అయినా ఈ డెలివరీ ఏజెంట్ ఏమాత్రం వెనుకాడలేదు. "సార్, అది నా బాధ్యత. కస్టమర్ సంతోషమే తాను కోరుకుంటాను" అంటూ మళ్లీ రెస్టారెంట్‌కు వెళ్లి మిస్ అయిన వాటిని తిరిగి తీసుకొచ్చాడు. సబ్వే వాళ్ల నుంచి రూ.20 పరిహారాన్ని కూడా ఆయన తీసుకోలేదు. "దేవుడు నాకు ఎ౦తో ఇచ్చాడు. ఒకరు చేసిన పొరపాటుకు నేను ఈ డబ్బు ఎందుకు తీసుకోవాలి? అంటూ అతను శ్రీపాల్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది.జీవిత గమనాన్ని మార్చిన కారు ప్రమాదంరైడర్ తన గతం గురించి శ్రీపాల్ గాంధీ వద్ద ఓపెన్ అయ్యాడు. షాపూర్జీ పల్లోంజీలో కన్స్ట్రక్షన్ సూపర్వైజర్గా పనిచేస్తూ నెలకు రూ.1.25 లక్షల జీతం అందుకునేవారు. కానీ ఒక కారు ప్రమాదం అతని జీవిత గమనాన్ని మార్చేసింది. ఎడమ చేయి, కాలు పక్షవాతానికి గురయ్యాయి. తన ఉద్యోగాన్ని, స్థిరత్వాన్ని, కొంతకాలానికి ఆశను కోల్పోయాడు. ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో అతనికి తోడ్పాడు అందించింది. ఫుడ్ డెలివరీ పార్ట్నర్గా అవకాశమిచ్చింది.తన కుమార్తె ఇప్పుడు దంతవైద్యం చదువుతోందని శ్రీపాల్‌తో ఫుడ్ డెలివరీ రైడర్ అన్నారు. కేవలం ఆదాయం కోసమే కాకుండా తన కలను సజీవంగా ఉంచుకోవడానికి ఆయన రైడ్ చేస్తున్నారని శ్రీపాల్ గాంధీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. "అతను జీవితాన్ని నిందించలేదు. ఫిర్యాదులు చేయలేదు. సాకులు చెప్పలేదు" అని రాసుకొచ్చారు. స్వామి సమర్థ్‌ను విశ్వసించే అతను 'దేవుడు నాతో ఉన్నాడు. నేనెందుకు కంగారు పడాలి?" అని నవ్వుతూ అన్నాడని శ్రీపాల్ వివరించారు."ఈ రోజు నాకు శాండ్ విచ్ వచ్చింది. కానీ కృతజ్ఞత, స్థిరత్వం, ఆశావాదం నా దగ్గరే నిలిచిపోయాయి" అంటూ తన పోస్ట్ ను ముగించారు. అతనికి ఉపాధి కల్పించిన జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోస్ట్ వైరల్‌గా మారి నెటిజనుల ప్రశంసలు అందుకుంది. అలాంటి వారికి సెల్యూట్.. వావ్, అద్భుతం.. నిజంగా స్ఫూర్తిదాయకం అంటూ కామెంట్లు పెట్టారు.
ఫ్యామిలీ

చేపల టీచర్..!
అక్వేరియం చేపల పెంపకంలో ఉన్న పార్వతి నెలకు రు.50 వేలకు పైగానే సంపాదిస్తారు. కానీ అంతకు మించిన సంతోషం ఆమెకు వేరే ఉంది! చేపల పెంపకంలో శిక్షణ కోసం తన దగ్గరకు వచ్చే కొల్లమ్‌లోని ‘కాలేజ్ అండ్ ఫిషరీస్ స్కూలు’ విద్యార్థులు తనను ‘‘టీచర్.. టీచర్..’’ అంటూ సందేహాలు అడుగుతుండటం మనసుకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని చెబుతారామె.పార్వతి సోషియాలజీ గ్రాడ్యుయేట్. 18 ఏళ్ల క్రితం – పెళ్లయే వరకు ఆమెకు అక్వేరియం చేపల పెంపకం అనే ఆలోచనే లేదు. మెట్టినింటి వాళ్లకు చేపల వ్యాపారం ఉంది. ఎనిమిది చేపల చెరువులు ఉన్నాయి. వాటిల్లో వేటికవిగా... తినే చేపల్ని, అక్వేరియం చేపల్ని పెంచుతుంటారు. భర్తతో కలిసి చేపల చెరువులకు వెళ్లొస్తుండటం, వాటిని మార్కెట్ చేయటం వంటివి చూస్తూ క్రమంగా తనూ చేపల పెంపకంపై ఆసక్తి పెంచుకున్నారు పార్వతి. అయితే పార్వతి కేవలం అక్వేరియం చేపల పెంపకాన్ని మాత్రమే ఎంచుకున్నారు. వీటినే ఆర్నమెంట్ చేపలనీ, రంగు చేపలనీ అంటారు. ఇప్పుడంటే ఆమె తన ‘దేవూస్ ఆక్వా ఫామ్’ నిర్వహణతో పూర్తిగా మెలకువల్ని తెలుసుకోగలిగారు కానీ, మొదట్లో ఆ చేపల్ని పెంచటం చాలా కష్టంగా ఉండేదట! ‘‘కొన్నిసార్లు కుంటలోని అక్వేరియం చేపలు మొత్తం చనిపోయి కనిపించేవి. నష్టం మాట ఎలా ఉన్నా ఆ చిన్ని ప్రాణులు విగతజీవులై నీటి పైన తేలియాడుతూ ఉండటం చూసి మనసుకు ఎంతో బాధ కలిగేది’’ అంటారు పార్వతి. దాచుకున్న డబ్బుతో..!వివిధ సైజులలోని 21 సిమెంటు కుంటలలో అక్వేరియం చేపల్ని పెంచుతున్నారు పార్వతి. ఈ బ్రీడింగ్ ట్యాంకులు పెద్దవిగా ఉంటాయి. బేబీ ఫిష్‌లను ఆ పెద్దవాటికి దూరంగా ఉంచటం కోసం ప్రత్యేకంగా మరి కొన్ని చిన్న ట్యాంకులు ఉంటాయి. ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ పథకం కింద రుణంగా తీసుకున్న డబ్బు కొంత, తన దగ్గరున్న దాచుకున్న డబ్బు కొంత కలిపి రు.15 లక్షల పెట్టుబడితో ఈ అక్వేరియం చేపల (ఆర్నమెంట్ ఫిష్) బిజినెస్‌ను ప్రారంభించారామె. పార్వతికి కొల్లమ్, అలెప్పి, కొట్టాయం, తిరువనంతపురం, పఠనంతిట్ట, ఇంకా ఉత్తర కేరళలోని కొన్ని ప్రాంతాలలో క్లయింట్లు ఉన్నారు. చిన్న దుకాణాల వాళ్లు కూడా వచ్చి కొనుగోలు చేస్తుంటారు. నెలకు తక్కువలో తక్కువగా రు.15 వేలు, ఎక్కువలో ఎక్కువగా లక్ష వరకు రాబడి ఉంటోంది. ప్రస్తుతం కాయ్ కార్ప్, మార్ఫ్, క్రిబెన్సిస్, జులిడోక్రోమిస్, బ్యూటికాఫ్యూరి, ఫ్రంటోసా, జెబ్రా డేనియోస్, రెయిన్ బో సిక్లిడ్, హెకెల్లి, మూన్ లైట్ గోరమి రకం రంగు చేపల్ని తన ఫామ్‌లో ఉత్పత్తి చేస్తున్నారు పార్వతి. మొదట్లో అన్ని చోట్లా దొరికే ఏంజెల్, గుప్పి, ఫైటర్, గోల్డ్‌ఫిష్ రకాల్ని మాత్రమే పెంచేవారు. చేప రకాన్ని బట్టి బ్రీడింగ్ ఉంటుంది. ‘‘మార్ఫ్ వెరైటీలో ఆడ చేపలు గుడ్లు పెడతాయి. ఆ గుడ్లను మగ చేపలు తమ నోటిలో పొదుగుతాయి. అది మాకు తెలుస్తుంది. అప్పుడు ఆ మగ చేపల్ని వేరే కుంటలోకి మారుస్తాం’’ అని ఎంతో ఆసక్తికరంగా వివరిస్తారు పార్వతి. ప్రస్తుతం ఆమె తన బిజినెస్‌ను మరింతగా విస్తృతపరచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. దాచుకోని విద్యతో...!అక్వేరియం చేపల పెంపకంలోని ఈ అనుభవం అంతా కేవలం నేర్చుకోవటం ద్వారానే పార్వతికి లభించలేదు. పనగఢ్లోని ‘కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్డడీస్’లో రీసెర్చర్‌గా ఉన్న యానా మెర్సీతో కలిసి కొంతకాలం పని చేశారామె. ‘‘ప్రతి పనిలోనూ కష్టం ఉంటుంది. రాబడిలో ఒడిదుడుకులు ఉంటాయి. అయినప్పటికీ ముందుకు సాగిపోవాలి. మనకు తెలిసిన విద్యను దాచుకోకుండా, రాబోయే తరాల వారికి పంచాలి.. ’’ అంటారు పార్వతి.కొన్ని విశేషాలుప్రపంచంలో స్టాంప్ కలెక్షన్ తర్వాత అతి పెద్ద హాబీ ఇంట్లో అక్వేరియం ఉంచుకోవటమే!అక్వేరియంలోని రంగురంగుల చేపల్ని చూస్తుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో రూఢి అయింది.రంగు చేపల అమ్మకానికి, పెంపకానికి చెన్నైలోని కొళత్తూరు ప్రసిద్ధి.ఆసియాలోని అతి పెద్ద ‘రంగు చేపల మార్కెట్’గా కొళత్తూరు గుర్తింపు సంపాదించింది.అక్వేరియంలో ఉండే చేపలు చాలా సున్నితమైనవి. వాటికి సమపాళ్లలో రెండు పూటలా ఆహారం అందించాలి.అక్వేరియంలో అధిక సంఖ్యలో చేపల్ని ఉంచితే, వాటి విసర్జితాలు ఎక్కువై నీటిలో అమోనియం అధికమౌతుంది. చేపలకు హానికరంగా మారుతుంది. అక్వేరియంలో నీటిని తరచు మారుస్తుండాలి. పెద్ద తొట్టె అయితే వారానికోసారి, చిన్నదైతే రెండు రోజులకోసారి నీటిని మార్చాలి. అక్వేరియంలో నీటికి మార్చకపోతే బాక్టీరియా చేరి చేపలు చనిపోయే అవకాశం ఉంది. చేపలకు ప్రత్యేకమైన ఆహారాన్ని ఇవ్వాలి. ప్రత్యేక మోతాదుల్లో ఇవ్వాలి. ఈ వివరాలను షాపు వాళ్ల నుంచి తెలుసుకోవచ్చు. సాక్షి, స్పెషల్ డెస్క్ (చదవండి: మన ముచ్చట: పుస్తకానికి గుడి)

కలలో కూడా చూడని ఇల్లు..! చూశాక మాత్రం..
ధనవంతుడైన ఒక దొంగకు ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్, ఒక ఇంటిని చూపిస్తూ ఇలా అంటున్నాడు.. ‘‘ఇంటి ముందు ‘మా జైలుకు స్వాగతం’ అనే బోర్డు పెట్టుకుంటే భలే ఉంటుంది సార్. అలాగే, కాలింగ్ బెల్లుకు బదులు ఇక్కడ ఒక జైల్ అలారం పెట్టించుకుంటే ఇంకా సూపర్. అలాగే మీకోసం ఒక పెద్ద సెల్లో మాస్టర్ బెడ్రూమ్ను డిజైన్ చేసుకోవచ్చు. అతిథులు వస్తే, వాళ్లకోసం నెంబర్ వైజ్డ్ రిమాండ్ రూమ్స్ కూడా ఉన్నాయి. అతిథులతో మీకు ఇబ్బంది రాకుండా, వారిని వెంటనే ఇంటి నుంచి వెళ్లగొట్టగలిగేలా రూమ్స్‌లో అద్భుతమైన చెక్క మంచాలు ఉన్నాయి. వాటిని మీకు స్పెషల్ డిస్కౌంట్ కింద ఫ్రీగా ఇస్తాం. ఎప్పుడైనా పిల్లలు మొండిగా ప్రవర్తిస్తుంటే, క్రమశిక్షణలో పెట్టడానికే పక్కనే సిద్ధంగా ఒక లాకప్ రూమ్ కూడా ఉంది’’ అని వివరిస్తున్నాడు. ఇదంతా ఆ రిచ్ చోర్, తనను మెప్పించడానికే ఇలా చెప్తున్నాడేమో అనుకున్నాడు. కాని, అతను వచ్చిన ప్రతి ఒక్కరికీ ఇలాగే వివరిస్తున్నాడు. ఎందుకంటే, ఆ ఇల్లు నిజంగానే ఒక జైలు కాబట్టి. ఈ అద్భుతమైన జైలును సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే, ఇంగ్లండ్‌లోని డోర్సెట్‌కు వెళ్లాలి. 1899లో నిర్మించిన స్వానేజ్ పోలీస్ స్టేషన్ ప్లస్ జైలును, అక్కడి ప్రభుత్వం 1.2 మిలియన్ పౌండ్స్ (అంటే రూ. 13 కోట్లు )కు వేలానికి పెట్టింది. లైఫ్‌లాంగ్ లాకప్‌కు సిద్ధంగా ఉన్నవారు ఎవరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. త్వరపడండి! (చదవండి: ఆ దంపతుల యావజ్జీవితం నౌకలోనే..! రీజన్ తెలిస్తే షాకవ్వుతారు..)

అందంతో మాయ చేసే ముద్దుగుమ్మ మృణాలిని బ్యూటీ రహస్యం ఇదే..!
అందమంతా పోతపోసుకున్నట్లు కనువిందు చేసే మాయ పేరే మృణాళిని రవి. సోషల్ మీడియాలో రీల్స్ నుంచి సిల్వర్ స్క్రీన్‌పై రియల్‌గా కనిపించడంలోనే కాదు, ఫ్యాషన్‌లోనూ స్టయిలిష్‌గా ఉంటుంది. ఆరోగ్యకరమైన అలవాటు ఒక్కటి చాలు మీ అందాన్ని మరింత పెంచడానికి. రోజూ పడుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకొని, మాయిశ్చరైజర్ రాసుకుంటా. ఆ అలవాటే నా అందానికి సహజత్వాన్ని ఇస్తుందని చెబుతోంది మృణాళిని రవి.రాయల్ రింగ్..సాధారణ దుస్తుల్లో కూడా రాయల్‌గా కనిపించాలంటే.. మీ దగ్గర తప్పకుండా ఒక్కటైనా స్టేట్మెంట్ రింగ్ ఉండాల్సిందే! అది చిన్నదైనా, పెద్దదైనా సరే, మొత్తం మీ లుక్కే ఒక ప్రత్యేకమైన ఎలిగెన్స్‌ను ఇవ్వగలదు. ఇవి ఎక్కువగా వివిధ ఆకారాలు, రంగులు, స్టోన్స్‌తో ప్రత్యేకమైన డిజైన్స్‌లో ఉంటాయి. స్టేట్మెంట్ రింగ్ వేసుకున్నప్పుడు చేతికి వేరే ఏ ఇతర ఆభరణాలతోనూ స్టయిలింగ్ చేయొద్దు. ఎక్కువ రింగ్స్ వేసుకుంటే ఫోకస్ చెదిరిపోతుంది. మంచి నెయిల్ పాలిష్‌తో జత కలిపితే ఉంగరం ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. మ్యూట్ షేడ్స్ లేదా డ్రెస్‌కు మ్యాచ్ అయ్యే కలర్స్ ఉపయోగించండి. లాంగ్ స్లీవ్స్ బ్లౌజ్‌లు, టాప్‌లు అసలు వేసుకోవద్దు. అలాగే హ్యాండ్‌బ్యాగ్‌కు బదులు క్లచ్ తీసుకెళ్లడం ఉత్తమం. (చదవండి: ముద్దుగుమ్మ రాశీ ఖన్నా ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే..!)ఇక కాంప్లిమెంటరీ జ్యూలరీగా కమ్మలను చూజ్ చేసుకోండి. అవికూడా మితంగా, సేమ్ టోన్ జ్యూలరీలో సెలెక్ట్ చేసుకోవాలి. ఫొటోషూట్స్, వివాహాది శుభకార్యాలకు సింపుల్ అండ్ గ్రేట్ ఆప్షన్ ఇది. అప్పుడు అక్కడ మీరు మాట్లాడకపోయినా సరే, మీ స్టయిల్ మాట్లాడుతుంది. ఇక మృణాళిని ధరించే జ్యూలరీ బ్రాండ్: కర్ణిక, ఇయర్ రింగ్స్ ధర: రూ. 33,200, ఉంగరం ధర: రూ. 2,200, చీర బ్రాండ్: ఆలివ్ హ్యాండ్ప్రింట్స్ రూ. 3,850/-.బ్లౌజ్ ధర: రూ. 1,050/-.(చదవండి: వర్షం సాక్షిగా.. ఒక్కటైన జంటలు..!)

పదో తరగతి తర్వాత
పదో తరగతి తర్వాత ఏం చదవాలి? ఏం చేయాలి? ప్రతి విద్యార్థి, ప్రతి పేరెంట్ ఎదుర్కొనే సాధారణమైన ప్రశ్న. మీ బిడ్డకు ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే కార్పొరేట్ కాలేజీలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. లేదంటే ఆ కాలేజీల మార్కెటింగ్ ఏజెంట్లు వస్తారు. ఎంపీసీ, బైపీసీ, ఐఐటీ, నీట్, ఎంసెట్ అంటూ ఆశలు చూపిస్తారు. లేదంటే సీఈసీ ప్లస్ సీఏ అంటూ వస్తారు. తమ కాలేజీల్లో చేర్పించుకుంటారు. చాలామంది ఇలాగే స్నేహితులు, పొరుగింటివాళ్లు, బంధువులు, సమాజం ప్రభావం వల్ల ‘అందరూ ఎంచుకునే దారి’లోనే ప్రయాణిస్తుంటారు. ఆ తర్వాత అక్కడ ఒత్తిడి భరించలేక నానా అవస్థలు పడుతుంటారు. అనేకమంది విద్యార్థులు మానసిక ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళనలాంటి సమస్యలతో కౌన్సెలింగ్ కోసం వస్తుంటారు. కొందరు కోరుకున్నది సాధించలేక తీవ్ర మానసిక సమస్యల్లో పడిపోతుంటారు. ఈ పరిస్థితులు మారాలంటే, మార్చాలంటే కావాల్సింది– కెరీర్ కౌన్సెలింగ్. కెరీర్ కౌన్సెలింగ్ అంటే...పదో తరగతి తర్వాత మీరు తీసుకునే నిర్ణయం మీ జీవిత దశ, దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది. అందుకే ఈ దశలో కెరీర్ కౌన్సెలింగ్ ఒక గేమ్ చేంజర్‌గా నిలుస్తుంది. ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం, ఆసక్తి, సామర్థ్యాలు ఉంటాయి. ఒకరు ఎదిగే దారి మరొకరికి సరిపోదు. కెరీర్ కౌన్సెలింగ్‌లో ‘ఏది ఫేమస్’ అని కాకుండా, ‘ఏది మీకు బెస్ట్’ అనే ప్రశ్నకు శాస్త్రీయమైన, మానసికమైన సమాధానం దొరుకుతుంది. ఇది గూగుల్ మ్యాప్ లాంటిది. మీ లక్ష్యానికి సులువైన దారి చూపిస్తుంది. తప్పుడు మార్గంలో వెళ్తే హెచ్చరిస్తుంది.ఉదాహరణకు ఏనుగు, కోతి, చేపకు చెట్టెక్కమనే పరీక్ష పెడితే? ఒక్క కోతి మాత్రమే గెలుస్తుంది. మిగతావన్నీ ఓడిపోతాయి. అలాగని అవన్నీ పనికిరానివి అనగలమా? దేని బలం దానిదే, దేని ప్రత్యేకత దానిదే! అలాగే పదో తరగతి తరువాత ఏం చదవాలనే నిర్ణయం కూడా వ్యక్తిగతంగా ఉండాలి.కెరీర్ కౌన్సెలింగ్ ఎందుకు అవసరమంటే... ∙మనకు తెలియని అంతర్గత శక్తులను బయటకు తేవడానికి ∙మనకున్న ఆసక్తి, వ్యక్తిత్వం, సామర్థ్యానికి సరిపడే కోర్సు ఏదో కనుగొనడానికి ∙‘అందరూ చేస్తున్నది నేనూ చేయాలి’ అనే ఉచ్చులోంచి బయటపడడానికి ∙భవిష్యత్తులో ఉన్న అవకాశాలు, సవాళ్లు, రిస్క్‌లు తెలుసుకోవడానికి ∙మన లక్ష్యాన్ని నిర్దేశించుకునే ముందు స్పష్టత కోసం.పదో తరగతి తర్వాత విద్యావకాశాలు... పదో తరగతి తర్వాత అందరికీ తెలిసింది ఇంటర్మీడియట్ చదవడం. దానిలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులు ఉంటాయి. ఇవి కాకుండా హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, మల్టీమీడియా, ట్రావెల్ అండ్ టూరిజం కోర్సులు కూడా ఉన్నాయి. పాలిటెక్నిక్ చదివి ఆ తర్వాత ఇంజినీరింగ్ చేసే అవకాశమూ ఉంది. తక్షణ ఉద్యోగావసరం ఉన్నవాళ్లు ఐటీఐ చేస్తే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇవి కాకుండా అరుదుగా తెలిసిన, భవిష్యత్తులో హై డిమాండ్ ఉన్న కోర్సులు కూడా ఉన్నాయి. ఇవి ఉన్నట్లు కూడా చాలామందికి తెలియదు. కాని, వీటిలో ఆసక్తి, సామర్థ్యం, ప్యాషన్ ఉంటే చాలా గొప్ప కెరీర్ అవకాశాలున్నాయి. ఉదాహరణకు, యానిమేషన్ అండ్ వీఎఫ్ఎక్స్లో డిప్లొమా, సైబర్ ఫోరెన్సిక్ డిప్లొమా, గేమింగ్ డిప్లొమా, రోబోటిక్స్, ఏఐ డిప్లొమా, ఫైర్ ఇంజినీరింగ్, పారామెడికల్ కోర్సులు. కౌన్సెలింగ్ లేకుండా నిర్ణయం తీసుకుంటే వచ్చే నష్టాలు∙తల్లిదండ్రులు, ఇతరుల మాటలు విని తీసుకున్న కోర్స్ మధ్యలోనే బోర్ కొడుతుంది. ∙మనకు సామర్థ్యం లేని సబ్జెక్టుల వల్ల పరీక్షల్లో తప్పే అవకాశాలు పెరుగుతాయి. ∙‘నాక్కావాల్సింది ఇది కాదు’ అని గుర్తించినప్పుడు మళ్ళీ రీ–స్టార్ట్ చెయ్యాలి. ∙విలువైన సంవత్సరాలు, డబ్బు, మెంటల్ ఎనర్జీ వృథా అవుతాయి. ∙చివరికి వృత్తి, ఉద్యోగం, జీవితంలో అసంతృప్తికి దారితీస్తుంది.కౌన్సెలింగ్ తీసుకుంటే వచ్చే లాభాలు∙మీకు సరిపడే స్ట్రీమ్ లేదా కోర్స్‌ను గుర్తించగలుగుతారు. ∙స్పష్టత, ఆత్మవిశ్వాసం, నిబద్ధత వస్తాయి. ∙‘అందరూ వెళ్తున్న దారి’ కంటే ‘నాకు సరిపోయే దారి’ఎంచుకునే ధైర్యం వస్తుంది. ∙భవిష్యత్తులో ఉండే కెరీర్ అవకాశాలపై పూర్తి అవగాహన పెరుగుతుంది. ∙ప్రవేశ పరీక్షలు, అందుకు కావాల్సిన నైపుణ్యాల గురించి ముందే తెలుసుకుని సిద్ధంగా ఉంటారు.
ఫొటోలు
అంతర్జాతీయం

సామ్‌సంగ్‌కు ట్రంప్ హెచ్చరికలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ ప్రఖ్యాత తయారీ సంస్థలను టారిఫ్‌ల పేరిట బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఆయా కంపెనీలు అమెరికాలోనే వస్తువులు, సరుకులు ఉత్పత్తి చేయాలని, లేకపోతే సుంకాల బాదుడుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆయన యాపిల్ కంపెనీకి ఇప్పటికే హెచ్చరికలుజారీ చేశారు. దక్షిణ కొరియాకు చెందిన సామ్సంగ్ సంస్థకు సైతం ఇప్పుడు అదే పరిస్థితి ఎదురయ్యింది. అమెరికాలో ఉత్పత్తి చేయకపోతే 25 శాతం టారిఫ్ విధిస్తామని సామ్‌సంగ్‌కు ట్రంప్ తేల్చిచెప్పారు. ఆయన తాజాగా వైట్‌హúస్లో మీడియాతో మాట్లాడారు. అణు విద్యుత్ ఉత్పత్తిని మరింత పెంచడానికి ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకాలు చేశారు. అమెరికాలో ఎల్రక్టానిక్ ఉత్పత్తులు విక్రయించుకొనే ఏ సంస్థ అయినా సరే వాటిని ఇక్కడే తయారు చేయాలని, లేనిపక్షంలో సుంకాలు చెల్లించడానికి సిద్ధంగా ఉండాలని స్పష్టంచేశారు. తయారీ ప్లాంట్లను అమెరికాలో నెలకొల్పితే ఎలాంటి టారిఫ్‌లు ఉండవని చెప్పారు. మరెక్కడో తయారు చేసి, ఇక్కడ విక్రయించుకొని, సొమ్ము చేసుకుంటామంటే అది సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ఐఫోన్లను అమెరికాలో ఉత్పత్తి చేయకపోతే యాపిల్ కంపెనీపై 25 శాతం టారిఫ్‌లు విధించడం తథ్యమని ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. యాపిల్ కంపెనీకి సంబంధించి 90 శాతం ఫోన్లు చైనాలోనే తయారవుతున్నాయి. అక్కడి ప్లాంట్లను భారత్‌కు తరలించేందుకు యాపిల్ సిద్ధమవుతోంది. ఇంతలోనే ట్రంప్ కన్నెర్ర చేశారు. మరోవైపు సామ్‌సంగ్‌కు చైనాలో తయారీ ప్లాంట్లు లేవు. చివరి ప్లాంట్ 2019లో మూతపడింది. సామ్సంగ్ ఫోన్లు, ఎల్రక్టానిక్ ఉత్పత్తులు ఎక్కువగా భారత్, దక్షిణ కొరియా, వియత్నాం, బ్రెజిల్‌లోనే తయారవుతున్నాయి. భారత్‌లోనే తయారు చేస్తారా? మీ ఇష్టం.. యాపిల్ కంపెనీకి ట్రంప్ మరోసారి అల్టిమేటం జారీ చేశారు. ‘‘ఐఫోన్ల తయారీ ప్లాంట్లను చైనా నుంచి భారత్‌కు తరలించుకోవాలంటే తరలించుకోండి. మేము వద్దనడం లేదు. కానీ, ఐఫోన్లను అమెరికాలో విక్రయించుకోవాలంటే మాత్రం సుంకాలు చెల్లించాల్సిందే. సుంకాలు లేకుండా మీరు ఐఫోన్లు ఇక్కడ అమ్ముకోలేరు’’అని పేర్కొన్నారు.

427 మంది రోహింగ్యాల జల సమాధి
బ్యాంకాక్: మయన్మార్ ముస్లిం మైనారిటీ వర్గం రోహింగ్యాలు ప్రయాణిస్తున్న పడవలు మునిగి 427 మంది మృతి చెందినట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థి విభాగం (యూఎన్‌హెచ్‌సీఆర్) తెలిపింది. ఈ నెల 9, 10వ తేదీల్లో మయన్మార్ తీరానికి సమీపంలో ఈ దారుణ విషాదం చోటుచేసుకుందని పేర్కొంది. పడవల మునకకు కారణాలు, కచ్చితంగా ఎందరు జల సమాధి అయ్యారనే వివరాలను తెలుసుకునేందుకు కృషి కొనసాగుతోందని వివరించింది. ఈ నెల 9వ తేదీన పడవ మునిగి 267 మంది ప్రాణాలు కోల్పోగా అందులోని కేవలం 66 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని, 10వతేదీన మరో పడవ మునగ్గా 247 మంది రోహింగ్యాలు చనిపోగా, 21 మంది మాత్రమే ప్రాణాలు దక్కించుకున్నారని యూఎన్‌హెచ్‌సీఆర్ వివరించింది. సజీవులైన వారు బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్లో ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరానికి, మయన్మార్‌లోని రఖైన్ ప్రాంతానికి తిరిగి వెళ్లిపోయారని పేర్కొంది.

కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌పై కుట్ర!
పారిస్: ఫ్రాన్స్‌లో ప్రతిష్టాత్మక కాన్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతున్న సమయంలోనే గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం నిర్వాహకులను ఆందోళనకు గురిచేసింది. దక్షిణ ఫ్రాన్స్‌లోని అల్పిస్–మారిటైమ్స్ ప్రాంతంలో శనివారం ఉదయం 1.60 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఇదే ప్రాంతంలో కాన్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతోంది. కరెంటు లేకపోవడంతో కొన్ని కార్యక్రమాలు రద్దు చేయాల్సి వచ్చింది. అధికారులు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించడంతో ఫిలిం ఫెస్టివల్ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. సాయంత్రం ఫిలిం ఫెస్టివల్ ముగింపు వేడుకలు యథాతథంగా జరిగాయి. కరెంటు సరఫరా హఠాత్తుగా ఆగిపోవడానికి కారణం ఏమిటన్న దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం రాత్రి కాన్స్ సమీపంలోని ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. దీనివల్ల విద్యుత్ గ్రిడ్‌లో సమస్యలు తలెత్తాయి. హై–ఓల్టేజీ కరెంటు లైన్ ఒకటి కూలిపోయిందని విద్యుత్ శాఖ సిబ్బంది చెప్పారు. దీనివల్ల అల్పిస్–మారిటైమ్స్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. అయితే, ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం జరగడం వెనుక కుట్ర ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టినట్లు అనుమానిస్తున్నారు. కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు అంతరాయం కలిగించాలన్న ఉద్దేశంతోనే ఈ కుట్ర జరిగినట్లు అంచనా వేస్తున్నారు.

‘రాజీనామా చేస్తానని ఆయన చెప్పలేదే!’
ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్(Muhammad Yunus) వైదొలుగుతారనే ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. ఈ మేరకు యూనస్ మంత్రివర్గ సలహాదారు శనివారం అధికారికంగా ప్రకటన చేశారు. ‘‘బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనసే కొనసాగుతారు. ఆయనేం రాజీనామా చేస్తానని చెప్పలేదు కదా. ఆ వార్తలు కేవలం అసత్య ప్రచారాలే’’ అని స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే.. దేశంలో రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడం వల్లే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని ఇంగ్లీష్ మీడియా హౌజ్‌లు తాజాగా కథనాలు ఇచ్చాయి. ఇదే విషయాన్ని నేషనల్ సిటిజన్ పార్టీ (NCP) చీఫ్ నహిద్ ఇస్లామ్ సైతం ధృవీకరించడంతో ఆయన పదవి నుంచి దిగిపోవడం ఖాయమనే చర్చ నడిచింది.మరోవైపు.. బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్‌కి యూనస్ ప్రభుత్వానికి పొసగడం లేదు. సైనిక వ్యవహరాల్లో యూనస్ నిర్ణయాలు తీసుకోవడంపై వకార్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తోంది. 2026 జూన్‌లో ఎన్నికలు జరుగుతాయని యూనస్ ప్రకటన చేయగా.. అందుకు విరుద్ధంగా ఈ ఏడాది డిసెంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని వకార్ పట్టుబడుతున్నారు.
జాతీయం

పాక్‌కు రహస్య సమాచారాన్ని చేరవేస్తున్న వ్యక్తి అరెస్ట్
అహ్మదాబాద్: గుజరాత్‌లోని మిలటరీ సంస్థల కీలక సమాచారాన్ని పాకిస్తాన్ గూఢచార విభాగాలకు చేరవేస్తున్న సరిహద్దుల్లోని కచ్ జిల్లా వాసిని పోలీసులు అరెస్ట్ చేశారు. లఖ్‌పత్ ప్రాంతానికి చెందిన సహదేవసిన్హ్ గోహిల్(28) కాంట్రాక్టు ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్నాడు. 2023లో ఇతడికి అదితి భరద్వాజ్ పేరుతో పాకిస్తాన్ ఏజెంట్ వాట్సాప్ ద్వారా పరిచయమైంది. తరచూ చాటింగ్ చేస్తూ అతడిని బుట్టలో వేసుకుంది. గోహిల్ తన ఆధార్ కార్డుతో తీసుకున్న రెండు సిమ్ల ఓటీపీలను ఆమెకు పంపాడు. దీంతో, ఆమె పాకిస్తాన్ నుంచి ఆ నంబర్లతో వాట్సాప్ చాటింగ్ సాగిస్తోంది. ఆమె కోరిన విధంగా, తనుండే ప్రాంతంలోని బీఎస్ఎఫ్, నేవీల మౌలిక వసతులతోపాటు నిర్మాణంలో ఉన్న వాటికి సంబంధించిన కీలక సమాచారాన్ని, ఫొటోలను పంపాడు. బదులుగా గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఇతడికి రూ.40 వేల నగదు అందింది. విషయం పసిగట్టిన గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) ఇటీవల గోహిల్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అదితి భరద్వాజ్ పాకిస్తాన్ గూఢచారి అనే విషయం గోహిల్‌కు తెలుసునని ఏటీఎస్ శనివారం వెల్లడించింది. ఇతడితోపాటు పాక్ ఏజెంట్ అదితి భరద్వాజ్పైనా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపింది.

COVID-19: తేలికపాటివిగా అత్యధిక కేసులు.. గృహ సంరక్షణలో చికిత్స
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నమోదైన కోవిడ్-19 కేసుల్లో అత్యధిక భాగం స్వల్ప లక్షణాలు కలిగినవేనని, బాధితులు గృహ సంరక్షణలో చికిత్స పొందుతున్నారని ఉన్నతవైద్యాధికార వర్గాలు తెలిపాయి. కోవిడ్-19(COVID-19) కేసులకు సంబంధించి కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శనివారం ఆరోగ్య పరిశోధన శాఖ కార్యదర్శి (డీహెచ్ఆర్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డీసీహెచ్ఎస్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) డైరెక్టర్ జనరల్‌తో సమీక్షించారు.కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అత్యధిక భాగం తేలికపాటివి, గృహ సంరక్షణలో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇటీవల సింగపూర్, హాంకాంగ్ తదితర దేశాల్లో కోవిడ్-19 కేసుల పెరుగుదలకు సంబంధించి ఈ సమీక్షలో చర్చించారు. కేసుల విషయంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Union Ministry of Health) అప్రమత్తంగా ఉందని, బహుళ ఏజెన్సీల ద్వారా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో కొత్తగా కోవిడ్-19 వేరియంట్ ఎన్బీ.1.8.1కు చెందిన ఒక కేసు, ఎల్‌ఎప్.7కి చెందిన నాలుగు కేసులను గుర్తించారు.తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఎల్ఎఫ్.7, ఎన్బీ.1.8 సబ్వేరియంట్లను ‘వేరియంట్స్ అండర్ మానిటరింగ్’ (వీయూఎం)లుగా వర్గీకరించింది. వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ (వీఓసీ) లేదా వేరియంట్స్ ఆఫ్ ఇంటరెస్ట్ (వీఓఐ)గా పేర్కొంది. చైనా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో కోవిడ్-19 కేసుల పెరుగుదలకు కారణమైన వేరియంట్లు ఇవేనని వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం అత్యంత సాధారణ వేరియంట్ జేఎన్.1 వ్యాప్తిలో ఉంది. తరువాత బీఏ.2 (26శాతం), ఇతర ఓమిక్రాన్ సబ్‌లైనేజ్‌లు (20శాతం) ఉన్నాయి.మే 19 నాటికి దేశంలో 257 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఢిల్లీలో గత 24 గంటల్లో 23 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు, తెలంగాణలో ఒకటి నిర్ధారితమయ్యాయి. బెంగళూరులో తొమ్మిది నెలల చిన్నారికి పాజిటివ్‌గా తేలింది. కేరళలో మే నెలలోనే 273 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో తీవ్రమైన డయాబెటిస్తో బాధపడుతున్న కోవిడ్-19 రోగి అనారోగ్య కారణాలతో మృతిచెందాడు. తాజాగా ముంబైలో ఎనిమిది కొత్త వైరల్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి.ఇది కూడా చదవండి: ఇస్రో రాకెట్ 7 నిమిషాల్లోనే విఫలం.. పరిశీలనకు కమిటీ

చివరకు.. లవర్‌తోనే పెళ్లి
యశవంతపుర(కర్ణాటక): తాళి కట్టే సమయంలో, ఈ పెళ్లి వద్దని రచ్చచేసిన పల్లవి అనే వధువు.. చివరకు పంతం నెగ్గించుకుంది. శుక్రవారం హాసన్‌లో ఆదిచుంచనగిరి కళ్యాణ మండపంలో వరుడు వేణుగోపాల్ తాళి కట్టే సమయంలో వధువు వద్దని చెప్పడంతో రభస జరిగింది. తాను రఘు అనే యువకున్ని ప్రేమించానని, అతనినే పెళ్లాడతానని పల్లవి తెగేసి చెప్పింది. ఎంతమంది నచ్చజెప్పినా వినలేదు. పెద్ద గొడవే చెలరేగింది. దీంతో వరుడు, బంధుమిత్రులు అందరూ ఉసూరంటూ వెళ్లిపోయారు. ఆమె ప్రియుడు రఘుకు కాల్ చేసి పిలిపించింది. కుటుంబసభ్యుల సమక్షంలో పల్లవి తాళి కట్టించుకుంది. అదే మండపంలో సాదాసీదాగా ఈ తంతు జరిగింది. సినిమా కథను తలదన్నే ఈ వివాహం హాసన్‌లో హాట్ టాపిక్ అయ్యింది.

‘భర్తల ప్రాణాల కోసం వేడుకోకుండా.. ఉగ్రవాదులపై తిరగబడాల్సింది’
భివానీ: పహల్గాం ఉగ్ర దాడిపై బీజేపీ నేతల నోటిదురుసు తగ్గడం లేదు. మంత్రుల స్థాయి నేతలే మతిలేని వ్యాఖ్యలు చేసి కోర్టులతో మొట్టికాయలు తింటున్నా కనువిప్పు కలగడం లేదు. పహల్గాం దాడిలో మహిళల కళ్లముందే వారి భర్తలను ముష్కరులు కర్కశంగా కాల్చి చంపడం తెలిసిందే. అలా సర్వం కోల్పోయి వితంతువులుగా మిగదిలిన వారినుద్దేశించి హరియాణాకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు రాంచందర్ జంగ్రా శనివారం దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.బీజేపీ ఎంపీ రాంచందర్ జంగ్రా తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘భర్తలను చంపొద్దని ఉగ్రవాదులను వేడుకునే బదులు వారిపై తిరగబడాల్సింది. కానీ వారిలో యోధుల స్ఫూర్తి లోపించింది. ఉగ్రవాదులకు చేతులు జోడించారు. పర్యాటకులంతా అగ్నివీరుల్లాగా వారిని ప్రతిఘటిస్తే ప్రాణనష్టం బాగా తగ్గేది’ అంటూ కామెంట్స్ చేశారు. రాణీ అహల్యాబాయి మాదిరిగా మన సోదరీమణుల్లో సాహస స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరముందంటూ హితోక్తులు పలికారు. జంగ్రా వాచాలతపై రాజకీయ దుమారం రేగుతోంది. ఆయన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమంటూ కాంగ్రెస్ నేతలు దీపీందర్‌సింగ్ హుడా, సుప్రియా శ్రీనేత్, సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ తదితరులు మండిపడ్డారు.महिलाओं का उपहास उड़ाना तो बीजेपी का कर्म और धर्म दोनों बन चुका है।इसी क्रम में भाजपा के सांसद रामचंद्र जांगरा देश के गृहमंत्री की विफलता का ठीकरा शहीदों की पत्नी के सिर फोड़ना चाह रहे हैं।उनका कहना है कि उन महिलाओं को भी साथ में शहीद हो जाना चाहिए था।pic.twitter.com/vL2x97ePQU— Uttar Pradesh Congress Sevadal (@SevadalUTP) May 25, 2025ఇదిలా ఉండగా.. ఇటీవలే భారత సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీపై బీజేపీ నేత, మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. విజయ్ షా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘వాళ్లు (ఉగ్రవాదులు) మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసి వితంతువుల్ని చేశారు. వాళ్ల (ఉగ్రవాదుల) మతానికి చెందిన సోదరిని సైనిక విమానంలో మోదీజీ పాక్‌కు పంపించి పాఠం నేర్పించారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తించాయి. ఆయన మంత్రి పదవిపై వెంటనే వేటువేయాలని కాంగ్రెస్ నేతలు ప్రధానికి విజ్ఞప్తిచేశారు. అనంతరం, జరిగిన పరిణామాల తర్వాత సదరు మంత్రి తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. అది ‘భాషా పరమైన తప్పిదమే’ తప్ప ఏ మతాన్నీ కించపరచాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఇండియన్ ఆర్మీకి, సోదరి కర్నల్ సోఫియా ఖురేషీకి, యావత్ దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నట్లు ఓ వీడియోను విడుదల చేశారు.
ఎన్ఆర్ఐ

జార్ఖండ్‌లో శంకర నేత్రాలయ MESU ఆధ్వర్యంలో కంటి శస్త్రచికిత్స శిబిరాలు
శంకర నేత్రాలయ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఆధ్వర్యంలో జార్ఖండ్‌లో రెండు కంటి శస్త్రచికిత్స శిబిరాలు విజయవంతంగా నిర్వహించారు. గిరిధీహ్ జిల్లాలోని బొగ్గు , మైకా తవ్వకాల మధ్యన , గ్రామీణ ప్రాంతమైన గాండాలే ఈ శిబిరం గురించి అవగాహన కల్పించారు. ఉచిత కంటిదృష్టి పరీక్షలు , ముత్యబిందు శస్త్రచికిత్సలు నిర్వహించారు.దేశంలోని అత్యంత వెనుకబడిన, మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోగులకు నాణ్యమైన కంటి వైద్యాన్ని అందించాలనే దృఢ సంకల్పంతో, అనుభవజ్ఞులైన వైద్యులు ,సహాయక సిబ్బందిని బస్సుల ద్వారా అక్కడికి పంపించాలన్న ఆలోచనతో గొప్ప శంకర నేత్రాలయ స్థాపకుడు పద్మభూషణ్ డా. ఎస్.ఎస్. బద్రినాథ్ దూరదృష్టిని చూపించారు. ఆసుపత్రులకు చేరలేని ఆర్థికంగా బలహీనమైన గ్రామీణ ప్రజలకు, తమ స్వగ్రామంలోనే, ప్రయాణం లేకుండా, ఉచితంగా ప్రపంచ స్థాయి శస్త్రచికిత్సా సదుపాయాలు ఎమ్ఈఎస్యూలు అందిస్తున్నాయి. వీల్‌పై ఆపరేషన్ థియేటర్ అనే వినూత్న ఆవిష్కరణ ద్వారా, అన్నివిధాలా అవసరమైన సాంకేతిక సామగ్రితో కూడిన శస్త్రచికిత్సలు ఎంతో అవసరమైన వారికీ అద్దెనైనా లేకుండా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది కేవలం వైద్యసేవ మాత్రమే కాదు-ఇది ఒక జీవితాంతం గుర్తుండిపోయే దాతృత్వం అని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!ముగింపు రోజు, అన్ని SN సిబ్బంది, స్కూల్ టీచర్స్, వాలంటీర్లకు గుర్తింపు ప్రదానం చేశారు. పిల్లల పాఠశాల వారు క్యాంప్ స్క్రీనింగ్ నిర్వహించేందుకు , 9 రోజులు క్యాంప్‌కు ప్రదేశం అందజేసేందుకు సహాయం చేసినందుకు బాక్సా ట్రస్ట్ RO వాటర్ ఫిల్టరింగ్ సిస్టమ్‌ను పాఠశాలలో ఏర్పాటు చేశారు. శంకర నేత్రాలయ స్పాన్సర్లు కన్నన్ వెంకటేశ్వర్ (MESU జార్ఖండ్ క్యాంప్ #113), స్వర్నిమ్ కనత్ , కార్టీక్ రామకృష్ణన్ (MESU జార్ఖండ్ క్యాంప్ #114), మరియు స్థానిక ప్రాయోజకుడు బాక్సా ట్రస్ట్ వారు ఈ రెండు MESU క్యాంప్‌లు #113 మరియు #114లో వారి సేవలను అందించి, గ్రామీణ భారతదేశంలో కంటి అనారోగ్యాన్ని నివారించడానికి మరొక అడుగు ముందుకేశారు.బాల రెడ్డి ఇందుర్తి శంకర నేత్రాలయ చైర్మన్ డాక్టర్ ఎస్. సురేంద్రన్, అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావు, జనరల్ మేనేజర్ సురేష్ కుమార్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు కౌశిక్ అదికారి, ఉజ్జల్ సిన్హా మరియు సంకర నేత్రాలయ USA వ్యవస్థాపకుడు శ్రీ SV ఆచార్య, EVP శ్యామ్ అప్పలి, సెక్రటరీ వంశీ ఎరువరం, ట్రస్టీ మెహర్ లంకా వారి మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ. సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు గారికి ఈ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాధాలు తెలియజేశారు.

డబ్లిన్‌లో శ్రీవాసని కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు
శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో విశ్వరూపిణి, శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, లలితా మహా పరాభట్టారిక స్వరూపిణి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించు కొని వైశాఖ శుద్ధ దశమి నాటి ఉత్సవాన్ని వారాంతంలో స్థానిక VHCCI ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి అభిషేకాన్ని శివకుమార్, మాధవి దంపతుల సహకారంతో నిర్వహించారువిద్యనాథ్ రజిత, కళ్యాణ్ ఇనిస్ దంపతుల సహకారంతో అమ్మవారికి విశేషమైన పుష్పాలంకరణ వస్త్రాలంకరణ సేవలు నిర్వహించారు. అలాగే శీతల్ కుమార్, వర్షిణి దంపతుల ప్రోత్సాహంతో అమ్మవారికి పల్లకి సేవ నిర్వహించారు, పవన్ కుమార్ సహకారంతో శాస్రోక్తంగా ఏంతో విశేషమైన గోపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలకి కుమారి పూజ నిర్వహించారు, శ్రీనివాస్, సరిత సంతోష్ విన్య దంపతులు కన్యలందరికి బహుమతులు తాంబూలాలతో సత్కరించి ఆశీర్వచనం అందుకొన్నారు, తదుపరి మహిళలందరూ అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి సహకారం అందించిన జ్ఞాన ప్రకాష్, మహాలక్ష్మి దంపతులను పినాక శర్మ ప్రత్యేక వైదిక ఆశీర్వచనం అందజేశారు. తదుపరి శిరీష, కవిత, రేణుక తదితరుల ఆధ్వర్యంలో అమ్మవారి విశేష పారాయణ కార్యక్రమం నిర్వహించారు.అటుపిమ్మట అమ్మవారికి ఆణివారం నిర్వహించారు, ఈ కార్యక్రమాలకు స్థానిక వ్యాపార సంస్థలైన డెస్టినీ ఐర్లాండ్, టీం దుకాణ్, తాలి రెస్టారెంట్, ఇండియన్ వైబ్ రెస్టారెంట్, TEST TRIANGLE మొదలగు వారందరు సహకరించిన ఈ సాంస్కృతిక కార్యక్రమానికి వ్యాఖ్యానకర్తలుగా చిరంజీవి లక్ష్మి హాసిని , శ్రీమతి మౌనిక నడిపించారు. చిన్నపిల్లలు ఏంతో ఉత్సాహంగా అన్నమాచార్య కీర్తనలు, అమ్మవారి పాటలు,నృత్య కళాప్రదర్శనాలతో సభికులందరిని భక్తిపారవశ్యంలో నింపారు. పిల్లలందరికీ పినాక శర్మ ప్రత్యేక ఆశీర్వచనం అందించారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండికార్యక్రమంలో చివరిగా అమ్మవారి ప్రసాద వితరణ మరియు బోజనవిందు కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి శ్రీకిరణ్, నీరజ, శ్రీనివాస్ సుధా, ఝాన్సీ, శ్రీనివాస్, శిరీష, రఘు, కవిత, వెంకట్ జూలూరి తదితరులందరు సహాయ సహకారాలను అందించారు.చివరిగా అపూర్వ చారిటీ సంస్థ తరుపున ప్రవీణ్ నూతనంగా నిర్మించబోయే హిందూ దేవాలయం గురించి ,అందులో వాసవి అమ్మవారికి కూడా ఉపాలయం ఉంటుందని చెప్పగా, జయంతి కార్యక్రమ నిర్వాహుకుల్లో ప్రధానంగా నిలిచిన నరేంద్ర కుమార్ గారు మాట్లాడుతూ ధార్మిక కార్యక్రమాలకు మనవంతు సహాయం చేసి మన ధర్మాన్ని ప్రపంచ నలుమూలల నిలబెట్టాలని, స్వీయ సంపాదనలో కొంతమొత్తం ప్రతిఒక్కరు ధార్మిక సేవకు వినియోగించాలని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన సంతోష్, శ్రీనివాస్ వెచ్చ, భార్గవ్, మాణిక్, కళ్యాణ్, రేణుక, మన్మోహన్, శివ, హేమంత్, జయరాం, తృప్తి, కావ్య, సాగర్, మాధురి లకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

శంకర్ సుబ్రమోనియన్ తో SNUSA 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమం
వాషింగ్టన్: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం, ప్రముఖ దాత, IIT మద్రాస్ పూర్వ విద్యార్థి శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారిని సత్కరించేందుకు 2025 ఏప్రిల్ 26న (శనివారం) ఒక ప్రత్యేకమైన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది.శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారు అట్లాంటా నివాసితులు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే భావనతో, అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, అనేక సంస్థలకు ప్రోత్సాహక దాతగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధన కేంద్రాలను స్థాపించడంలో మరియు కొనసాగించడంలో ఆయన పాత్ర విలువైనదిగా నిలిచింది.2022 లో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ బ్రున్స్విక్ వారు శ్రీ శంకర్ గారిని "ఇంజినీరింగ్ వాల్ ఆఫ్ ఫేమ్"లో చేర్చి సత్కరించారు. 2024 సెప్టెంబర్‌లో, IIT మద్రాస్ పూర్వ విద్యార్థుల సహకారంతో, డయాబెటిస్‌పై పరిశోధన కోసం "శంకర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" ను స్థాపించారు. ఇది ఎమోరీ యూనివర్సిటీ యొక్క గ్లోబల్ డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్ (EGDRC) తో భాగస్వామ్యంలో పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న మధుమేహ సమస్యకు శాస్త్రీయ పరిష్కారాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కేంద్రం ప్రారంభించబడింది.తమ సొంత ఊరైన ఎట్టాయపురం, తమిళనాడులోని గ్రామీణ ప్రాంత ప్రజల కోసం $350,000 విరాళం అందించి, మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఏర్పాటు చేయడంలో శ్రీ శంకర్ గారు ముఖ్యపాత్ర పోషించారు. ఇది శంకర నేత్రాలయకు ఐదవ MESU యూనిట్ కాగా,2025 ఆగస్టులో ఇది పూర్తిగా సిద్ధమై తమిళనాడు మరియు కేరళకు సేవలు అందించనుంది. ఈ యూనిట్ ద్వారా ప్రతి సంవత్సరం 80 కన్ను శిబిరాలు నిర్వహించగలగడం వల్ల అనేకమందికి వెలుగు పంచే అవకాశం లభించనుంది.ఈ సందర్భంగా శ్రీ శంకర్ గారి కుటుంబ సభ్యులు — శ్రీమతి లక్ష్మీ శంకర్, కుమార్తె అంబికా శంకర్, కుమారుడు అశోక్ కుమార్ మరియు మనవడు — కార్యక్రమానికి హాజరయ్యారు.SNUSA అధ్యక్షుడు మరియు "శంకర రత్న" అవార్డు గ్రహీత శ్రీ బాలా ఇందుర్తి గారు, శ్రీ శంకర్ గారిని ఘనంగా సత్కరించి,SNUSA యొక్క బ్రాండ్ అంబాసడర్‌గా ఆయనను ప్రకటించారు. ఈ సందర్భంగా, వారి మానవతా దృక్పథానికి, లక్షలాది మంది కళ్లల్లో వెలుగు నింపాలనే శంకర నేత్రాలయ ఆశయానికి ఆయన అందిస్తున్న మద్దతుకు SNUSA తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపబడింది.ప్రస్తుతం శంకర నేత్రాలయ గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ యూనిట్ల ద్వారా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు భారత ప్రభుత్వం నుండి అధికారికంగా అనుమతి పొందిన ఏకైక సంస్థ. ఇతర క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా సమీపంలోని శంకర నేత్రాలయ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా అందించబడుతున్నాయి.ఈ కార్యక్రమాన్ని SNUSA అధ్యక్షుడు శ్రీ బాలా ఇందుర్తి, కోశాధికారి శ్రీ మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీనీ వంగిమల్ల, మెహర్ లంకా, డా. మాధురి నాముదూరి, సాంస్కృతిక విభాగం నీలిమ గడ్డమనుగు, క్రీడా విభాగం రమేష్ చాపరాల, MESU “అడాప్ట్-ఎ విల్లేజ్” చైర్ డా. కిశోర్ రాసమళ్ళు, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తాడికమల్లా, మీడియా చైర్ గిరి కోటగిరి, మరియు సభ్యులు శ్రీధర్ జూలపల్లి, పాడి రావు అట్మూరి, మరియు అట్లాంటా చాప్టర్ నాయకులు శ్రీనివాస్ దుర్గం, రామ్ దుర్వాసుల, శిల్ప ఉప్పులూరి, డా. జనార్ధన్ పన్నెల, రామరాజు గదిరాజు, వెంకీ నిలం, సందీప్ కౌత, దుర్గ గోరా, బిజు దాస్, మరియు యువత విభాగం చరిత్ర జూలపల్లి గారు కలిసి విజయవంతంగా నిర్వహించారు. సింగపూర్ నుండి శ్రీ రత్నకుమార్ కవుటూరు గారు మీడియా విభాగంలో ఎనలేని సేవలందిస్తున్నారని బాలగారు తన ప్రసంగంలో పేర్కొన్నారుఈ వేడుకలో మేటి నాట్య కళాకారులు — రేవతి కోమందూరి, శశికల పెనుమర్తి, నీలిమ గడ్డమనుగు, సోబియా కిషన్, జసోథ బాలసుబ్రమణ్యం — నేతృత్వంలో భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాధవి ఉప్పులూరి మరియు ఉష మోచెర్ల లలిత సంగీతంతో పాటు, స్థానిక గాయనీ గాయకులు, జసోథ బాలసుబ్రమణ్యం విద్యార్థుల వాయిలిన్ వాయిద్య ప్రదర్శన కూడా ఆధ్యాత్మికతతో కూడిన మూడ్‌ను ఏర్పరిచిందివేదికపై శ్రీ శంకర్ గారు $350,000 చెక్కును SNUSA కోశాధికారి మూర్తి రేకపల్లి గారికి అందజేశారు,SN బృందం మరియు పూజారుల సమక్షంలో. కార్యక్రమం ప్రారంభం లో అట్లాంటా హిందూ టెంపుల్ ప్రధాన పూజారి శ్రీ గోపాల్ భట్టార్ మరియు నలుగురు పూజారులు వేద మంత్రాలతో దీపప్రజ్వలన చేశారు మరియు శంకర నేత్రాలయ సేవా మార్గానికి ఆశీర్వచనాలు అందించారు.కార్యక్రమం ముఖ్య అతిథులుగా డా. కిషోర్ చివుకుల (బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ - ఆబర్న్, అలబామా), శ్రీ శ్యామ్ అప్పలి (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - లాస్ ఏంజలిస్), శ్రీ అధి మొర్రెడ్డి, శ్రీమతి రేఖా రెడ్డి (ఫీనిక్స్, AZ), శ్రీమతి భాను రామకృష్ణన్ (వాషింగ్టన్ DC), డా. కేశవ్ భట్ (రాలీ,NC), మరియు ఇతరులు పాల్గొన్నారు. మెహర్ లంకా కార్యక్రమ స్థల ఎంపిక మరియు అతిథుల ఆతిథ్య ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారు. నీలిమ గడ్డమనుగు పూజారులు, కొరియోగ్రాఫర్లు, గాయనీ గాయకులు మరియు అలంకరణ బృందంతో సమన్వయం చేసారు.ఈ సమావేశానికి హాజరైన ప్రముఖులు మరియు MESU దాతలు: డా. బీకే మోహన్, డా. సుజాత రెడ్డి,కోమటి మోహన్ రెడ్డి, రవి పోనంగి, మురళి రెడ్డి, రవి కందిమల్ల, అమర్ దుగ్గసాని, బాలరామిరెడ్డి, శ్రీకాంత్ కొండా, కిరణ్ పాశం, ప్రభాకర్ రెడ్డి ఎరగం, అనిల్ జాగర్లమూడి, భరత్ మదాడి, వంశీ మదాడి, తిరు చిల్లపల్లి, జగదీష్ చీమర్ల, నారాయణ రేకపల్లి, శీలా లింగం, అధి చిన్నతిమ్మ, గోపాల్ నాయర్, ఇందు నాయర్, ప్రవీణ్ ఆకుల, రవి గెల్లా, రాజ్ వుచాటు, రాఘవ తడవర్తి, కమల్ సాతులూరు, శ్రీరామ్ రెడ్డి పళ్ళా, మరియు డా. ప్రమోద్ రెడ్డి కైలా.ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించిన మాస్టర్స్ ఆఫ్ సెరిమనీ: శ్రీ విజు చిలువేరు మరియు శ్రీ శ్యామ్ అప్పలి . ఫోటో/వీడియో కవరేజ్: శ్రీ వెంకట్ కుట్టువా. ఫుడ్ : అచిస్ రెస్టారెంట్. ఓటు ఆఫ్ థ్యాంక్స్: శ్రీ శ్యామ్ అప్పలి. ఫోటో గ్యాలరీ: https://sankaranethralayausa.org/meet-n-greet-shankar-subramonian/index.htmlమరిన్ని వివరాల కోసం దయచేసి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి: www.SankaraNethralayaUSA.org

నాట్స్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో ఫుడ్ డోనేషన్
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో పనిచేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన నినాదానికి తగ్గట్టుగా పేద దేశాల్లో పిల్లల ఆకలి తీర్చేందుకు ముందడుగు వేసింది. రిచర్డ్సన్ నగరంలో నాట్స్ డల్లాస్ విభాగం, ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్స్ సంస్థతో కలిసి తెలుగు చిన్నారులతో ఫుడ్ డోనేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అత్యద్భుత సేవాస్ఫూర్తిని ప్రదర్శించారు. దాదాపుగా 30 మంది పిల్లలు, పది మంది పెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మొత్తం 105 బాక్సులు ప్యాక్ చేయబడి, 22,680 భోజనాలు సిద్ధం చేశారు. ఈ ప్రయత్నం ద్వారా 62 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పోషకాహారం అందించగలిగే ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి నాట్స్ పూర్వ అధ్యక్షులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బాపు నూతి , నాట్స్ డల్లాస్ చాప్టర్ జట్టు కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటిలు నాయకత్వం వహించారు. నిర్వాహకులుగా సౌజన్య రావెళ్ళ, పావని నున్న వ్యవహరించారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ అడ్వైజర్ సురేంద్ర ధూళిపాళ్ల ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి రాజేంద్ర మాదాల, రవి తాండ్ర , కిషోర్ నారె, సత్య శ్రీరామనేని మరియు డల్లాస్ చాప్టర్ జట్టు నుండి సుమతి మాదాల, శివ మాధవ్, బద్రి బియ్యపు, కిరణ్ నారె తదితరులు పాల్గొన్నారు. "ఒక చిన్న సహాయం ఒక జీవితాన్ని మారుస్తుంది" అనే నినాదంతో నాట్స్ సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని, పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించటానికి ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకి పెద్దలకి, దాతలకు నాట్స్ డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ మరియు శ్రావణ్ నిడిగంటిలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డాలస్ చాప్టర్ టీం, సలహాదారు బృందం సభ్యుల సహకారం వల్ల ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్రైమ్

రెండు దుర్ఘటనల్లో.. ఏడుగురు బలి!
చింతకొమ్మదిన్నె/సాక్షి, అమరావతి/పటమట (విజయవాడ తూర్పు): రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో శనివారం జరిగిన దుర్ఘటనల్లో ఏడుగురు మృత్యువాతపడ్డారు. వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించగా.. విజయవాడలోని ఓ అపార్ట్మెంట్లో కరెంట్ షాక్ ముగ్గురు బలయ్యారు. వివరాలివీ.. కారుపైకి లారీ దూసుకొచ్చి.. వైఎస్సార్ జిల్లా బద్వేలు ప్రాంతానికి చెందిన బసినేని శ్రీకాంత్‌రెడ్డి, బి. కోడూరుకు చెందిన కోగటం తిరుపతిరెడ్డి కుటుంబాలు బెంగళూరులో ఉంటున్నాయి. వీరిలో శ్రీకాంత్‌రెడ్డి బెంగళూరులో.. తిరుపతిరెడ్డి జర్మనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. తిరుపతిరెడ్డి ఇటీవలే స్వదేశానికి వచ్చి వారం రోజుల కిందట తిరిగి జర్మనీకి వెళ్లాడు. ఈ క్రమంలో.. శ్రీకాంత్‌రెడ్డి (32), తన భార్య శిరీష (28), కుమార్తె త్రిషికారెడ్డి (3).. తిరుపతిరెడ్డి భార్య శశికళ (35), కుమార్తె సాయి హర్షిత (9), కుమారుడు రిషికేశవర్‌రెడ్డి (8), శశికళ సోదరి స్వర్ణ (38) కడప జిల్లా బద్వేలుకు శనివారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి బయల్దేరారు. సమీప బంధువులైన వీరంతా తమ స్వగ్రామం బద్వేలు మండలం చిన్న పుత్తాయపల్లెలోని శ్రీరాముల దేవాలయంలో జరిగే ఉత్సవంలో పాల్గొనేందుకు వస్తున్నారు. వీరి కారు కడప–చిత్తూరు జాతీయ రహదారిలో గువ్వలచెరువు ఘాట్.. చింతకొమ్మదిన్నె రోడ్డులో ఆంజనేయస్వామి గుడి వద్దకు వచ్చిoది. అదే సమయంలో ఎరువుల లోడుతో విల్లుపురం నుంచి హైదరాబాదుకు వెళ్తున్న లారీ వెనక నుంచి వేగంగా వచ్చి, కారుపైకి దూసుకెళ్లింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో శ్రీకాంత్‌రెడ్డి, శిరీష, రిషికేశవర్‌రెడ్డి, సాయిహర్షిత అక్కడికక్కడే మరణించారు. ప్రమాదాన్ని పసిగట్టి శ్రీకాంత్, శిరీషలు తమ కుమార్తె చిన్నారి త్రిషికారెడ్డిని కారు నుంచి బయటకు తోసేయగా మట్టి కుప్పలపై పడి గాయపడింది. చింతకొమ్మదిన్నె సీఐ శంకర్ నాయక్, డీటీఆర్బీ (డిస్ట్రిక్ట్ ట్రాఫిక్ రికార్డ్స్ బ్యూరో) సీఐ మహమ్మద్ బాబా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. క్రేన్ సాయంతో కారు, లారీని వేరుచేశారు. కారులో ఇరుక్కుపోయిన నాలుగు మృతదేహాలను బయటికి తీసేందుకు గంటన్నరసేపు శ్రమించాల్సి వచి్చంది. క్షతగాత్రులను కడప రిమ్స్‌కు తరలించి మెరుగైన వైద్యసేవలను అందిస్తున్నారు.దుస్తులు ఆరేస్తుండగా కరెంట్ షాక్.. విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని చంద్రబాబునాయుడు కాలనీ సాయిటవర్స్ అపార్ట్మెంట్లో కాకినాడు జిల్లా సామర్లకోటకు చెందిన చలాది రామదుర్గా ప్రసాద్ (55), రాధ (45) ఉంటున్నారు. ప్రసాద్ లారీడ్రైవర్‌గా పనిచేసేవారు. శనివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ప్రసాద్ చెల్లి ఊటుకూరి ముత్యావళి (42) ఇంటి ముందు ఇనుప తీగపై దుస్తులు ఆరేసేందుకు వెళ్లింది. కరెంట్ వైరు, కేబుల్ వైరు, దుస్తులు ఆరేసే తీగ అన్నీ కలిపి ఉన్నాయి. వర్షాలతో ఎర్త్‌వైర్‌కు విద్యుత్ సరఫరా అవడంతో తీగపై దుస్తులు వేయగానే ముత్యావళి విద్యుదాఘాతానికి గురై కేకలు వేసింది. ఆమెను రక్షించేందుకు వెళ్లిన ప్రసాద్, రాధ షాక్‌కు గురయ్యారు. ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. ఫ్లాట్ ఖాళీచేస్తున్న తరుణంలో.. కుటుంబ తగాదాల నేపథ్యంలో ప్రసాద్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌ను కోర్టు ఆదేశాలతో శుక్రవారం ఖాళీ చేయాల్సి ఉంది. ఇందుకోసం ముత్యావళి రెండ్రోజుల క్రితం కడియం నుంచి వచ్చింది. సామగ్రిని తరలించేందుకు అన్నీ సర్దుకుని మరికొన్ని గంటల్లో బయల్దేరుతారనగా ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరి ఇంట్లో లభించిన ఫోన్ నెంబర్ల ఆధారంగా రాజమహేంద్రవరంలోని వారి బంధువులకు పోలీసులు సమాచారమిచ్చారు. వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ప్రమాదం జరిగిన ఇంటికి వెళ్లి స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

రచ్చకెక్కిన డాక్టర్‌బాబు కాపురం
ఆయన వృత్తిరిత్యా వైద్యుడు. సంఘంలో మంచి పేరుతో గౌరవ మర్యాదలు అందుకుంటూ వస్తున్నాడు. ఉన్నట్లుండి.. షాకింగ్ అవతారంలో ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వెంటనే ఆయనగారి భార్య ఇచ్చిన ‘గే’ స్టేట్మెంట్ అందరినీ నోళ్లు వెళ్లబెట్టేలా చేసింది.ఉత్తర ప్రదేశ్ సంత్ కబీర్ జిల్లాలో ప్రభుత్వ వైద్యుడైన డాక్టర్ వరుణేష్ దుబే(Doctor Varunesh Dubey) కాపురం రచ్చకెక్కింది. తన భర్త స్వలింగ సంపర్కుడని, మహిళా వేషధారణతో మగవాళ్లతో నీలి చిత్రాల్లో నటిస్తున్నాడని, ఆపై వాటిని అమ్మి డబ్బు సంపాదిస్తున్నాడని భార్య సింపీ పాండే(simpy pandey) సంచలన ఆరోపణలకు దిగింది.‘‘నా భర్త నన్ను గోరఖ్‌పూర్ నివాసంలో వదిలేశాడు. తనకు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్‌లో ఉంటూ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. మహిళా వేషధారణలో మగవాళ్లతో కలిసి శృంగారంలో పాల్గొంటున్నాడు. ఆ వీడియోలను అమ్ముకుని డబ్బు సంపాదిస్తున్నాడు. కావాలంటే నా భర్త అశ్లీల చిత్రాలు ఇంటర్నెట్లో ఉన్నాయి చూస్కోండి. దీనిపై గట్టిగా నిలదీసినందుకు నన్ను, నా సోదరుడ్ని చిత్రహింసలకు గురి చేశాడు అంటూ పోలీసులను ఆశ్రయించారామె.అదే సమయంలో భార్య చేసిన ఆరోపణలను డాక్టర్ వరుణేష్ ఖండించారు. తనకు అలాంటి గత్యంతరం పట్టలేదని, తన ఆస్తిని కాజేసేందుకు ఆమె పన్నిన పన్నాగమని కౌంటర్ ఇచ్చారాయన. ‘‘వృద్ధుడైన నా తండ్రిని నా భార్య మానసికంగా హింసించి చంపేసింది. ఆస్తి తన పేరిట రాయాలంటూ గత కొంతకాలంగా గొడవలు చేస్తోంది. చివరకు మా బిడ్డను కూడా చంపుతానంటూ బెదిరించింది. నా మీద, నా సోదరి మీద కిరాయి రౌడీలను పంపి దాడి చేయించింది. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు నిజం కాదు. నా ఫోన్‌ను హ్యాక్ చేసి ఆమె డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించింది. .. అయినా ఇలాంటి వాటిని నేను కుంగిపోయి అఘాయిత్యానికి పాల్పడను. నేను మగాడ్ని.. అమాయకుడ్ని. అది రుజువయ్యేదాకా ఎలాంటి పోరాటం అయినా చేస్తా’’ అని అంటున్నారాయన.భార్యభర్తల పరస్పర ఆరోపణలతో ఈ పంచాయితీ పోలీసులకు చేరింది. ఇరువురి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో కొసమెరుపు ఏంటంటే.. ఈ జంటది ప్రేమ వివాహం కావడం!.

భర్తతో విడిపోయేందుకు పసికందును చంపేసింది.. ...
దుబ్బాక(మెదక్): మావనత్వం మంటగలిసింది.. నవమాసాలు మోసి.. పేగు తెంచుకొని పుట్టిన రెండు మాసాల పసికందును ఆ కర్కశ తల్లి బావిలో వేసి కడతేర్చింది.. ఆపై తన బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారంటూ డ్రామాకు తెరలేపింది.. అనుమానం వచ్చిన పోలీసులు ఆ కర్కశ తల్లిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే బావిలో వేసి చంపానంటూ ఒప్పుకుంది. ఈ అమానుషమైన ఘటనకు సంబంధించి శుక్రవారం దుబ్బాక సీఐ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. సిద్దిపేట మండలం పుల్లూరుకు చెందిన రామగల శ్రీమాన్, నంగునూర్ మండలం నర్మెట్టకు చెందిన కవిత మూడేళ్ల కిందట ప్రేమ వివాహం చేసకున్నారు. వీరికి రెండు నెలల కిందట కుమారుడు పుట్టడటంతో దీక్షిత్ కుమార్ పేరు పెట్టారు. భర్త శ్రీమాన్ దొంగతనం కేసుల్లో రెండు సార్లు జైల్‌కు వెళ్లడం.. తనను సరిగ్గా చూసుకోకుండా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ రావడంతోపాటు తల్లిదండ్రులకు దూరం కావడంతో కవిత కొద్ది రోజులుగా మానసికంగా కుంగిపోతూ వస్తుంది. భర్తతో ఉండటం ఇష్టం లేక కవిత ఎలాగైనా వదిలించుకోవాలనుకుంది. పది రోజుల కిందట అత్తగారిల్లు పుల్లూరులో గొడవపడి శ్రీమాన్ అమ్మమ్మ గారింటికి దుబ్బాక మండలం అప్పనపల్లికి వచ్చారు. శ్రీమాన్ 17వ తేదిన పని నిమిత్తం రుద్రారం గ్రామానికి వెళ్లి అక్కడే ఉన్నాడు. భర్తతో ఉండటం ఇష్టం లేక ఎలాగైన వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఇందుకు రెండు నెలల పసికందు దీక్షిత్ అడ్డుగా ఉన్నాడని భావించి ఓ పథకాన్ని వేసింది.కిడ్నాప్ డ్రామా..ఈ నెల 21న మధ్యాహ్నం 2 గంటల సమయంలో దీక్షిత్‌ను బావిలో పడేసింది. ఏం తెలియనట్లుగా ఇద్దరు వ్యక్తులు వచ్చి తన బిడ్డను ఎత్తుకెళ్లారంటూ కిడ్నాప్ డ్రామా ఆడి తన భర్తతో కలిసి బుధవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె మాటలు, ప్రవర్తన పట్ల అనుమానం వచ్చి కవితను అదుపులోకి తీసుకొని విచారించగా తనకు భర్తతో ఉండటం ఇష్టం లేకనే పసికందును బావిలో వేసినట్లు తెలపడంతో గురువారం బావిలో గాలించి పసికందు మృతదేహాన్ని వెలికితీసినట్లు సీఐ తెలిపారు. ఈ వ్యవహారంలో శ్రీమాన్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కవితను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు పేర్కొన్నారు.

‘రాజస్థాన్ నేరం’ వెనుక లోకేంద్ర!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కాచిగూడకు చెందిన కార్టన్స్ ఫ్యాక్టరీ యజమాని హేమ్రాజ్ దుగ్గర్ ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న లోకేంద్ర బహదూర్ షాహి నేతృత్వంలోని ముఠా మరో నేరం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ పంజా విసరడానికి ఆరు నెలల ముందు ముంబైకి చెందిన ఓ బడా వ్యాపారి ఇంట్లో ఇదే పంథాలో 5 కేజీల బంగారం తస్కరించినట్లు ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు ఈ నెల 14 రాత్రి రాజస్థాన్‌లోని జైపూర్‌లో నివసించే కాంగ్రెస్ పార్టీ నేత సందీప్ చౌదరి ఇంట్లో రూ.6 కోట్ల సొత్తు దొంగతనానికీ ఇతడే సూత్రధారి అని ఆ పోలీసులు అనుమానిస్తున్నారు. దీన్ని ఖరారు చేసుకోవడానికి హైదరాబాద్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వ్యవస్థీకృతంగా లోకేంద్ర వ్యవహారాలు.. కొన్నేళ్ల క్రితం నేపాల్ నుంచి వసలవచ్చిన లోకేంద్ర వ్యవస్థీకృతంగా ఈ చోరీలు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడి వ్యాపారుల ఇళ్లల్లో పని చేస్తున్న నేపాలీల్లో కొందరితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా ఆయా వ్యాపారుల కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు తెలుసుకుంటున్నాడు. అదను చూసుకుని అప్పటికే పని చేస్తున్న వారి ద్వారానే, ఆ స్థానంలో మరో నేపాలీని పనిలో పెట్టిస్తున్నాడు. ఆపై తన ముఠాతో రంగంలోకి దిగి ఆ ఇంటిని కొల్లగొట్టిస్తున్నాడు. ముంబైకి చెందిన వ్యాపారి ఇంట్లో ఇదే పంథాలో ఐదు కేజీల బంగారం తస్కరించారు. గత నెల్లో కాచిగూడలోనూ ఇలానే భారీ చోరీకి పాల్పడ్డారు. ఇక్కడ ఇంట్లో ఉన్న ఇద్దరు వృద్ధులకు మత్తు మందు ఇచ్చి తమ పని కానిచ్చారు.వైశాలీ నగర్లోనూ .. జైపూర్‌లోని వైశాలీనగర్లో ఉన్న సందీప్ చౌదరి ఇంట్లోనూ ఇదే పం«థాలో నేరం జరిగింది. ఈ ఇంట్లో పని చేసే మహిళతో పాటు ఓ పురుషుడు అదను కోసం ఎదురు చూశారు. సందీప్ జైపూర్‌లో లేని విషయం గమనించి మరో ఇద్దరికి సమాచారం ఇచ్చారు. ఆయన కుటుంబీకులతో మత్తు మందు కలిపిన టీ తాగించారు. అంతా అపస్మారక స్థితిలో ఉండగా ఆ ఇద్దరితో పాటు మరొకరినీ రప్పించిన ఈ ద్వయం ఇంట్లో ఉన్న నగదు, బంగారం, వెండి, వజ్రాభరణాలతో సహా రూ.6 కోట్ల విలువైన సొత్తుతో ఉడాయించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ప్రత్యేక బృందం భరత్ బిస్త్, హరి బహదూర్ దామిలను అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. నిందితుల విచారణలో సరైన వివరాలు రాకపోవడంతో ఈ పంథాలో జరిగిన నేరాల వివరాలు ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే కాచిగూడ చోరీ వారి దృష్టికి వెళ్లింది. ఇక్కడా, అక్కడా ఒకేలా నేరం జరగడంతో జైపూర్ చోరీ వెనుకా లోకేంద్ర బహదూర్ షాహి పాత్రను అనుమానిస్తున్నారు. దర్యాప్తు కోసం వివరాలు కోరుతూ నగర పోలీసులను సంప్రదిస్తున్నారు.