Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Sunita Williams reveals what she will miss the most about space1
ఆ ‘మెరుపు’ను నాతోనే దాచుకుంటాను: సునీతా విలియమ్స్‌

అంతరిక్షంలో చిక్కుపోయి సుదీర్ఘ విరామం తర్వాత భూమి మీదకు రాబోతున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్.. తన అనుభవాలను మరోసారి పంచుకున్నారు. అంతరిక్షం నుంచే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆమె మాట్లాడారు. ‘ నేను, బుచ్ ఒక మిషన్ ను కంప్లీట్ చేసే క్రమంలో అంతరిక్షంలో అడుగుపెట్టాం. ఇక్కడ ఉన్నాన్నా‍ళ్లు ఒకరికొకరు సమన్వయంతో సహకారంతో పని చేశాం. మేము ఇక్కడ పరిస్థితుల్లో మార్పులు గమనించాం. ఇక్కడ మనం నివసించడం వల్ల ఒక ప్రత్యేకమైన థృక్పదం ఏర్పడుతుంది. ఇక్కడ నా సుదీర్గ ప్రయాణం ఒక స్ఫూర్తిగా మిగిలిపోతుంది. ఆ మెరుపును ఎప్పటికీ కోల్పోను. దాన్ని నాతోనే దాచుకుంటాను’ అని సునీతా విలియమ్స​ స్పష్టం చేశారు.సునీతా విలియమ్స్‌ అంతరిక్షంలోకి వెళ్లి నేటికి 284 రోజులు. అంటే సుమారు 9 నెలలకు పైగానే అయ్యింది. 2024 జూన్‌ 5న ఆమె అక్కడికి చేరుకున్నారు. తిరిగి జూన్‌ 12, 15 తేదీల్లో భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది కానీ రాలేదు! భూ కక్ష్యకు సుమారు 400 కి.మీ. ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐ.ఎస్‌.ఎస్‌.) సునీతను, ఆమె సహ వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌ను విజయవంతంగా మోసుకెళ్లిన ‘బోయింగ్‌ స్టార్‌లైనర్‌’ వ్యోమనౌక తీరా వారిని అక్కడ దింపేశాక, పని చేయటం మానేసింది! దాంతో కొన్ని నెలల పాటు వారు అంతరిక్షంలోనే ఉండిపోయారు.అంతరిక్షకేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. నాసా-స్పేస్‌ ఎక్స్‌లు చేపట్టిన క్రూ-10 మిషన్‌ ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం విజయవంతమైంది. ఇవాళ (ఆదివారం) ఉదయం 9:40 గంటలకు ఈ అనుసంధాన ప్రక్రియ జరిగినట్లు వెల్లడించిన నాసా.. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది.నాసా-స్పేస్‌ ఎక్స్‌లు చేపట్టిన క్రూ-10 మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.33 గంటలకు అమెరికాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఫాల్కన్‌ 9 రాకెట్‌ డ్రాగన్‌ క్యాప్సుల్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. సునీతా విలియమ్స్‍, బచ్ లు బుధవారం భూమ్మీదకు వచ్చే అవకాశం ఉంది. That’s good to hear! #SunitaWilliams returns to earth 🌎 https://t.co/RGUUmJh6lQ— Samina Shaikh 🇮🇳 (@saminaUFshaikh) March 16, 2025

Ap Coalition Government Borrowed Another Rs 11000 Crore2
మరో రూ.11వేల కోట్లు.. అప్పు చేసిన కూటమి ప్రభుత్వం

సాక్షి,విజయవాడ : కూటమి ప్రభుత్వం అమరావతి కోసం రూ.11 వేల కోట్లు అప్పు చేసింది. ఈ అప్పు మొత్తాన్ని మొత్తం అప్పు అమరావతిలో నిర్మాణాలకు ఖర్చు పెట్టనుంది.ఇక,రూ.11 వేల కోట్ల అప్పు కోసం హాడ్కోతో సీఆర్డీఏ ఒప్పందం కుదర్చుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ సమక్షంలో ఒప్పందం జరిగింది. ప్రపంచ బ్యాంకు ఋణానికి అదనంగా హడ్కో రుణం తీసుకుంది. రూ. 11 వేల కోట్లను అమరావతిలో పనులకు కూటమి ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

Electric vs Petrol Bike Which One Should You Choose3
పెట్రోల్ బైక్ vs ఎలక్ట్రిక్ బైక్: ఏది ఎంచుకోవాలి?

ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం పెట్రోల్, ఎలక్ట్రిక్ బైకులు మాత్రమే కాకుండా సీఎన్‌జీ బైక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే చాలామంది.. ఎలక్ట్రిక్ బైక్ కొనాలా? పెట్రోల్ బైక్ కొనాలా? అనే సందిగ్ధంలో పడుతుంటారు. ఈ కథనంలో దేనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.ఎలక్ట్రిక్ బైక్స్ప్రస్తుతం మార్కెట్లో దాదాపు ప్రతి కంపెనీ.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో బైకులను లాంచ్ చేస్తూనే ఉంది. పెట్రోల్ మోడల్స్‌తో పోలిస్తే.. ఎలక్ట్రిక్ బైకులకు మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ. అంతే కాకుండా ఇవి పర్యావరణ హితం కూడా. అంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఎలాంటి కాలుష్య కారకాలను వాతావరణంలోకి విడుదల చేయవు.ఎలక్ట్రిక్ వాహనాల్లో లిథియం అయాన్ బ్యాటరీ లేదా లిథియం అయాన్ పాస్ఫేట్ బ్యాటరీలు ఉంటాయి. ఇవి ఎక్కువ మన్నికను ఇస్తాను. సంస్థలు కూడా ఈ బ్యాటరీలపైన మంచి వారంటీ కూడా అందిస్తాయి. విద్యుత్ శక్తిని ఉపయోగించుకోవడం ద్వారా.. శిలాజ ఇంధన వినియోగం మాత్రమే కాకుండా కార్బన్ ఉద్గారాలు కూడా గణనీయంగా తగ్గుతాయి.ఇదీ చదవండి: తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులుపెట్రోల్ బైక్స్చాలా కాలంగా ఎక్కువమంది పెట్రోల్ బైకులనే ఉపయోగిస్తున్నారు. ఇంధనం అయిపోగానే.. వెంటనే ఫిల్ చేసుకోవడానికి లేదా నింపుకోవడానికి పెట్రోల్ బంకులు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎలాంటి ఆందోళన లేకుండా ఎక్కువ దూరం ప్రయాణించగల సామర్థ్యం ఈ పెట్రోల్ బైకులకు ఉంటుంది. ఈ కారణంగానే చాలామంది పెట్రోల్ బైకులను కొనుగోలు చేస్తుంటారు. పనితీరు పరంగా కూడా పెట్రోల్ బైకులు.. ఎలక్ట్రిక్ బైకుల కంటే ఉత్తమంగా ఉంటాయి.ఎలక్ట్రిక్ బైక్స్ ఎక్కువ కొనుగోలు చేయకపోవడానికి కారణంఇండియన్ మార్కెట్లో లెక్కకు మించిన ఎలక్ట్రిక్ బైక్స్ అందుబాటులో ఉన్నప్పటికీ.. చాలామంది పెట్రోల్ బైక్స్ కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతుంటారు. దీనికి ప్రధాన కారణం మౌలిక సదుపాయాలైన ఛార్జింగ్ స్టేషన్స్ కావలసినన్ని అందుబాటులో లేకపోవడం అనే తెలుస్తుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే.. ఛార్జింగ్ మధ్యలోనే ఖాళీ అవుతుందేమో అనే భయం కూడా ఎక్కువమంది కొనుగోలు చేయకపోవడానికి కారణం అనే చెప్పాలి.

Virat Kohli Unsatified On BCCI Family Restriction Rule4
బీసీసీఐ నిర్ణయంపై కోహ్లి అసంతృప్తి

బీసీసీఐ కొత్తగా ప్రవేశపెట్టిన కుటుంబ నియంత్రణ నిర్ణయంపై (విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలపై అంక్షలు) టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అసంతృప్తి వ్యక్తం చేశాడు. విదేశీ పర్యటనల్లో కుటుంబాలు దగ్గరగా లేకపోతే ఆటగాళ్లు మానసిక సమస్యలు ఎదుర్కొంటారని అన్నాడు. దీని ప్రభావం జట్టు జయాపజయాలపై పడుతుందని తెలిపాడు. కఠిన సమయాల్లో కుటుంబాలు వెంట ఉంటే ఆటగాళ్లకు ఊరట కలుగుతుందని పేర్కొన్నాడు. పర్యటనల్లో ఆటగాళ్లకు కుటంబాలు తోడుండటం​ ఎంతో ముఖ్యమో కొంతమందికి తెలియట్లేదని బీసీసీఐపై పరోక్షంగా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్‌లు ముగిశాక ఆటగాళ్లు ఒంటరిగా కూర్చొని బాధపడాలా అని ప్రశ్నించాడు. కుటుంబాలు దగ్గరగా ఉంటే ఆటగాళ్ల ప్రదర్శన మరింత మెరుగుపడుతుందని తెలిపాడు. ఐపీఎల్‌ 2025 ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్‌లో కోహ్లి ఈ విషయాలను పంచుకున్నాడు.కాగా, బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2024-25 పరాజయం తర్వాత బీసీసీఐ విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలపై నియంత్రణ విధించింది. ఈ మేరకు ఓ రూల్‌ను జారీ చేసింది. కుటుంబ నియంత్రణ రూల్‌ ప్రకారం.. 45 రోజుల కంటే తక్కువ వ్యవధి ఉండే విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలకు అనుమతి లేదు. 45 రోజుల కంటే ఎక్కువ నిడివితో సాగే విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలను రెండు వారాల తర్వాత అనుమతిస్తారు. మొత్తంగా కుటుంబాలు ఆటగాళ్లతో కేవలం 14 రోజులు మాత్రమే గడిపే అవకాశం ఉంటుంది.ఇదిలా ఉంటే, తాజాగా ముగిసిన ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భారత్‌ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో విరాట్‌ అద్భుతంగా ఆడి భారత్‌ మూడోసారి ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ అనంతరం కొద్ది రోజులు దుబాయ్‌లోనే సేద తీరిన విరాట్‌.. తాజాగా ఐపీఎల్‌ 2025 సీజన్‌ కోసం తన జట్టుతో చేరాడు. ఐపీఎల్‌లో విరాట్‌ ప్రాతినిథ్యం వహించే ఆర్సీబీ.. మార్చి 22న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌తో తమ జర్నీ ప్రారంభిస్తుంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఒక్క టైటిల్‌ కూడా గెలవని ఆర్సీబీ.. ఈ సాలా కప్‌ నమ్మదే అంటూ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.ఆర్సీబీ ఈ ఏడాది జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. గత రెండు సీజన్లు కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్‌ను తప్పించి కొత్త కెప్టెన్‌గా రజత్‌ పాటిదార్‌ను నియమించుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి టిమ్‌ డేవిడ్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, జేకబ్‌ బేతెల్‌, ఫిల్‌ సాల్ట్‌, రొమారియో షెపర్డ్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌ లాంటి విదేశీ స్టార్లు వచ్చారు. చాలా​కాలం పాటు తమకు సేవలందించిన హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను ఆర్సీబీ ఈ ఏడాది వదులుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి కృనాల్‌ పాండ్యా, దేవ్‌దత్‌ పడిక్కల్‌, భువనేశ్వర్‌ కుమార్‌ లాంటి దేశీయ స్టార్లు కూడా వచ్చారు. జట్టు మొత్తం మారడంతో తమ ఫేట్‌ కూడా మారుతుందని ఆర్సీబీ అభిమానులు ఆశిస్తున్నారు.ఐపీఎల్‌-2025లో ఆర్సీబీ జట్టు..రజత్‌ పాటిదార్‌ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, దేవ్‌దత్‌ పడిక్కల్‌, టిమ్‌ డేవిడ్‌, స్వస్థిక్‌ చికారా, కృనాల్‌ పాండ్యా, మనోజ్‌ భండగే, రొమారియో షెపర్డ్‌, స్వప్నిల్‌ సింగ్‌, జేకబ్‌ బేతెల్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, మోహిత్‌ రతీ, ఫిలిప్‌ సాల్ట్‌, జితేశ్‌ శర్మ, జోష్‌ హాజిల్‌వుడ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, లుంగి ఎంగిడి, రసిక్‌ సలాం దార్‌, సుయాశ్‌ శర్మ, యశ్‌ దయాల్‌, నువాన్‌ తుషార, అభినందన్‌ సింగ్‌

BJP Leader Maheshwar Reddy Slams CM Revanth5
‘సీఎం రేవంత్‌ ఏకపాత్రాభినయం చేస్తున్నారు’

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సెటైర్లు వేశారు. బీజేఎల్పీ కార్యాలయం నుంచి మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీల ఎగవేత, సమాధానాల దాటవేతల ప్రభుత్వమని మండిపడ్డారు. అదే సమయంలో రేవంత్ ఏకపాత్రాభినయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘రేవంత్ చేసిన ఏకపాత్రాభినయం నిన్న అసెంబ్లీలో చూశాం.. రేవంత్ కాలేజీ రోజుట్లో ఇలాంటి ఏకపాత్రాభినయం చేసినట్లున్నాడు. గవర్నర్ ప్రసంగంపై ప్రశ్నిస్తే.. ఎక్కడా సమాధానం చెప్కకుండా దాటవేశారు. జవాబులు చెప్పకుండా కేవలం ఎదురుదాడి చేయడమే కనిపించింది. పసలేని, స్కూలర్ లేని ఏకపాత్రాభినంయ మాత్రమే రేవంత్ చేశారు.శాసనసభలో 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తానని రేవంత్ హామీ ఇచ్చారు. ఏ హామీలు గెలిపించాయో.. ఆ గ్యారెంటిలకే చట్టబద్ధత లేకుండా పోయింది. సభ ఇంకా కొనసాగుతోంది. 6 గ్యారెంటీలు, ఇచ్చిన హామీలు, అభివృద్ధి అంశాలపై చర్చకు సిద్ధమా?, తెలంగాణ ప్రజలకు ముఖం చూపించలేని దుస్థితిలో రేవంత్ సర్కార్ ఉంది. అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయా? ఇంకా ఎవరైనా అడ్డుకుంటున్నారా అనేది చెప్పాలి. రుణమాఫీ పూర్తిచేశామని గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారు. నిర్మల్ లో ఏ గ్రామానికి వెళ్లినా సరే.. రుణమాఫీ పూర్తి అయిందని నిరూపిస్తే ఎంతటి శిక్షకైనా నేను సిద్ధమే. మేనిఫెస్టోలో పెట్టని ఫ్యూచర్ సిటీ, కొడంగల్ డెవలప్ మెంట్, మూసీ ప్రక్షాళన, హైడ్రా అంశాలను ఎందుకు ఎత్తుకున్నారు. లంకె బిందెల కోసమా?, మీ ఆస్థాన గుత్తేదారుల ప్రాజెక్టులకు రీ ఎస్టిమేషన్ వేసి ఇస్తున్న మీకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలియదా?, వారి జేబులు నింపే శ్రద్ధ పేదలకు మంచి చేసేందుకు పట్టింపు లేదా?, కాంగ్రెస్, బీఆర్ఎస్ డూప్ ఫైట్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ నేతను సభ నుంచి బహిష్కరించి దానిపై చర్చ డైవర్ట్ చేస్తున్నారు. మీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరగలేదంటే ఎలా?, కేటీఆర్ దుబాయ్ లో ఏం చేశాడో రికార్డులు ఉన్నాయని రేవంత్ అన్నారు.. వాటిని బయట పెట్టి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. కాళేశ్వరం అవినీతి, ధరణి, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా రేస్ అంశాలపై చర్యలేవి?’ అని ప్రశ్నించారు మహేశ్వర్ రెడ్డి.

CM Revanth Reddy Comments On Kaleshwaram Project In Station Ghanpur Meeting6
‘అది కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం’

సాక్షి, వరంగల్‌ : ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ రూ.7లక్షల కోట్లు అప్పు చేశారు. కేసీఆర్‌ చేసిన అప్పులకు వడ్డీ చెల్లిస్తున్నాం. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. అంచనాల మేరకు రాష్ట్రానికి ఆదాయం రావడం లేదు.కేసీఆర్‌ రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మించారు. కట్టిన మూడేళ్లకే కాళేశ్వరం కూలింది. అది కాళేశ్వరం కాదు..కూలేశ్వరం. కేసీఆర్‌ అసెంబ్లీకి రాకుండా 15 నెలల్లో రూ. 58 లక్షల జీతం తీసుకున్నారు.ప్రాజెక్టులపై దమ్ముంటే కేసీఆర్‌,హరీష్‌ రావు చర్చకు రావాలి. ఎనిటైం. ఏ ప్రాజెక్ట్‌ దగ్గరైనా చర్చకు రెడీ. రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తి తెలంగాణ జాతిపిత ఎలా అవుతారు? ఎవరు జాతిపిత? ఎవరికి జాతిపిత? తెలంగాణకు జాతిపిత అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్.త్యాగాలు చేసిన వారు జాతిపితలు అవుతారు’అని పునరుద్ఘాటించారు. సభలో రేవంత్‌ అసహనంజనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో నిర్వహించిన భారీ బహిరంగసభలో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతుండగా.. నిరుద్యోగులు ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఆ ఫ్లెక్సీలను చూసిన రేవంత్‌.. చూశాను ఇక దించండి అంటూ అసహనానికి లోనయ్యారు. దీంతో నిరుద్యోగులు ఫ్లెక్సీలను దించడంతో రేవంత్‌ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

Saira Banu Requests shouldn't be called as AR Rahman ex-wife7
ఆయన త్వరగా కోలుకోవాలి.. దయచేసి నన్ను అలా పిలవొద్దు: సైరా భాను

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ఏఆర్ రెహమాన్. గతేడాది చివర్లో తన భార్య సైరా భానుతో విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. దాదాపు 28 ఏళ్ల తమ బంధానికి గుడ్‌ బై చెప్పనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఏఆర్ రెహమాన్ ఆస్పత్రి పాలయ్యారు. డీ హైడ్రేషన్‌కు గురికావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. అనంతరం డిశ్ఛార్డ్ అయ్యారు.తాజాగా ఏఆర్ రెహమాన్‌ ఆరోగ్యంపై ఆయన భార్య సైరా భాను ఓ ‍ప్రకటన విడుదల చేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నానని తెలిపారు. ఆయనకు ఛాతీలో నొప్పితో ఆస్పత్రిలో చేరినట్లు నాకు తెలిసింది.. ఆ దేవుడి ఆశీర్వాదంతో ప్రస్తుతం బాగానే ఉన్నారని.. ఎవరూ కూడా ఆందోళనకు గురి కావొద్దని అభిమానులను కోరారు. అయితే మేమిద్దరం ఇంకా అధికారికంగా విడాకులు తీసుకోలేదని అన్నారు. కేవలం నా ఆరోగ్య సమస్యల కారణంగానే విడిపోయామని.. గత రెండేళ్లుగా నా పరిస్థితి బాగాలేదని పేర్కొన్నారు. నా వల్ల ఆయనకు అదనపు ఒత్తిడిని గురి చేయవద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మాకు ఇంకా విడాకులు మంజూరు కాలేదని.. అందువల్ల తనను మాజీ భార్య అని పిలవవద్దని మీడియాతో పాటు అందరికీ విజ్ఞప్తి చేసింది.కాగా.. ఏఆర్ రెహమాన్, సైరా భాను 1995లో వివాహం చేసుకున్నారు. గతేడాది నవంబర్‌లో తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. సైరా తరపు లాయర్ వందనా షా ఈ జంట విడిపోవాలనే నిర్ణయానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు. కాగా.. ఈ జంటకు ఖతీజా, రహీమా, అమీన్ అనే ముగ్గురు పిల్లలు సంతానం ఉన్నారు.రెహమాన్ సినీ ప్రయాణంఏఆర్‌ రెహమాన్‌.. రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా ప్రయాణం ఆరంభించాడు. ఎన్నో హిట్‌ చిత్రాలకు బ్లాక్‌బస్టర్‌ సంగీతం అందించాడు. తెలుగులో గ్యాంగ్‌మాస్టర్‌, నీ మనసు నాకు తెలుసు, నాని, ఏ మాయ చేసావె, సాహసం శ్వాసగా సాగిపో వంటి చిత్రాలకు పని చేశాడు. ఇటీవల వచ్చిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ఛావాకు అద్భుతమైన సంగీతం అందించాడు. ప్రస్తుతం రామ్‌చరణ్‌-బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. ఈయనను ప్రభుత్వం.. పద్మ శ్రీ, పద్మ భూషణ్‌తో సత్కరించింది. స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ సినిమాకుగానూ రెండు ఆస్కార్లు అందుకున్నాడు.

Ysrcp Leader Bhumana Karunakar Reddy Fires On Chandrababu8
‘కాశీనాయన’ కూల్చివేత వెనుక దుష్టశక్తులు ఎవరు?: భూమన

సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో మహిమాన్వితమైన కాశీనాయన క్షేత్రం కూల్చివేతల వెనుక ఉన్న దుష్టశక్తులు ఎవరో బయట పెట్టాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ల మధ్య ఉన్న వైరుధ్యాలతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు నలిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీనాయన క్షేత్రం కూల్చివేతలు ఈ రాష్ట్రంలో హిందూధర్మం గుండెలను బుల్డోజర్‌లతో బద్దలుకొట్టడమేనని మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...సనాతనధర్మ పరిరక్షణ అంటే ఇదేనా పవన్?సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ కూల్చివేతలపై ఎక్కడా స్పందించలేదు. పాశవికంగా, దుర్మార్గంగా జరిగిన ఈ దాడిపై ఆయన నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదు. ఈ కూల్చివేతలు చేపట్టిన అటవీశాఖ సనాతన ధర్మ పరిరక్షకుడుగా తనకు తాను చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిధిలో, ఆయన పర్యవేక్షణలో పనిచేస్తోంది. సనాతన ధర్మంపై దాడి చేస్తే, వారి తలలు తీస్తాను అంటూ భీకర ప్రతిజ్ఞలు చేసే పవనానందుల గొంతుక ఇప్పుడు మాత్రం మూగబోయింది. ఆయన దీనిపై స్పందించాల్సిన అవసరం లేదా? గతంలో తిరుపతిలో ఆరుగురు చనిపోయినప్పుడు నేరుగా ఇక్కడికి వచ్చి క్షమాపణలు చెప్పారు.ఈ రోజు కాశీనాయన క్షేత్రాన్ని పవన్ పరిధిలోని శాఖకు చెందిన అధికారులే కూల్చేవేస్తే ఎందుకు మౌనంగా ఉన్నారు? మీకు బదులుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు క్షమాపణలు చెప్పారు? తిరుపతి విషయంలో సారీలు చెప్పడం మా పార్టీ విధానం కాదు అంటూ ఆనాడు మంత్రి లోకేష్ వ్యాఖ్యలు చేయడం నిజం కాదా? ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆధీనంలోని అటవీశాఖ అధికారులు చేసిన దానికి విద్యాశాఖ మంత్రిగా క్షమాపణలు చెప్పడం, తానే కాశీనాయన క్షేత్రంను నిర్మించి ఇస్తానని ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. నారా లోకేష్, పవన్ కల్యాణ్‌ల మధ్య ఉన్న వైరుధ్యాల వల్ల పవిత్ర క్షేత్రాలు నలిగిపోవాలా?సోషల్ మీడియా సాక్షిగా వీరిద్దరి మధ్య ఉన్న గొడవలు అందరికీ తెలిసినవే. రెడ్‌బుక్ గుడ్డితనం కమ్మి గతంలో ఆలయాలను కూల్చిన వారు నేడు కాశీనాయన క్షేత్రంపై విరుచుకుపడ్డారు. ఎవరు కూల్చారో తెలియదు, ఉత్తర్వులు ఎవరో గుడ్డిగా ఇచ్చారంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఇది సమర్థించుకోవడం కాదు? మీకు తెలియకుండానే ఆలయాలు నేలమట్టం అవుతాయా? ఆశ్రమాలు కూలతాయా? ప్రసాదంలో విషాలు కలుస్తాయా? కాషాయం కింద విషం చిమ్ముతున్నది మీది కాదా? పార్టీ మీటింగ్‌లకు ప్రభుత్వ సొమ్ముతో గాలిలో ఎగిరి ప్రయాణాలు చేసే పవన్ కళ్యాణ్ హెలికాఫ్టర్‌కు కాశీనాయన క్షేత్రంకు దారి కనిపించడం లేదా?మా ఇంట్లోనే సనాతన ధర్మం పుట్టింది అంటూ గతంలో పవన్ చెప్పారు. ఆయనే మా తండ్రి పూజ గదిలో వెలిగే దీపారాదనతో సిగరెట్‌ వెలిగించుకునేవారు అని కూడా అన్నారు. ఇవ్వన్నీ కూడా సనాతన ధర్మం కిందకు వస్తాయా అని కూడా పవనానంద స్వామీ చెప్పాలి. శ్రీశైలం క్షేత్రాన్ని కూడా కూల్చివేస్తారా?కాశీనాయన క్షేత్రం కూల్చివేతలపై దేవాదాయశాఖ మంత్రి స్పందిస్తూ ఈ క్షేత్రం టైగర్‌జోన్ పరిధిలో ఉన్నందునే కూల్చివేశారు అంటూ ప్రకటన చేశారు. టైగర్‌జోన్ పరిధిలోనే ఉన్న శ్రీశైలంను కూడా కూల్చివేస్తామనే ఉద్దేశం ఆ శాఖ మంత్రి మాటల్లో అర్థమవుతోంది. టైగర్‌జోన్ పరిధిలో ఉన్న అన్ని దేవాలయాలను కూల్చివేయాలన్నదే ఈ కూటమి ప్రభుత్వ అసలు లక్ష్యం. కూటమి పాలనలో హిందూ దేవాలయాలకు దిక్కులేకుండా పోయింది.ఆలయాల పరిరక్షణకు ఎటువంటి చర్యలు లేవు. రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉన్న కాశీనాయన క్షేత్రంకు ఉన్న ఆధ్యాత్మిక విలువల దృష్ట్యా దీనిని అటవీ చట్టాల పరిధి నుంచి మినహాయించాలని ఆనాడే సీఎం హోదాలో వైఎస్‌ జగన్ కేంద్ర అటవీశాఖకు లేఖ రాశారు. ఇప్పుడు సనాతన సారధి పవన్ కళ్యాణ్ పరిధిలోని అటవీశాఖ అధికారులు కేంద్ర అటవీశాఖ నుంచి ఎటువంటి ఉత్తర్వులు, ఆదేశాలు లేకుండానే ఈ క్షేత్రంలోని నిర్మాణాలను కూల్చివేశారు.పవన్ కళ్యాణ్ ఆదేశాలు లేకుండానే ఈ కూల్చివేతలు జరిగాయా? వీటిని కూల్చివేస్తున్నారని తెలిసి కూడా ఎందుకు పవన్ దానిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఎంతసేపు బీజేపీకి కొమ్ముగాయడం, మోయడంలో తనమునకలు అయ్యి ఉండటం వల్లే ఇటువంటి ఘోరమైన సంఘటనను పట్టించుకోలేదా? బొట్లు పెట్టడం, మెట్లు కడగడం మినహా ఆలయాలను పరిరక్షించాలనే విషయాన్ని విస్మరించారు. బీజేపీ కూడా ఎందుకు స్పందించడం లేదు. కాశీనాయన క్షేత్రంను కులం కోణంలో చూస్తున్నారా అనే అనుమానాలు, అది అసలు ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు అనే భావనను కలిగిస్తున్నారా అనుమానం భక్తుల్లో కలుగుతోంది.కూటమి పాలనలో హిందూధర్మంకు గడ్డుకాలంకూటమి పాలనలో హిందూధర్మంకు గడ్డుకాలం దాపురించింది. కూటమి ప్రభుత్వానికి వైయస్‌ఆర్‌సీపీపై అభాండాలు మోపి పబ్బం గడుపుకోవడమే తెలుసు. తిరుయల లడ్డూలో కల్తీనెయ్యి అంటూ ఒక పచ్చి అబద్దాన్ని తెరమీదికి తీసుకువచ్చి ఆనాడు వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై దుర్మార్గమైన నిందలు మోపారు. ఆవుకొవ్వు, పందికొవ్వు కలిపారంటే సాక్షాత్తూ సీఎం ఒక ప్రకటన చేయడం, వారి రాజకీయం కోసం ఎంత దూరమైన సరే దిగజారిపోతారనడానికి నిదర్శనం.జనం దీనిని నిజమని నమ్మేలా శతవిధాల ప్రయత్నించారు. దీనిపై సుప్రీంకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక అత్యున్నత పదవిలో ఉన్నవారు బాధ్యతారహితంగా ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది. ఇదంతా ఒక కుట్ర అంటూ వైఎస్సార్‌సీపీ ధైర్యంగా ఎదుర్కోవడంతో ఈ కూటమి ప్రభుత్వం సిగ్గుతో వెనక్కి తగ్గింది.అలాగే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లలో కూటమి ప్రభుత్వం బాధ్యతారాహిత్యం కారణంగా తొక్కిసాలకు గురై ఆరుగురు మృతి చెందడం, 45 మందికి పైగా గాయపడ్డారు. వైఎస్సార్‌సీపీ పాలనలో చిన్నచిన్న పొరపాట్లను కూడా అత్యంత దారుణంగా చిత్రీకరించారు. అదే కూటమి పాలనలో జరుగుతున్న అరాచకాలను ఏదో పొరపాటున జరిగిన చిన్న అంశంగా సమర్థించుకుంటున్నారు. తాజాగా ఒక తాగుబోతు నేరుగా శ్రీవారి ఆలయ ప్రాంగణం బయట మద్యం మత్తులో పెద్ద ఎత్తున గొడవ చేశాడు. శ్రీవారి కొండపై మద్యం ఎంతైనా దొరుకుతుందంటూ వీరంగం సృష్టించారు. ఇప్పటి వరకు నాలుగుసార్లు ఎర్రచందనం కొండపై పట్టుబడింది. దానిపై ఎటువంటి చర్యలు లేవు. ఎన్టీఆర్‌ను మానసికంగా చంపి పుట్టిన పార్టీ టీడీపీమంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శవాలపైన పుట్టిన పార్టీ అంటూ మాట్లాడారు. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఎన్టీఆర్‌ను మానసికంగా చంపి, ఆయన శవాన్ని అడ్డం పెట్టుకుని, అధికారాన్ని లాక్కుని అనే విషయం లోకేష్ గుర్తించాలి. తెలుగుదేశం అధికారపీఠం కింద విగతజీవులైన పింగళి దశరథ్‌రామ్, వంగవీటి మోహనరంగా వంటి వారు ఉన్నారని లోకేష్ తెలుసుకోవాలి.గిల్లి జోల పాడటం, చంపి మాలవేయడం, వెన్నుపోటు పొడిచి పీఠమెక్కడం టీడీపీ లక్షణం. కూటమి ప్రభుత్వంలో కూర్చున్నందుకే కాషాయదళం నోరువిప్పడం మానేసింది. ఏపీలో సనాతన ధర్మానికి జరుగుతున్న అన్యాయం, ఆలయాల విధ్వంసం, శ్రీవారి క్షేత్రంలో జరుగుతున్న అనాచారం, దళారీల మయంగా మారిన పవిత్రక్షేత్రం కాషాయదళానికి కనిపించడం లేదు. అమరావతిలో శ్రీవారి కళ్యాణం జరిపామంటూ ఎంతో ఆర్భాటంగా ప్రకటించుకున్న సీఎం చంద్రబాబు.. గతంలో వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు స్వామివారి కళ్యాణాలను గ్రామాల్లోకి తీసుకువచ్చాం. 2004 డిసెంబర్ నుంచే నేను టీటీడీ బోర్డ్ సభ్యుడగా ఉన్నప్పుడే మొట్టమొదటి సూళ్ళూరిపేట దళితవాడలో స్వామివారి కళ్యాణంను అద్భుతంగా నిర్వహించాం. తరువాత కొన్ని పదుల సంఖ్యలో శ్రీవారి కళ్యాణాలు చేయించాం’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు.

Several People Dead In Europes North Macedonia Concert Incident9
ఘోర అగ్ని ప్రమదం.. 51 మంది దుర్మరణం!

నార్త్ మెసీడోనియా: యూరప్ లోని నార్త్ మెసీడోనియాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ నైట్ క్లబ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని భారీ ప్రాణనష్టం వాటిల్లింది. ఈ ఘటనలో సుమారు 51 మంది దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. వందల సంఖ్యలో గాయాలబారిన పడ్డారు. కోకానిలో ఉన​ నైట్ క్లబ్ లో ఓ కార్యక్రమం నిమిత్తం భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. మెసీడోనియా పాప్ గ్రూప్ డీఎన్ కే ప్రొగ్రామ్ ఉండటంతో అభిమానులు భారీ ఎత్తున నైట్ క్లబ్ కు వచ్చారు. అయితే నైట్ క్లబ్ లో ఉన్న మందుగుండ సామాగ్రి అంటుకుని మంటలు వ్యాపించాయి. అక్కడకు వచ్చిన వారు తేరుకునే లోపు పలువురు మంటలకు ఆహుతయ్యారు. ఈ కార్యక్రమానికి సుమారు 1500 మంది హాజరైనట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారిలో ఎక్కువ మంది యువకులే ఉన్నట్లు సమాచారం. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటైన డీఎన్ కే పాప్ గ్రూప్ కు అధిక సంఖ్యలో యువత ఫ్యాన్స్ గా ఉన్నారు. డీఎన్ కే ఎక్కడ షో చేసినా యువతే అధికంగా హాజరవుతారు. ఈ క్రమంలోనే తాజా షోకు కూడా యువత ఎక్కువగా హాజరయ్యారని నార్త్‌ మెసీడోనియా న్యూస్‌ ఏజెన్నీ ఎమ్‌ఐఏ స్పష్టం చేసింది.

Rinku Singh Smashed 77 Runs From Just 33 Balls In A Practice Match Ahead Of IPL 202510
IPL 2025: విధ్వంసం సృష్టించిన రింకూ సింగ్‌

ఐపీఎల్‌ 2025 సీజన్‌ ప్రారంభానికి ముందు కేకేఆర్‌ స్టార్‌ బ్యాటర్‌ రింకూ సింగ్‌ ఫామ్‌లోకి వచ్చాడు. నిన్న (మార్చి 15) జరిగిన కేకేఆర్‌ ఇన్‌ట్రా స్క్వాడ్‌ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రింకూ 33 బంతులు ఎదుర్కొని 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా అతను ప్రాతినిథ్యం వహించిన టీమ్‌ పర్పుల్‌ టీమ్‌ గోల్డ్‌పై విజయం సాధించింది.ఐపీఎల్‌ ప్రారంభానికి మరి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో అన్ని ఫ్రాంచైజీలు ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. ఇంట్రా స్క్కాడ్‌ మ్యాచ్‌లు ఆడుతూ బిజీగా గడుపుతున్నాయి. ఈ క్రమంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కేకేఆర్‌ కూడా ఇన్‌ట్రా స్క్వాడ్‌ మ్యాచ్‌లు ఆడుతుంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ రెండు టీమ్‌లుగా విడిపోయి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడింది. టీమ్‌ పర్పుల్‌కు అజింక్య రహానే.. టీమ్‌ గోల్డ్‌కు వెంకటేశ్‌ అయ్యర్‌ సారథ్యం వహించారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ గోల్డ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. వెంకటేశ్‌ అయ్యర్‌ (61) మెరుపు అర్ద సెంచరీతో సత్తా చాటాడు. లవ్నిత్‌ సిసోడియా 46 పరుగులతో రాణించాడు.అనంతరం 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేం​దుకు బరిలోకి దిగిన టీమ్‌ పర్పుల్‌.. రింకూ సింగ్‌ చెలరేగడంతో 15.5 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కావడంతో విజయం సాధించాక కూడా మ్యాచ్‌ను కొనసాగించారు. రెండో లక్ష్యంగా టీమ్‌ పర్పుల్‌కు 250 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని కూడా టీమ్‌ పర్పుల్‌ మరో 13 బంతులు మిగిలుండగానే ఛేదించింది. మరో లక్ష్యంగా టీమ్‌ పర్పుల్‌కు 280 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే ఈసారి టీమ్‌ పర్పుల్‌ 280 పరుగుల లక్ష్యానికి 2 పరుగుల దూరంలో నిలిచిపోయింది. నిర్ణీత ఓవర్లలో టీమ్‌ పర్పుల్‌ 5 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. టీమ్‌ పర్పుల్‌ ఇన్నింగ్స్‌లో రింకూ సింగ్‌తో పాటు ఆండ్రీ రసెల్‌ (64 నాటౌట్‌), క్వింటన్‌ డికాక్‌ (52) చెలరేగిపోయారు.ఇదిలా ఉంటే, ఐపీఎల్‌-2025 సీజన్‌లో కేకేఆర్‌ జర్నీ లీగ్‌ ఆరంభ రోజున (మార్చి 22) ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ మ్యాచ్‌ కేకేఆర్‌ హెం గ్రౌండ్‌ అయిన ఈడెన్‌ గార్డెన్స్‌లో జరుగుతుంది. గత సీజన్‌ ఫైనల్లో శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలోని కేకేఆర్‌ సన్‌నైజర్స్‌ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించి, తమ మూడో ఐపీఎల్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. గత సీజన్‌ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌ కేకేఆర్‌ను విడిచిపెట్టాడు. మెగా వేలంలో శ్రేయస్‌ను పంజాబ్‌ కొనుగోలు చేసింది. శ్రేయస్‌ను ఆ జట్టు కెప్టెన్‌గా కూడా ఎంపిక చేసింది. శ్రేయస్‌ వీడటంతో కేకేఆర్‌కు కెప్టెన్‌ ఎంపిక​ అనివార్యమైంది. మెగా వేలంలో బేస్‌ ధర రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసిన అజింక్య రహానేను కేకేఆర్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అతనికి డిప్యూటీగా (వైస్‌ కెప్టెన్‌) వెంకటేశ్‌ అయ్యర్‌ను నియమించింది. తొలుత వెంకటేశ్‌ అయ్యర్‌నే కేకేఆర్‌ కెప్టెన్‌గా ఎంపిక చేస్తారని ప్రచారం​ జరిగింది. అయితే చివరి నిమిషంలో రహానే ఎంట్రీ ఇచ్చి కెప్టెన్సీని ఎగరేసుకుపోయాడు. మెగా వేలంలో రహానేను కేకేఆర్‌ తొలుత పట్టించుకోలేదు. అమ్ముడుపోని ఆటగాళ్ల రౌండ్‌లో రహానేను కేకేఆర్‌ దక్కించుకుంది.2025 ఐపీఎల్‌ సీజన్‌ కోసం కేకేఆర్‌ జట్టు..అజింక్య రహానే (కెప్టెన్‌), వెంకటేశ్‌ అయ్యర్‌ (వైస్‌ కెప్టెన్‌), మనీశ్‌ పాండే, రింకూ సింగ్‌, రోవ్‌మన్‌ పావెల్‌, అంగ్‌క్రిష్‌ రఘువంశీ, అనుకూల్‌ రాయ్‌, మొయిన్‌ అలీ, రమన్‌దీప్‌ సింగ్‌, సునీల్‌ నరైన్‌, ఆండ్రీ రసెల్‌, క్వింటన్‌ డికాక్‌, లవ్‌నిత్‌ సిసోడియా, రహ్మానుల్లా గుర్బాజ్‌, వరుణ్‌ చక్రవర్తి, వైభవ్‌ అరోరా, అన్రిచ్‌ నోర్జే, ఉమ్రాన్‌ మాలిక్‌, మయాంక్‌ మార్కండే, హర్షిత్‌ రాణా, స్పెన్సర్‌ జాన్సన్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
title
ఆ ‘మెరుపు’ను నాతోనే దాచుకుంటాను: సునీతా విలియమ్స్‌

అంతరిక్షంలో చిక్కుపోయి సుదీర్ఘ విరామం తర్వాత భూమి మీదకు రాబోతున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్..

title
స్టూడెంట్‌ మైండ్‌ బ్లాక్‌ స్పీచ్‌..! ఫిదా అవ్వాల్సిందే..

ఒక విద్యార్థి తన ఉద్వేగభరిత గళంతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

title
సునీత వచ్చేస్తోంది.. ఐఎస్‌ఎస్‌తో క్రూ-10 అనుసంధానం సక్సెస్‌

అంతరిక్షకేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది.

title
‘మీ టైమ్‌ అయిపోయింది’.. వారికి ట్రంప్‌ హెచ్చరిక

సానా: యెమెన్‌లో హౌతీలపై అమెరికా సైన్యం విరుచుకుపడింది.

title
26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ హతం?

జీలం: పాకిస్తాన్‌లోని జీలం ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో..

National View all
title
పుట్టిన ఏడాదికే తల్లి వెంటే జైలుకు పసిబిడ్డ.. పాపం ఈ చిన్నారికి ఎంత కష్టమొచ్చిందో

బెంగళూరు : ప్రసవించిన 14రోజులకే అనివార్య కారణాలతో రూ.60వేలకు

title
మిజోరం వండర్‌ కిడ్‌కి అమిత్‌ షా స్పెషల్‌ గిఫ్ట్‌

మిజోరాం: ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి

title
అమాయకురాల్ని.. తెల్ల కాగితాలపై బలవంతంగా సంతకం..: రన్యా రావు లేఖ

కన్నడ నటి రన్యా రావు (Ranya Rao) క

title
స్వర్ణ దేవాలయంలో భక్తులపై దాడి.. ఐదుగురికి గాయాలు

అమృత్‌సర్‌: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గల స్వర్ణదేవాలయం(

title
తమిళులపై కామెంట్స్‌.. పవన్‌కు ప్రకాష్‌రాజ్‌ కౌంటర్‌

చెన్నె: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు కౌంటరిచ

International View all
NRI View all
title
కెనడా కొత్త కేబినెట్‌లో ఇద్దరు భారతీయులు

ఒట్టావా: కెనడా నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మార్క్‌ క

title
పాపం ఉష.. ఇష్టం లేకున్నా నవ్వాల్సిందే!

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తన భార్య ఉషా

title
భారత విద్యార్థుల చూపు.. ఆ దేశాలవైపు!

ఉన్నత విద్య కోసం అగ్ర రాజ్యాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.

title
టీటీఏ (TTA) న్యూయార్క్‌ చాప్టర్‌ రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపురి

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA)  న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి &

title
న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు

మహిళలకు  ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి  పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోస

NRI View all
title
గ్రీన్‌కార్డులపై బాంబు పేల్చిన జేడీ వాన్స్‌.. అమెరికా పౌరసత్వం కట్‌!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసార

title
ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

title
సుదీక్ష మిస్సింగ్‌.. కిడ్నాపైందా?

న్యూఢిల్లీ: కరీబియన్‌ దేశం డొమినికన్‌ రిపబ్లిక్‌లో తెలుగు వి

title
డాక్టర్‌ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!

డొమినికన్ రిపబ్లిక్‌లో  కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడు

title
USA: భారత సంతతి సుదీక్ష అదృశ్యం.. బీచ్‌లో ఏం జరిగింది?

వర్జీనియా: అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీ

Advertisement
Advertisement