Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

TDP Telugu Drama Party Says YS Jagan1
టీడీపీ.. తెలుగు డ్రామా పార్టీ: వైఎస్‌ జగన్‌

సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బుధవారం పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీలో బాబు సర్కార్‌ ఎన్నికల హామీల అమలును ప్రశ్నించారాయన.టీడీపీ అంటే.. తెలుగు డ్రామా పార్టీ. మహానాడు పెద్ద డ్రామా. చంద్రబాబు మహానాడులో ఫోజులు ఇస్తున్నారు. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు. కడపలో మహానాడు పెట్టి.. జగన్‌ను తిట్టడం సత్తా ఎలా అవుతుంది?. ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుంది.... జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో సమస్యలు చెప్పి, ఎక్కువ పరిష్కారాలు పొందిన వాళ్లు టీడీపీ వాళ్లే. ఎమ్మెల్యేలు వద్దన్నా.. వారికి మనం మంచి చేశాం. కానీ, ఈరోజు చంద్రబాబు అన్యాయాలు చేస్తున్నారు. దీనికి వడ్డీ సహా చెల్లిస్తాం. అప్పుడే మరోసారి ఇలాంటి తప్పులు చేయడానికి భయపడతారు’’ అని జగన్‌ అన్నారు... చంద్రబాబు.. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ గాలికొదిలేశారు.143 హామీలను పూర్తిగా పక్కనపెట్టారు.చిన్నహామీ అయిన ఉచిత బస్సుకోసం కూడా ప్రజలు ఎదురుచూస్తున్నారు. గ్యాస్‌ సిలెండర్లు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువులు అటకెక్కాయి. సీబీఎస్‌ఈ, టోఫెల్‌, నాడు-నేడు, పిల్లలకు ట్యాబులు అన్నీ ఆగిపోయాయి. మా హయాంలో ప్రతి మూడు నెలలకూ ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఇచ్చేవాళ్లం. కూటమి ప్రభుత్వంలో అమ్మ ఒడికి పంగనామాలు పెట్టారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌, వసతి దీవెన లేదు. చదివించలేక పిల్లలను పనులకు పంపే పరిస్థితులు కనిపిస్తున్నాయి... ఆరోగ్య శ్రీనికూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. పేషెంట్లకు ఆరోగ్య శ్రీ అందని పరిస్థితి నెలకొంది. పేదలు వైద్యంకోసం అప్పులు పాలు అవుతున్నారు. చంద్రబాబు పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఏడాది కాలంగా రైతు భరోసా లేదు. ధాన్యం సహా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు రావడంలేదు. ధాన్యానికి కనీస మద్దతు ధరే కాదు, జీఎల్టీ రూపంలో ప్రతి ఎకరాకు రూ.1౦వేలు అదనంగా రైతుకు వచ్చేది. మిరప, పత్తి, చీనీ, టమోటో.. పొగాకు.. ఇలా ఏ పంట తీసుకున్నా రైతులకు ధరలు రాడంలేదు. రైతు బతుకు దళారీ పాలయ్యింది:.. ఏడాది కాలంలో ఒక్క ఉద్యోగంకూడా ఇవ్వలేకపోయారు. ఉన్న ఉద్యోగాలూ పీకేస్తున్నారు. 2.6 లక్షల మంది వాలంటీర్లు, 15వేల మంది బెవరేజెస్‌ కార్పొరేషన్లు, రేషన్‌ వాహనాల మీద ఆధారపడ్డ 20వేల మంది ఇలా మొత్తంగా 3లక్షల ఉద్యోగాలను తీసేశారు. మన పాలనలో ఉద్యోగస్తుల్లో చంద్రబాబు విషం నింపారు. ఇప్పుడు ఒక్కరికీ ఐఆర్‌ ఇచ్చిన పాపాన పోలేదు, పీఆర్‌సీ లేదు. మూడు డీఏలు పెండింగ్‌, బకాయిలు పెండింగ్‌. చంద్రబాబును ఎందుకు తెచ్చుకున్నామని ఉద్యోగులు తలపట్టుకుంటున్నారు. ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్జ్‌, రాజధాని పనులు.. లిక్కర్‌ ఇలా దేన్నీ వదలకుండా దోచేస్తున్నారు.వైఎస్సార్‌సీపీ హయాంలో మనం రూ.2.73లక్షల కోట్లు డీబీటీ చేశాం. జగన్‌ చేశాడు, ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు. మరణం తర్వాత ప్రతి ఇంట్లో నేను బతికే ఉండాలని ఆశపడ్డాను. అందుకే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగాను. కానీ చంద్రబాబు బటన్‌ నొక్కడంలేదు, దోచేసుకోవడం, దోచేసినది పంచేసుకోవడం చేస్తున్నాడు. రాష్ట్రానికి వచ్చిన ఆదాయాలు కూడా తగ్గిపోయాయి. దేశం మొత్తం 11 శాతం పెరిగితే.. మనకు ౩శాతం పెరిగాయి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు టీడీపీకి చెందిన గజ దొంగల ముఠా జేబుల్లోకి పోతోంది’’ అని జగన్‌ అన్నారు.క్లిక్‌ చేయండి: మహానాడులో చంద్రబాబు మహానటన

Jagan Gollaprollu Penukonda YSRCP Leaders Meeting Key Comments Updates2
చంద్రబాబుది దౌర్భాగ్యపు పాలన: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడకూ పోలేదని, కానీ కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీ అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. చంద్రబాబు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లను ప్రలోభ పెట్టి, బెదిరించి, భయపెట్టి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మన హయాంలో.. కోవిడ్‌ లాంటి మహమ్మారి వచ్చి ఆదాయాలు తగ్గి, ఖర్చులు పెరిగి, తీవ్ర సంక్షోభం ఉన్నా.. ఏరోజు కూడా వాటిని సాకులుగా చూపించలేదు. ప్రజలకు చేయాల్సిన మేలు చేయకుండా పక్కనపెట్టలేదు. ఎన్ని సమస్యలున్నా ప్రజలకు సంతోషంగా మేలు చేశాం. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాం. సీఎం కార్యాలయం నుంచి ప్రతి కార్యాలయంలోనూ కూడా మేనిఫెస్టో పెట్టాం. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ దాన్ని అమలు చేసేట్టుగా చేశాం. 99శాతం హామీలను అమలు చేశాం. అంత గొప్పగా ప్రజలకు మేలు చేశాం. అందుకనే అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేశాం.కానీ, చంద్రబాబుది(Chandrababu) దౌర్భాగ్యపు పాలన. తాను ప్రానిథ్యం వహిస్తున్న కుప్పం నుంచే చంద్రబాబు అరాచకాలను ప్రోత్సహించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మన పార్టీల్లో చిన్న చిన్న పదవుల్లో ఉన్నవారు చంద్రబాబు కుట్రలకు తలొగ్గక విలువలు చాటారు. అందుకు మీ అందరికీ హ్యాట్సాఫ్‌ చెప్తున్నా.ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడకూ పోలేదు. చంద్రబాబు పాలనకు, మన పాలనకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలకు మంచి చేశామన్న తృప్తి మనకు ఉంది. వైఎస్సార్‌సీపీ(YSRCP)కి చెందిన ఏ కార్యకర్త అయినా, ఏ నాయకుడు అయినా రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి పలానా వైఎస్సార్‌సీపీ వాళ్లం అని చెప్పే ధైర్యం ఉంది. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పనిచేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా?. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయి.సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తారు’’ అని జగన్‌ అన్నారు. ఇదీ చదవండి: నారావారి ఏఐ తిప్పలు, ఎన్టీఆర్‌ ఉండి ఉంటేనా..

India to conduct mock drills tomorrow in 4 states3
రేపు పాక్‌ సరిహద్దు రాష్ట్రాల్లో భారత్‌ మాక్‌ డ్రిల్‌

సాక్షి,ఢిల్లీ: రేపు పాక్‌ సరిహద్దు రాష్ట్రాల్లో భారత్‌ మాక్‌ డ్రిల్ నిర్వహించనుంది. ఇందులో భాగంగా గుజరాత్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, జమ్మూలో మాక్‌ డ్రిల్ నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది. అయితే, మాక్‌ డ్రిల్ నిర్వహించే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

KSR Comments On BRS MLC Kalvakuntla Kavitha Letter4
కవిత లేఖ టీకప్పులో తుపానేనా?

ప్రతిపక్షంలో ఉండగా రాజకీయ పార్టీలకు సంక్షోభాలు సహజం. తెలంగాణలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)లోనూ ప్రస్తుతం ఒక సంక్షోభం నెలకొని ఉంది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె కవిత లేఖ రాయడం సహజంగానే కలకలం సృష్టించింది. తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో.. ఏడాదిన్నర కాలంగా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు ఇది చికాకు కలిగించేదే. కేడర్‌ను గందరగోళంలో పడేసేదే.కవిత లేఖ ఒక ఎత్తు.. అమెరికా నుంచి తిరిగి వస్తూనే విమానాశ్రయంలోనే చేసిన వ్యాఖ్యలు ఇంకో ఎత్తు. ఒకపక్క కేసీఆర్‌ దేవుడంటూనే.. ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయని చెప్పి కవిత బీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టారు. తన లేఖను బయటపెట్టిన కోవర్టులెవరన్న ప్రశ్న కూడా సంధించి దాంతో తనకు సంబంధం లేదని చెప్పారన్నమాట. పార్టీలో కేసీఆర్‌ తరువాత అత్యంత ప్రముఖులు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి, కేసీఆర్‌ మేనల్లుడు హరీశ్‌ రావు, మాజీ ఎంపీ సంతోష్‌ కుమార్‌లు మరి కొంతమంది మాత్రమే. కవిత తన లేఖను ఎవరి ద్వారా కేసీఆర్‌కు పంపారో తెలియదు కానీ.. పార్టీ ప్రముఖుల్లోనే ఎవరో ఒకరు దాన్ని బయటపెట్టారన్నది ఆమె భావన కావచ్చు.అయితే, ఈ లేఖ లీక్‌ కావాలని, ప్రజల్లోకి వెళ్లాలని కవిత కూడా కోరుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అమెరికా నుంచి రాగానే విమానాశ్రయంలోనే లేఖ విషయాలను హడావుడిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. తండ్రి, సోదరుడితో సంప్రదింపుల తరువాత కూడా వ్యాఖ్యానించి ఉండవచ్చు. అలా కాకుండా పార్టీకి నష్టం కలుగుతుందని తెలిసినా దేవుడు, దెయ్యం వంటి డైలాగులు వాడారంటే ఆమె ఆంతర్యంపై పలు రకాల విశ్లేషణలు వస్తాయి. ఈ విషయం కవితకూ తెలుసు. పైగా ఆమె మద్దతుదారులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు సీఎం, సీఎం అని నినాదాలు ఇవ్వడం, ప్లకార్డులు, బ్యానర్లలో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ల ఫోటోలు లేకపోవడం చూస్తే ప్రణాళిక ప్రకారమే కవిత విమానాశ్రయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు స్పష్టమవుతుంది.అసెంబ్లీ ఎన్నికల తరువాత ఇప్పుడిప్పుడే పార్టీ పుంజుకుంటున్న తరుణంలో ఈ దుమారం చెలరేగడం కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతోందన్న అనుమానాలు పార్టీ కేడర్‌లో రేకెత్తిస్తాయి. కవిత ఇకపై ఏం చేస్తుందన్న ఆందోళన కూడా ఏర్పడుతుంది. కేసీఆర్‌ స్పందన కోసం అంతా ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతానికైతే కేసీఆర్‌ స్వయంగా స్పందించకపోగా.. ఇతరులు కూడా రియాక్ట్ కావద్దని సూచించారు. కేటీఆర్‌ ఆయనను కలిసిన తర్వాత కూడా కొత్త పరిణామాలేవీ లేకపోవడం ద్వారా పార్టీ వేచి ఉండే ధోరణిని పాటిస్తోందని అనుకోవాలి. అదే సమయంలో ఎల్లో మీడియా గతంలో వైఎస్ షర్మిలను రెచ్చగొట్టినట్లు తెలంగాణలో కవితను కూడా రెచ్చగొడుతున్నారన్న అనుమానం ఉంది. దానికి తగినట్లే ఆమె పార్టీ పెడతారని, సోషల్ మీడియాలో ఆమెకు అనుకూలంగా కామెంట్లు వస్తున్నాయని టీడీపీకి మద్దతిచ్చే ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. కవిత కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, ఆ పార్టీనే వెనుకాడుతోందని కూడా ఈ ఎల్లో మీడియా కథనాన్ని ఇచ్చింది. జాగృతి కార్యకర్తలు దీన్ని ఖండించవచ్చు కానీ జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది.షర్మిలను రాజకీయంగా వాడుకుని ఆ తర్వాత ఆమెను విఫల ప్రయోగం అని ఎల్లో మీడియా వారే తేల్చేశారు. కవిత పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఉంటుందా అన్న చర్చ ఉంది. కవిత లేఖ ఆధారంగా కాంగ్రెస్, బీజేపీలు రకరకాల వ్యాఖ్యలు చేసి బీఆర్ఎస్‌ను ఆత్మరక్షణలో పడేయడానికి ప్రయత్నించాయి. కుటుంబ పంచాయతీ అని, డ్రామా అని, ఆస్తుల తగాదా అని ఈ పార్టీలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు వంటి వారు ఆమె సొంత పార్టీ పెడతారని అనే వరకు వెళ్తున్నారు. అంతదాకా వెళతారా అన్నది అప్పుడే చెప్పలేం కానీ పార్టీలో తన ప్రాముఖ్యత పెంచుకోవడానికి యత్నించవచ్చు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ నేత పొన్నం ప్రభాకర్‌ ఇదంతా బీజేపీ-బీఆర్‌ఎస్‌ డ్రామా అంటున్నారు. కేంద్ర మంత్రి బీజేపీకి చెందిన బండి సంజయ్‌ కవితను కాంగ్రెస్ వదలిన బాణంగా విమర్శిస్తున్నారు. ఇంకో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కూడా ఇదంతా డాడీ, డాటర్ డ్రామా అని వ్యాఖ్యానించారు.కుమార్తె తన తండ్రికి లేఖ రాస్తే తప్పేమిటని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ శ్రవణ్‌ ప్రశ్నిస్తున్నా.. లేఖలోని విషయాలు, ఒక రాజకీయ పార్టీ అధినేతకు వేసిన ప్రశ్నలు కచ్చితంగా చర్చనీయాంశాలే. ఫీడ్ ‌బ్యాక్‌ పేరుతో కవిత పార్టీ రజతోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశం తాలూకూ లోటుపాట్లను ఒక జర్నలిస్టులా, విశ్లేషకురాలిగా తన లేఖలో ఎత్తి చూపింది. ఒక వ్యాసంలా సాగిన ఈ లేఖలో కొన్ని పాజిటివ్‌ పాయింట్లు ఉన్నా.. నెగిటివ్ పాయింట్లే ఎక్కువ. కేసీఆర్‌ నాయకత్వ పటిమపై కవితకు సందేహం కలిగినట్టుగా ఈ లేఖలోని వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. అలాగే.. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదాలో సోదరుడు కేటీఆర్‌.. పార్టీని నడుపుతున్న నేపథ్యంలో కవితలో ఏదో అసంతృప్తి కూడా ఏర్పడినట్లు స్పష్టమవుతోంది.వరంగల్‌ సభలో వేదికపై కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌ ఫోటో మాత్రమే ఉండటం​ కూడా ఆమె అసంతృప్తికి కారణమై ఉండవచ్చు. ఏప్రిల్ 27న జరిగిన పార్టీ రజతోత్సవ సభ విజయవంతం అయిందని.. కేసీఆర్‌ ప్రసంగాన్ని శ్రద్దగా విన్నారని, కాంగ్రెస్ ఫెయిల్ అని సభికులతో చెప్పించడం, ముఖ్యమంత్రి రేవంత్ పేరును కేసీఆర్ తీయకపోవడం వంటివి కవితకు నచ్చాయట. అయితే, అదే సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, తెలంగాణ గీతం గురించి మాట్లాడకపోవడాన్ని ఆమె ఆక్షేపించారు. కేసీఆర్ ప్రసంగంలో మరింత పంచ్‌ని ప్రజలు ఆశించారని ఆమె చెబుతున్నారు. అయినా ఈ సభతో కార్యకర్తలు, నాయకులు సంతృప్తిగానే ఉన్నారని అంటున్నారు. వారంతా సంతృప్తిగా ఉంటే పనికట్టుకుని కవిత ఈ లేఖ రాసి నెగిటివ్ పాయింట్లపై ఫోకస్ పెట్టవలసిన అవసరం ఏమిటో తెలియదు.నెగిటివ్ పాయింట్ల గురించి చెబుతూ, ఉర్దూలో మాట్లాడకపోవడం, ఎస్సీ వర్గీకరణ, వక్ఫ్ బిల్లు ప్రస్తావన లేకపోవడం, సభ నిర్వహణ ఎవరో పాత ఇంఛార్జీలకు అప్పగించడం నచ్చలేదని అంటున్నారు. సభలో ఇతర నేతలు మాట్లాడే అవకాశం లేకపోవడాన్ని ఆమె తప్పు పట్టారు. సాధారణంగా ఎక్కువ మంది నేతలు ఇలాంటి సభలలో మాట్లాడుతుండే వారు. కానీ, ఈసారి కేసీఆర్‌ మాత్రమే మాట్లాడారు. ఇది కొంత ఆశ్చర్యంగానే ఉంది. కార్యకర్తల ధూంధాం విఫలమైందని కవిత అభిప్రాయపడ్డారు. బీజేపీపై రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడతారా అని కేసీఆర్‌ను ఆమె నిలదీశారు. భవిష్యత్తులో పొత్తు ఉంటుందేమోనని ఊహాగానాలకు ఆస్కారం కలిగిందని ఆమె విశ్లేషించారు. బీజేపీతో తాను వ్యక్తిగతంగా ఇబ్బంది పడ్డ విషయాన్ని గుర్తు చేసుకున్నారు.అయితే, ఎన్నికల ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు రావడం వల్ల బీఆర్‌ఎస్‌కు కూడా ఇబ్బంది అయిన విషయాన్ని కూడా మర్చిపోరాదు. కాంగ్రెస్ పై క్షేత్ర స్థాయిలో నమ్మకం పోయినా, బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందేమోనన్న ఆలోచన పార్టీ శ్రేణులలో ఉందని కవిత అనడం సంచలనమే. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, మళ్లీ పార్టీని పట్టాలెక్కించేందుకు తంటాలు పడుతున్న తరుణంలో కవిత ఈ మాటలు అనడం నష్టమే. కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణ, దిశానిర్దేశం చేయలేకపోయారని కూడా ఆమె తప్పుపట్టారు. ఒకటి, రెండు రోజులు ప్లీనరీ నిర్వహించి పార్టీ శ్రేణుల అభిప్రాయాలను తీసుకుని ఉండాల్సిందని ఆమె అన్నారు. బహిరంగ సమావేశాలలో అభిప్రాయాలు తీసుకునే పరిస్థితి ఉండదు. కవిత లేఖ సారాంశం.. పార్టీ ఆశించినంత బాగా నడవడం లేదు అన్నది అనిపిస్తుంది. కేటీఆర్‌తో సంబంధాలేమైనా దెబ్బతిన్నాయా అన్న అనుమానం కలుగుతుంది.కొద్ది రోజుల క్రితం హరీశ్‌రావు ఇంటికి వెళ్లి కేటీఆర్‌ రెండుగంటలు భేటీ అయి.. అంతా బాగుందన్న భావన కలిగించడానికి యత్నిస్తే, సోదరి రూపంలో ఈ కొత్త సమస్య వచ్చింది. అయితే, కవిత మరీ అధికంగా స్పందిస్తే ఆమెకే నష్టం. దేవుడి చుట్టూ దెయ్యాలు ఉన్నాయని అనడం ద్వారా తండ్రిని ఆమె గౌరవించినట్లా? లేక అవమానించినట్లా అన్న చర్చ జరుగుతోంది. పురాణాలలో దెయ్యాల మధ్యలో దేవుడు ఎక్కడైనా కనిపించారా?. తండ్రికి తన లేఖలో‘సారీ’ చెబుతూ ముగించినా, ఆమె ఎయిర్ పోర్టులో చేసిన ఘాటైన వ్యాఖ్యలతో ఆ ‘సారీ’కి అర్థం లేకుండా పోయింది. ‘అనుబంధం, ఆత్మీయత అంతా ఒక నాటకం.. ఆత్మ తృప్తికై ఆడుకునే వింత నాటకం’ అని ఒక కవి అంటాడు. ఇటువంటి రాజకీయాలు చూస్తే ఆ మాట నిజం అనిపిస్తుంది కదా!. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

TDP Mahanadu: Party Workers Laughs At NTR AI Video5
మహానాడులో ఎన్టీఆర్‌ ఏఐ వీడియోపై గుసగుసలు

సాక్షి, వైఎస్సార్ జిల్లా: 'సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు' అనే నినాదంతో తెలుగు దేశం పార్టీని స్థాపించి.. ప్రజాస్వామ్యానికి కొత్త అర్ధం చెప్పిన దార్శనికుడు ఎన్టీఆర్. అయితే ఆ తర్వాత పార్టీ చంద్రబాబు చేతుల్లోకి ఎలా వెళ్లింది.. ఎన్టీఆర్‌ ఎంతగా క్షోభ పడింది తెలుగు వాళ్లకు తెలిసిన విషయమే. తెలుగు దేశం పార్టీ మహానాడు వేళ.. అందునా ఆయన జయంతినాడు వైరల్‌ అవుతున్న ఓ వీడియోపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.టెక్నాలజీ అంటూ పదే పదే స్టేట్‌మెంట్లు ఇచ్చే చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌లు.. మహానాడులో ఏఐతో గొప్పల కోసం తిప్పలు పడడం నవ్వులు పూయిస్తోంది. ఎన్టీఆర్‌ స్వయంగా మహానాడుకు వచ్చి ఆ తండ్రీకొడుకులను పొగిడితే ఎలా ఉంటుందో అంటూ ఓ ఏఐ (NTR AI Video) వీడియోను మహానాడు వేదికపై ప్రదర్శించారు. చంద్రబాబు పీ4, అమరావతి ద్వారా రాష్ట్రాన్నే మార్చేస్తాడని.. యువగళంతో తన మనవడు లోకేశ్ కొత్త ఊపు తెచ్చాడంటూ ఏఐ ఎన్టీఆర్‌తో పొగడ్తలు గుప్పించుకున్నారు. ఆ టైంలో అక్కడే ఉన్న కార్యకర్తల్లో కొందరు.. ఆయన బతికి ఉంటే ఏం మాట్లాడే వారో? అంటూ నవ్వుకుంటూ గుసగుసలాడుకోవడం కనిపించింది. మరోవైపు.. ఏఐ వీడియో ద్వారా మాట్లాడిన సీనియర్ ఎన్టీఆర్మహానాడులో ఏఐ వీడియో ద్వారా సీనియర్ ఎన్టీఆర్ ప్రసంగం సృష్టించి, చంద్రబాబు, లోకేష్ లను పొగడ్తలతో ముంచెత్తిన టీడీపీ నాయకులు pic.twitter.com/if9KqwNHhM— Telugu Scribe (@TeluguScribe) May 28, 2025Video Credits: Telugu Scribeతనను చంద్రబాబు సీఎం గద్దెనుంచి దింపి.. టీడీపీని లాక్కున్న తర్వాత ఎన్టీఆర్‌ చంద్రబాబు నిజస్వరూపం గురించి పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఈ క్రమంలో తాజా ఏఐ వీడియోపై సోషల్‌ మీడియాలో కొన్ని కామెంట్లు కనిపిస్తున్నాయి. చంద్రబాబు తన ఆత్మను అమ్ముకున్నాడని, ఔరంగజేబు వారసుడని, తన కంటే పెద్ద నటుడంటూ నాడు ఎన్టీఆర్‌ చెప్పిన మాటలను కొందరు సోషల్‌ పోస్ట్‌ చేస్తున్నారు. ఇదేం ఆనందం చంద్రబాబు, లోకేష్‌? అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. Video Credits: vasanth_gollapalliఇదీ చదవండి: Mahanadu-కనీసం భోజనాల దాకా అయినా ఆగండయ్యా!

Rishabh Pant fined by BCCI after LSGs defeat to RCB6
రిషబ్ పం‍త్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ

ఐపీఎల్‌-2025 సీజన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఓటమితో ముగించింది. సోమవారం ఏకానా స్టేడియం వేదికగా రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ ప‌రాజ‌యం పాలైంది. అయితే ఓట‌మి బాధలో ఉన్న ల‌క్నో కెప్టెన్ రిష‌బ్ పంత్‌కు మ‌రో బిగ్‌ షాక్ త‌గిలింది.ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేటు మెయింటిన్ చేసినందుకుగానూ పంత్‌కు రూ. 30 లక్షల భారీ జరిమానా ఐపీఎల్ ఎడ్వైజ‌రీ క‌మిటీ విధించింది. అలాగే జ‌ట్టులో ఇంపాక్ట్ ప్లేయ‌ర్ స‌హా అంద‌రూ రూ. 12 ల‌క్ష‌లు లేదా మ్యాచ్ ఫీజులో 50శాతం జ‌రిమానాగా చెల్లించాల‌ని స‌ద‌రు క‌మిటీ ఆదేశించింది.ఈ ఏడాది సీజ‌న్‌లో ల‌క్నో జ‌ట్టు స్లో ఓవ‌ర్ రేట్‌ను న‌మోదు చేయ‌డం ఇది మూడో సారి. అందుకే అంత భారీ మొత్తంలో జ‌రిమానా విధించారు. "ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ సార‌థి రిష‌బ్ పంత్‌కు జరిమానా విధించాం. ఏకానా స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నాము. ఇది మూడో సారి అయినందున ఆర్టికల్ 2.22 ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్ ప్రకారం పంత్‌ కు రూ. 30 లక్షలు ఫైన్ వేశాము ’ అని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. కాగా ఈ మ్యాచ్‌లో రిషబ్‌ పంత్ అద్బుతమైన సెంచ‌రీతో చెల‌రేగాడు. సీజ‌న్ ఆరంభం నుంచి విఫ‌ల‌మైన పంత్‌.. త‌మ ఆఖ‌రి మ్యాచ్‌లో మాత్రం విధ్వంసం సృష్టించాడు. రిషబ్‌ 61 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 118 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67, 4 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో మెరిశాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 228 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని బెంగ‌ళూరు కేవ‌లం నాలుగు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 18.4 ఓవర్లలో చేధించింది.చదవండి: IND Vs ENG: బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. దిలీప్‌కు మ‌ళ్లీ పిలుపు

Amitabh Bachchan revealed why he doesnt have pulse on his wrist7
మణికట్టుపై పల్స్‌ లేకపోవడం ప్రమాదకరమా!.. బిగ్‌బీకి సైతం..

బాలీవుడ్ మెగాస్టార్‌, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలతో అలరించిని గొప్ప నటుడు. ఏ పాత్రలోనే ఇట్టే ఒదిగిపోయి..ప్రేక్షకుల, విమర్శల ప్రశంసలు అందుకున్న దిగ్గజ నటుడు. అయితే ఆయకు మణికట్టుపై పల్స్‌ అస్సలు ఉండదట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా కౌన్‌ బనేగా కరోడ్‌పతి ఎపిసోడ్‌లో చెప్పారు. ఆ సీజన్‌ ఎపిసోడ్‌లో ‘సాధారణంగా హార్ట్ బీట్ తెలుసుకోవడానికి రెండు వేళ్లను శరీరంలో ఏ భాగంపై ఉంచి చూస్తారు?’ అనే ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకు మణికట్టు సమాధానం. ఆ నేపథ్యంలో బిగ్‌బీ తన మణికట్టుపై వేళ్లు పెట్టినా నాడి దొరకదని చెప్పుకొచ్చారు. దానికి గల కారణాన్ని కూడా వివరించారు. మరీ ఇలా పల్స్‌ ఉండకపోవడం ఏదైనా అనారోగ్యానికి సంకేతమా..?, ఎందువల్ల ఇలా జరుగుతుంది వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం.1982లో కూలీ సినిమా సమయంలో అమితాబ్‌ ప్రమాదం బారినపడ్డారు. ఆ ప్రమాదం కారణంగా చాలా రోజులు ఆస్పత్రిలో ఉండిపోవాల్సి వచ్చింది. అదీగాక ఆస్పత్రి సిబ్బంది ప్రతి అరగంటకొకసారి రక్తం తీసుకోవడానికి సూదులు గుచ్చేవారని అన్నారు. దాంతో మణికట్టుపై పల్స్ పనిచేయడం ఆగిపోయిందని అన్నారు. ప్రస్తుతం తన మెడపై మాత్రమే పల్స్‌ ఉంటుందని అన్నారు. ఇది సర్వసాధారణమా లేక ప్రమాదమా..?ఇది సర్వసాధారణంగా గాయం, శస్త్ర చికిత్స లేదా రక్తనాళాలను ప్రభావితం చేసే వైద్య పరిస్థితులు వంటి వాటి కారణంగా సంభవిస్తుంది. వాస్తవానికి ఆరోగ్యవంతమైన వ్యక్తుల మణికట్టు వంటి ప్రామాణిక పాయింట్లలో పల్స్‌ సులభంగా తెలుస్తుంది, గుర్తించగలం కూడా. అయితే గాయం లేదా ధమనులకు సంబంధించిన సమస్యల కారణంగా కొత్తమందికి బలహీనమైన పల్స్‌ ఉండొచ్చని అన్నారు వైద్యులు. అయితే ఇలా లేకపోవడం మాత్రం మొత్త ఆరోగ్యానికి అంత ప్రమాదకరమేమి కాకపోయినా..కారణమేంటన్నది తెలుసుకోవాల్సిందేనని నొక్కి చెప్పారు.మన హార్ట్‌ బీట్‌ని గుర్తించడానికి ఉపకరించేవి శరీరంలోని పల్స్‌ పాయింట్లేనని అన్నారు. మన శరీరంలో ఎక్కడెక్కర్‌ పల్స్‌ ఉంటాయంటే..రేడియల్ పల్స్: బొటనవేలు బేస్ దగ్గర మణికట్టు మీదకరోటిడ్ పల్స్: మెడకు ఇరువైపులా, వాయునాళం పక్కనఫెమోరల్ పల్స్: గజ్జ ప్రాంతంలోపాప్లిటియల్ పల్స్: మోకాలి వెనుకడోర్సాలిస్ పెడిస్ పల్స్: పాదం పైభాగంలోపోస్టీరియర్ టిబియల్ పల్స్: చీలమండ ఎముక వెనుకఇలా శరీరంలోని ఈ విభిన్న ప్రాంతాల్లోని నాడీ స్పర్శ సాయంతో హృదయ స్పందనని అంచనా వేస్తారు ఆరోగ్య సంరక్షణ నిపుణులు.పల్స్‌ తెలుసుకోవడం ఎలా అంటే..పల్స్‌ను తనిఖీ చేయడం అనేది చాలా ముఖ్యమైనది. పైగా సింపుల్‌ తెలుసుకునే క్లినకల్‌ అంచనా. అందుకోసం మన చూపుడు, మధ్య వేళ్లను పల్స్‌ పాయిట్లపై ఉంచి.. వారి హృదయస్పందన రేటు ఎంత వేగంగా లేదా నెమ్మదిగా ఉందనేది అంచనావేస్తారని చెబుతున్నారు నిపుణులు. అలా అని నిర్లక్ష్యం చెయ్యొద్దు..మణికట్టులో పల్స్‌ లేకపోతే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే..ఆ వ్యక్తికి గాయం లేదా ఎలాంటి శస్త్ర చికిత్సలు జరిగిన ఆరోగ్య చరిత్ర లేకపోతే ప్రమాదకరమేనని హెచ్చరిస్తున్నారు. ఇది రక్తప్రసరణ సరిగా లేకపోవడం లేదా ధమని అడ్డంకి లేదా నరాల సంబంధిత సమస్యని సూచిస్తుంది. దీన్ని గనుక నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యుడిని సంప్రదించనట్లయితే అంతర్లీనంగా ఉన్న వైద్య పరిస్థితిని ముందుగా గుర్తించి అనారోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. View this post on Instagram A post shared by ❤‍🔥Magic_or_fun😆 (@magic_or_fun) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: భారతీయుల దంతాలు బాగుంటాయ్‌..! జర్మన్‌ వ్యక్తి ప్రశంసల జల్లు)

BSNL shown improvements in its financial performance after years of losses8
బీఎస్‌ఎన్‌ఎల్‌కు లాభాల పంట

ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలోనూ టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నష్టాలను వీడి రూ.280 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 849 కోట్ల నికర నష్టం నమోదైంది. గతేడాది క్యూ3(అక్టోబర్‌–డిసెంబర్‌)లోనూ రూ.262 కోట్ల నికర లాభం ఆర్జించిన సంగతి తెలిసిందే. వెరసి 2007 తదుపరి వరుసగా రెండో త్రైమాసికంలోనూ లాభాలు ప్రకటించినట్లు కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సిందియా వెల్లడించారు.గత 18ఏళ్ల తరువాత నిర్వహణ లాభం, సానుకూల మార్జిన్లు, నికర లాభాలు సాధించినట్లు పేర్కొన్నారు. ఫలితంగా మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర నష్టం భారీగా(58 శాతం) తగ్గి రూ.2,247 కోట్లకు పరిమితమైంది. 2023–24లో రూ.5,370 కోట్ల నష్టం నమోదైంది. నిర్వహణ ఆదాయం 8 శాతం ఎగసి రూ.20,841 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 10 శాతం బలపడి రూ.23,400 కోట్లకు చేరగా.. 2023–24లో నమోదైన 3 సర్కిళ్లతో పోలిస్తే సుమారు 10 సర్కిళ్లలో నికర లాభాలు సాధించినట్లు సిందియా వెల్లడించారు.ఇదీ చదవండి: బ్యాంకుల మొండిబాకీలు ‘రైట్‌ఆఫ్‌’గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ.24,432 కోట్ల పెట్టుబడులు వెచ్చించినట్లు తెలియజేశారు. ఆదాయంలో మొబిలిటీ నుంచి 6 శాతం వృద్ధితో రూ.7,499 కోట్లు లభించగా.. ఫైబర్‌ టు హోమ్‌ బిజినెస్‌ 10 శాతం అధికమై రూ.2,923 కోట్లు అందుకుంది. ఎంటర్‌ప్రైజ్‌ విభాగం 4 శాతం పుంజుకుని రూ. 4,096 కోట్ల ఆదాయం సాధించింది. 4జీ, 5జీ సేవలపై దృష్టి పెట్టడం ద్వారా వృద్ధిని కొనసాగించనున్నట్లు కంపెనీ చైర్మన్, ఎండీ ఏ రాబర్ట్‌ జే రవి పేర్కొన్నారు.

Ram Charan Team Up With Director Trivikram9
ఊహించని కాంబో.. ఆ దర్శకుడితో చరణ్?

'ఆర్ఆర్ఆర్' తర్వాత పాన్ ఇండియా క్రేజ్ పెరిగిపోయిందనుకుంటే 'గేమ్ ఛేంజర్'తో రామ్ చరణ్‌కి పెద్ద దెబ్బ పడింది. దీంతో ఫ్యాన్స్ బాగా డీలాపడిపోయారు. అలాంటి టైంలో 'పెద్ది' గ్లింప్స్ రావడంతో ఒక్కసారిగా జోష్ వచ్చింది. ప్రస్తుతానికైతే మెగా అభిమానుల ఆశలన్నీ బుచ్చిబాబు తీస్తున్న ఈ చిత్రంపైనే ఉన్నాయి. మరి దీని తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్‪‌లోనే ఉంది.లెక్క ప్రకారం 'పెద్ది' తర్వాత.. సుకుమార్ దర్శకత్వంలో చరణ్ సినిమా చేయాలి. కానీ స్క్రిప్ట్ పరంగా ఇంకా ఆలస్యమయ్యేలా ఉందని టాక్ వినిపిస్తోంది. దీంతో పలువురి పేర్లు వినిపించాయి. ఇప్పుడు త్రివిక్రమ్ పేరు వార్తల్లోకి వచ్చింది. 'గుంటూరు కారం' తర్వాత అల్లు అర్జున్‌తో భారీ మైథలాజికల్ మూవీ చేయడానికి త్రివిక్రమ్ సిద్ధమయ్యాడు. కానీ అట్లీ రావడంతో ఈ దర్శకుడి ప్రాజెక్ట్ కాస్త వెనక్కి వెళ్లింది.(ఇదీ చదవండి: సందీప్ వంగాకు దీపిక ఇన్ డైరెక్ట్ కౌంటర్?)ప్రస్తుతం ఖాళీ దొరకడంతో త్రివిక్రమ్.. వెంకటేశ్‌తో ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీని గురించి అధికారిక ప్రకటన రావొచ్చు. ఒకవేళ ఇదే సెట్ అయితే వచ్చే వేసవిలో రిలీజ్ ఉండొచ్చు. ఆ తర్వాత చరణ్‌తో త్రివిక్రమ్ ఉండొచ్చని అంటున్నారు. గతంలో వీళ్లిద్దరి కాంబో గురించి టాక్ నడిచింది గానీ తర్వాత తర్వాత సైడ్ అయిపోయింది.మళ్లీ ఇన్నాళ్లకు త్రివిక్రమ్ పేరు చరణ్ కోసం తెరపైకి వచ్చింది. ఒకవేళ ఇది నిజమైతే ఎలాంటి స్టోరీతో వస్తారనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడంతా పాన్ ఇండియా, యాక్షన్ మూవీస్ ట్రెండ్ నడుస్తుంది. త్రివిక్రమ్ చిత్రాలన్నీ ఫ్యామిలీ తరహాలో ఉంటాయి. మరి ఎవరి దారిలోకి ఎవరు వెళ్తారు? వీటన్నింటిపై క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.(ఇదీ చదవండి: ఆ పాట తర్వాత.. అభిషేక్-ఐశ్వర్య పెళ్లి చేసుకుంటారనుకోలేదు!)

Shah Rukh Khan As Brand Ambassador of Candere10
ఒకే ఇంట్లో షెహన్‌షా, బాద్‌షా: కందేరే బ్రాండ్ అంబాసిడర్‌గా షారుక్ ఖాన్

ముంబయి: సోషల్ మీడియాలో జరిగిన చర్చల అనంతంరం చివరకు అధికారిక ప్రకటన వెలువడింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ 'షారుక్ ఖాన్‌'ను కందేరే ప్రీమియం లైఫ్‌స్టైల్ జ్యూవెలరీ బ్రాండ్, తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ ప్రకటన కేవలం ఊహాగానాలకు ముగింపు మాత్రమే కాదు. భారత ఆభరణాల పరిశ్రమలోను, బ్రాండ్ కథనాల ప్రపంచంలోను ఒక కీలక మలుపుగా నిలుస్తోంది.ఈ ప్రచార యాత్ర ప్రారంభమైంది ఒక స్టైలిష్ టీజర్‌తో. అందులో ఖాన్ మెరిసే ఆభరణాలతో ఆకర్షణీయంగా కనిపించడంతో, అభిమానులు ఇది ఆయన సొంత బ్రాండ్ అని భావించారు. షారుక్ ఇప్పటికే అనేక వ్యాపారాల్లో పాల్గొన్న నేపథ్యంలో.. కంపెనీలో ఆయనకు షేర్స్ ఉంటాయనే ఊహలు వెలుగులోకి వచ్చాయి.దీనిపై కందేరే సంస్థ తక్షణమే స్పందిస్తూ.. షారుక్ ఖాన్ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమేనని, కంపెనీలో ఆయనకు ఎలాంటి వాటా లేదని స్పష్టంగా పేర్కొంది. ఇది ప్రచార సంబంధిత భాగస్వామ్యమే అయినప్పటికీ, దీని వెనుక ఉన్న సాంస్కృతిక, వాణిజ్య పరమైన ప్రభావం భారీగానే ఉంది.ఈ భాగస్వామ్యం ద్వారా కల్యాణ్ జ్యూవెలర్స్ గ్రూప్.. భారత సినిమా రంగంలోని ఇద్దరు అగ్రనటులను ఒకే బ్రాండ్ గూటిలో చేర్చింది. ఒకవైపు సంప్రదాయానికి ప్రతీక అయిన అమితాబ్ బచ్చన్ కల్యాణ్ బ్రాండ్‌కు, మరోవైపు ఆధునికత, డిజైన్‌పై దృష్టి పెట్టిన కందేరే బ్రాండ్‌కు షారుక్ ఖాన్ అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తున్నారు.కందేరే ఓమ్ని-చానెల్ బ్రాండ్‌గా 75కి పైగా రిటైల్ అవుట్‌లెట్లు కలిగి ఉంది. ఇది వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే, రోజువారీ ఉపయోగానికి సరిపోయే, ఆధునిక శైలికి అనుగుణంగా రూపొందించిన లైఫ్‌స్టైల్ ఆభరణాలను అందిస్తుంది. షారుక్ ఖాన్ కొత్త ప్రచారం.. కందేరే బ్రాండ్ సంప్రదాయం.. ఆధునికత మధ్య ఉన్న అందమైన సమతౌల్యానికి ప్రతీకగా మారుతోంది. సినిమా గ్లామర్, మిల్లీనియల్స్, జెన్ జెడ్ తరాల అభిరుచులతో మిళితంగా నిలుస్తోంది.మార్కెటింగ్ పరంగా చూస్తే, ఈ డ్యూయల్ సెలబ్రిటీ వ్యూహం అనేది తెలివిగా రూపొందించిన ఒక తరాల వారసత్వ కథనంగా నిలుస్తోంది. బ్రాండ్ విలువను క్షీణింపచేయకుండా, యువత నుంచి వృద్ధుల దాకా అందరినీ కలిపే విధంగా. షెహన్‌షా (బచ్చన్) మరియు బాద్‌షా (ఖాన్) ను ఒకే సంస్థ గూటిలో చేర్చిన కల్యాణ్ హౌస్, సంప్రదాయానికి గౌరవం ఇస్తూనే మార్పును ఆలింగనం చేసే ఆభరణాల సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఇది శాశ్వత సంప్రదాయాల నుంచి ఆధునిక మెరుపుల దాకా, ఇప్పుడు తరాలను ఒకచోట చేర్చే వారసత్వాన్ని సృష్టిస్తోంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement