Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Ysrcp Leaders Sit Demand In Rajahmundry Pharmacy Student Incident1
రాజమండ్రి ఘటనపై సిట్‌తో దర్యాప్తు చేయించాలి : వరుదు కళ్యాణి

తూర్పుగోదావరి జిల్లా,సాక్షి: మహిళలకు అన్యాయం జరిగితే ఒప్పుకోనున్న డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ఎక్కడా? అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల ప్రశ్నించారు. రాజమండ్రి బొల్లినేని ఆసుపత్రిలో ఆత్మహత్యకు పాల్పడిన బాధితురాలి కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, అధికార ప్రతినిధి శ్యామల, మాజీ ఎంపీ భరత్ రామ్‌లు పరామర్శించారు. బొల్లినేని ఆసుపత్రి ఘటనపై సిట్‌ వేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. వరుదు కళ్యాణి: మాట్లాడుతూ.. ఘటన జరిగి 10 రోజులైనా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ ఘటనను పట్టించుకోరా . యువతిని దారుణంగా హింసించి ఆత్మహత్యకు పురిగొలిపేలా చేసిన వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు. ఏ హాస్పిటల్లో అయితే బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడిందో అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించడం దారుణం. జిల్లా యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదు. సీసీటీవీ ఫుటేజ్‌ను ఇప్పటిదాకా ఎందుకు తల్లిదండ్రులకు చూపించలేదు. ఈ ఘటనపై సిట్ వేసి దర్యాప్తు జరపాలి.బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతాం’ అని హెచ్చరించారు.ఆరే శ్యామల అధికార ప్రతినిధి:బాధిత కుటుంబ తల్లడిల్లిపోతుంది. సహాయంగా ఉండాల్సిన ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుంది. మహిళలకు అన్యాయం జరిగితే ఒప్పుకోమన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ. బాధిత తల్లిదండ్రులకు న్యాయం చేయాలి. అంజలికి మెరుగైన వైద్యం అందించే ఏర్పాటు చేయాలి. జరిగింది ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాలి.మాజీ ఎంపీ మార్గాని భరత్: బాధితురాల్ని దారుణంగా హింసించిన దీపక్‌ను శిక్షించాలి. అధికార తెలుగుదేశం పార్టీకి అతడు సన్నిహితుడు కావడంతోనే ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదు. ఈ ఘట్టంపై సమగ్ర విచారణ జరగాలి. బాధిత యువతి తనకు తానుగా ఇంజక్షన్ చేసుకోలేదు.. ఎవరు చేశారన్న విషయాన్ని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేయాలి. ప్రభుత్వాధికారులు ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదు. గతంలో దీపక్ ఎవరెవరుని హింసించాడన్న అంశాన్ని కూడా పోలీసులు పరిశీలించాలి. ఈ ఘటన బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలి.బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి బాధితురాలి తల్లిదండ్రులు :మా బిడ్డను ఆరోగ్యంగా మాతో పంపాలి.లేదంటే అదే ఇంజక్షన్ మాకు ఇవ్వండి.మాకు న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తాం’అని హెచ్చరించారు.

Gujarat Banaskantha Boiler Explosion Triggers Massive Blast2
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 13 మంది మృతి

బనస్కాంత:గుజరాత్‌లోని బనస్కాంతలోని అగ్ని ప్రమాదం(fire accident) చోటుచేసుకుంది. దీసాలోని జీఐడీసీ ప్రాంతంలోని ఒక బాణసంచా కర్మాగారంలో మంగళవారం ఉదయం ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. బాయిలర్‌లో పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగాయి.ఈ ‍ప్రమాదంలో ప్రాథమికంగా ముగ్గురు మృతిచెందారని భావించారు. అయితే ఆ తరువాత మరో పది మృతదేహాలు లభించడంతో మృతుల సంఖ్య 13కి చేరింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఫ్యాక్టరీలోని మండే పదార్థాల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి.అగ్నిమాపక సిబ్బంది(Fire fighters) సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. స్థానిక ఎమ్మెల్యే ప్రవీణ్ మాలి సహా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. పేలుడు కారణంగా భవనంలోని కొంత భాగం కూలిపోయిందని ప్రవీణ్ మాలి తెలిపారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Ration Rice Row: Perni Nani Challange Kutami Prabhutam3
వేధింపులకు భయపడేది లేదు.. వైఎస్సార్‌సీపీని వీడేది లేదు: పేర్ని నాని

కృష్ణా, సాక్షి: ఓటేసి గెలిపించిన ప్రజలకు మేలు చేయకుండా.. వ్యవస్థలను రాజకీయ వేధింపులకు వాడుకుంటోందని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) మండిపడ్డారు. రేషన్‌ బియ్యం వ్యవహారంలో కృష్ణా జిల్లా పోలీసులు హైకోర్టును సంప్రదించిన పరిణామంపై ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘మేం ఏపాపం చేయలేదని పోలీసు వ్యవస్థకు తెలుసు. ప్రభుత్వానికి జరిగిన నష్టానికి రెట్టింపు జమచేశాం. అయినా నా భార్య జయసుధ పై ఏడు సంవత్సరాల పైబడి శిక్ష పడే సెక్షను పెట్టి అరెస్టు చేయాలని చూశారు. ఆ సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని జిల్లా కోర్టు నా భార్యకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు నా భార్యకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లారు.. మా కుటుంబంపై తప్ప సివిల్ సప్లై శాఖ(Civil Supply Ministry) ఇంతవరకూ ఎవరిపైనా ఒక్క క్రిమినల్ కేసు పెట్టలేదు. అసలు సివిల్‌ సప్లై శాఖ అనేది ఏర్పడిన తర్వాత ఇప్పటిదాకా ఇప్పటి వరకు ఎవరిపైనా క్రిమినల్‌ కేసులు లేవు. సాక్షాత్తూ సివిల్ సప్లై మంత్రి వెళ్లి 22 వేల టన్నుల బియ్యం పట్టుకున్నా కేసు లేదు. సీజ్ ద షిప్‌.. సీజ్‌ ద గోడౌన్ అన్నా.. ఎవరిపైనా క్రిమినల్ కేసు లేదు. వాళ్లపై పెట్టింది కేవలం 6A కేసు మాత్రమే. నాకు ముందు కానీ నా తర్వాత కానీ ఒక్కరి పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టలేదు. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నాపై, నా భార్యపై క్రిమినల్‌ కేసులు పెట్టారు... ఎన్నో జరుగుతున్నా అన్నీ 6A కేసులే. ఈ పరిస్థితి చూస్తేనే వాళ్ల దిగజారుడుతనం తెలుస్తోంది. నన్ను, నా భార్యను, నా కొడుకును ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటాం. ఆఖరికి జైలుకు అయినా పోతాం. అంతేగానీ వైఎస్సార్‌సీపీ(YSRCP) నుంచి తప్పుకునేది లేదు. ఎల్లప్పుడూ జగన్ వెంటే ఉంటాం. కూటమి తప్పుల్ని ఎంగడుతూనే ఉంటాం’’ అని పేర్ని నాని అన్నారు.

Ksr Analysis On Pawan, Bjp Politics4
పవన్‌ను వాడుకోవడం.. ఇప్పుడు బీజేపీ వంతు!

అవసరమైతే తమిళనాడుకు కూడా పార్టీని విస్తరిస్తానంటున్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌! వినడానికి బాగానే అనిపించినా ఆయన చెప్పిందైతే వాస్తవం! ఎలాగంటారా? ఏపీలోనే సొంతబలం లేదు కదా? ఇతర రాష్ట్రాలలో ఏం చేయగలుగుతారని మీకు అనిపించవచ్చు. అదే తమాషా రాజకీయం! ఇదంతా భారతీయ జనతా పార్టీ ఆడుతున్న గేమ్ అని అందులో ఈయన ఒక పావుగా మారుతున్నారని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. వామపక్షాల వారైతే బహిరంగంగానే ఈ విమర్శలకు దిగుతున్నారు.రాజకీయాలలోకి వచ్చిన తర్వాత అనేక రూపాలు మార్చుకున్న పవన్ కళ్యాణ్ కొద్ది నెలల క్రితం దక్షిణాది రాష్ట్రాలలో దేవాలయాలను సందర్శించారు. అది కూడా బీజేపీ మాట మేరకే అని ఒక విశ్లేషణ. ఎందుకంటే వచ్చే ఏడాది తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ యోచిస్తోంది. ఇందుకోసం మళ్లీ అన్నా డీఎంకేతో జత కట్టడానికి పావులు కదుపుతోంది. అన్నాడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా ఇందుకు దాదాపు సిద్దమవుతున్నట్లుగానే వార్తలు వస్తున్నాయి. డీఎంకే చేపట్టిన హిందీ వ్యతిరేక ఆందోళన, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి నష్టం కలుగుతున్న అంశాలపై ఆయన వ్యూహాత్మకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వినతిపత్రాలు సమర్పించడానికి ఢిల్లీ వళ్లారు. గతంలో బీజేపీతో పొత్తు ఉన్నా, లోక్‌సభ ఎన్నికల సమయంలో వేర్వేరుగా పోటీ చేశారు. కానీ డీఎంకే మొత్తం స్వీప్ చేసింది. ఆ పార్టీ తమిళనాడులో బలంగా వేళ్లూనుకుంది. జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకే బలహీనపడింది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే బెటర్ అన్న భావన అన్నాడీఎంకేలో ఏర్పడిందని చెబుతున్నారు.ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఈ కూటమిలో చేరతారా? లేదా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. తమ కూటమికి సినీ రంగు అద్దడానికి, తమిళనాడులోని తెలుగు వారిని కొంతమేర ఆకర్షించడానికి పవన్ కళ్యాణ్‌ను ప్రయోగించాలని బీజేపీ తలపెట్టిందని అంటున్నారు. ఒకప్పుడు కులం ఏమిటి? మతం ఏమిటి అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఏకంగా సనాతని వేషం కట్టి దక్షిణాది రాష్ట్రాలు తిరిగి వచ్చారు. ఒక ప్లాన్ ప్రకారం కొద్ది రోజుల క్రితం తమిళ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఏపీలో కేవలం ఆరు శాతం ఓట్లు మాత్రమే వచ్చినా, టీడీపీ పొత్తు కారణంగా జనసేనకు చెందిన 21 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. పవన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది. కాపు సామాజిక వర్గం వారు తమ నుంచి ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావాలని ఎప్పటినుంచో అభిలషిస్తున్నారు.పవన్ కళ్యాణ్ వారి ఆశలపై నీళ్లు జల్లుతూ చంద్రబాబుకు పూర్తిగా వత్తాసు పలుకుతున్నారు. పదిహేనేళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలని అంటున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ సీఎం కాకుండా అడ్డుపడడానికే ఈ వాదన చేస్తున్నారన్న అభిప్రాయం ఉన్నా, అవసరమైతే తన పదవి కోసం లోకేశ్‌కు కూడా విధేయత ప్రదర్శించే అవకాశం ఉంటుందని కొందరి భావన.చంద్రబాబు ఎప్పుడైనా మళ్లీ బీజేపీని వ్యతిరేకించినా, లేక ఏదో ఒక అంశంపై విడిపోవాలని బీజేపీ అనుకున్నా, పవన్ కళ్యాణ్‌ను ప్రొజెక్టు చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్‌కు ఏపీలో పెద్దగా ఓట్లు రాకపోయినా లేకపోయినా, ఆయన సినిమా ఇమేజీని వాడుకుని ఇతర రాష్ట్రాలలో ప్రొజెక్టు చేస్తే దాని ప్రభావం ఏపీపై కూడా ఉండవచ్చన్నది ఒక అంచనా అట.తెలంగాణలో గతంలో బీజేపీ జనసేనతో కలిసి పోటీచేసినా ఫలితం పెద్దగా లేకుండా పోయింది. జనసేన ఒక్క చోట తప్ప పోటీ చేసిన అన్నిచోట్ల డిపాజిట్లు కోల్పోయింది. కాని సనాతని వేషం కట్టి ఇతర రాష్ట్రాలలో పర్యటించడం, ఇప్పుడు తమిళనాడుపై దృష్టి కేంద్రీకరించడం వంటి చర్యల ద్వారా చంద్రబాబుకు ఒక చెక్ గా పవన్ ఉండే అవకాశం ఉంటుంది. బీజేపీ వారు చెప్పినట్లు ప్రచారం చేసి వారితో ఆయన మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోగలిగితే సమీప భవిష్యత్తులో లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేయడం, లేదా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం చంద్రబాబు కుటుంబానికి కుదరకపోవచ్చు. అన్నాడీఎంకే, బీజేపీ కూటమిలో చేరినా తమిళనాడులో జనసేన ఎంతవరకు సఫలం అవుతుందన్నది సందేహమే. సినీ నటుడు కూడా కనుక ప్రచారానికి ఈయనను వాడుకోవచ్చు. అందుకే యథా ప్రకారం పవన్ కళ్యాణ్ ఏపీలో ఎలాంటి అబద్దాలు ఆడారో, అదే తరహాలో తమిళనాడులో కూడా ట్రయల్ ప్రారంభించినట్లు అనిపిస్తుంది.ఉదాహరణకు ఆయనకు తమిళ కవి భారతీయార్ పై అభిమానం ఉందని చెప్పడం, శివాజీ గణేశన్‌కు అభిమానినని, 1982 నుంచి 1995 వరకు చెన్నైలో ఉన్నానని చెప్పడం, మైలాపూర్ పాఠశాలలో చదువుకున్నానని అనడం, కూరగాయల మార్కెట్ కు వెళ్లి తమిళం నేర్చుకున్నానని వెల్లడించడం చూస్తే వీటిలో ఎన్ని నిజాలు ఉన్నాయో, ఎన్ని అబద్దాలు ఉన్నాయో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే పవన్ తన పుట్టిన స్థలం, చదువు గురించి మాత్రమే కాదు..అనేక అంశాలలో ఎన్ని రకాలుగా మాటలు మార్చింది ఏపీ ప్రజలకు తెలుసు. అన్నాడీఎంకే, బీజేపీ కలిస్తే తప్పులేదని, అన్నా డీఎంకేతో జనసేన పొత్తు పెట్టుకోవచ్చని ఆయన అన్నారు. ఇక పిఠాపురంలో హిందీకి అనుకూలంగా మాట్లాడి, తమిళ నేతలను పరోక్షంగా విమర్శించిన పవన్ కళ్యాణ్ అక్కడ మాత్రం మాట మార్చారు. భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తానని చెప్పారు. తద్వారా తమిళ సెంటిమెంట్‌కు అనుకూలంగా మాట్లాడినట్లు కనిపించే యత్నం చేశారన్న మాట.పిఠాపురంలో తమిళ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసుకుని సొమ్ము చేసుకుంటున్నప్పుడు హిందీని వ్యతిరేకించడం ఏమిటని అన్నారు. హిందీని రుద్దవద్దన్నది మాత్రమే తమిళ పార్టీల డిమాండ్. ఇదే అంశంపై అన్నాడీఎంకే కూడా అమిత్‌షా కు విన్నవించింది. పవన్ కళ్యాణ్ మరో ఆశ్చర్యకరమైన అంశం చెప్పారు. 2014లో పార్టీని ప్రారంభించినప్పుడు కనుచూపు మేర చీకటి కనిపించిందని, ఎలా ముందుకు వెళ్లాలో తెలియలేదని, మనసులో ధైర్యం తప్ప మరేమీ లేవని ఆయన అన్నారు. ఇది సత్య దూరమైందో, కాదో ఆయనే ఆలోచించుకోవాలి. జనసేన పార్టీని స్థాపించడం, ఆ వెంటనే చంద్రబాబు కోరిక మేరకు మద్దతు ఇవ్వడం, కనీసం పోటీ కూడా చేయక పోవడం, తదుపరి టీడీసీ కూటమి ప్రభుత్వంతో సంబంధాలు పెట్టుకుని ఎంజాయ్ చేయడం జరిగాయి. చంద్రబాబుకు అవసరమైనప్పుడల్లా స్పెషల్ విమానాలు ఏర్పాటు చేస్తే హైదరాబాద్ నుంచి తరలి వెళ్లేవారు. మరి ఇందులో ఆయనకు చీకటి కనిపించడం ఏమిటో తెలియదు. కాకపోతే 2019లో బీఎస్పీ, వామపక్షాలతో పోటీచేసి ఓటమి చెందినప్పుడు చీకటి కనిపించి ఉండవచ్చు. తన పార్టీ ఒకే సీటు గెలవడం, తనే రెండు చోట్ల ఓడిపోయారప్పుడు. 2019లో కూడా చంద్రబాబుతో పరోక్ష పొత్తు ఉందన్న ఆరోపణలు లేకపోలేదు. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై మొదట పార్లమెంటులో మాట్లాడాలని, అలా కాకుండా ఒకేసారి రోడ్లపైకి వస్తే ఎలా అని ప్రశ్నించారు. అంతే తప్ప దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే తాను కూడా పోరాడతానని చెప్పలేక పోయారు. అదే టైమ్‌లో దక్షిణాదిలో లోక్ సభ సీట్లు తగ్గవని నమ్ముతున్నట్లు ఆయన చెబుతున్నారు.ఏపీలో పార్టీ విస్తరణకు ప్రత్యేకంగా ఎలాంటి అడుగులు వేయకపోయినా, జనసేన నేతలు, కార్యకర్తలు ఆయా నియోజకవర్గాలలో టీడీపీ వారి పెత్తనం కింద నలిగిపోతున్నా, పట్టించుకోని పవన్ కళ్యాణ్ ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తామని చెబుతున్నారు. చంద్రబాబుతో కలిసి చేసిన సూపర్ సిక్స్ అనే అబద్దాల వాగ్దానాలను తమిళనాడులో కూడా చెబుతారేమో తెలియదు. ఈ ఇంటర్వ్యూలలో ఆ జర్నలిస్టులు ఏపిలో ఎన్డీయే కూటమి హామీల అమలు తీరుతెన్నుల గురించి ఒక్క ప్రశ్న కూడా వేసినట్లు కనిపించదు. ముందస్తుగా మాట్లాడుకుని ఉంటే ఇబ్బంది లేని ప్రశ్నలే వేసే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ విప్లవవీరుడు చెగువెరా మొదలు టిడిపి అధినేత చంద్రబాబు వరకు, ప్రధాని మోడీ వరకు ఎన్ని రంగులు మార్చారో ,ఇప్పుడు తమిళనాడులో కూడా ఎన్ని రకాల విన్యాసాలు చేస్తారో, ఆయనను తమిళ ప్రజలు ఎంతవరకు నమ్ముతారో వేచి చూడాల్సిందే. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Arpita Khan hosts lavish Eid bash with Salman Khan and other Bollywood celebreties5
అన్నతో కలిసి గ్రాండ్‌గా ఈద్‌ పార్టీ, సందడి చేసిన సెలబ్రిటీలు

రంజాన్‌ పర్వదినం సందర్బంగా వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరిగాయి. ముఖ్యంగా బాలీవుడ్‌ హీరో సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా శర్మ ఖాన్ సోమవారం రాత్రి ఈద్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోదరుడితో కలిసి గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు. పండుగ వేడుక, గ్లామర్ రెండింటినీ మిళితం చేసిన ఈ స్టార్-స్టడెడ్ ఈవెంట్‌లో పలువురు బాలీవుడ్‌ తారలు సందడి చేశారు. ఈద్ వేడుకలో సాంప్రదాయ లుక్స్‌లో అందరూ మంత్రముగ్ధుల్ని చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో విశేషంగా నిలిచాయి.రంజాన్‌ సందర్బంగా అర్పితా ఖాన్‌ ఇచ్చిన లావిష్‌ పార్టీకి అర్బాజ్ ఖాన్, అల్విరా ఖాన్ , ఆయుష్ శర్మ వంటి కుటుంబ సభ్యులతోపాటు పెళ్లి తరువాత తొలిసారి ఈద్‌ వేడుకలను జరుపుకుంటున్నసోనాక్షి సిన్హా, భర్తతో కలిసి హాజరైంది.అర్పితా శర్మ ఖాన్ నిర్వహించిన స్టార్-స్టడెడ్ ఈద్ వేడుకలో, సోనాలి బింద్రే పింక్ సూట్‌లో అందంగా కనిపించింది. ఇంకా జెనీలియా,రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, షమితా శెట్టి, అంగద్ బేడి, నేహా ధుపియా తదితర బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.అంతకుముందు తన సోదరి గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లోని తన బాల్కనీ నుండి అభిమానులను పలకరించాడు. సల్మాన్ సోదరి అర్పితా కుమార్తె, మేనకోడలితో కలిసి అభిమానులకు కనువిందు చేశాడు. అధిక భద్రతా సమస్యల కారణంగా బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుకనుంచి తెల్లటి కుర్తా-పైజామా ధరించి ఫ్యాన్స్‌ను అభినందించారు. ఈ సందర్బంగా సల్మాన్‌ మూవీ "సికందర్" అంటూ సందడి చేశారు. “షుక్రియా ధన్యవాదాలు ఔర్ సబ్ కో ఈద్ ముబారక్.” అంటూ వారికి ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించి ఒక వీడియోను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.Shukriya Thank you aur sab ko Eid Mubarak! pic.twitter.com/EaW0CeaZWi— Salman Khan (@BeingSalmanKhan) March 31, 2025

SBI Customers Face Issues With Mobile Banking and Fund Transation6
ఎస్‌బీఐ సేవల్లో అంతరాయం: నిలిచిపోయిన ట్రాన్సాక్షన్స్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లు ఆన్‌లైన్ సేవలతో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వెబ్‌సైట్ పర్ఫామెన్స్ ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ డౌన్‌డెటెక్టర్ ప్రకారం, ఈరోజు ఉదయం 8:15 గంటలకు ఈ అంతరాయం ప్రారంభమైంది. 11:45 గంటలకు సమస్య తీవ్రమై 800 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి.వార్షిక ముగింపు కార్యకలాపాల కారణంగా.. ఏప్రిల్ 1 మధ్యాహ్నం 1:00 గంట నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో లైట్, యూపీఐ సేవల వంటి డిజిటల్ సర్వీసులు అందుబాటులో ఉండవని.. ఈ అంతరాయానికి క్షమించమని ఎస్‌బీఐ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది.ఇదీ చదవండి: రూ.8000 కోట్లకు కంపెనీ అమ్మేసి.. ఫిజిక్స్ చదువుతున్నాడుడౌన్‌డెటెక్టర్ ప్రకారం, సుమారు 64 శాతం మొబైల్ బ్యాంకింగ్‌కు సంబంధించిన ఫిర్యాదులు, 33 లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. ఈ అంతరాయం నుంచి బయటపడటానికి కస్టమర్లు యూపీఐ లైట్, ఏటీఎమ్ ఉపయోగించుకోవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.pic.twitter.com/hoCuUxJIdJ— State Bank of India (@TheOfficialSBI) April 1, 2025

Are you trying Ghibli images How safe was it Check Details Here7
Ghibli ఫొటోలు ట్రై చేస్తున్నారా?.. ఇది మీకోసమే!

ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్, వాట్సాప్‌.. ఇలా ఏ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ ఓపెన్‌ చేసినా ఫీడ్‌ మొత్తం జిబ్లీ(Ghibli) ఫొటోలతో నిండిపోతోంది. సామాన్యులు, సినీ తారలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు.. ఇలా అంతా కార్టూన్‌ తరహా ఫొటోలను పంచుకుంటూ మురిసిపోతున్నారు. ఎడాపెడా ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తుండడంతో.. నెట్టింట ఈ నయా ట్రెండ్ ఊపేస్తోంది. అయితే అలా అప్‌లోడ్‌ చేసే ముందు ఇది ఎంతవరకు సురక్షితం అనే ఆలోచన మీలో ఎంతమంది చేస్తున్నారు?.. ఏఐ బేస్డ్ చాట్‌బాట్‌ యూజర్లను ఆకర్షించేందుకు ఆయా కంపెనీలు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి‌. ఇందులో భాగంగానే.. ఓపెన్‌ ఏఐ సంస్థ ఇటీవల చాట్‌జీపీటీలో (ChatGPT) జిబ్లీ స్టూడియోను ప్రవేశపెట్టింది. తమకు కావాల్సిన ఫొటోను ఎంచుకుని.. ఫలానా స్టైల్‌లో కావాలని కోరితే చాలూ.. ఆకర్షనీయమైన యానిమేషన్‌ తరహా ఫొటోలను సృష్టించుకోవచ్చు. ఈ ట్రెండ్‌ విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావడంతో ఇతర ఏఐ ప్లాట్‌ఫామ్‌లు సైతం ఇవే సదుపాయాన్ని అందిస్తున్నాయి. అయితే ఆ వాడకం పరిధి దాటి శ్రుతిమించి పోతోంది. ఎంతవరకు సురక్షితం?ఏదైనా మనం ఉపయోగించినదాన్ని బట్టే ఉంటుంది. అది సాంకేతిక విషయంలో అయినా సరేనని నిఫుణులు తరచూ చెబుతుంటారు. అలాగే జిబ్లీ స్టైల్‌ ఏఐ ఇమేజ్‌ జనరేటర్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సృజనాత్మకత మరీ ఎక్కువైపోయినా.. భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. మరోవైపు వ్యక్తిగతమైన ఫొటోలను ఏఐ వ్యవస్థల్లోకి అడ్డగోలుగా అప్‌లోడ్‌ చేస్తే.. అవి ఫేషియల్‌ డాటాను సేకరించే ప్రమాదమూ లేకపోలేదని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ఇలాగే కొన్ని కంపెనీలు వ్యక్తిగత డాటాను తమ అల్గారిథమ్‌లలో ఉపయోగించుకుంటున్న పరిస్థితులను నిపుణులు ఉదాహరిస్తున్నారు.అలాంటప్పుడు ఏం చేయాలంటే..వ్యక్తిగత ఫొటోలను అప్‌లోడ్‌ చేసేటప్పుడు.. ఆ జనరేటర్‌ను క్షుణ్ణంగా పరిశీలించండి. ప్రైవసీ పాలసీల విషయంలో నమ్మదగిందేనా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకోండి. అందుకోసం సదరు జనరేటర్‌ గురించి నెట్‌లో క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దానికి యూజర్లు ఇచ్చే రివ్యూలను చదవాలి. అన్నికంటే ముఖ్యమైన విషయం.. సున్నితమైన అంశాల జోలికి పోకపోవడం. చిన్నపిల్లల ఫొటోలను ప్రయత్నించకపోవడమే మంచిది. మరీ ముఖ్యమంగా ప్రముఖుల ఫొటోలను ప్రయత్నించకపోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఇది చట్టపరమైన చర్యలకు అవకాశం కూడా ఇచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ప్రస్తుతానికి.. ఛాట్‌జీపీటీ, గూగుల్‌ జెమినీ, ఎక్స్‌ గ్రోక్, డీప్‌ఏఐ, ప్లేగ్రౌండ్‌ఏఐలు.. పరిమితిలో ఉచితంగా,అలాగే పెయిడ్‌ వెర్షన్‌లలోనూ రకరకాల ఎఫెక్ట్‌లతో ఈ తరహా ఎఫె​‍క్ట్‌లను యూజర్లకు అందిస్తున్నాయి. వీటితో పాటు జిబ్లీ ఏఐ కూడా స్టూడియో జిబ్లీస్టైల్‌ ఆర్ట్‌ వర్క్‌తో ఫొటోలను చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. నోట్‌: పర్సనల్‌ డాటా తస్కరణ.. సైబర్‌ నేరాలు పెరిగిపోతున్న రోజుల్లో ఏ టెక్నాలజీని అయినా.. అదీ సరదా కోణంలో అయినా ఆచితూచి.. అందునా పరిమితంగా వాడుకోవడం మంచిదనేది సైబర్‌ నిపుణుల సూచన.

Konstas Handed Cricket Australia Central Contract For 2025 268
బుమ్రాతో గొడవ పడ్డ ఆటగాడికి జాక్‌పాట్‌

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2024-25లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రాతో గొడవ పడ్డ ఆస్ట్రేలియా యువ ఆటగాడు సామ్‌ కొన్‌స్టాస్‌కు జాక్‌పాట్‌ తగిలింది. 2025-26 సంవత్సరానికి గానూ క్రికెట్‌ ఆస్ట్రేలియా కొన్‌స్టాస్‌కు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చింది. కొన్‌స్టాస్‌తో పాటు వివాదాస్పద బౌలింగ్‌ శైలి కలిగిన మాథ్యూ కుహ్నేమన్‌, ఆల్‌రౌండర్‌ బ్యూ వెబ్‌స్టర్‌ కూడా కొత్తగా క్రికెట్‌ ఆస్ట్రేలియా సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ పొందారు. ఈ ముగ్గురి చేరికతో క్రికెట్‌ ఆస్ట్రేలియా సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల సంఖ్య 23కు చేరింది. కొన్‌స్టాస్‌, కుహ్నేమన్‌, వెబ్‌స్టర్‌ ఇటీవల ఆస్ట్రేలియా తరఫున అద్భుత ప్రదర్శనలు చేశారు. ఈ కారణంగా వారు క్రికెట్‌ ఆస్ట్రేలియా వార్షిక కాంట్రాక్ట్‌ పొందారు. కొన్‌స్టాస్‌, వెబ్‌స్టర్‌ భారత్‌తో జరిగిన బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో సత్తా చాటగా.. కుహ్నేమన్‌ ఇటీవల జరిగిన శ్రీలంక సిరీస్‌లో చెలరేగిపోయాడు. ఆ సిరీస్‌లో కుహ్నేమన్‌ 2 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీశాడు. ఫలితంగా ఆసీస్‌ శ్రీలంకను వారి సొంతగడ్డపైఏ 2-0 తేడాతో ఓడించింది. కొన్‌స్టాస్‌ విషయానికొస్తే.. ఇతగాడు తన టెస్ట్‌ కెరీర్‌ను ఘనంగా ప్రారంభించాడు. అరంగేట్రం ఇన్నింగ్స్‌లోనే బుమ్రా లాంటి వరల్డ్‌ క్లాస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ను ఎదుర్కొని హాఫ్‌ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌ తర్వాత కొన్‌స్టాస్‌ చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ చేయనప్పటికీ.. బుమ్రాతో మాటల యుద్దం కారణంగా బాగా పాపులర్‌ అయ్యాడు.వెబ్‌స్టర్‌ విషయానికొస్తే.. ఇతగాడు కూడా బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2024-25లోనే అరంగేట్రం చేశాడు. వెబ్‌స్టర్‌ కూడా తన తొలి మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను బంతితో కూడా రాణించాడు. మిచెల్‌ మార్ష్‌, కెమారూన్‌ గ్రీన్‌ గాయపడటంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన వెబ్‌స్టర్‌ తన తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటి క్రికెట్‌ ఆస్ట్రేలియా సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ పట్టాడు.2025-26 సంవత్సరానికి గానూ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ పొందిన ఆసీస్‌ ఆటగాళ్లు..పాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్, నాథన్ లియాన్, అలెక్స్ కారీ, సామ్ కొన్‌స్టాస్, జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, జై రిచర్డ్‌సన్, స్కాట్ బోలాండ్, లాన్స్ మోరిస్, మాథ్యూ కుహ్నేమన్, ఆడమ్ జంపా, ట్రావిస్ హెడ్, మాట్ షార్ట్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్నస్ లబూషేన్‌, ఉస్మాన్ ఖవాజా, మిచెల్ మార్ష్, బ్యూ వెబ్‌స్టర్, కామెరూన్ గ్రీన్, జేవియర్ బార్ట్‌లెట్

Vizag Chodavaram Court Sensational Judgement in Vepadu Divya Case9
అనకాపల్లి: వేపాడు దివ్య కేసులో సంచలన తీర్పు

అనకాపల్లి, సాక్షి: పదేళ్ల కిందట తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిన్నారి వేపాడు దివ్య హత్య కేసులో సంచలన తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితుడు గుణశేఖర్‌ను దోషిగా ప్రకటించిన చోడవరం కోర్టు.. మరణశిక్షను ఖరారు చేసింది. దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. గుణశేఖర్‌కు దివ్య కుటుంబంతో గొడవలు ఉన్నాయి. ఇది మనసులో పెట్టుకుని.. స్కూల్‌కి వెళ్లి వస్తున్న ఆరేళ్ల చిన్నారి దివ్యను నిందితుడు తన వెంట తీసుకెళ్లాడు. బిళ్లలమెట్ల రిజర్వాయర్‌ వద్దకు తీసుకెళ్లి బీర్‌ బాటిల్‌తో గొంతు కోసి పైశాచికంగా హత్య చేశాడు. ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా జరిపారు. చివరకు బంధువైన గుణ శేఖరే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించుకుని అరెస్ట్‌ చేశారు. ఇన్నేళ్లపాటు విచారణ జరగ్గా.. చివరకు దివ్య కుటుంబానికి న్యాయం జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Payal Rajput Comments On movie Chance In Tollywood10
టాలెంట్‌తో పనిలేదు.. అలాంటి వాళ్లకే ఛాన్సులు ఇస్తున్నారు: పాయల్‌ రాజ్‌పుత్‌

టాలెంట్‌ ఎంత ఉన్నా సరే చిత్రపరిశ్రమలో రాణించడం చాలా కష్టమని ఢిల్లీ బ్యూటీ 'పాయల్‌ రాజ్‌పుత్‌'(Payal Rajput) అన్నారు. 'RX 100' ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీ హిట్‌ కొట్టింది. ఈ సినిమాతోనే ఆమె తెలుగు వారికి ద‌గ్గ‌రైంది. ఈ మూవీ త‌ర్వాత ఆమె వ‌రుస సినిమాలు చేసినప్పటికీ ఏదీ ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. అయితే, చాలారోజుల గ్యాప్‌ తర్వాత వచ్చిన 'మంగ‌ళ‌వారం' సినిమాలో తన నటనతో విశ్వరూపం చూపింది. ఈ సినిమా భారీ విజయం అందుకోవడమే కాకుండా ఒక నటిగా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ‘మంగళవారం’లోని నటనకు గాను జైపుర్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఉత్తమ నటిగా పాయల్‌ అవార్డ్‌ అందుకుంది. అయితే, ఈ సినిమా తర్వాత ఆమెకు భారీ ఛాన్సులు వస్తాయని అందరూ ఆశించారు. కానీ, అలాంటిది ఏమీ జరగలేదు. ఈ క్రమంలో తాజాగా ఇండస్ట్రీపై పాయల్‌ ఒక పోస్ట్‌ చేసింది.ఒక నటిగా రాణించడం అనేది అన్నింటికంటే చాలా కష్టంతో కూడుకున్న విషయం. ప్రతిరోజు కూడా అనిశ్చిత భారంతోనే మొదలౌతుంది. ఎందుకంటే నేను ప్రతిరోజూ ప్రతిభను కప్పివేసే నెపోటిజం (బంధుప్రీతి ), పక్షపాతంతో నిండి ఉన్న ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాను. నాకొక సందేహం ఉంది. నేను అంకితభావంతో ఎంతో కష్టపడుతున్నప్పటికీ వెలుగులు కనిపించడం లేదు. ఆధిపత్యం చెలాయించే ఈ ప్రపంచంలో నిజంగానే రాణించగలనా అనే సందేహం వస్తుంది. అవకాశాలు వచ్చినట్టే వచ్చే చేయి జారిపోతున్నాయి. కొందరు తమ ఇంటిపేరు ఉపయోగించుకొని ఛాన్సులు తెచ్చుకుంటే మరికొందరు సరైన ఏజెంట్స్‌ ద్వారా దక్కించుకుంటున్నారు. ఇలాంటివి నేను చాలా గమనించాను. ఇలాంటి ప్రదేశంలో నేను రాణించగలనా అనే సందేహం వస్తుంటుంది.' అని పాయల్‌ అన్నారు. మంగళవారం (2023) తర్వాత పాయల్‌ రాజ్‌పూత్‌ మరో సినిమా నటించలేదు. అంతటి భారీ విజయాన్ని అందుకున్న ఆమెకు అవకాశాలు రాకపోవడం ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. కాస్త ఓపిక పడితే తప్పకుండా మంచి ఛాన్సులు వస్తాయని సోషల్‌మీడియా ద్వారా ఆమెకు చెబుతున్నారు. పాయల్‌ ట్వీట్‌ను తమ అభిమాన హీరోలు, దర్శకులకు ట్యాగ్‌ చేస్తూ ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి అంటూ రిక్వెస్ట్‌ చేయడం విశేషం. అలా పాయల్‌పై తమ అభిమానాన్ని చాటుతున్నారు. Being an actor is one of the toughest careers out there. Each day starts with the weight of uncertainty, as I step into a world where nepotism and favoritism often overshadow talent. #struggleisreal 🎞️— paayal rajput (@starlingpayal) April 1, 2025There are moments of doubt when I question whether my hard work and dedication can truly shine through in a landscape dominated by privilege. I watch as opportunities slip away to those with famous last names or a powerful agent, wondering if my talent is enough to break…— paayal rajput (@starlingpayal) April 1, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement