Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Kadapa ZP Chairman election unanimous Victory to YSRCP and Shock To TDP1
కూటమి దౌర్జన్యాలకు తెర.. తిరిగింది ఫ్యాన్‌ గిరగిర

సాక్షి నెట్‌వర్క్: అధికార కూటమి ప్రభుత్వ బెదిరింపులు, దౌర్జన్యాలు, అడ్డంకుల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా గురువారం జరిగిన ‘స్థానిక’ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తన హవాను చాటుకుంది. అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగుర వేసింది. ఎక్కడికక్కడ అధికార కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, నేతలు తీవ్ర బెదిరింపులకు పాల్పడినా చాలా చోట్ల వారి ఆటలు సాగలేదు. పలు చోట్ల ఎంతగా ఒత్తిడి ఎదురైనా ఎంపీటీసీ/జెడ్పీటీసీ/వార్డు సభ్యులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, మద్దతుదారుల పక్షానే నిలిచి ప్రభుత్వ పెద్దలకు బుద్ధి చెప్పారు. తీవ్ర నిర్బంధాలు.. ప్రలోభాలు.. భయపెట్టడాలు.. దాడులు.. వైఎస్సార్‌సీపీ సభ్యులపైకి పోలీసుల ప్రయోగాలు.. అయినప్పటికీ అధికార కూటమి పార్టీలకు స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఆశించిన ఫలితం దక్కలేదు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేసినా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తాము గెలిచిన పార్టీ వైఎస్సార్‌సీపీ జెండాను గట్టిగా పట్టుకుని మరోసారి చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. ఎన్ని రకాలుగా ప్రలోభపెట్టినా అధికార టీడీపీ వైపు పెద్దగా మొగ్గు చూపలేదు. ఒక జడ్పీ చైర్మన్, 24 ఎంపీపీ, 17 వైస్‌ఎంపీపీ, 8 కో ఆప్షన్‌ సభ్యుల స్థానాలు మొత్తం కలిపి 50 స్థానాలకు గురువారం ఎన్నికలు జరగగా, 40 స్థానాల్లో (ఇందులో ఒక వైస్‌ ఎంపీపీ రెబల్‌) వైఎస్సార్‌సీపీ గెలిచింది. ఆరు స్థానాల్లో టీడీపీ, రెండు చోట్ల జనసేన, ఒకచోట బీజేపీ.. ప్రలోభాలతో గట్టెక్కారు. 7 స్థానాల్లో ఎన్నిక వివిధ కారణాలతో వాయిదా పడింది. 210 గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచు పదవులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ గురువారం ఎన్నికలు నిర్వహించింది. ఇందులో 184 పంచాయతీల్లో ఉప సర్పంచు ఎన్నిక పూర్తయింది. వార్డు సభ్యుల పదవి ఖాళీగా ఉండటం వల్ల 16 పంచాయతీల్లో ఉప సర్పంచు ఎన్నిక రద్దయింది. మరో పది పంచాయతీల్ల్లో ఉప సర్పంచు ఎన్నిక వాయిదా పడింది. తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన వైఎస్సార్‌ కడప జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ముత్యాల రామగోవిందరెడ్డి ఏకీగ్రవంగా ఎన్నికయ్యారు. దౌర్జన్యకాండ.. వైఎస్సార్‌ జిల్లా గోపవరంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడైన ఉప సర్పంచ్‌ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డిపై దాడి చేస్తున్న టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌ జెడ్పీ పీఠంపై ఫ్యాన్‌ రెపరెపలు వైఎస్సార్‌ జిల్లా జెడ్పీ చైర్మన్‌గా బ్రహ్మంగారిమఠం జెడ్పీటీసీ సభ్యుడు ముత్యాల రామగోవిందురెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి కలెక్టర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ డిక్లరేషన్‌ అందజేసి, ప్రమాణ స్వీకారం చేయించారు. గురువారం ఉదయం 10 గంటలకు సహాయ ఎన్నికల అధికారి, జెడ్పీ సీఈఓ ఓబుళమ్మ వద్ద నామినేషన్‌ దాఖలు చేశారు. 11 గంటలకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. రామగోవిందురెడ్డి అభ్యరి్థత్వాన్ని మాత్రమే జెడ్పీటీసీ సభ్యులు ప్రతిపాదించడం, బలపర్చడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్‌ ప్రకటించారు. జిల్లాలోని 48 మంది జెడ్పీటీసీ సభ్యుల్లో ఒక్కరు మాత్రమే టీడీపీ సభ్యుడు. ఐదుగురు వైఎస్సార్‌సీపీ సభ్యులను టీడీపీ నేతలు బలవంతంగా, ప్రలోభాలతో ఆ పారీ్టలోకి లాక్కున్నారు. ఈ లెక్కన వైఎస్సార్‌సీపీకి నికరంగా 42 సభ్యుల మద్దతు ఉండగా, వేంపల్లె జెడ్పీటీసీ సభ్యుడు రవికుమార్‌రెడ్డి మాతృమూర్తి వియోగంతో ఎన్నికకు హాజరు కాలేకపోయారు. దీంతో 41 మంది జెడ్పీటీసీ సభ్యులు రామగోవిందురెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దాడులకు తెగబడ్డ టీడీపీ శ్రేణులు వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌ ఎన్నికలో గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ కార్యకర్తలు యథేచ్ఛగా దాడులకు తెగించారు. రెండు కార్లలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైన 14 మంది వార్డు సభ్యులు రాగా, గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలోని పెద్దమ్మ గుడి వద్ద పోలీసులు వారిని నిలిపేశారు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లాలని చెప్పడంతో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడైన ఉప సర్పంచ్‌ అభ్యర్థి బీరం రాఘవేంద్రారెడ్డి కారు దిగబోయాడు. అంతలోనే వందల సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కారు వద్దకు వచ్చి అతడిపై దాడి చేస్తూ ఈడ్చుకెళ్లారు. తర్వాత ఆయన అక్కడి నుంచి తప్పించుకుని గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి చేరుకున్నారు. కానీ మిగిలిన వార్డు సభ్యులు కారులోనే ఉండిపోయారు. దీంతో టీడీపీ నేతలు కారు అద్దాలను రాళ్లతో ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో వాహన డ్రైవర్‌తో పాటు వార్డు మెంబర్లకు గాయాలయ్యాయి. పంచాయతీ కార్యాలయంలోకి చొరబడిన టీడీపీ నాయకులు టీడీపీ నాయకులు బచ్చల పుల్లయ్య, బచ్చల ప్రతాప్, తోట మహేశ్వరరెడ్డి, వంగనూరు మురళీధర్‌రెడ్డి, చీమల రాజశేఖరరెడ్డి, గంటా వెంకటేశ్వర్లు, బొగ్గుల సుబ్బారెడ్డి, ఈవీ సుధాకర్‌రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు ఎన్నిక జరుగుతున్న కార్యాలయంలోకి దౌర్జన్యంగా వెళ్లారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అక్కడి నుంచి తరిమేశారు. ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డి కోరం తప్పకుండా ఉండాలని చెప్పడంతో టీడీపీ నాయకులు 10వ వార్డు మెంబర్‌ కందుల బీబీ, 9వ వార్డు మెంబర్‌ షేక్‌ ఖాదర్‌ బాషా, 4వ వార్డు మెంబర్‌ కేశవ స్థానంలో నకిలీ గుర్తింపు కార్డులతో కొత్త వ్యక్తులను వార్డు సభ్యులు అని చెప్పి కార్యాలయంలోకి పంపారు. విచారణలో వారు వార్డు సభ్యులు కాదని నిర్ధారించారు. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి వచ్చేందుకు కారులో ఉన్న వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులు ప్రయతి్నంచగా టీడీపీ నాయకులు మళ్లీ దాడులకు పాల్పడ్డారు. కోరం లేకపోవడంతో ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డి ఎన్నికలను శుక్రవారానికి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా, ఒంటిమిట్ట వైస్‌ ఎంపీపీ ఉప ఎన్నికలో టీడీపీ బెదిరింపులు, ప్రలోభాల పర్వంతో చేజిక్కించుకుంది. ఖాజీపేట ఉప మండలాధ్యక్షురాలిగా వైఎస్సార్‌సీపీ (రెబల్‌) అభ్యర్థి ముమ్మడి స్వప్న విజయం సాధించారు. రాయచోటి రూరల్‌ మండల ఉపాధ్యక్షురాలు–2గా వైఎస్సార్‌ సీపీకి చెందిన శిబ్యాల ఎంపీటీసీ సభ్యురాలు నాగ సుబ్బమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.త్రిపురాంతకంలో టీడీపీకి దిమ్మ తిరిగేలా షాక్‌ప్రకాశం జిల్లాలో గురువారం రెండు ఎంపీపీలు, ఒక వైస్‌ ఎంపీపీ, కో–ఆప్షన్, నాలుగు ఉప సర్పంచ్‌ పదవులకు ఎన్నికలు జరిగాయి. రెండు ఎంపీపీలతో పాటు వైస్‌ ఎంపీపీ, కో–ఆప్షన్‌ సభ్యుడిని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. మార్కాపురం ఎంపీపీగా బండి లక్ష్మిదేవి, త్రిపురాంతకం ఎంపీపీగా ఆళ్ల సుబ్బమ్మ, పుల్లలచెరువు వైస్‌ ఎంపీపీగా లింగంగుంట్ల రాములు, యర్రగొండపాలెం కో–ఆప్షన్‌ సభ్యునిగా సయ్యద్‌ సాధిక్‌లు వైఎస్సార్‌సీపీ తరుఫున ఎన్నికయ్యారు. సృజన, కృష్ణలతో ఎంపీపీ సుబ్బమ్మ త్రిపురాంతకంలో ఎంపీ­టీసీ సభ్యురాలు ఎం.సృజనను భయపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసిన టీడీపీకి ఆమె దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు. ఎంపీపీ ఉప ఎన్నికలో పాల్గొనేందుకు టీడీపీ మద్దతు వర్గంతో వచ్చిన ఆమె వైఎస్సార్‌సీపీ అభ్యర్థినిగా పోటీ చేసిన ఆళ్ల సుబ్బమ్మకు మద్దతుగా చేయి ఎత్తారు. దీంతో మాజీ ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి ఆమె చున్నీ పట్టుకుని లాగాడు. చేయిదించమని గట్టిగా అరుస్తూ గద్దించినా సృజన చలించలేదు. దీంతోపాటు మేడపి గ్రామానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండిపెండెంట్‌ ఎంపీ­టీసీ సభ్యుడు పి.కృష్ణ నేరుగా వచ్చి సుబ్బమ్మకు మద్దతిచ్చారు. ఫలితంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆళ్ల సుబ్బమ్మ ఎంపీపీగా ఎన్నికైంది. పుల్లల­చెరువులో కూడా బలం లేక­పో­యినా టీడీపీ కుయు­క్తులు పన్నింది. రెండు వర్గాలకు సమానంగా ఓట్లు రావడంతో లాటరీలో వైఎస్సార్‌సీపీ వైస్‌ ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది.జగనన్న పార్టీకే జై ‘మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి వెంటే ఉంటానని మాట ఇచ్చాను. నిలబెట్టుకున్నాను. నేను మొదటి నుంచి జగనన్న అభిమానిని. ఆయన చరిష్మాతోనే ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిచా. కొంత మంది నన్ను మభ్య పెట్టాలని చూ­­శారు. మూడు రోజులుగా హౌస్‌ అరెస్ట్‌ చేసి ఇప్పుడు ఎన్నిక సందర్భంగా ఇక్కడికి తీసుకొ­చ్చారు. – ఎం.సృజన, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం–2 ఎంపీటీసీ సభ్యురాలుధీరనారి... నాగేంద్రమ్మప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం వైస్‌ ఎంపీపీ పదవికి గురువారం జరిగిన ఉప ఎన్నికలో టీడీపీకి ఓటు వేయాలని భర్త ఒత్తిడి తెచ్చినా, భార్య మాత్రం వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి ఓటు వేసి అటు నుంచి అటే పల్నాడులోని పుట్టింటికి వెళ్లింది. పుల్లల చెరువు మండలం ముటుకుల విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో పోలయ్య నైట్‌ వాచ్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన భార్య వి.నాగేంద్రమ్మ మర్రివేముల ఎంపీటీసీ సభ్యురాలు. మండల వైస్‌ ఎంపీపీగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు పోలయ్యపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. చేసేదిలేక పోలయ్య తన భార్యతో ఓటు వేయిస్తానని చెప్పారు. ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాగానే ఆమె వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వైస్‌ ఎంపీపీ పోటీలో ఉన్న రాములుకు మద్దతుగా చేయి ఎత్తారు. ఆ తర్వాత తన భర్తతో మాట పడాల్సి వస్తుందని అటునుంచి అటే పల్నాడు జిల్లా దాచేపల్లిలోని తన పుట్టింటికి వెళ్లారు.రామగిరిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీల అడ్డగింతశ్రీ సత్యసాయి జిల్లాలో మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత చిల్లర రాజకీయం చేశారు. రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌ను అడ్డు పెట్టుకుని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను బెదిరించారు. ప్రలోభాలకు గురిచేసే యత్నం చేశారు. మొత్తంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడేలా చేసి ఎంపీపీ పదవి చేజిక్కించుకోవాలని భావించారు. తీవ్ర గందరగోళం మధ్య ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడింది. కంబదూరు ఎంపీపీగా ఎన్నికైన లక్ష్మీదేవితో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీ తలారి రంగయ్య రామగిరి మండలంలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలకు గానూ 9 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచారు. ఎంపీపీ స్థానం జనరల్‌ మహిళకు రిజర్వ్‌ అయింది. ఈ క్రమంలో ఎంపీపీగా ఉన్న మీనుగ నాగమ్మ ఇటీవల మరణించారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే టీడీపీ తరఫున ఒక్క మహిళా సభ్యురాలు కూడా లేకపోవడంతో ఫిరాయింపు రాజకీయాలకు తెరలేపారు. టీడీపీ తరఫున ఒక్కరే ఉన్నారు. భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలకు టీడీపీలోకి లాక్కున్నారు. ముగ్గురూ పురుషులే కావడంతో టీడీపీ తరఫున నామినేషన్‌ వేసేందుకు అభ్యర్థి కూడా లేరు. ఈ క్రమంలో బెంగళూరులో ఉన్న వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆరుగురు రామగిరికి వస్తుండగా.. కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్‌ ప్లాజా వద్దకు పోలీసులు చేరుకుని అడ్డుకున్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు బందోబస్తు మధ్య రామగిరికి తామే తీసుకెళ్తామని, మిగతా వాళ్లు రాకూడదని చెప్పారు. ఈ క్రమంలో ఆలస్యం కావడంతో నామినేషన్‌ దాఖలు చేసేందుకు గడువు మీరిందని.. ఎన్నికను మరుసటి రోజుకు (శుక్రవారానికి) వాయిదా వేస్తున్నట్లు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ సంజీవయ్య ప్రకటించారు. దీంతో మార్గం మధ్యలో ఉన్న వైఎస్సార్‌సీపీ సభ్యులను పెనుకొండ తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌ అక్కడికి చేరుకుని వైఎస్సార్‌సీపీ సభ్యులతో పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌కు వీడియో కాల్‌ కలిపారు. డబ్బులు, పదవులు ఆశ చూపి.. పార్టీ మారాలని వారు కోరగా.. వైఎస్సార్‌సీపీ సభ్యులు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో అనారోగ్యంగా ఉందని.. వాంతి వస్తోందని పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలు భారతి వాహనం నుంచి కిందకు దిగారు. వెనుకే వస్తున్న టీడీపీ నేతలు ఆమెను బలవంతంగా వారి వాహనం ఎక్కించుకుని ఉడాయించారు. మిగిలిన ఐదుగురు వైఎస్సార్‌సీపీ సభ్యులను కర్ణాటక సరిహద్దు వరకు పోలీసులు వదిలివచ్చారు. కాగా, కూటమి పార్టీల నేతలు చెప్పినట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని.. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వ్యవస్థకు చెడ్డపేరు తెస్తోన్న ఎస్‌ఐ మొన్నటి వరకు సెలవులో ఉన్న రామగిరి ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌ ఉన్నఫలంగా ఎంపీపీ ఎన్నికల సమయంలో విధులకు రావడం దేనికి? బందోబస్తులో భాగంగా రామగిరిలో డ్యూటీ ముగించుకుని వెంటనే.. ప్రత్యేక వాహనాల్లో వైఎస్సార్‌సీపీ సభ్యుల వెంట వెళ్లడం.. పరిటాల సునీత, శ్రీరామ్‌తో వీడియో కాల్స్‌ మాట్లాడించి.. బెదిరింపులకు దిగడం సబబు కాదు. రక్షణ కల్పించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కానీ న్యాయ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఎస్‌ఐ సుధాకర్‌ యాదవ్‌ ప్రవర్తించాడు. గత ఎన్నికల్లోనూ ఆయన అనంతపురం జిల్లాలో టీడీపీ తరఫున బరిలో దిగేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత కూడా టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు.– తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేకర్నూలు జిల్లాలో ఫ్యాన్‌ ప్రభంజనంఉమ్మడి కర్నూలు జిల్లాలోని స్థానిక సంస్థల్లో ఏర్పడిన నాలుగు ఖాళీలకు గురువారం నిర్వహించిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. జెడ్పీ కోఆప్షన్‌ సభ్యునిగా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడుకు చెందిన మదర్ఖాన్‌ ఇలియాజ్‌ఖాన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కృష్ణగిరి కోఆప్షన్‌ సభ్యునిగా వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు చిన్నషాలును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తుగ్గలి మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా మండలంలోని శభాష్‌పురం ఎంపీటీసీ సభ్యురాలు రాచపాటి రామాంజనమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వెల్దుర్తి ఎంపీపీగా ఎల్‌.నగరం ఎంపీటీసీ దేశాయి లక్ష్మిదేవమ్మను ఎన్నుకున్నారు. నందిగామ పీఠం వైఎస్సార్‌సీపీదే ఎనీ్టఆర్‌ జిల్లా నందిగామ మండల పరిషత్‌ పీఠాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది. గురువారం నిర్వహించిన ఎన్నికలో రాఘవాపురం ఎంపీటీసీ సభ్యురాలు పెసరమల్లి రమా­దేవి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కిడ్నాప్‌ చేసి దక్కించుకున్న టీడీపీ పల్నాడు జిల్లా అచ్చంపేటలో మొత్తం 17 మంది ఎంపీటీసీ సభ్యుల్లో 16 మంది వైఎస్సార్‌ సీపీ, ఒక్కరు టీడీపీ. వారిలో గ్రంధశిరి ఎంపీటీసీ సభ్యుడు చిలకా జ్ఞానయ్య అనారోగ్యంతో మృతి చెందారు. మిగిలిన 16 మందితో ఎన్నిక నిర్వహించవలసి ఉంది. అయితే బుధవారం పోలీసుల సహాయంతో టీడీపీ నేతలు తొమ్మిది మంది వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్‌ చేశారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ వారికి పచ్చ కుండువాలు కప్పి బలవంతంగా ఎన్నికకు తీసుకువచ్చారు. వైఎస్సార్‌సీపీకి మద్దతిస్తున్న ఆరుగురు ఎంపీటీసీలను ఆలస్యంగా వచ్చారన్న సాకుతో ఎన్నికకు రాకుండా అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నూతన ఎంపీపీగా భూక్యా స్వర్ణమ్మ భాయి ఎంపీపీగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. నరసరావుపేటలో ఎన్నిక బాయ్‌కాట్‌ నరసరరావుపేట వైస్‌ ఎంపీపీ ఎన్నిక కోరం లేదన్న కారణంతో ఆగిపోయింది. మొత్తం 17 మంది ఎంపీటీసీలకు గాను అన్ని స్థానాలు వైఎస్సార్‌సీపీ ఖాతాలోనే ఉన్నాయి. ఇందులో గతంలో వైస్‌ ఎంపీపీగా గెలిచిన యాంపాటి లక్ష్మీ మరణించడంతో గురువారం ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే బుధవారం రాత్రి ఎంపీపీ భర్త మూరబోయిన శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ మండల కనీ్వనర్‌ తన్నీరు శ్రీనిసవారావు, పాలపాడు ఎంపీటీసీ మెట్టు రామిరెడ్డిలను పోలీసుల సహాయంతో టీడీపీ నేతలు అపహరించారు. దీనికి నిరసనగా ఎన్నికలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు పాల్గొనలేదు. విడవలూరులో ఏకపక్షంగా ఎన్నిక నెల్లూరు జిల్లా విడవలూరు ఎంపీపీని గురువారం ఏకపక్షంగా ఎన్నుకున్నారు. మొత్తం 14 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ 12, సీపీఎం 2 స్థానాల్లో గతంలో విజయం సాధించాయి. అయినప్పటికీ బెదిరింపులతో టీడీపీ బలపరిచిన ఏకుల శేషమ్మను ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దగదర్తిలో వాయిదా వేశారు. విశాఖలో వైఎస్సార్‌సీపీకి నాలుగుఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో ఫ్యాన్‌ జోరు పెంచింది. మొత్తం 5 ఎంపీపీ, 2 వైఎస్‌ ఎంపీపీ, ఒక కోఆప్షన్‌ మెంబర్‌కు గురువారం ఎన్నికలు జరిగాయి. వీటిలో 4 ఎంపీపీ, ఒక వైఎస్‌ ఎంపీపీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.సీఎం సొంత జిల్లాలో టీడీపీ అరాచకం తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో గురువారం జరిగిన నాలుగు మండలాల ఎంపీపీ ఉప ఎన్నికల్లో మూడింట్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పరిధిలోని రామకుప్పం ఎంపీపీ స్థానాన్ని, వైస్‌ ఎంపీపీ స్థానాన్ని టీడీపీ అడ్డదారిలో కైవశం చేసుకుంది. రామకుప్పంలో ఉప ఎన్నిక సందర్భంగా ఎనిమిది మంది ఎంపీటీసీలతో ఎమ్మెల్సీ భరత్‌కృష్ణ మండల పరిషత్‌ కార్యాలయానికి బయలు దేరారు. వీరి వాహనాన్ని టీడీపీ మూకలు పథకం ప్రకారం పట్రపల్లి క్రాస్, అన్నవరం క్రాస్, రాజుపేట క్రాస్‌లో అడ్డుకున్నారు. ఎంపీటీసీల వాహనానికి ముందు, వెనుక కార్లు, ట్రాక్టర్లు, టెంపో వాహనాలను అడ్డుపెట్టి ముందుకు కదలకుండా చేశారు. మరి కొన్నిచోట్ల చెట్లను నరికి రోడ్డుకు అడ్డుగా వేశారు. అడ్డుగా ఉన్న వాహనాలు, చెట్లను తొలగించుకుంటూ రామకుప్పం మండల పరిషత్‌ కార్యాలయం చేరేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది. ఆ లోపు టీడీపీ ఆరుగురు ఎంపీటీసీలతో ఎంపీపీ ఎన్నికను పూర్తి చేయించుకున్నారు. చివరకు ఎంపీపీగా టీడీపీ బలపరచిన సులోచనమ్మ, వైస్‌ ఎంపీపీగా టీడీపీ బలపరచిన వెంకట్రామయ్య గౌడ్‌ గెలుపొందారు. ఆ మూడు మండల పరిషత్‌లు వైఎస్సార్‌సీపీ ఖాతాలోకే.. తిరుపతి జిల్లాలోని తిరుపతి రూరల్‌ మండల అధ్యక్షుడిగా మూలం చంద్రమోహన్‌రెడ్డి, చిత్తూరు జిల్లా సదుం మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా మాధవి, తవణంపల్లి ఎంపీపీగా ప్రతాప్‌­సుందర్‌రాయల్‌ రెడ్డి విజయం సాధించారు. వీరు ముగ్గురూ వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులే. చిత్తూరు జిల్లా విజయపురం మండల ఉపాధ్యక్షురాలిగా వైఎస్సార్‌సీపీ బలపరిచిన కన్నెమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కో–ఆప్షన్‌ సభ్యురాలిగా వైఎస్సార్‌సీపీ బలపరచిన నసీమా ఎన్నిక­య్యా­రు. తిరుపతి జిల్లా యర్రావారిపాళెం మండలంలోని చింతగుంట పంచాయతీ ఉప సర్పంచ్‌గా వైఎస్సా­ర్‌­సీపీ మద్దతుదారు అన్నపూర్ణ గెలుపొందారు. చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె ఉప సర్పంచ్‌గా టీడీపీ బలపరచిన వెంకటరమణ గెలుపొందారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం తాళ్లపల్లె పంచాయతీ ఉప సర్పంచ్‌ ఎన్నిక కోరం లేక వాయిదాపడింది. భయపెట్టినా..నిలబడ్డారు నామమాత్రపు బలం లేకపోయినా బాపట్ల నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు టీడీపీ పన్నిన కుట్రలు భగ్నమయ్యాయి. పిట్టలవానిపాలెం ఎంపీపీ పరిధిలో 11 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 10 మంది ఎంపీటీసీలు వైఎస్సార్‌సీపీ తరఫున పోటీకి దిగిన దిందుకూరి సీతారామరాజుకు మద్దతుగా నిలిచి ఓట్లేశారు. ఆయన ఎంపీపీగా ఎన్నికయ్యారు. భట్టిప్రోలు మండల పరిషత్‌ కో–ఆప్షన్‌ సభ్యుడిగా వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు సయ్యద్‌ నబీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం ఉప సర్పంచ్‌గా వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికకాగా, రేపల్లె మండలం పేటేరు ఉప సర్పంచ్‌గా టీడీపీ మద్దతు దారు శ్రీదేవి ఎన్నికయ్యారు. భట్టిప్రోలు మండలం పెదపులివర్రు ఉప సర్పంచ్‌గా టీడీపీ మద్దతు దారుడు శ్రీనివాసరావు, పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం ఉప సర్పంచ్‌గా టీడీపీ మద్దతు పలికిన వాసంతి విజయం సాధించారు. పశ్చిమగోదావరిలో ప్రజాస్వామ్యం ఖూనీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గురువారం జరిగిన ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, ఉప సర్పంచ్‌ ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తూ పచ్చమూకల­ు రెచి్చపోయాయి. అత్తిలిలో 20 ఎంపీటీసీ స్థానాలకు గాను ఒక ఎంపీటీసీ గల్ఫ్‌లో ఉండగా, ప్రస్తుతం వైఎస్సార్‌సీపీకి 13, కూటమికి ఆరుగురు సభ్యుల సంఖ్యాబలం ఉంది. ఐదుగురు సభ్యులను తమవైపు తిప్పుకొనేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి ఎన్నిక జరగకుండా అడ్డుకున్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసం నుంచి ఉదయం 13 మంది సభ్యులు బయలుదేరుతుండగా అధిక సంఖ్యలో కూటమి శ్రేణులు ఇంటిని చుట్టుముట్టారు. రోడ్డుకు మోటారు సైకిళ్లు అడ్డంగా పెట్టి దమ్ముంటే తీసుకువెళ్లమంటూ గొడవకు దిగారు. ఒకానొక దశలో గేట్లు తోసుకుంటూ లోపలకు వచ్చే ప్రయత్నం చేయడంతో ఎంపీటీసీ సభ్యులు కారుమూరి నివాసంలోకి వెళ్లి తలదాచుకోవాల్సి వచి్చంది. మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నిక వాయిదా వేసినట్టు సమాచారం అందాక కూటమి శ్రేణులు కారుమూరి నివాసం నుంచి వెళ్లారు.యలమంచిలిలో హైడ్రామాకూటమి హైడ్రామా నడుమ యలమంచిలి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. 17 మంది ఎంపీటీసీలకు గాను 13 మంది వైఎస్సార్‌సీపీ సభ్యులు కాగా, నలుగురు కూటమి సభ్యులు ఉన్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీపీ ఎన్నిక లాంఛనమే కావాల్సి ఉంది. తమకు ఓటేయాలని వైఎస్సార్‌సీపీ నాయకుల నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయంటూ కూటమి సభ్యులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయగా, అధికారులు ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు. కైకలూరు వైస్‌ ఎంపీపీ ఎన్నికల్లో కూటమి నేతలు అరాచకానికి తెగబడ్డారు. వైఎస్సార్‌సీపీకి చెందిన భుజబలపట్నం ఎంపీ­టీసీ సభ్యుడు పెన్మత్స సూర్యనారాయణరాజును కూటమి నేతలు ఓటింగ్‌కు రాకుండా అడ్డుకున్నారు. ఈ సన్నివేశాన్ని ఫొటోలు తీస్తున్న స్థానిక జర్నలిస్ట్‌ కురేళ్ల కిషోర్‌ను కూటమి నేతలు చితకబదారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ­టీసీని రాకుండా అడ్డుకోవడంతో నియోజకవర్గ ఇన్‌చార్జి దూలం నాగేశ్వరరావు నిరసన వ్యక్తం చేశారు. కూటమి పార్టీకి చెందిన తొమ్మిది మంది మాత్రమే ఎన్నికకు హాజరుకావడంతో కోరం లేక ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు.

Fresh Encounter Breaks Out In Jammu And Kashmir Kathua March 28 Full Details2
జమ్ములో కొనసాగుతున్న ఉగ్ర వేట.. నలుగురు పోలీసుల వీరమరణం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టగా.. మరికొందరి కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. మరోవైపు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీసులు వీరమరణం చెందారు. డీఎస్పీ అధికారి సహా మరో ముగ్గురు సిబ్బందికి ఆస్పత్రిలో చికిత్స అందుతోంది.రాజ్‌బాగ్‌ ప్రాంతంలోని జఖోలె గ్రామం వద్ద గురువారం ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పాక్‌ భూభాగం నుంచి దొంగచాటుగా చొరబడిన ఉగ్రవాదుల ఏరివేతకు చేపట్టిన కార్డన్‌ ఆపరేషన్‌ సుదీర్ఘ ఎదురు కాల్పులకు దారి తీసింది. ఇంకా నలుగురు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.ఇదిలా ఉంటే.. ఆదివారం సాయంత్రం కథువా జిల్లా హిరానగర్‌ సెక్టార్‌లో జమ్మూకశ్మీర్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ (ఎస్‌వోజీ)కి ఎదురుపడ్డ ఉగ్రవాదుల గ్రూపు తప్పించుకుపోయింది. ఘటనాప్రాంతంలో ఎం4 కార్బైన్‌ తపాకులు నాలుగు, గ్రనేడ్లు 2, బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ఒకటి, ఐఈడీ సామగ్రి అక్కడ లభించాయి. శనివారం వీరు లోయమార్గం గుండా, లేదా కొత్తగా నిర్మించిన సొరంగం గుండా చొరబడి ఉంటారని భావిస్తున్నారు. అప్పటి నుంచి డ్రోన్లు, హెలికాప్టర్లు, బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాలు, జాగితాలతో వేటాడుతూనే ఉన్న ఎస్‌వోజీ అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో గురువారం వారి జాడను పసిగట్టింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్లతో సుఫైన్‌ గ్రామ సమీప దట్టమైన అటవీ ప్రాంతం దద్దరిల్లుతోంది. పోలీసులకు తోడు ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌ను కూడా ఉన్నతాధికారులు అక్కడికి తరలించారు.

Robinhood Movie Twitter Review,Public Talk In Telugu3
‘రాబిన్‌హుడ్‌’ మూవీ ట్విటర్‌ రివ్యూ

హీరో నితిన్ గత కొంత కాలంగా వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్నాడు. ఆయన ఖాతాలో ఇటీవలి కాలంలో ఒక్క హిట్ సినిమా కూడా లేదు. ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘మాస్ట్రో’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమవడంతో నితిన్ మార్కెట్ బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’తో గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హీస్ట్ కామెడీ చిత్రంలో నితిన్‌కి జోడీగా శ్రీలీల నటించింది. ఆస్ట్రేలియా క్రికెటర్‌ డెవిడ్‌ వార్నర్‌ ఓ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రచారచిత్రాలకు మంచి స్పందన లభించింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మార్చి 28) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘రాబిన్‌హుడ్‌’కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.రాబిన్‌హుడ్‌ చిత్రానికి ఎక్స్‌లో మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొందరు అంటుంటే...యావరేజ్‌ అని మరికొంతమంది కామెంట్‌ చేస్తున్నారు. Done with my show,good 2nd half, where each & every episode worked out except cringe Leela portions. David Bhai cameo at the end is hilarious!!adidha suprisu song is good..!! Overall a decent commercial entertainer 2.5/5 #Robinhood— Peter Reviews (@urstrulyPeter) March 27, 2025 ఇప్పుడే సినిమా చూశాను. సెకండాఫ్‌ బాగుంది. శ్రీలీల పోర్షన్‌ మినహా ప్రతి ఎపిసోడ్‌ బాగా వర్కౌట్‌ అయింది. డేవిడ్‌ వార్నర్‌ క్యామియో రోల్‌ చివరిలో వచ్చి నవ్వులు పూయిస్తోంది. అదిదా సర్‌ప్రైజ్‌ సాంగ్‌ బాగుంది. ఓవరాల్‌గా ఇది డీసెంట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ అని ఓ నెటిజన్‌ 2.5 రేటింగ్‌ ఇచ్చాడు.#RobinhoodGood 1st half and a bad second half.Not better than bheeshma(as compared by hero). @actor_nithiin @sreeleela14 @VenkyKudumula pic.twitter.com/hZHFLIoHA5— Nenu (@nenuneneh) March 28, 2025 ‘ఫస్టాఫ్‌ బాగుంది. సెకండాఫ్‌ బాగోలేదు. భీష్మతో పోలిస్తే మాత్రం ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి’ అని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.#Robinhood Review : SUMMER FULL FAMILY ENTERTAINER - 3.5/5 🔥🔥🔥ACTOR @actor_nithiin and #RajendraPrasad GAARU DUO WAS THE BIGGEST ASSET TO THE FILM 🎥 DIRECTOR @VenkyKudumula DEALED THE SIMPLE STORY WITH HIS TRADEMARK COMEDY AND SCREENPLAY 💥💥🔥🔥👍👍NEW STAR ⭐️… pic.twitter.com/b8EFYU2PD4— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) March 28, 2025‘సమ్మర్‌ ఫుల్‌ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. రాజేంద్రప్రసాద్‌, నితిన్‌ పాత్రలు పండించిన కామెడీ సినిమాకు ప్రధాన బలం. ఓ సింపుల్‌స్టోరీని వెంకీ కుడుముల తనదైన కామెడీ సీన్లతో, స్క్రీన్ ప్లేతో చక్కగా తీర్చిదిద్దాడు’ అంటూ ఓ నెటిజన్‌ 3.5 రేటింగ్‌చ్చాడు.#Robinhood Bagundhi 2nd half >>>> 1st half David Bhai entry ki theaters resound aeeeComedy bagundhi Songs placement worst except adhi dha suprise song.Overall ga good film😂— NAvANeETh (@Navaneethkittu) March 28, 2025రాబిన్‌హుడ్‌ బాగుంది. ఫస్టాఫ్‌ కంటే సెకండాఫ్‌ బెటర్‌. డేవిడ్‌ భాయ్‌ ఎంట్రీకి థియేటర్స్‌లో రీసౌండే. కామెడీ బాగుంది. అదిదా సర్‌ప్రైజ్‌ మినహా మిగతా పాటల ప్లేస్‌మెంట్స్‌ బాగోలేవు. ఓవరాల్‌గా గుడ్‌ మూవీ అని ఓ వ్యక్తి ట్విటర్‌లో రాసుకొచ్చాడు. Done with 1st Half of #Robinhood !Here is the #Review so far:Strictly Average!! As a commercial cinema, plot and treatment is quite routine, but the comedy by #VennelaKishore & #RajendraPrasad garu worked out to an extent! Generated good laughs in the theatre! Needs a very… https://t.co/3yhnScEFtP— FILMOVIEW (@FILMOVIEW_) March 27, 2025

Rasi Phalalu: Daily Horoscope On 28-03-2025 In Telugu4
ఈ రాశి వారికి వ్యాపారాలలో ఊహించని లాభాలు.. ఉద్యోగాలలో హోదాలు

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి: బ.చతుర్దశి రా.7.12 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: పూర్వాభాద్ర రా.9.46 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.8.28 నుండి 9.16 వరకు, తదుపరి ప.12.31 నుండి 1.19 వరకు,అమృత ఘడియలు: ప.2.05 నుండి 3.38 వరకు.సూర్యోదయం : 6.01సూర్యాస్తమయం : 6.08రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకుయమగండం : ప.3.00 నుండి 4.30 వరకు మేషం... పనులు సకాలంలో పూర్తి కాగలవు. బంధువులతో సఖ్యత. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు. ఉద్యోగాలలో హోదాలు.వృషభం... ఉత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో అనుకూలత. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. అనుకోని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.మిథునం.... ముఖ్యమైన పనులలో అవాంతరాలు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. అనారోగ్యం. దైవదర్శనాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో శ్రమాధిక్యం..కర్కాటకం... ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. పనులలో తొందరపాటు. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపార విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.సింహం.... ఆప్తులు మరింత దగ్గరవుతారు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. ఉద్యోగాలలో మరింత అనుకూలం.కన్య.... కార్యజయం. మొండిబాకీలు వసూలవుతాయి. సోదరులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగాలలో ఊహించని అవకాశాలు.తుల.... కొన్ని పనుల్లో అవాంతరాలు. కుటుంబంలో సమస్యలు. బంధువులతో విభేదాలు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలలో అంచనాలు తప్పుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.వృశ్చికం... కుటుంబంలో చికాకులు. ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. దూరప్రయాణాలు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.ధనుస్సు.... పనుల్లో విజయం సాధిస్తారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు. పాత మిత్రుల కలయిక. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. ఉద్యోగాలలో పురోగతి.మకరం... ఆర్థిక పరిస్థితిలో గందరగోళం. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులు, మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు సంభవం.కుంభం.... పనులు సజావుగా సాగుతాయి. బంధువుల నుంచి ధనలాభం. ఆర్థిక లావాదేవీలలో పురోగతి. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు అధిక లాభాలు. ఉద్యోగాల్లో పైహోదాలు.మీనం.... మిత్రులతో అకారణంగా తగాదాలు. కొన్ని పనులు మధ్యలోనే విరమిస్తారు. కాంట్రాక్టులు చేజారతాయి. ఆర్థిక ఇబ్బందులు. ఉద్యోగాల్లో పనిభారం. వ్యాపారాలు కొంత అనుకూలిస్తాయి.

Donald Trump announces 25percent tariffs on car imports to US5
Donald Trump: మరో టారిఫ్‌ బాంబు 

వాషింగ్టన్‌/టొరంటో/ఫ్రాంక్‌ఫర్ట్‌/టోక్యో: ప్రపంచ దేశాలతో టారిఫ్‌ల యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తారస్థాయికి తీసుకెళ్తున్నారు. తమ దేశంలోకి దిగుమతయ్యే అన్నిరకాల కార్లపైనా సుంకాలను ఎకాయెకి 25 శాతానికి పెంచేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఇది కార్ల విడిభాగాలతో పాటు తేలికపాటి ట్రక్కులకు కూడా వర్తించనుంది. ‘‘కొత్త టారిఫ్‌లు ఏప్రిల్‌ 2 నుంచి అమల్లోకి వస్తాయి. ఇది శాశ్వత నిర్ణయం. దీనిపై వెనక్కు తగ్గేదే లేదు’’ అని ట్రంప్‌ బుధవారం ప్రకటించారు. ‘‘సుంకాలు వద్దనుకునే తయారీ కంపెనీలు అమెరికాలోనే కార్లను తయారు చేసుకుంటే సరి! పైసా కూడా పన్ను కట్టాల్సిన పనుండదు!’’ అంటూ హితవు పలికారు! భారత్‌తో పాటు పలు దేశాలపై ప్రకటించిన పరస్పర సుంకాలు కూడా ఏప్రిల్‌ 2 నుంచే అమల్లోకి వస్తాయని ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. దాన్ని ‘విముక్తి దినం’గా అభివరి్ణంచారు. ఒకట్రెండు రోజుల్లో మరిన్ని కఠిన వాణిజ్య నిర్ణయాలు కూడా ప్రకటించనున్నారు. కార్లపై సుంకాల పెంపుపై ప్రపంచ దేశాలు భగ్గుమన్నాయి. కెనడా, మెక్సికో, చైనా, బ్రెజిల్, జపాన్‌తో పాటు పలు యూరప్‌ దేశాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించాయి. దీన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. లేదంటే తగిన ప్రతి చర్య తప్పదని హెచ్చరించాయి. ట్రంప్‌ నిర్ణయం ప్రభావం భారత్‌పైనా పడనుంది. టాటా మోటార్స్, ఐషర్‌ మోటార్స్‌ వంటి ఆటో దిగ్గజాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. త్వరలో ప్రతీకార చర్యలు: కెనడా ట్రంప్‌ ప్రకటించిన కార్ల సుంకాలను కెనడాపై ప్రత్యక్ష దాడిగా ప్రధాని మార్క్‌ కార్నీ అభివరి్ణంచారు. దీనిబారి నుంచి తమ దేశాన్ని, కార్ల పరిశ్రమను, కంపెనీలను, కార్మికులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుని తీరతామని ప్రకటించారు. దీనికి తప్పకుండా ప్రతీకార చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. వాటిపై నిర్ణయం తీసుకునేందుకు ‘అమెరికాతో సంబంధాలపై కేబినెట్‌ కమిటీ’తో కార్నీ గురువారం అవ్యతసరంగా సమావేశం కానున్నారు. ఇందుకోసం ఎన్నికల ప్రచారం నుంచి ఆయన ఉన్నపళాన ఒట్టావా చేరుకున్నారు. ట్రంప్‌ టారిఫ్‌ల బారినుంచి దేశీయ ఆటో పరిశ్రమను కాపాడేందుకు కెనడా ఇప్పటికే 140 కోట్ల డాలర్ల నిధిని ఏర్పాటు చేసింది. అమెరికాకు కెనడా ఎగుమతుల్లో ఆటో ఉత్పత్తులది రెండో స్థానం. యూరప్‌ ఆందోళన ఆర్థిక మందగమనంతో ఇప్పటికే సతమతమవుతున్న యూరప్‌ కార్ల పరిశ్రమపై ట్రంప్‌ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. బీఎండబ్ల్యూ, ఫోక్స్‌వాగన్, మెర్సిడెజ్‌–బెంజ్, వోల్వో, స్టెలాంటిస్‌ వంటి యూరప్‌ తయారీ కార్ల ధరలు అమెరికాలో భారీగా పెరగనున్నాయి. ట్రంప్‌ చర్యను అక్కడి కార్ల దిగ్గజాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది అమెరికాపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని యూరప్‌ ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం హెచ్చరించింది. అందుకు తగ్గట్టుగానే ట్రంప్‌ ప్రకటన తర్వాత ఫోర్డ్, జనరల్‌ మోటార్స్‌ వంటి అమెరికా కార్ల తయారీ దిగ్గజాల షేర్ల ధరలు పతనమయ్యాయి. యూరప్‌ ఆటో పరిశ్రమకు అమెరికాయే అతి పెద్ద దిగుమతిదారు. 2023లో అక్కడినుంచి అమెరికాకు 560 కోట్ల యూరోల విలువైన వాహనాలు, విడిభాగాలు ఎగుమతయ్యాయి. ఇటలీ, జర్మనీ కార్ల ఎగుమతుల్లో 30 శాతం వాటా అమెరికాదే. అమెరికా కార్ల ఎగుమతుల్లో యూరప్‌ వాటా కేవలం 2 శాతమే. జపాన్‌ కార్లకు అమెరికాయే అతి పెద్ద దిగుమతిదారు. దాంతో ట్రంప్‌ నిర్ణయం గురువారం జపాన్‌ పార్లమెంటును కుదిపేసింది. ప్రధాని షిగెరు ఇషిబా దీనిపై సభలో ప్రకటన చేశారు. తాజా నిర్ణయం నుంచి తమను మినహాయించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించారు. బ్రెజిల్‌ అధ్యక్షుడు లులా డసిల్వా కూడా ట్రంప్‌ నిర్ణయంపై మండిపడ్డారు. స్వేచ్ఛా వాణిజ్య విలువలకు ఇష్టానికి తూట్లు పొడవడం ద్వరా ట్రంప్‌ సర్కారు దారుణంగా ప్రవర్తిస్తోందంటూ తూర్పారబట్టారు. ‘‘ట్రంప్‌ తాను ప్రపంచానికే అధ్యక్షుడినని భావిస్తున్నారు. ఈ మతిలేని నిర్ణయాలు అంతిమంగా అమెరికాతో పాటు ఎవరికీ మంచి చేయవు’’ అని హెచ్చరించారు. అమెరికా టారిఫ్‌లపై ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.అమెరికాపైనా ప్రభావం ట్రంప్‌ కార్ల టారిఫ్‌ నిర్ణయం ప్రభావం అమెరికాపైనా గట్టిగానే పడనుంది. ముఖ్యంగా డెట్రాయిట్‌ వంటి కార్ల పరిశ్రమ కేంద్రాలకు ఇది కోలుకోలేని దెబ్బే కానుంది. అక్కడి నుంచి ఒక్క కెనడాకే 40 శాతం కార్లు ఎగుమతి అవుతాయి. ఇతర దేశాలన్నీ అమెరికాపై విధించబోయే ప్రతీకార సుంకాలు దేశీయ కార్ల పరిశ్రమ నడ్డి విరవడం ఖాయమని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. ‘‘కార్ల కంపెనీలు తయారీ యూనిట్లు అమెరికా బయటికి తరలి వేలాది మంది ఉపాధి కోల్పోవచ్చు. సరిహద్దులకు రెండు వైపులా చాలా కార్ల కంపెనీలు మూతబడటం ఖాయం. ఏప్రిల్‌ 2 అమెరికాకు విముక్తి దినమని ట్రంప్‌ అనుకుంటున్నారు. కానీ నిజానికి అది ఆ దేశం పాలిట వినాశ దినం కాబోతోంది’’ అని కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌ గవర్నర్‌ డౌగ్‌ ఫోర్డ్‌ చెప్పారు.2024లో అమెరికా దిగుమతి చేసుకున్న కార్లు, ట్రక్కులు దాదాపు 80 లక్షలు వాటి విలువ24,000 కోట్ల డాలర్లు

Lucknow Super Giants beat Sunrisers Hyderabad by 5 wickets6
జెయింట్స్‌ సూపర్‌ విక్టరీ

ఉప్పల్‌ స్టేడియంలో మళ్లీ పరుగులు వరద పారింది. దాదాపు 400 పరుగులు కూడా నమోదయ్యాయి. కానీ ఫలితం మాత్రం పూర్తి భిన్నంగా వచ్చింది. ప్రతీసారి విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతూ ప్రత్యర్థిని ఊపిరాడకుండా చేసే సన్‌రైజర్స్‌ ఈసారి ఓటమి పక్షాన నిలిచింది. బలహీన బౌలింగ్‌గా అనిపించిన లక్నో పట్టుదలగా ఆడి రైజర్స్‌ను 200 గీత దాటకుండా చేస్తే... ఆపై లక్నో బ్యాటర్లు పూరన్, మిచెల్‌ మార్ష్లు సన్‌రైజర్స్‌కు వారి బ్యాటింగ్‌ దెబ్బనే రుచి చూపించారు. ఫలితంగా హైదరాబాద్‌కు అనూహ్య ఓటమి ఎదురుకాగా... లక్నో గెలుపు బోణీ చేసింది. ఏడాది క్రితం ఇదే మైదానంలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న లక్నో టీమ్‌ ఇప్పుడు బదులు తీర్చుకుంది. సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు సొంతగడ్డపై తొలి పరాజయం ఎదురైంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ 5 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ట్రావిస్‌ హెడ్‌ (28 బంతుల్లో 47; 5 ఫోర్లు,3 సిక్స్‌లు), అనికేత్‌ వర్మ (13 బంతుల్లో 36; 5 సిక్స్‌లు), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (28 బంతుల్లో 32; 2 ఫోర్లు) జట్టు ఇన్నింగ్స్‌లో కీలక పరుగులు సాధించారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శార్దుల్‌ ఠాకూర్‌ 34 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్నో 16.1 ఓవర్లలో 5 వికెట్లకు 193 పరుగులు చేసి గెలిచింది. నికోలస్‌ పూరన్‌ (26 బంతుల్లో 70; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), మిచెల్‌ మార్ష్ (31 బంతుల్లో 52; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 43 బంతుల్లోనే 116 పరుగులు జోడించారు. అభిషేక్, ఇషాన్‌ విఫలం సన్‌రైజర్స్‌కు ఈసారి సరైన ఆరంభం లభించలేదు. శార్దుల్‌ వరుస బంతుల్లో అభిషేక్‌ శర్మ (6), గత మ్యాచ్‌ సెంచరీ హీరో ఇషాన్‌ కిషన్‌ (0)లను వెనక్కి పంపడంతో 15 పరుగులకే జట్టు 2 వికెట్లు కోల్పోయింది. అయితే హెడ్‌ మాత్రం తన జోరు తగ్గించలేదు. అవేశ్‌ ఓవర్లో అతను 2 సిక్స్‌లు, ఫోర్‌తో చెలరేగాడు. రవి బిష్ణోయ్‌ ఓవర్లో 35 పరుగుల వద్ద హెడ్‌ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను పూరన్‌ వదిలేశాడు. అదే ఓవర్లో బిష్ణోయ్‌ కూడా కఠినమైన మరో రిటర్న్‌ క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. అయితే దాని వల్ల ఎక్కువ నష్టం జరగలేదు. మరో 12 పరుగులు జోడించిన హెడ్‌ను ప్రిన్స్‌ యాదవ్‌ అద్భుత బంతితో క్లీన్‌»ౌల్డ్‌ చేశాడు. ప్రిన్స్‌కు ఐపీఎల్‌లో ఇది తొలి వికెట్‌ కావడం విశేషం. మరో ఎండ్‌లో బాగా తడబడిన నితీశ్‌ ధాటిగా ఆడటంలో విఫలమయ్యాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు దూకుడు ప్రదర్శించిన క్లాసెన్‌ (17 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్‌) దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు. అయితే అనికేత్, ప్యాట్‌ కమిన్స్‌ (4 బంతుల్లో 18; 3 సిక్స్‌లు) సిక్సర్లు స్కోరును 200 పరుగులకు చేరువగా తెచ్చారు. బిష్ణోయ్‌ ఓవర్లో రెండు వరుస సిక్స్‌లు బాదిన అనికేత్‌...రాఠీ ఓవర్లోనూ వరుసగా రెండు సిక్సర్లతో చెలరేగాడు. అయితే తర్వాతి బంతికీ ఇదే ప్రయత్నంలో క్యాచ్‌ ఇచ్చి అతను వెనుదిరిగాడు. చివరి 2 ఓవర్లలో కలిపి 10 పరుగులే చేయగలిగిన హైదరాబాద్‌ ఆఖరి 16 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా లేకపోవడం గమనార్హం. మెరుపు భాగస్వామ్యం... షమీ తన తొలి ఓవర్లో మార్క్‌రమ్‌ (1)ను అవుట్‌ చేసిన ఆనందం రైజర్స్‌ శిబిరంలో ఎంతోసేపు నిలవలేదు. అక్కడి నుంచి మార్ష్, పూరన్‌ కలిసి రైజర్స్‌ బౌలర్ల భరతం పట్టారు. సిమర్జీత్‌ ఓవర్లో పూరన్‌ ఫోర్, 2 సిక్స్‌లు బాదగా, షమీ ఓవర్లో మార్ష్ 2 సిక్స్‌లు కొట్టాడు. అభిషేక్‌ ఓవర్లో కూడా పూరన్‌ 2 సిక్స్‌లు కొట్టడంతో పవర్‌ప్లేలో లక్నో స్కోరు 77 పరుగులకు చేరింది. ఆ తర్వాత పూరన్‌ మరింత చెలరేగిపోయాడు. 18 బంతుల్లోనే ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పూరన్‌ అవుటైన తర్వాత 29 బంతుల్లో మార్ష్ అర్ధ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో బదోని (6), పంత్‌ (15) అవుటైనా... మిల్లర్‌ (13 నాటౌట్‌), సమద్‌ (8 బంతుల్లో 22 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కలిసి విజయాన్ని పూర్తి చేశారు. మూడు బంతులు, మూడు సిక్సర్లు... సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ కమిన్స్‌ బ్యాటింగ్‌ ఆసక్తికరంగా సాగింది. తాను ఎదుర్కొన్న తొలి 3 బంతులను అతను సిక్సర్లుగా మలిచాడు. శార్దుల్‌ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన అతను, అవేశ్‌ ఓవర్లో తొలి బంతిని సిక్సర్‌ కొట్టి తర్వాతి బంతికే వెనుదిరిగాడు. అనూహ్య రనౌట్‌... టాప్‌–3 బ్యాటర్లు వెనుదిరిగిన తర్వాత రైజర్స్‌ ఆశలన్నీ క్లాసెన్‌పైనే ఉన్నాయి. అతనూ అప్పటికే చక్కటి షాట్లతో ధాటిని ప్రదర్శిస్తున్నాడు. అయితే ప్రిన్స్‌ యాదవ్‌ ఓవర్లో అతను రనౌట్‌ కావడం జట్టు తుది స్కోరుపై ప్రభావం చూపించింది. ప్రిన్స్‌ వేసిన బంతిని నితీశ్‌ బలంగా బాదగా బౌలర్‌ దానిని క్యాచ్‌ అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే అది విఫలం కాగా, బంతి చేతులను తాకి నాన్‌ స్ట్రయికింగ్‌ స్టంప్స్‌ వైపు వెళ్లింది. అప్పటికే పరుగు కోసం క్రీజ్‌ దాటిన క్లాసెన్‌ రనౌటవక తప్పలేదు. ఎవరీ అనికేత్‌ వర్మ...? ఐదు సిక్సర్లతో సన్‌రైజర్స్‌ అభిమానులను ఆకట్టుకున్న అనికేత్‌ వర్మ గత మ్యాచ్‌తోనే ఐపీఎల్‌లోకి అడుగు పెట్టాడు. రాజస్తాన్‌తో పోరులో తన రెండో బంతికే అతను సిక్స్‌ కొట్టాడు. ఐపీఎల్‌కు ముందు అతను సీనియర్‌ స్థాయిలో ఒకే ఒక టి20 మ్యాచ్‌ ఆడాడు. మధ్యప్రదేశ్‌ తరఫున బరిలోకి దిగిన అనికేత్‌ హైదరాబాద్‌తో జరిగిన ముస్తాక్‌ అలీ ట్రోఫీ మ్యాచ్‌లో తొలి బంతికే డకౌటయ్యాడు. అయితే అండర్‌–23 స్థాయి తన దూకుడైన ప్రదర్శనతో అతను అందరి దృష్టిలో పడ్డాడు. దేశవాళీ అండర్‌–23 వన్డే టోర్నీలో 7 మ్యాచ్‌లలో 16 సిక్సర్లు బాదాడు. మధ్యప్రదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో కూడా చెలరేగిన తీరును చూసి సన్‌రైజర్స్‌ వేలంలో కనీస విలువ రూ. 30 లక్షలకు అనికేత్‌ను తీసుకుంది. పుట్టింది ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోనే అయినా మెరుగైన అవకాశాల కోసం సరిహద్దు రాష్ట్రం మధ్యప్రదేశ్‌ చేరుకొని అక్కడే ఆటను మొదలు పెట్టాడు. ఐపీఎల్‌లో నేడుచెన్నై X బెంగళూరువేదిక: చెన్నైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారంస్కోరు వివరాలు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: హెడ్‌ (బి) ప్రిన్స్‌ 47; అభిషేక్‌ (సి) పూరన్‌ (బి) శార్దుల్‌ 6; ఇషాన్‌ కిషన్‌ (సి) పంత్‌ (బి) శార్దుల్‌ 0; నితీశ్‌ రెడ్డి (బి) రవి బిష్ణోయ్‌ 32; క్లాసెన్‌ (రనౌట్‌) 26; అనికేత్‌ (సి) మిల్లర్‌ (బి) రాఠీ 36; అభినవ్‌ మనోహర్‌ (సి) సమద్‌ (బి) శార్దుల్‌ 2; కమిన్స్‌ (సి) రాఠీ (బి) అవేశ్‌ 18; హర్షల్‌ (నాటౌట్‌) 12; షమీ (సి) బదోని (బి) శారుŠద్‌ల్‌ 1; సిమర్జీత్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–15, 2–15, 3–76, 4–110, 5–128, 6–156, 7–156, 8–176, 9–181. బౌలింగ్‌: శార్దుల్‌ ఠాకూర్‌ 4–0–34–4, అవేశ్‌ ఖాన్‌ 4–0–45–1, దిగ్వేశ్‌ రాఠీ 4–0–40–1, రవి బిష్ణోయ్‌ 4–0–42–1, ప్రిన్స్‌ యాదవ్‌ 4–0–29–1. లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మార్ష్ (సి) నితీశ్‌ రెడ్డి (బి) కమిన్స్‌ 52; మార్క్‌రమ్‌ (సి) కమిన్స్‌ (బి) షమీ 1; పూరన్‌ (ఎల్బీ) (బి) కమిన్స్‌ 70; పంత్‌ (సి) షమీ (బి) హర్షల్‌ 15; బదోని (సి) హర్షల్‌ (బి) జంపా 6; మిల్లర్‌ (నాటౌట్‌) 13; సమద్‌ (నాటౌట్‌) 22; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (16.1 ఓవర్లలో 5 వికెట్లకు) 193. వికెట్ల పతనం: 1–4, 2–120, 3–138, 4–154, 5–164. బౌలింగ్‌: అభిషేక్‌ శర్మ 2–0–20–0, షమీ 3–0–37–1, సిమర్జీత్‌ సింగ్‌ 2–0–28–0, కమిన్స్‌ 3–0–29–2, ఆడమ్‌ జంపా 4–0–46–1, హర్షల్‌ పటేల్‌ 2–0–28–1, ఇషాన్‌ కిషన్‌ 0.1–0–4–0.

Center deposited second installment of advance for Polavaram works in the state treasury7
రూ.2,704.81 కోట్లనూ మళ్లించిన సర్కారు

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి వీలుగా.. నిధుల సమస్య ఉత్ప­న్నం కాకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 12న రెండో విడత అడ్వాన్సుగా ఇచ్చిన రూ.2,704.81 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవ­సరాలకు మళ్లించేసింది. తక్షణమే ఆ నిధులను సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ ఖాతాలో జమ చేసి, రసీదు పంపాలంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికా­రులు రోజూ ఒత్తిడి చేస్తుండటంతో జల వనరుల శాఖ అధి­కారులు బెంబేలెత్తిపోతున్నారు. నిర్వాసితు­లకు పరి­హా­­రం, సేకరించాల్సిన భూమికి పరిహారం, చేసిన పనులకు బిల్లులు చెల్లించడానికి మాత్రమే వినియో­గిం­చాల్సిన అడ్వాన్సు నిధులను మళ్లీ దారి మళ్లించేయడంపై అధికారవర్గాల్లో జోరుగా చర్చ సాగు­తోంది. గత ఏడాది అక్టోబర్‌ 9న తొలి విడత అడ్వా­న్సుగా ఇచ్చిన రూ.2,348 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇదే రీతిలో మళ్లించేసింది. కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరకు జనవరి రెండో వారంలో వాటిని నోడల్‌ ఏజెన్సీ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఖర్చు పెట్టిన నిధులను తిరిగిస్తే చంద్రబాబు గగ్గోలుగతంలో పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులను కేంద్ర ప్రభుత్వం తిరిగి (రీయింబర్స్‌ చేసేది) ఇచ్చేది. అంటే.. కేంద్రం రీయింబర్స్‌ చేసిన నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులే. ఆ నిధులను ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పథకాల కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వినియోగిస్తే.. పోలవరం నిధులను దారి మళ్లించేశారంటూ చంద్రబాబుతోపాటు టీడీపీ నేతలు అప్పట్లో దుష్ఫ్రచారం చేశారు. రీయింబర్స్‌మెంట్‌ ప్రక్రియలో జాప్యం వల్ల రాష్ట్ర ఖజానాపై తీవ్ర భారం పడుతోందని.. అడ్వాన్సుగా నిధులు ఇచ్చి ప్రాజెక్టు పనులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన విజ్ఞప్తికి ప్రధాని మోదీ అప్పట్లో సానుకూలంగా స్పందించారు. ఆ మేరకు పోలవరం ప్రాజెక్టు పనులకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.459.68 కోట్లను రీయింబర్స్‌ చేయడంతోపాటు రూ.2,348 కోట్లను తొలి విడత అడ్వాన్సు రూపంలో మొత్తం రూ.2,807.68 కోట్లను విడుదల చేస్తూ కేంద్ర జల్‌ శక్తి శాఖ అక్టోబర్‌ 9న ఉత్తర్వులు జారీ చేసింది. అదే రోజున వాటిని రాష్ట్ర ఖజానాలో జమ చేసింది. ఈ నిధులను సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ అకౌంట్‌లో జమచేసి.. పోలవరం ప్రాజెక్టులో కేంద్ర కేబినెట్‌ నిర్దేశించిన పనులకు మాత్రమే ఖర్చు చేయాలనే నిబంధన పెట్టింది. ఈ నిధుల్లో 75 శాతం ఖర్చు చేశాక.. వినియోగ ధ్రువీకరణ పత్రాలు (యూసీలు) పంపితే మిగతా నిధులు ఇస్తామని స్పష్టం చేసింది. ఈ నెల 12న రెండో విడత అడ్వాన్సుగా ఇచ్చిన రూ.2,704.81 కోట్ల విషయంలోనూ ఇదే నిబంధనలు పెట్టింది. అప్పట్లో రీయింబర్స్‌ చేసిన నిధులను మళ్లించేశారంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు అడ్వాన్సు నిధులను మళ్లించేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

Sakshi Editorial On India Bangladesh relations8
బంగ్లాతో మళ్లీ చెలిమి!

నిరుడు ఆగస్టులో జరిగిన తిరుగుబాటులో అప్పటి బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా పదవి కోల్పోయి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నప్పటి నుంచీ భారత–బంగ్లాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాన సలహాదారు మహ్మద్‌ యూనుస్‌కు లేఖ రాయటం ఆహ్వానించదగ్గ పరిణామం. బంగ్లా జాతీయ దినోత్సవం సందర్భంగా త్యాగాల పునాదులపై నిర్మితమైన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షించారు. పదిహేనేళ్లు పాలించిన హసీనా మత ఛాందసుల్ని అదుపులో పెట్టడంలో సాధించిన విజయాలు ప్రశంసనీయమైనా, రిగ్గింగ్‌తో విజయాన్ని చేజిక్కించుకోవటం, విపక్ష నేతలను ఏళ్ల తరబడి జైళ్లపాలు చేయటం వంటి ధోరణుల్ని ఎవరూ జీర్ణించుకోలేక పోయారు. తిరుగుబాటు జరి గాక, జనం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టయింది. హసీనా పార్టీ అవామీ లీగ్‌ నేత లపైనా, కార్యకర్తలపైనా దాడులతో పాటు ఆ పార్టీకి మద్దతు పలికారంటూ పలువురి ఆస్తుల్ని ధ్వంసం చేయటం మితిమీరింది. ఈ అరాచకం ఆపకపోగా అంతా సవ్యంగా ఉందంటూ యూనుస్‌ దబాయింపులకు దిగారు. మతఛాందసులది పైచేయి అయి మహిళలపైనా, మైనారిటీ హిందూ వర్గంపైనా దాడులకు పూనుకుంటున్నా... వివిధ ప్రాంతాల్లో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు బాగా పెరిగినా అదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. గత డిసెంబర్‌లో ఆ దేశాన్ని సందర్శించిన మన విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రి ఈ నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను బంగ్లా విదేశాంగ సలహాదారు మహమ్మద్‌ తౌహిద్‌ హుస్సేన్‌కు అందజేశారు. భౌగోళిక రాజకీయ కోణంలో బంగ్లాదేశ్‌తో చెలిమి భారత్‌కు చాలా అవసరం. అది చిన్న దేశమే అయినా దానితో మనకు 4,096 కిలోమీటర్ల మేర సరిహద్దువుంది. ఇందులో నదీ పరీవాహక ప్రాంతం వేయి కిలోమీటర్లపైన ఉంటుంది. తాగునీటికైనా, సాగునీటికైనా తీస్తా నదీజలాలు ఆ దేశానికి ప్రాణప్రదమైనవి. ఆ నది ప్రవహించే 315 కిలోమీటర్లలోనూ 130 కిలోమీటర్లు బంగ్లాదేశ్‌ భూభాగంలోనే ఉంటుంది. పశ్చిమబెంగాల్‌లోని గజల్‌డోబా బరాజ్‌ వల్ల భారీ మొత్తం జలాలు ఆ రాష్ట్రానికే పోతాయని, తమకు మిగిలేది అతి తక్కువని బంగ్లా వాదిస్తోంది. ఆ జలాల్లో తమకు 50 శాతం వాటా ఇవ్వాలని కోరుకుంటోంది. చివరకు కనీసం తొలి దశలో 25 శాతం ఇస్తే చాలని రాజీ కొచ్చింది కూడా. కానీ మమత అందుకు కూడా ససేమిరా అన్నారు. వాస్తవానికి 2011లో నాటి యూపీఏ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తీస్తా నదీజలాల పంపకంపై బంగ్లాతో సూత్రప్రాయంగా అంగీకారానికొచ్చారు. ఒప్పందం రూపొందింది. కానీ అప్పుడు కూడా పశ్చిమ బెంగాల్‌ సీఎంగా వున్న మమతా బెనర్జీ యూపీఏ భాగస్వామి కావటం, ఆ ఒప్పందానికి ఆమె ససేమిరా అనటంతో చివరి నిమిషంలో ఆగిపోయింది. ఫెనీ జలాల విషయంలోనూ ఇలాంటి పీటముడే పడింది. నదీజలాల అంశం తప్ప ఇతరేతర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు బాగుండేవి. భారత్‌ పెద్దన్న పాత్ర పోషిస్తున్నదని, తమ ప్రయోజనాలను బేఖాతరు చేస్తున్నదని బంగ్లా ప్రజానీకంలో చాన్నాళ్ల నుంచి అసంతృప్తి వుంది. దానికితోడు హసీనాకు భారత్‌ గట్టి మద్దతుదారుగా ఉండటంవల్లే ఆమె ఇష్టారాజ్యం సాగిందని, లక్షలాదిమంది తమ కార్యకర్తలను జైళ్లలో పెట్టారని విపక్షాల ఆరోపణ. ఈశాన్య భారత్‌లో తరచు హింసాత్మక చర్యలకు పాల్పడుతూ బంగ్లాదేశ్‌ శిబిరాల్లో తలదాచుకునే మిలిటెంట్లను ఆమె హయాంలో భారత్‌కు అప్పగించేవారు. ఇది కూడా అక్కడి ఛాందసవాదులకు మింగుడుపడలేదు. అయినా ఇరు దేశాలూ ఉమ్మడిగా ఎదుర్కొనాల్సిన సమస్యలూ ఉన్నాయి. ఉదాహరణకు టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మించతలపెట్టిన మెడాగ్‌ జలవిద్యుత్‌ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్దది కాబోతోంది. అది మనతోపాటు బంగ్లాదేశ్‌ ప్రయోజనాలకు కూడా ముప్పు కలిగిస్తుంది. బంగ్లా సాగు అవసరాల్లో 55 శాతం బ్రహ్మపుత్ర నదీజలాలు తీరుస్తాయి. చైనాలోని టిబెట్‌లో యార్లుంగ్‌ సాంగ్పోగా మొదలై మన దేశంలో ప్రవేశించేసరికి బ్రహ్మపుత్ర అయి, బంగ్లాలో అది జమునా నదిగా మారుతుంది. ప్రస్తుత బంగ్లా వాటా జలాల్లో 5 శాతం తగ్గినా సాగు ఉత్పత్తులు 15 శాతం పడిపోతాయని మూడేళ్ల క్రితం బంగ్లా పర్యావరణ శాఖ అంచనా వేసింది. బరాజ్‌ నిర్మిస్తున్న ప్రాంతం భూకంపాలపరంగా ప్రమాదకరమైనది. భూ అంతర్భాగంలోని టిబెట్‌ పలక చురుగ్గా ఉండటమే ఇందుకు కారణం. దీనిపై ఇప్పటికే మన దేశం చైనాకు ఆందోళనను తెలియజేయగా, బంగ్లాదేశ్‌ సైతం ఆ బరాజ్‌ ప్రభావంపై రూపొందించిన నివేదికలు తమకందించాలని ఆ దేశానికి లేఖ రాసింది.బంగ్లా విముక్తి దినోత్సవంపై ప్రస్తుత పాలకులకు అంత పట్టింపు లేదు. హసీనా పతనానికి దారితీసిన ఉద్యమానికి నాయకత్వం వహించి, ప్రస్తుత ప్రభుత్వంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న విద్యార్థులు తమది తటస్థ దేశంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆ ఆశయంతో గణతాంత్రిక్‌ ఛాత్ర సంగ్సద్‌ (ప్రజాతంత్ర విద్యార్థి మండలి) పేరిట గత నెలలో పార్టీ స్థాపించారు. అయితే ఛాందస వాదులు దీన్ని ఎంతవరకూ సాగనిస్తారో తెలియదు. దేశాన్ని మళ్లీ తూర్పు పాకిస్తాన్‌గా మార్చాలని వారు తహతహలాడుతున్నారు. ఇస్లామిక్‌ సంప్రదాయాలను అమలు చేయాలని చూస్తున్నారు. వచ్చే నెల 2 నుంచి 4 వరకూ బ్యాంకాక్‌లో జరగబోయే బంగాళాఖాత దేశాల ఆర్థిక సహకార సంఘం బిమ్‌స్టెక్‌ సమావేశం సందర్భంగా మోదీతో భేటీకి బంగ్లా ఆసక్తి చూపుతోంది. తాజా పరిణామంతో అది సాకారమైతే మళ్లీ ఇరు దేశాల స్నేహసంబంధాలూ పట్టాలెక్కుతాయి.

YSRCP President YS Jagan Fires On CM Chandrababu Naidu and Deputy CM9
హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?: వైఎస్‌ జగన్‌

ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేదీ వీళ్లే.. అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే, మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమను తాము చిత్రీకరించుకునేది వీళ్లే. ఒకరు ఆదేశిస్తారు.. మరొకరు పర్యవేక్షిస్తారు. సనాతన వాదిగా చెప్పుకుంటూ కాశినాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిన, అటవీ శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం, తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూలి్చవేతలపై ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇలాంటి వీరికి హిందూ ధర్మంపై, ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు ఉందా? – వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభు­త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ వైపు యథేచ్ఛగా జరుగుతున్న ఆలయాల కూల్చి­వేతలు.. మరో వైపు హిందూ ధర్మంపై కొనసాగుతున్న దాడులపై వైఎస్సార్‌సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్రంగా స్పందించారు. ‘ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేదీ వీళ్లే.. అబద్ధాలను ప్రచారం చేసేదీ వీళ్లే.. మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమను తాము చిత్రీకరించుకునేది వీళ్లే.. ఒకరు ఆదేశిస్తారు, మరొకరు పర్యవేక్షిస్తారు’ అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకు­పడ్డారు. వైఎస్సార్‌ జిల్లా కాశినాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణా­లకు బాధ్యత వహించాల్సిన అటవీ శాఖను చూస్తున్న, సనాతన వాదినని చెప్పుకుంటున్న డిప్యూటీ సీఎం.. తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూల్చి­వేతలపై ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని దెప్పి పొడిచారు. ఇలాంటి వీరికి హిందూ ధర్మంపైన, ఆలయాల పరిరక్షణపైనా మాట్లాడే హక్కు ఉందా? అని నిలదీçస్తూ గురువారం ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ చేశారు. కాశినాయన క్షేత్రం పరిరక్షణకు ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో చేసిన కృషికి సంబంధించిన ఆధారాలు, అప్పట్లో అధ్యాత్మిక శోభతో విలసిల్లిన ఆ క్షేత్రం ఫొటోలు.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ క్షేత్రం కూల్చివేతకు జారీ చేసిన ఉత్తర్వులు, కూల్చివేత ఫొటోలను ట్యాగ్‌ చేస్తూ ‘ఇవిగో ఆధారాలు.. ఏమిటి మీ సమా«­దానం’ అని సీఎం చంద్ర­బాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌లను సూటిగా ప్రశ్నించారు. ఈ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..ఇవి ప్రత్యక్ష సాక్ష్యాలు కావా? నాకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్‌ ఏంటంటే... దేవుడు అంటే భక్తి, భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలు.. రాష్ట్రంలో ఆలయాలపై, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా?మా ఐదేళ్ల పాలనలో ఈ క్షేత్రాన్ని పరిరక్షించాం అటవీ ప్రాంతంలో ఉన్న కాశినాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై 2023 ఆగస్టు 7న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చినా, ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుం బిగించిన మాట వాస్తవం కాదా? అదే ఏడాది.. అదే నెల 18న అప్పటి కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు ముఖ్యమంత్రి హోదాలో నేనే స్వయంగా లేఖ రాశాను. కాశినాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీ శాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రాన్ని రిజర్వ్‌ చేయాలని, దీని కోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలను విధించినా తు.చ.తప్పక పాటి­స్తామని ఆ లేఖలో చాలా స్పష్టంగా చెప్పాం. మా ప్రయత్నా­లతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది. మా ఐదేళ్ల పాలనలో కాశినాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఆలయాల పట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణ పట్ల మాకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. ఇవిగో ఆధారాలు07–08–2023:కాశినాయన క్షేత్రంలో నిర్మాణాలు నిలిపివేయాలని, ఉన్నవాటిని తొలగించాలని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చిన కాపీ 18–08–2023: కాశినాయన క్షేత్రం ఉన్న భూమిని అటవీ శాఖ నుంచి మినహాయించాలని, 12.98 హెక్టార్ల భూమిని కాశినాయన క్షేత్రానికి రిజర్వు చేయాలని కోరుతూ అప్పటి కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు నాటి సీఎం వైఎస్‌ జగన్‌ రాసిన లేఖ అధికార అహంకారానికి ఇవిగో ఆధారాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచే ఇదే కాశినాయన క్షేత్రంలో ఏం జరిగిందో రాష్ట్రం అంతా చూస్తోంది. ఒక ప్రసిద్ధ క్షేత్రంపై బుల్డోజర్లు నడిపి కిరాతకంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, కలెక్టర్‌ ఆదేశాలతో, ఆర్డీఓ పర్యవేక్షణలో నిర్మాణాలను కూల్చివేస్తూ వచ్చారు. చంద్రబాబు ఆదేశాల మేరకు, డిప్యూటీ సీఎం పర్యవేక్షణలో ఉన్న తన పర్యావరణ, అటవీ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఇచ్చిన కూల్చివేత ఉత్తర్వులతో హిందూ ధర్మంపైన, ఆధ్యాత్మిక క్షేత్రాలపైన అధికార అహంకారంతో దాడి చేశారు. ఇందుకు ఇవిగో ఆధారాలు (కాశినాయన క్షేత్రం కూల్చివేతకు జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులు ట్యాగ్‌ చేస్తూ), ఏమిటి మీ సమాధానం?1–1–2025: ఏపీ అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదేశాల మేరకు కాశినాయన క్షేత్రంలోని నిర్మాణాలను తొలగించాలని వైఎస్సార్‌ జిల్లా కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ సంబంధిత అధికారులకు జారీ చేసిన ఆదేశాల కాపీ వీళ్ల తీరే అంత.. వారే ఉత్తర్వులిచ్చి, వారి చేతులతోనే కాశినాయన క్షేత్రాన్ని కూల్చేసి, వాతలు పెట్టి, వెన్న పూసిన మాదిరిగా ఇప్పుడు మాటలు చెబుతున్నారు. వీళ్ల తీరే అంత. ఈ ప్రభుత్వం వచ్చాకే వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తూ జరిగిన తిరుమల లడ్డూ దుష్ప్రచార వ్యవహారమైనా, టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటన విషయంలోనైనా, ఇప్పుడు కాశినాయన క్షేత్రంలో గుడి కూల్చివేతలైనా.. ఇలా ఏదైనా అంతే.

Indians are planning their summer vacations10
ముందే ప్లానేద్దాం.. సమ్మర్‌లో టూరేద్దాం!

సాక్షి, హైదరాబాద్‌: సమ్మర్‌ వెకేషన్‌కు ఇప్పటినుంచే మనవారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏటేటా పెరుగుతున్న పర్యాటకుల డిమాండ్‌కు తగ్గట్టుగానే...దేశవ్యాప్తంగా హోటళ్లు (హోటల్‌ రూమ్‌లు), ఇతర ప్రత్యామ్నాయ విడిదుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ వేసవిలో వివాహాలకు కూడా ముహూర్తాలు ఉండటంతో హోటళ్లకు కూడా డిమాండ్‌ క్రమంగా పెరుగుతోంది. గత ఏడాదితో పోల్చితే ఇప్పటికే లగ్జరీ, మిడ్‌–స్కేల్, బడ్జెట్‌ సెగ్మెంట్‌లలో హోటల్‌ గదుల రేట్లు 10 నుంచి 12 శాతం పెరిగినట్టుగా ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్స్‌ ఇన్‌ ఇండియన్‌ టూరిజమ్‌ అండ్‌ హాస్పిటాలిటీ వర్గాలు చెబుతున్నాయి. తమతమ కుటుంబ బడ్జెట్, వేసవి విడిదులకు సంబంధించి ఖర్చు చేయగలిగే స్తోమతను బట్టి దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలు, విదేశాల్లోని ప్రముఖ సందర్శన ప్రదేశాలు, మరికొందరు వీసా ఫ్రీ దేశాల్లో వేసవి పర్యటనలకు సిద్ధమవుతున్నారు. కశ్మీర్, గోవా, హిమాచల్, కేరళలకు వెళ్లేందుకు క్రేజ్‌ దేశీయంగా చూస్తే.. కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, గోవా, రాజస్తాన్‌లతోపాటు ఈశాన్య రాష్ట్రాలు వేసవి సెలవులకు గమ్యస్థానాలుగా అగ్రభాగాన నిలుస్తున్నాయి. వీటితోపాటు హిల్‌స్టేషన్లుగా పేరుగాంచిన ముస్సోరి, మనాలి, రుషికేశ్‌ తదితర ప్రాంతాల్లోని హోటళ్ల గదులకు డిమాండ్‌ అత్యధికంగా ఉన్నట్టుగా వెల్లడైంది. కూర్గ్, మహబలేశ్వర్‌ వంటి టూరిస్ట్‌ డెస్టినేషన్లకు కూడా క్రమంగా పర్యాటకులు పెరుగుతున్నట్టుగా వివిధ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రత్యేకంగా మహబలేశ్వర్‌లోని బీచ్‌కు ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నట్టుగా తెలుస్తోంది. ఉదయ్‌పూర్, జైపూర్‌లు కూడా ఈ విషయంలో ఏమాత్రం వెనుకబడి లేవు. రుషికేశ్, కాసోల్, హంపి, ముక్తేశ్వర్‌ వంటి పర్యాటక ప్రదేశాల్లో హాస్టళ్లకు డిమాండ్‌ పెరుగుతున్నట్టుగా జో వరల్డ్‌ సంస్థ వెల్లడించింది. టాప్‌ ఇంటర్నేషనల్‌ సమ్మర్‌ డెస్టినేషన్స్‌ ఇవే.. ఇంటర్నేషనల్‌ సమ్మర్‌ డెస్టినేషన్స్‌గా స్విట్జర్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, హంగేరీ, ఆ్రస్టియా, చెక్‌ రిపబ్లిక్, ఇతర ఐరోపా దేశాలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. వీటితోపాటు దుబాయ్, ఈజిప్ట్, జపాన్, సింగపూర్, వియత్నాం, ఇండోనేసియాలకు ఏటా డిమాండ్‌ పెరుగుతోందని అట్లీస్‌ సంస్థ వెల్లడించింది. ఇక ఈ వేసవి సీజన్‌లో యూఏఈ, యూఎస్‌ఏలకు అత్యధికంగా బుక్సింగ్‌ జరిగినట్టు ఈ సంస్థ తెలిపింది. ఈ దేశాల్లో పర్యటించేందుకు ముందుగానే పర్యాటకులు చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా ఆ సంస్థ అంచనా వేసింది. అంటార్కిటికాలో ఐస్‌బ్రేకర్‌ క్రూయిజ్‌లు, ఫిన్‌లాండ్లో నార్తర్న్‌ లైట్స్‌ అనుభవాలు, గాజు గోపుర ఇగ్లూలు, ఆర్కిటిక్‌ సూట్‌లు మరియు ఆర్కిటిక్‌ ట్రీహౌస్‌లలో బస వంటి ప్రీమియం అనుభవాలను కూడా ప్రయాణికులు కోరుకుంటున్నారు. సౌత్‌ ఆఫ్రికా వైన్‌యార్డ్‌లలో కన్వర్టిబుల్‌ కార్లు లేదా హార్లే–డేవిడ్‌సన్‌లతో సెల్ఫ్‌–డ్రైవ్‌ సాహసాలు కూడా ప్రజాదరణ పొందుతున్నాయి.తొలిసారి విదేశీ పర్యటనలకు వెళుతున్న వారిలో ఎక్కువగా కాంబోడియా, శ్రీలంక, అజర్‌బైజాన్‌లను ఇష్టపడుతున్నారు. ఈ దేశాల సందర్శనకు సులభంగా వీసా ప్రక్రియ ఉండటంతోపాటు ఆయా సమ్మర్‌ ట్రిప్‌లకు అయ్యే ఖర్చు కూడా తక్కువగా ఉండడమే అందుకు కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీసా అవసరం లేని ప్రాంతాలకు ఆదరణ... ఇక వీసా అవసరం లేని వివిధ పర్యాటక దేశాలు భారత టూరిస్ట్‌లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అయితే వీసా ఫ్రీ దేశాలు అయిన నేపాల్, భూటాన్, థాయ్‌లాండ్, మాల్దీవులు, మారిషస్‌ వంటి వాటికి భారత్‌ టూరిస్టుల నుంచి భారీగా డిమాండ్‌ పెరిగినట్టు హాలిడే, టూరిజం నిర్వాహకులు చెబుతున్నారు. ఈ దేశాలు వీసా రహిత సులభ ప్రవేశ కారణంగా గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నాయి. ఎస్‌ఓటీసీ ట్రావెల్‌ హాలిడేస్, కార్పొరేట్‌ టూర్స్‌ విభాగం నివేదిక ప్రకారం.. వీసా రహిత గమ్యస్థానాలు ప్రయాణికులకు ఖర్చులను ఆదా చేసే అవకాశాన్ని అందిస్తున్నాయని, దీనిని వారు లగ్జరీ అనుభవాల కోసం ఉపయోగిస్తున్నారని పేర్కొంది. ఉదాహరణకు థాయ్‌లాండ్‌లో ముయే థాయ్‌ (కిక్‌బాక్సింగ్‌) నేర్చుకోవడం, లగ్జరీ రిసార్ట్‌లలో డిటాక్స్‌ కార్యక్రమాలు, మారిషస్‌లో స్నార్కెలింగ్‌ లేదా మాల్దీవ్స్‌లో మిషెలిన్‌–స్టార్‌ అండర్‌వాటర్‌ డైనింగ్‌ వంటివి ఉన్నాయి. అదే సమయంలో ఫినామినన్‌–ఆధారిత ప్రయాణం ఒక కీలక ధోరణిగా ఉద్భవించిందని ఈ నివేదిక తెలిపింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement