Top Stories
ప్రధాన వార్తలు

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ముస్లిం సోదరులకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. అల్లా చూపిన మార్గంలో నడవాలని, అల్లా చల్లని దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారురంజాన్ పండుగ సందర్బంగా వైఎస్ జగన్..‘ముస్లింలకు రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైనది. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నాను. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్’ అని అన్నారు.భక్తి శ్రద్ధలతో కఠినమైన ఉపవాస దీక్షలు ముగించుకుని ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అయిన రంజాన్ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ నా శుభాకాంక్షలు. అల్లా చూపిన మార్గంలో నడవాలని, అల్లా చల్లని దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 31, 2025

బాబు డబుల్ గేమ్.. సొంత ఇలాకాలో ఊహించని షాక్
చిత్తూరు, సాక్షి: ముస్లింల హక్కుల విషయంలో డబుల్ గేమ్ ఆడుతున్న నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా.. చంద్రబాబు నియోజకవర్గంలో, అదీ రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరులు శాంతియుత నిరసనకు దిగారు. తమ సంక్షేమాన్ని, అభివృద్దిని నిర్లక్ష్యం చేస్తున్న చంద్రబాబు(Chandrababu).. ఇప్పుడేమో రక్షించేవాడిలా నాటకాలు ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నియోజకవర్గం కుప్పం(Kuppam)లో ఇవాళ నిరసన జరిగింది. నల్ల బ్యాడ్జిలు ధరించిన మరీ రంజాన్ ప్రత్యేక ప్రార్థనంలో పాల్గొన్నారు ముస్లిం సోదరులు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం నడుం బిగించాలనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్రంలోని ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉంటూనే.. వక్ఫ్ సవరణ బిల్లుకు చంద్రబాబు మద్దతు ఇస్తుండడాన్ని వీళ్లంతా ఖండించారు. ఈ బిల్లు గనుక పార్లమెంట్లో పాసైతే ముస్లిం సమాజం తీవ్రంగా నష్టపోతుంది అని ఆవేదన చెందుతున్నారు. ఇదీ చదవండి: వక్ఫ్ సవరణ బిల్లును అడ్డుకోవాల్సిందేముస్లిం సమాజం మొత్తం వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు(Waqf Bill) విషయంలో రాష్ట్రంలో ఒకలా, ఢిల్లీలో మరో రకంగా చంద్రబాబు మాట్లాడుతుండడాన్ని రాజకీయ వర్గాలు ఖండిస్తున్నాయి. ఈ బిల్లు విషయంలో చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నాయి.ఇదిలా ఉంటే.. టీడీపీ మద్ధతు మీదనే కేంద్రం ఆధారపడి ఉందనేది విశ్లేషకుల మాట. అలాంటప్పుడు ఆ బిల్లును ఆదిలోనే టీడీపీ వ్యతిరేకించి ఉంటే ఇప్పుడు జేపీసీ వరకు వచ్చి ఉండేది కాదన అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. మరోపక్క బిల్లుకి మద్దతు ప్రకటించిన చంద్రబాబు.. తాజాగా జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొని వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తున్నామని చెబుతుండడం మోసమేనన్నది కొందరి వాదన. ఈ క్రమంలోనే ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వాములైన టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ నితీశ్ కుమార్లపై మజ్లిస్ అధినేత.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలాంటి వారిని క్షమించబోమంటూ ఘాటు వ్యాఖ్యాలు చేశారు.

రాజకీయ ప్రకంపనలు.. మూడోసారి అధికారంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను మూడోసారి అధికారంలోకి రావడానికి మార్గాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడంపై తాను జోక్ చేయడం లేదంటూ మాట్లాడారు. అయితే, అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడాన్ని రాజ్యాంగంలోని 22వ సవరణ అనుమతించదు. దీంతో, ఆయన వ్యాఖ్యలు అమెరికాలో కొత్త చర్చకు దారి తీశాయి.అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడానికి అవకాశం, మార్గాలు ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే దీనిపై ఇప్పుడే ఆలోచించడం సరికాదన్నారు. దానికి ఇంకా సమయం ఉందని చెప్పుకొచ్చారు. అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం ఓ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికాలో చాలా మంది ప్రజలు.. నన్ను మూడోసారి ఎన్నిక కావాలని కోరుతున్నారు. నాకు పనిచేయడం అంటే ఇష్టం. అమెరికా ప్రజలు కోసం ఎంత కష్టమైనా కొన్ని నిర్ణయాలు తీసుకోడానికి వెనుకాడను. మూడోసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడే దానిపై ఆలోచించడం తొందరపాటు అవుతుంది. ఇప్పుడు నేను ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించాను. ఇప్పుడు చేయాల్సింది చాలా మిగిలి ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు.రెండు మార్గాలు.. ఇదిలా ఉండగా.. అమెరికా రాజ్యాంగంలో విధించిన రెండు దఫాల నిబంధనను మార్చాలంటే సవరణ చేయాలి. అది కష్టతరమైనది. రాజ్యాంగ సవరణ చేయాలంటే కాంగ్రెస్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉండాలి. లేదంటే మూడింట రెండు వంతుల రాష్ట్రాలు అంగీకరించాలి. ఈ రెండు మార్గాలనూ నాలుగింట మూడు వంతుల రాష్ట్రాలు ఆమోదించాలి. ఇది వ్యాఖ్యలు చేసినంత సులభం కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, అమెరికాలో 2028లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

RR VS CSK: 20 పరుగులు తక్కువ చేశామనిపించింది.. ఫీల్డింగ్‌తో కవర్ చేశాము: రియాన్ పరాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తొలి విజయం నమోదు చేసింది. సీఎస్కేపై గెలుపుతో రాయల్స్ ఖాతాను ఓపెన్ చేసింది. సొంత మైదానంలో నిన్న (మార్చి 30) జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసి 182 పరుగులు చేసిన ఆ జట్టు.. ఆతర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఈ మ్యాచ్‌లో రాయల్స్‌కు లభించిన మెరుపు ఆరంభాన్ని బట్టి చూస్తే ఇంకా భారీ స్కోర్ చేసుండాలి. కానీ సీఎస్కే బౌలర్లు పరిస్థితులను అదుపులోకి తెచ్చుకున్నారు. నితీశ్ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) పవర్ ప్లేలో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. రాణా ఔటయ్యాక రాయల్స్ ఇన్నింగ్స్ ఢీలా పడింది. శాంసన్ (16 బంతుల్లో 20; ఫోర్, సిక్స్), రియాన్ పరాగ్ (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్‌మైర్ (16 బంతుల్లో 19; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. నూర్ అహ్మద్ (4-0-28-2), పతిరణ (4-0-28-2) మరోసారి అద్భుతమైన స్పెల్స్ వేశారు. ఖలీల్ అహ్మద్ (4-0-38-2) పర్వాలేదనిపించాడు. జడ్డూ, అశ్విన్ తలో వికెట్ తీశారు. ఓవర్టన్ (2-0-30-0), అశ్విన్ (4-0-46-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం ఛేదనకు దిగిన సీఎస్కేకు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ రచిన్ రవీంద్రను జోఫ్రా ఆర్చర్ డకౌట్ చేశాడు. అనంతరం రుతురాజ్ (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, సిక్స్) పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే అతనికి మరో ఎండ్ నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. హసరంగ (4-0-35-4) తన స్పెల్ ప్రతి ఓవర్లో వికెట్ తీసి సీఎస్కేను ఇరకాటంలో పడేశాడు. అయినా సీఎస్కేకు గెలుపు అవకాశాలు ఉండేవి. చివరి 3 ఓవర్లలో 45 పరుగులు చేయాల్సి ఉండింది. ధోని, జడ్డూ భారీ షాట్లు ఆడిన సీఎస్కే లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. చివరి ఓవర్లో 20 పరుగులు కాపాడుకోవాల్సిన తరుణంలో ఆర్చర్‌కు (3-1-13-1) బౌలింగ్ ఇవ్వకుండా సందీప్ శర్మకు బంతినప్పగించి రియాన్ పెద్ద సాహసమే చేశాడు. ఇది వర్కౌటైంది. సందీప్ 13 పరుగులు మాత్రమే ఇవ్వడంతో రాయల్స్ ఊపిరిపీల్చుకుంది.మ్యాచ్ అనంతరం రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. సమయం తీసుకున్నా ఈ గెలుపు ఆనందానిచ్చింది. తొలి రెండు మ్యాచ్‌లు కఠినంగా సాగాయి. 20 పరుగులు తక్కువ చేశామని భావించాము. మిడిల్ ఓవర్లలో బాగానే ఆడినప్పటికీ.. వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోర్ చేయలేకపోయాము.మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. వారు మా ప్రణాళికలను విజయవంతంగా అమలు చేశారు. తొలి మ్యాచ్‌లో 287 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయాము. రెండో మ్యాచ్‌లో 151 పరుగల టార్గెట్‌ను కాపాడుకోలేకపోయాము. అదృష్టవశాత్తు ఈ రోజు ఆటలో మాకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నితీశ్‌తో పాటు నేను కూడా బాగానే ఆడానుకుంటున్నాను. చివరి ఓవర్‌ను ఆర్చర్‌కు కాకుండా సందీప్ శర్మకు ఇవ్వడంపై స్పందిస్తూ.. కెప్టెన్‌గా నాకు అనిపించి చేశాను. బ్యాటింగ్‌లో తక్కువ చేశామని భావిస్తున్న 20 పరుగులను ఫీల్డింగ్‌లో కవర్ చేశాము. ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యాగ్నిక్‌తో కలిసి చాలా వర్కౌట్ చేశాము. ఫలితం వచ్చింది.

మయన్మార్‌లో దారుణ పరిస్థితులు.. రెస్య్కూ వేళ వైమానిక దాడులు!
నేపిడా/బ్యాంకాక్: మయన్మార్, థాయిలాండ్(Myanmar, Thailand)లను తాకిన భూకంపం భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ రెండు దేశాలలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మయన్మార్‌లో ఇప్పటివరకు సుమారు 1,700 మంది మృతిచెందినట్లు ప్రభుత్వం నిర్థారించింది. సుమారు 3,400 మంది గాయపడ్డారని, 300 మంది గల్లంతయ్యారని తెలిపింది.బ్యాంకాక్‌లో ప్రస్తుత పరిస్థితి ఇదే..బ్యాంకాక్‌లో భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 17కి పెరిగిందని నగర అధికారులు తెలిపారు. బ్యాంకాక్ మెట్రోపాలిటన్ అథారిటీ(Bangkok Metropolitan Authority) తెలిపిన వివరాల ప్రకారం 32 మంది గాయపడ్డారు. 82 మంది జాడ ఇంకా తెలియరాలేదు. వీరు నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల టవర్‌లో గల్లంతయ్యారని సమాచారం. ఈ భూకంపం మధ్య మయన్మార్‌లోని సాగింగ్ నగరానికి వాయువ్యంగా సంభవించింది. దేశంలోని రెండవ అతిపెద్ద నగరమైన మాండలేలో భారీ విధ్వంసం చోటుచేసుకుంది.సాయం కోసం రెడ్ క్రాస్ విజ్ఞప్తిభూకంప బాధితులకు సహాయం అందించేందుకు అంతర్జాతీయ రెడ్ క్రాస్, రెడ్ క్రెసెంట్ సొసైటీ(International Red Cross and Red Crescent Society)ల సమాఖ్య (ఐఎఫ్ఆర్సీ)100 మిలియన్ డాలర్ల పైగా మొత్తం అత్యవసరమని విజ్ఞప్తి చేసింది. అలాగే భూకంపం సంభవించిన ప్రాంతంలో అవసరాలు అంతకంతకూ పెగుతున్నాయని పేర్కొంది. రాబోయే 24 నెలల్లో లక్ష కుటుంబాలకు సహాయం అందించేందుకు మరింతగా నిధులు అవసరం కానున్నాయని పేర్కొంది. దీనికితోడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున మరో సంక్షోభం తలెత్తకముందే అప్రమత్తం కావాల్సిన అవసరముందని సూచించింది. ఇది విపత్తు మాత్రమే కాదని, సంక్లిష్టమైన మానవతా సంక్షోభమని ఐఎఫ్ఆర్సీ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ అలెగ్జాండర్ మాథ్యూ పేర్కొన్నారు.‘ఈ సమయంలో వైమానిక దాడులా?’1,700 మందిని బలిగొన్న భూకంపంతో దేశం అతలాకుతలం అవుతున్నసమయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న సాయుధ ప్రతిఘటన ఉద్యమం గ్రామాలపై వైమానిక దాడులు నిర్వహించడంపై మయన్మార్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరెన్ నేషనల్ యూనియన్ జంటా పౌరప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేస్తూనే ఉందని ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణ పరిస్థితులలో సైన్యం సహాయ చర్యలకు ముందుకు వస్తుందని, అయితే ఇప్పుడు దీనికి బదులుగా దేశ ప్రజలపై దాడి చేయడానికి బలగాలను మోహరించడం దురదృష్టకరమని పేర్కొంది. #OperationBrahma continues. @indiannavy ships INS Karmuk and LCU 52 are headed for Yangon with 30 tonnes of disaster relief and medical supplies.🇮🇳 🇲🇲 pic.twitter.com/mLTXPrwn5h— Dr. S. Jaishankar (@DrSJaishankar) March 30, 2025భారత్ నుంచి 30 టన్నుల సహాయక సామగ్రిభారత నావికాదళ నౌకలు మయన్మార్‌కు 30 టన్నుల సహాయాన్ని తీసుకువెళ్లాయని భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మీడియాకు తెలిపారు. భారత నావికాదళ నౌకలు ఐఎన్ఎస్ కార్ముక్, ఎల్సీయూలు 52 భూకంప ప్రభావిత ప్రాంతాలకు సహాయ సామగ్రిని తీసుకువెళ్లాయని అయన పేర్కొన్నారు. ఈ సహాయ చర్యలు ఆపరేషన్ బ్రహ్మలో భాగమని తెలిపారు. ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ‘ఆపరేషన్ బ్రహ్మ కొనసాగుతోంది. భారత నావికాదళ నౌకలు 30 టన్నుల సహాయక, వైద్య సామాగ్రితో యాంగోన్‌కు వెళ్లాయని తెలిపారు."మయన్మార్‌కు భారత రెస్క్యూ బృందంభారత సైన్యం తెలిపిన వివరాల ప్రకారం 10 మంది సిబ్బందితో కూడిన మొదటి సహాయక బృందం మయన్మార్‌లోని మండలే అంతర్జాతీయ విమానాశ్రయానికి(Mandalay International Airport) చేరుకుంది. ఫీల్డ్ హాస్పిటల్ ఏర్పాటు కోసం ఈ బృందం ప్రయత్నాలు ప్రారంభించింది. భారీ పరికరాలు, సహాయక సామగ్రిని తరలించేందుకు ఈ బృందం సోమవారం రోడ్డు మార్గంలో ప్రయాణించనుంది. కాగా భారత నేవీ నౌకలు సహాయ సామగ్రిని మయన్మార్‌కు తీసుకువెళుతున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.‘సహాయం అందినా ప్రాణం పోయింది’మయన్మార్‌లోని మండలేలో కూలిపోయిన అపార్ట్మెంట్ శిథిల్లాల్లో ఒక గర్భిణి 55 గంటల పాటు చిక్కకుపోయింది. రెస్క్యూ సిబ్బంది బాధితురాలు, 35 ఏళ్ల మాథు తుల్విన్ ప్రాణాలను కాపాడారు. అయితే స్కై విల్లా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ శిథిలాల నుండి ఆమెను బయటకు తీసిన కొద్దిసేపటికే ఆమె మృతిచెందింది.‘హూ’నుంచి మూడు టన్నుల వైద్య సామగ్రిమయన్మార్ను కుదిపేసిన భూకంపాలలో గాయపడిన వేలాది మందికి సాయం అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(హూ)దాదాపు మూడు టన్నుల వైద్య సామగ్రిని పంపింది. ట్రామా కిట్లు,టెంట్లతో సహా వైద్య సామగ్రి ఇప్పటికే వెయ్యి పడకల ఆసుపత్రికి చేరుకున్నాయని ‘హూ’ ఒక ప్రకటనలో తెలిపింది. భూకంప సంభవించిన 24 గంటల వ్యవధిలోపునే యాంగోన్లోని అత్యవసర వైద్య సామగ్రి నిల్వ నుంచి ఈ సామగ్రిని తరలించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.ధ్వంసమైన 50 మసీదులుమయన్మార్లో శుక్రవారం ప్రార్థనల కోసం మసీదులకు ముస్లింలు చేరుకుంటున్న సమయంలో ఈ భూకంపం సంభవించింది. దీంతో ఈ ప్రమాదం బారినపడి వందలాది మంది ముస్లింలు మృతిచెంది ఉంటారనే అంచనాలున్నాయి. భూకంపం సంభవించినప్పుడు, మండలేలో ఉంటున్న ఒక ముస్లిం తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. మసీదు పక్కనే ఉన్న తన ఇల్లు కూలిపోయిందని, తన అమ్మమ్మ, ఇద్దరు మామలు శిథిలాల కింద చిక్కకున్నారని తెలిపారు. నగరంలో శిథిలాల భవనాలు అలానే ఉన్నాయని, రెస్క్యూ బృందాలు అందించే సాయం సరిపోవడం లేదని ఆయన కన్నీరు పెట్టుకుంటూ తెలిపాడు. షాడో నేషనల్ యూనిటీ గవర్నమెంట్ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో 50కి పైగా మసీదులు ధ్వంసమయ్యాయి. ఇది కూడా చదవండి: Mann Ki Baat: వేసవి సెలవులు.. నీటి సంరక్షణపై ప్రధాని మోదీ సందేశం

HCU వద్ద హైటెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం విక్రయించ వద్దని విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం 200 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగంలా మారింది. వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల్లో ఆదివారం వందలాదిగా మోహరించిన పోలీసులు విద్యార్థులపై లాఠీ దెబ్బలతో విరుచుకుపడి దాదాపు 200 మందిని అరెస్ట్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. టీజీఐఐసీ, రెవెన్యూ అధికారులు జేసీబీలతో పోలీసుల కాపలా నడుమ వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల్లోకి వచ్చారు. దట్టమైన పొదలు, చెట్లను తొలగించే ప్రయత్నం చేశారు. అది గమనించిన కొందరు విద్యార్థులు అక్కడికి చేరుకునేసరికి పోలీసులు చుట్టుముట్టారు.Hyderabad Central University witnessed police brutality.Students peacefully protesting against CM @revanth_anumula remarks calling HCU students “cunning foxes” and opposing a land grab near their campus were met with violence lathi charge, phones smashed, voices silenced.… pic.twitter.com/25oHPIGoXH— Harish Rao Thanneeru (@BRSHarish) March 30, 2025ఈ క్రమంలో పర్యావరణాన్ని దెబ్బతీస్తూ.. జీవ వైవిధ్యానికి నష్టం కలిగించే ప్రయత్నాలు చేయవద్దని నినదిస్తూ అక్కడికి చేరుకున్న విద్యార్థులపై పోలీసులు రెచ్చిపోయారు. కాళ్లు, చేతులు పట్టుకొని నేలపై ఈడ్చుకెళ్లి వ్యాన్లలోకి ఎక్కించారు. అరెస్టులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని వర్సిటీలో పరిగెత్తిస్తూ మరీ లాఠీలతో చితకబాదారు. 200 మందికి పైగా విద్యార్థులను రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి, కొల్లూరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఠాణాలకు తరలించే క్రమంలో ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలని అడిగినందుకు హెల్మెట్లు, ప్రొటెక్షన్ షీల్డ్‌తో విచక్షణా రహితంగా కొట్టారు. కొందరు పోలీసులు తమను బూతులు తిట్టారని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు.Save our university land from being auctioned for private entities. University is an intellectual power house,don't kill the progress of the Telangana. Save our land.@KTRBRS @BRSHarish @Krishank_BRS @dhanyarajendran @revathitweets @bainjal @CharanT16 @RahulGandhi @priyankagandhi pic.twitter.com/81zQ3APMVd— sree charan (@mscharan) March 30, 2025బట్టలు చిరిగినా వదలకుండా..పోలీసుల అరాచకాన్ని ప్రశ్నించిన ఆడపిల్లలను మహిళా పోలీసులు జుట్టు పట్టుకుని నేలపై ఈడ్చుకుంటూ వ్యాను ఎక్కించారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో విద్యార్థినులు గాయాలపాలయ్యారు. బట్టలు చిరిగిపోయినా పట్టించుకోకుండా విద్యార్థులను లాకెళ్లారు. అడ్డుకోబోయిన యువకులను కాళ్లు, చేతులు పట్టుకుని వ్యాన్‌లో పడేశారు. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ తోటి విద్యార్థులు వర్సిటీ మెయిన్ గేట్ ఎదుట బైఠాయించారు. బయటకు రాకుండా నిర్బంధించడంతో అక్కడే కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. Mohabbat Ka Dukaan at HCU today. Kudos to @RahulGandhi & Congress sarkaar You have outdone yourselves pic.twitter.com/NPZOqG7Uoh— KTR (@KTRBRS) March 30, 2025

మామా.. ఆర్డర్ చేస్తున్నా..!
ఏడాది కిందట పెళ్లైన ఓ జంట ఉద్యోగం చేసుకుంటోంది. భర్త చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తే... భార్య ప్రైవేటుగా పనిచేస్తోంది. ఈ ఇద్దరూ వారి వృత్తిలో బిజీగా గడుపుతున్నారు. వంట చేయడం రాదు. దీంతో కొన్ని నెలలు వంట మనిషిని పెట్టుకున్నారు. రుచి లేదని ఆమెను చాలించారు. ఈ కారణంగా ఎక్కువగా ఫాస్ట్‌పుడ్ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. ఆస్పత్రి ఆవరణం, పలమనేరు రోడ్డు, మురకంబట్టు రోడ్డు, లేకుంటే తమిళనాడులోని వేలూరుకు సైతం వెళుతున్నారు.కొత్త జంటలు వంటపై తంటాలు పడుతోంది. పెళ్లి కూతుర్లు వంటింట్లో అడుగు పెట్టాలంటే తెగ ఫీలైపోతున్నారు. వంట చేయడం రాక కొంత మంది వంట గదికి దూరంగా ఉండిపోతున్నారు. మరికొంత మంది పని ఒత్తిళ్లతో వంట దగ్గరికి వెళ్లలేకపోతున్నారు. ఇంకొంత మంది యూట్యూబ్ పాఠాలతో వంట వండేందుకు అపసోపాలు పడుతున్నారు. వారు వండిందే వారికే నచ్చక సింపుల్‌గా ఆన్లైన్ ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. లేకుంటే పాస్ట్ ఫుడ్‌ను వెతుక్కుంటున్నారు. వీటి సంఖ్య జిల్లాలో గణనీయంగా పెరిగింది. ఇలా ఆరగించడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాణిపాకం(చిత్తూరు): ఒకప్పుడు పెళ్లి చూపులంటే.. వరుడు వైపు వరకట్నంతో పాటు అమ్మాయికి వంటా వచ్చా అని అడిగేవాళ్లు. ఏ రకమైనవి ఎక్కువగా వండుతావ్ అని గుచ్చి గుచ్చి ప్రశ్నించేవారు. అప్పట్లో చదువు, ఉద్యోగం చూసేవారు కాదు. అమ్మాయి చక్కగా వండి పెడుతూ..ఇంట్లో ఉంటే చాలనుకునేవారు. ఇప్పుడు అమ్మాయి ఎంత వరకు చదువుకుంది..ఏం చేస్తోంది అని మాత్రమే చూస్తున్నారు. వధువు వైపు నుంచి...వరుడు చదువు, ఉద్యోగం, ఫ్యామిలీ పరిస్థితి చూసి..పెళ్లి ఫిక్స్ చేసేస్తున్నారు. అమ్మాయికి వంట వచ్చా అని అడిగే వాళ్లు పూర్తిగా కరువయ్యారు. చదువులపైనే దృష్టి పెడుతున్నారు.. ఒకప్పుడు ఆడ పిల్లలు 10 ఏళ్ల వయస్సు వచ్చిందంటేనే తల్లులు వంటింటికి తీసుకెళ్లి రకరకాల వంటలు చేయడం నేర్పేవాళ్లు. అత్తారింటికి వెళితే మీ అమ్మ వంట చేయడం నేర్పలేదా అని మమ్మలను చులకనగా మాట్లాడతారని తల్లులు పట్టుబట్టి వాళ్ల పిల్లలకు వంట నేర్పేవాళ్లు. ఇప్పుడు పల్లె, పట్నం అనే తేడా లేకుండా తల్లిదండ్రులు పిల్లలను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. పిల్లల చదువుపై దృష్టి పెడుతున్నారు. బాగా చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం, ప్రభుత్వం ఉద్యోగం, డాక్టర్ అవ్వాలని, ఇతర ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నారు. ఇందులో చాలా మంది ఉన్నత చదువుల కోసం బయట రాష్ట్రాలకు, విదేశాలకు పంపుతున్నారు. ఒకప్పుడు మగ పిల్లలను చదివిస్తే ప్రయోజకుడై..పోషిస్తారని అనుకునేవాళ్లు. ఇప్పుడు మగ పిల్లలతో పాటు ఆడ పిల్లలను సమానంగా చదివిస్తున్నారు. చదువు తప్ప మరేది ముట్టుకోనివ్వడం లేదు. ఈ క్రమంలో ఆడ పిల్లలు వంటింటికి దూరమవుతున్నారు. తల్లులు సైతం పెళ్లైతే వంట నేర్చుకుంటుంది లే అని తేలికగా వదిలేస్తున్నారు. వంట చేయడం రాదు పెళ్లైన కొత్త జంటలు లగ్జరీ లైఫ్ వెతుక్కుంటున్నారు. పెళ్లికి ముందు నుంచే ఏ పని ముట్టుకోకుండా జీవించేయాలని కలలు కంటున్నారు. ముఖ్యంగా ఆడ పిల్లలు పుట్టింట్లో ఉన్నట్లుగా ఉండాలని కోరుకుంటున్నారు. అత్తారింటికి వెళ్లినా.. కాఫీ అంటే బెడ్ రూమ్‌కే వచ్చేయాలనే అనుకుంటున్నారు. వంట వచ్చిన మొగుడైతే ఇంకా బెటర్ అని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. ఇలా పుట్టింట్లో వంట నేర్చుకోక కొత్త పెళ్లి కూతుర్లు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా కాపురం పెట్టిన వారైతే వంట కోసం తంటాలు పడుతున్నారు. కొందరు యూట్యూబ్ చూసి వంట పాఠాలు నేర్చుకోవడానికి ప్రయతి్నస్తున్నారు. ఈ ప్రయత్నంలో చేతులు కాల్చుకుంటూ వద్దురా..ఈ వంట తంటా అంటూ చాలించుకుంటున్నారు. ఆ వండిన వంట రుచికరంగా లేకపోవడంతో అబ్బాయిలు ఆమడదూరం వెళ్లిపోతున్నారు. ఇక ఉద్యోగ రీత్యా దంపతులు ఇద్దరూ వంటింటికి దూరంగా ఉంటున్నారు. 8 గంటల పని, తర్వాత ఇంటి పని, ఇతర పనులు వెరసి అలసిపోతున్నారు.బయట ఫుడ్ డేంజర్..? అధికంగా బయట ఫుడ్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, బ్రెయిన్ స్ట్రోక్, క్యాన్సర్, రక్తనాళాల్లో కొలె్రస్టాల్ తదితర సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా పెళ్లైన వారు లావు కావడానికి ఇది కూడా ఒక కారణమని వెల్లడిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్‌కు జై కొడుతున్నారు దంపతులు ఇద్దరూ సంపాదన మీద పోటీ పడుతున్నారు. బిజీ లైఫ్‌లో పడిపోతున్నారు. నువ్వా నేనా అంటూ పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఈ తరుణంలో భార్య వంటింటికి దూరమై బయట ఫుడ్ కోసం అన్వేస్తున్నారు. అలాగే చాలా మంది వంట రాక అల్లాడిపోతున్నారు. యూట్యూబ్ చూసి వండిన ఆ టేస్ట్ రాకపోవడంతో ముద్ద మింగుడు పడడం లేదు. దీంతో ఫాస్ట్ ఫుడ్‌పై పడిపోతున్నారు. మూడు పూటల ఫాస్ట్‌ఫుడ్‌ను ఆరగిస్తున్నారు. లేకుంటే దర్జాగా ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వాళ్ల పరిస్థితి అయితే అర్ధరాత్రి కూడా ఆర్డర్లు పెట్టుకుని ఆవురావురమని తినేస్తున్నారు. ఫుడ్ దొరక్కపోయినా ఫిజ్జాలు, బర్గర్లు తెప్పించుకుని కడుపు నింపుకుంటున్నారు. దీని ఫలితంగా జిల్లాలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు విచ్చలవిడిగా పుట్టుకొచ్చాయి. బిర్యానీ సెంటర్లు సందుకొక్కటి ఉన్నాయి. వీరి రాకతో ఆ సెంటర్లు, హోటళ్లు నిండిపోతున్నాయి. కొత్త జంటలతో కళకళలాడుతున్నాయి. అనారోగ్యం పాలుకావద్దు ఫాస్ట్ ఫుడ్ ప్రస్తుత సమాజంలో ఫ్యాషన్‌గా మారింది. పేద, మధ్య ధనిక తేడా లేకుండా ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు చాలా మందికి వంట రాదు అని బయట ఫుడ్ తింటున్నారు. ఇది మంచిది కాదు. వీలైనంత వరకు తగ్గించుకుంటే మంచిది. తాజాగా వండి తినడం ఉత్తమం. బయట తినడం వల్ల అనేక రోగాలు మనిషిని చుట్టుముడుతాయి. – వెంకట ప్రసాద్, వైద్య నిపుణుడు, చిత్తూరు

పిల్లలు వద్దనుకున్నాం.. కారణం ఇదే: హరీశ్ శంకర్
టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్( Harish Shankar) పేరు చెప్పగానే అందరికి గుర్తొచ్చే సినిమా 'గబ్బర్ సింగ్'. నేడు ఆయన 45వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే, మీకు ఆయన కుటుంబ నేపథ్యంతో పాటు పిలల్లను ఎందుకు వద్దనుకున్నారో తెలుసా..? కరీంనగర్‌లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన సినిమాలపై మక్కువతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. నాన్న శ్యాంసుందర్ తెలుగు ఉపాధ్యాయుడు కావడంతో హరీశ్‌కు సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. కోన వెంకట్ సహకారంతో రవితేజ నటించిన వీడే సినిమాకు సహాయకుడుగా హరీశ్ జర్నీ మొదలైంది. ఆ తర్వాత రామ్‌గోపాల్ వర్మ అతనికి రవితేజ హీరోగా షాక్ సినిమాకు దర్శకత్వం వహించమని అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత మిరపకాయ్, గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాథం వంటి హిట్ సినిమాలను ఇండస్ట్రీకి ఇచ్చాడు.దర్శకులు హరీశ్ శంకర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కుటుంబ విషయాలను పంచుకున్నారు. తన భార్య పేరు స్నిగ్ధ అని ఆమెకు పెద్దగా సినిమాలంటే ఇష్టం ఉండదని ఆయన చెప్పారు. చివరకు ఒక సినిమా కోసం పనిచేసినందుకు వచ్చిన రెమ్యునరేషన్ గురించి కూడా ఆమెకు తెలియదని ఆయన అన్నారు. ఈ క్రమంలో తమకు పిల్లలు ఎందుకు వద్దనుకున్నారో హరీశ్ ఇలా చెప్పారు. నా భార్య స్నిగ్ధతో చాలా స్పష్టతతో ఉంటాం. మాది మధ్యతరగతి కుటుంబం. బడ్జెట్ విషయంలో ప్రతిదానికి లెక్కలు వేసుకునే ముందుకు సాగుతాం. కుటుంబంలో నేనే పెద్దవాడిని కావడంతో బాధ్యతలు తీసుకోవాల్సిందే.. నా చెల్లెలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయడంతో పాటు తమ్ముడిని సెటిల్ చేయడం నా ప్రధాన కర్తవ్యం. అమ్మానాన్నలకు కూడా మంచి ఇల్లు నిర్మించాలి. ఇలా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. వీటిని పూర్తి చేసే పనిలో ఉన్న నాకు స్నిగ్ధ కూడా మద్దతుగా నిలవడం మరింత బలాన్ని ఇచ్చింది. ఇంతకుమించి జీవితంలో ఎలాంటి బాధ్యతలూ వద్దనుకున్నాం. ఇద్దరం మాట్లాడుకున్న తర్వాతే పిల్లలు వద్దని నిర్ణయం తీసుకున్నాం. పిల్లలు పుట్టిన తర్వాత సెల్ఫీష్‌గా తయారవుతాం అనిపించింది. దీంతో వారి ప్రపంచం కుదించుకుపోతుంది అనేది నా అభిప్రాయం.' అని ఆయన అన్నారు.హరీశ్ శంకర్ చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్, కేవీఎన్, మైత్రీ మూవీ మేకర్స్ వంటి భారీ బ్యానర్స్‌లో ఆయన సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌తో ఇప్పటికే చర్చలు పూర్తి అయ్యాయి. త్వరలో వారిద్దరి కాంబినేషన్లో సినిమా ప్రారంభం కానుంది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు.

ఐటీ నోటీసు వస్తే ‘రాజీ’ చేసుకోండి..
ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వస్తే, వెంటనే వారితో ‘సంధి’ లేదా రాజీ చేసుకోవచ్చు. దీనికి ఎవరి రాయబారమూ అక్కర్లేదు. మీరే స్వయంగా ఒప్పందంలాంటిది చేసుకోవచ్చు. 2025 మార్చి 17న ఓ సర్క్యులర్ ద్వారా డిపార్టుమెంటు వారు సులువుగా రాజీ చేసుకోమని మార్గదర్శకాలు ఇచ్చారు. దీన్నే ఇంగ్లీషులో COMPOUNDING అంటారు.ఎన్నో సందర్భాల్లో డిపార్టుమెంటు వారు నోటీసులు ఇస్తారు. వాటికి బదులివ్వకపోతే వారు కోర్టుకు వెళ్తారు. కొన్ని సీరియస్ కేసుల్లో జైలుకి పంపిస్తారు. అంతవరకు వెళ్లడం అవసరమా! పరువు గంగపాలై, బతుకు హాస్పిటల్ పాలై, కృష్ణ జన్మస్థానంలో గడపడమెందుకు?ఈ పథకం .. లేదా ఒప్పందం.. లేదా రాజీ మార్గం ప్రకారం.. 1 కోర్టుకు వెళ్లక్కర్లేదు. లీగల్ ప్రాసిక్యూషన్ ఉండదు. 2. టైం కలిసి వస్తుంది. 3. మానసిక ఒత్తిడి ఉండదు 4. ఆర్థిక ప్రమాదం ఉండదు 5. బ్యాంకు అకౌంటు అటాచ్మెంట్ ఉండదు 6. వ్యాపారం సజావుగా చేసుకోవచ్చు 7. నలుగురికీ తెలియకుండా గొడవ సమసిపోతుంది 8. ఇది అతి పెద్ద ఉపశమనంవివరాల్లోకి వెళ్తే.. అన్ని రకాల నేరాలకు ఇది వర్తిస్తుంది. ఎన్ని సార్లయినా ఈ స్కీమ్‌తో ప్రయోజనం పొందవచ్చు. కాల వ్యవధులు లేవు. వ్యాపార నిర్వహణలో ఉన్నప్పుడు తెలిసో, తెలియకో ఎన్నో నేరాలు, ఇన్‌కంట్యాక్స్ చట్టం ప్రకారం జరుగుతుంటాయి. వీటన్నింటి మీద సమయం వెచ్చించలేము. కోర్టు చుట్టూ తిరగలేము. తిరిగినా జడ్జిమెంటు ఎలా ఉంటుందో చెప్పలేము.ఇన్ని కష్టాలతో, ఇబ్బందులతో వ్యాపారం చేయలేము. వ్యాపారం కుంటుపడుతుంది. బైటి జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటారు. వీటన్నింటిని అధిగమించేందుకు కల్పిస్తున్న ఈ వెసులుబాటు, పాత కేసులకూ వర్తిస్తుంది. పాత కేసులను తిరస్కరించినా ఈ ఒప్పందంలో చేరి, రాజీపడొచ్చు. మరీ మోసపూరితమైన కేసుల్లో తప్ప మిగతా అన్నింటికీ ఈ ‘‘రాజీ’’లో ఉపశమనం ఉంది.చాలా త్వరగా పరిష్కారం దొరుకుతుంది. ఒక దరఖాస్తు చేసుకోగానే మార్గం సుగమం అవుతుంది. హై–ప్రొఫైల్ కేసుల్లో ముందుగా స్పెషల్ పర్మిషన్ తీసుకుని గానీ రిలీఫ్ ఇవ్వరు. ఉదాహరణకు జైలు శిక్ష 2 సంవత్సరాలు దాటినా .. సీబీఐ, ఈడీ మొదలైన సంస్థలతో సమస్యలు ఉన్నా, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ పర్మిషన్ అవసరం. ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు.. 👉 బిజినెస్ వ్యక్తులు 👉 టీడీఎస్ విషయంలో ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటున్నవారు 👉 పన్నుభారాన్ని కోర్టుకు వెళ్లకుండా సెటిల్ చేసుకునే వారు 👉 గతంలో రాజీకి వెళ్లి తిరస్కరణకు గురైన వారు 👉 అనేక నేరాలు చేసి బైటికి రానివాళ్లుఎలా చేయాలి: వంద రూపాయల స్టాంపు పేపరు మీద అన్ని వివరాలను మీ సంబంధిత అధికారికి సబ్మిట్ చేయాలి. దరఖాస్తుతో పాటు ఫీజు చెల్లించాలి. ఎంత చెల్లించాలో డిపార్టుమెంటు నిర్ణయిస్తుంది. రాజీపత్రం రాగానే ఉపశమనం వచ్చినట్లే. ప్రాసిక్యూషన్ ఆగిపోతుంది. మీరు మాత్రం అప్పీలులో ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలి.రాజీకి వెళ్లకపోతేషరా మామూలే. లీగల్ ప్రాసిక్యూషన్ కొనసాగుతుంది. ఫైన్ పడుతుంది. జైలు శిక్ష పడొచ్చు. కోర్టు ఖర్చులు భరించాలి. రికార్డుల్లో అలాగే ఉండిపోతే ఉత్తరోత్తరా డిపార్టుమెంటు వారి దృష్టిలో చెడుగా.. అంటే డిఫాల్టరుగా ఉండిపోతారు. కాబట్టి వెంటనే రాజీమార్గంలో వెళ్లి, రాజీపడి అన్ని కష్టాల్లో నుంచి బైటపడండి.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు.

రంజాన్ విందు: టేస్టీ.. టేస్టీగా..షీర్ కుర్మా, కచ్చీ బిర్యానీ చేసేయండిలా..!
రంజాన్ ఉపవాస దీక్షలు ముగించుకుని ఈదుల్ ఫిత్ర్ లేక రంజాన్ వేడుకను బంధుమిత్రులతో కలిసి ఆనందంగా సెలబ్రెట్ చేసుకుంటారు. ఈ పర్వదినాన్ని ఈద్ అని కూడా పిలుస్తారు. ప్రతి ఒక్కరూ ఈ రోజున వారి వారిస్థోమత మేరకు కొత్త దుస్తులు ధరించి, పలు రకాల తీపి వంటకాలు ముఖ్యంగా సేమియా/షీర్ ఖుర్మా, బిర్యానీ చేసుకుని ఆనందంగా విందు ఆరగిస్తారు. ఈ సందర్భంగా నోరూరించే ఆ వంటకాల తయారీ ఎలానో చూద్దామా..!.షీర్ కుర్మా..కావల్సినవి: పాలు – అర లీటర్ (3 కప్పులు); నెయ్యి – టేబుల్‌స్పూన్; పంచదార – ఒకటిన్నర టేబుల్ స్పూన్ (డేట్స్ ఎక్కువ వాడితే తక్కువ పంచదార వేసుకోవాలి); సేవియాన్ (వెర్మిసెల్లి)– అర కప్పు; జీడిపప్పు – 8 (తరగాలి); బాదంపప్పు – 8 (సన్నగా తరగాలి); పిస్తాపప్పు – 8 (తరగాలి); ఖర్జూర – 9 (సన్నగా తరగాలి); యాలకులు – 4 (లోపలి గింజలను ΄÷డి చేయాలి); బంగారు రంగులో ఉండే కిస్మిస్ – టేబుల్ స్పూన్; రోజ్‌వాటర్ – టీ స్పూన్‌తయారీ విధానం: సేవియాన్‌ను కొద్దిగా నెయ్యి వేసి బంగారురంగు వచ్చేలా వేయించి తీసి పక్కన పెట్టాలి.అదె గిన్నె లేదా పాన్‌లో మరికాస్త నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి తీయాలి ∙విడిగా పాలు మరిగించి, సన్నని మంట కాగనివ్వాలి. పాలు కొద్దిగా చిక్కబడ్డాక దీంట్లో వేయించిన సేవియాన్, పంచదార వేసి ఉడికించాలి. సేవియాన్ ఉడికాక మంట తగ్గించి డ్రై ఫ్రూట్స్ మిశ్రమం, యాలకుల పొడి వేసి కలిపి, మంట తీసేయాలి. తీపిదనం ఎక్కువ కావాలనుకునేవారు మరికాస్త పంచదార కలపుకోవచ్చు. కుంకుమపువ్వు, గులాబీ రేకలు, మరిన్ని డ్రై ఫ్రూట్స్ చివరగా అలంకరించుకోవచ్చు.నోట్: ఎండుఖర్జూరం ముక్కలు కలుపుకోవాలంటే వాటిని రాత్రిపూట నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు ఉపయోగించాలి.కచ్చీబిర్యానీ..కావల్సినవి: బాస్మతి బియ్యం – పావు కేజీ (250 గ్రా.ములు); మటన్ – కేజీ (ముక్కలు 2 అంగుళాల పరిమాణం); అల్లం– వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్; ఉల్లిపాయలు – 5 (నిలువుగా సన్నగా తరిగి, విడిగా వేయించి పక్కనుంచాలి); కారం – టేబుల్ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; పచ్చి బొప్పాయి ముక్క – పేస్ట్ చేయాలి; చిలికిన పెరుగు – కప్పు; కుంకుమపువ్వు – కొన్ని రేకలు (గరిటెడు వేడి పాలలో కలిపి పక్కనుంచాలి)మటన్ మసాలా కోసం... (దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 పచ్చ యాలకులు, 3 లవంగాలు, బిర్యానీ ఆకు, అర టీ స్పూన్ మిరియాలు, అర టీ స్పూన్ సాజీర) రైస్ మసాలా కోసం... (యాలకులు 2, దాల్చిన చెక్క, పచ్చ యాలక్కాయ, 2 లవంగాలు, నెయ్యి లేదా నూనె 3 టేబుల్‌స్పూన్లు, పుదీనా, కొత్తిమీర గుప్పెడు, ఉప్పు తగినంత)తయారీ విధానం:బేసిన్లో మటన్ వేసి అందులో పెరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, బొప్పాయి ముద్ద, కారం, పసుపు, మసాలా, ఉప్పు, వేయించిన ఉల్లిపాయల తరుగు సగం వేసి కలిపి, 3 గంటల సేపు నానబెట్టాలి. కప్పు బియ్యానికి రెండున్నర కప్పుల చొప్పున నీళ్లు, మసాలా, బియ్యం, తగినంత ఉప్పు వేసి ముప్పావు వంతు వరకు ఉడికించి, నీళ్లను వడకట్టాలి. తర్వాత అందులో నెయ్యి వేసి కలపాలి. మరో మందపాటి డేకిసా(గిన్నె) తీసుకొని నెయ్యి వేసి వేడయ్యాక నానిన మటన్ వేసి కలపాలి. పైన పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నిమ్మరసం వేయాలి. సగం ఉడికిన బియ్యం పైన లేయర్‌గా వేయాలి. మిగిలిన నెయ్యి, కుంకుమపువ్వు కలిపిన పాలు, నిమ్మరసం వేయాలి. డేకిసా మీద మూత పెట్టి, గోధుమపిండి ముద్దతో చుట్టూ మూసేయాలి. పెద్ద మంట మీద 20–25 నిమిషాలసేపు ఉడకనివ్వాలి. సన్నని మంట మీద మరో 40 నిమిషాలు ఉంచాలి. తర్వాత దించి, రైతా/ఏదైనా గ్రేవీతో వేడి వేడిగా వడ్డించాలి. (చదవండి: ప్రేమను పంచే శుభదినం ఈద్)
రంజాన్ విందు: టేస్టీ.. టేస్టీగా..షీర్ కుర్మా, కచ్చీ బిర్యానీ చేసేయండిలా..!
పంచాంగ శ్రవణం.. తరలివచ్చిన జనం
బాబు డబుల్ గేమ్.. సొంత ఇలాకాలో ఊహించని షాక్
Eid al-Fitr: దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఈద్ శుభాకాంక్షలు
స్టాక్ మార్కెట్ సెలవులు.. ఏప్రిల్‌లో ఈ రోజుల్లో నో ట్రేడింగ్
RR VS CSK: 20 పరుగులు తక్కువ చేశామనిపించింది.. ఫీల్డింగ్‌తో కవర్ చేశాము: రియాన్ పరాగ్
ఉగాది రోజున ఓ వ్యక్తి సజీవ సమాధికి ప్రయత్నం
HCU వద్ద హైటెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు
Eid al-Fitr: ఢిల్లీ నుంచి ముంబై వరకూ.. అంతటా ఈద్ సందడి
ఈ జాబ్ చాలా లక్కీ!: ఐపీఎస్ అంకిత సురానా
ఇప్పటిదాకా ఆరు అక్రమ కేసులు.. దేనికైనా రెడీ: కాకాణి
IPL 2025: బోణీ కొట్టిన రాజస్తాన్ రాయల్స్..
పిల్లలు వద్దనుకున్నాం.. కారణం ఇదే: హరీశ్ శంకర్
ఇప్పుడేంటి.. ? కారుతో ఢీకొట్టాను.. ఎవరైనా చచ్చిపోయారా?
మయన్మార్‌లో దారుణ పరిస్థితులు.. రెస్య్కూ వేళ వైమానిక దాడులు!
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
బీసీల ఆలోచన ఆ పూటకే!
‘పీ4’.. అడ్వాన్స్డ్ ఏప్రిల్ ఫూల్!
ఒప్పందానికి రాకపోతే అమెరికా ‘బాంబు’ రుచి చూపిస్తాం: ట్రంప్
పొలిమేర హీరోయిన్ మరో థ్రిల్లర్ మూవీ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
రంజాన్ విందు: టేస్టీ.. టేస్టీగా..షీర్ కుర్మా, కచ్చీ బిర్యానీ చేసేయండిలా..!
పంచాంగ శ్రవణం.. తరలివచ్చిన జనం
బాబు డబుల్ గేమ్.. సొంత ఇలాకాలో ఊహించని షాక్
Eid al-Fitr: దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఈద్ శుభాకాంక్షలు
స్టాక్ మార్కెట్ సెలవులు.. ఏప్రిల్‌లో ఈ రోజుల్లో నో ట్రేడింగ్
RR VS CSK: 20 పరుగులు తక్కువ చేశామనిపించింది.. ఫీల్డింగ్‌తో కవర్ చేశాము: రియాన్ పరాగ్
ఉగాది రోజున ఓ వ్యక్తి సజీవ సమాధికి ప్రయత్నం
HCU వద్ద హైటెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు
Eid al-Fitr: ఢిల్లీ నుంచి ముంబై వరకూ.. అంతటా ఈద్ సందడి
ఈ జాబ్ చాలా లక్కీ!: ఐపీఎస్ అంకిత సురానా
ఇప్పటిదాకా ఆరు అక్రమ కేసులు.. దేనికైనా రెడీ: కాకాణి
IPL 2025: బోణీ కొట్టిన రాజస్తాన్ రాయల్స్..
పిల్లలు వద్దనుకున్నాం.. కారణం ఇదే: హరీశ్ శంకర్
ఇప్పుడేంటి.. ? కారుతో ఢీకొట్టాను.. ఎవరైనా చచ్చిపోయారా?
మయన్మార్‌లో దారుణ పరిస్థితులు.. రెస్య్కూ వేళ వైమానిక దాడులు!
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
బీసీల ఆలోచన ఆ పూటకే!
‘పీ4’.. అడ్వాన్స్డ్ ఏప్రిల్ ఫూల్!
ఒప్పందానికి రాకపోతే అమెరికా ‘బాంబు’ రుచి చూపిస్తాం: ట్రంప్
పొలిమేర హీరోయిన్ మరో థ్రిల్లర్ మూవీ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
సినిమా

మెల్బోర్న్లో బాలీవుడ్ సింగర్ కన్సర్ట్.. ఐదు లక్షల డాలర్ల నష్టమా?
బాలీవుడ్ ప్రముఖ సింగర్ నేహా కక్కర్ ఇటీవల మెల్బోర్న్లో ఓ మ్యూజిక్ కన్సర్ట్కు హాజరైంది. అయితే తాను మూడు గంటలకు ఈవెంట్‌కు వెళ్లడంతో నిర్వాహకులు తమను పట్టించుకోలేదని విమర్శలు చేసింది. అంతేకాకుండా నా టీమ్‌తో పాటు తనకు డబ్బులు ఇవ్వకుండా పారిపోయారని ఆరోపించింది. నా టీమ్‌కు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది.అయితే తాజాగా సింగర్ నేహా కక్కర్ ఆరోపణలపై మ్యూజిక్ కన్సర్ట్ నిర్వాహకులు స్పందించారు. ఆమె చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. నేహా కక్కర్ షోతో తాము తీవ్రంగా నష్టపోయామని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈవెంట్‌కు సంబంధించిన అన్ని రుజువులు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. అంతేకాకుండా ఆమె బృందానికి నిర్వాహకులు పెట్టిన ఖర్చులను కూడా ఇందులో ప్రస్తావించారు. ఈ ఈవెంట్ వల్ల తామే అప్పుల్లో చిక్కుకున్నామని రాసుకొచ్చారు. ఆమెనే తమకు డబ్బులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. View this post on Instagram A post shared by Beats Production (@beatsproductionau) View this post on Instagram A post shared by Beats Production (@beatsproductionau)

Vaishnavi Chaitanya: ఒక్క హిట్...తెలుగమ్మాయికి భారీ రెమ్యునరేషన్
తారల తలరాతలు మార్చడానికి ఒకే ఒక్క సినిమా చాలు. హిట్ పడ్డాక ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. రెమ్యునరేషన్ పెరుగుతూనే ఉంటుంది. అయితే ఆ హిట్ కోసం తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య ( Vaishnavi Chaitanya) చాలా కాలమే ఎదురు చూసింది. కెరీర్ ప్రారంభంలో 'లవ్ ఇన్ 143 అవర్స్' 'ది సాఫ్ట్వేర్ డెవలపర్' 'అరెరె మానస' 'మిస్సమ్మ' వంటి షార్ట్ ఫిల్మ్స్ తో నటిగా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి... అటు తర్వాత 'అల వైకుంఠపురములో' 'వరుడు కావలెను' వంటి క్రేజీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసే అవకాశం దక్కించుకున్నారు. ఆ సినిమాల్లో చేసినవి చిన్న పాత్రలే అయినప్పటికీ వాటితో కూడా యూత్ ను మెప్పించారు.అందువల్ల 'బేబీ' సినిమాలో వైష్ణవికి మెయిన్ హీరోయిన్ ఛాన్స్ వరించింది.ఆ ఒక్క చిత్రమే ఈ తెలుగమ్మాయి జీవితాన్ని మార్చేసింది.ఆ చిత్రంలో యూత్ లోనే కాదు.. ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా బోలెడంత క్రేజ్ సంపాదించుకున్నారు వైష్ణవి. ఇప్పుడు ఆమె నటిస్తున్న 'జాక్' సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో ఆమె ద్విపాత్రాభినయంతో అలరించనున్నారు. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 'శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర' బ్యానర్ పై అగ్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో పాటు '90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్ కి సీక్వెల్ గా రూపొందుతున్న సినిమాలో కూడా ఆనంద దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించనున్నారు వైష్ణవి. 'సితార ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఇలా 2 పెద్ద బ్యానర్లలో మెయిన్ హీరోయిన్ గా చేస్తూ బిజీగా గడుపుతున్నారు.ఇదిలా ఉంటే.. ఇప్పుడు టాలీవుడ్లో క్రేజ్ ఉన్న హీరోయిన్లు, డిమాండ్ ఉన్న హీరోయిన్లు బాగా తక్కువగానే ఉన్నారు. మొన్నటి వరకు ఒక ఊపు ఊపిన స్టార్ హీరోయిన్లు ఇప్పుడు ఫామ్‌లో లేరు. ఇలాంటి టైంలో దర్సకనిర్మాతలకి వైష్ణవి చైతన్య వైపు మొగ్గు చూపుతున్నారు.ఇది ఆమెకి కలిసొచ్చినట్టు అయ్యింది. దీంతో వైష్ణవి పారితోషికం కూడా పెరిగినట్టు సమాచారం. ఇటీవల ఓ కొత్త సినిమా కోసం వైష్ణవి చైతన్యకి కోటి రూపాయల పారితోషికం ఆఫర్ చేశారట ఓ యువ నిర్మాత, దర్శకుడు. వైష్ణవికి యూత్‌లో అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమెకు అంత మొత్తం ఇచ్చేందుకు ఈ దర్శకనిర్మాతలు సిద్దమైనట్టు సమాచారం.ఇలా తన అప్ కమింగ్ సినిమాకి గాను వైష్ణవి పారితోషికం కోటి రూపాయల మార్క్ టచ్ అయినట్టు స్పష్టమవుతోంది.

సమంత నిర్మాతగా తొలి మూవీ.. టీజర్ రిలీజ్
స్టార్ హీరోయిన్ సమంత.. సినిమాల్లో నటించి చాలా రోజులైపోయింది. చివరగా 'ఖుషి'లో కనిపించింది. తర్వాత ఒకటి రెండు వెబ్ సిరీసులు చేసిందంతే. మరోవైపు నిర్మాణ సంస్థ స్థాపించింది. ఇప్పుడు అందులో నిర్మించిన సినిమాని ఇప్పుడు విడుదలకు సిద్ధం చేసేసింది కూడా.(ఇదీ చదవండి: 'మ్యాడ్ స్క్వేర్'కి ఊహించని కలెక్షన్స్)పలువురు చిన్న నటీనటులతో తీసిన ఈ సినిమాకు శుభం టైటిల్ ఫిక్స్ చేశారు. కొన్నిరోజుల క్రితం దీని గురించి బయటపెట్టగా.. ఇప్పుడు ఉగాది సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. చూస్తుంటే ఇది ఫన్నీగా ఉంది. హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయనిపిస్తోంది. మీరు కూడా టీజర్ పై ఓ లుక్కేయండి. (ఇదీ చదవండి: పూరీ-సేతుపతి అఫీషియల్.. రెండు విషయాల్లో క్లారిటీ)

జాన్వీ కపూర్ ర్యాంప్ వాక్.. ఇంతకీ ముద్దుపెట్టిన ఆమె ఎవరు?
బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్లామర్ విషయానికొస్తే హీరోయిన్లలో ఓ మెట్టు ముందు వరుసలో ఉంటుంది. గతేడాది దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది సినిమాలో కనిపించనుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఇటీవల చెర్రీ బర్త్ డే సందర్భంగా రివీల్ చేశారు.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఫ్యాషన్ షో మెరిసింది. తన ర్యాంప్‌వాక్‌తో అభిమానులను కట్టిపడేసింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఈ ర్యాంప్ వాక్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన బాలీవుడ్ బ్యూటీ ఈ షోకు హాజరైన ఓ పెద్దావిడను ఆలింగనం చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో జాన్వీ కపూర్‌కు అప్యాయంగా ముద్దు పెట్టిన ఆమె ఎవరు? అంటూ నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు.అయియతే అక్కడ ఉన్నది శ్లోకా మెహతా తల్లిదండ్రులు మోనా, రస్సెల్ మెహతా. కాగా.. రస్సెల్ మెహతా భారతదేశంలోని వజ్రాల తయారీదారులలో ఒకటైన రోజీ బ్లూ ఇండియాను కలిగి ఉన్న వ్యాపారవేత్త అని తెలుస్తోంది. ఆయన కుమార్తె శ్లోకా మెహతా ప్రముఖ బిలియనీర్ ముఖేశ్ అంబానీ, నీతా అంబానీలకు పెద్ద కోడలు కావడంతో అందరి దృష్టి ఆమెపైనే పడింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)
న్యూస్ పాడ్‌కాస్ట్

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు

థాయ్‌లాండ్, మయన్మార్‌లో భారీ భూకంపం... పేకమేడల్లా కూలిన భవనాలు... రెండు దేశాల్లో ఇప్పటికే 200 దాటిన మృతుల సంఖ్య.. ఇండియా, చైనాలోనూ భూప్రకంపనలు

హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?... ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఎలాగైనా ఉత్తీర్ణత పెంచాల్సిందే... ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు..

పెద్దల మెప్పు కోసం పని చేయొద్దు, పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది... మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం

అరటి రైతును ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం పేరిట సిండికేట్ లూటీ... సన్నిహితులైన కాంట్రాక్టర్లతో ప్రభుత్వ పెద్దల కుమ్మక్కు...

25 ఏళ్లపాటు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టొద్దు... చెన్నైలో జేఏసీ తొలి సమావేశంలో తీర్మానం

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనలో ఉద్యోగాలు మాయం... దాదాపు 2 లక్షల మేర తగ్గిపోయిన ఉద్యోగుల సంఖ్య
క్రీడలు

‘మయామి’ క్వీన్ సబలెంకా
ఫ్లోరిడా: ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ హోదాకు తగ్గట్టు రాణించిన బెలారస్ టెన్నిస్ స్టార్ సబలెంకా తన కెరీర్లో 19వ సింగిల్స్ టైటిల్‌ను సాధించింది. ఆదివారం ముగిసిన మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 లెవెల్ టోరీ్నలో సబలెంకా తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. 88 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సబలెంకా 7–5, 6–2తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ జెస్సికా పెగూలా (అమెరికా)పై గెలిచింది. విజేత సబలెంకాకు 11,24,380 డాలర్ల (రూ. 9 కోట్ల 61 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ పెగూలాకు 5,97,890 డాలర్ల (రూ. 5 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీ 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. టైటిల్ గెలిచే క్రమంలో సబలెంకా తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం గమనార్హం. సబలెంకా సాధించిన 19 టైటిల్స్‌లో 17 టైటిల్స్ హార్డ్కోర్టులపై రావడం విశేషం.

Asian Wrestling 2025: భారత రెజ్లర్లకు మూడు పతకాలు
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో చివరిరోజు ఆదివారం భారత్‌కు మూడు పతకాలు లభించాయి. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో దీపక్ పూనియా (92 కేజీలు), ఉదిత్ (61 కేజీలు) రజత పతకాలు నెగ్గగా... దినేశ్ (125 కేజీలు) కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్స్‌లో దీపక్ పూనియా 0–10 పాయింట్ల తేడాతో అమీర్‌హుస్సేన్ (ఇరాన్) చేతిలో... ఉదిత్ 4–6 పాయింట్ల తేడాతో టకారా సుడా (జపాన్) చేతిలో ఓడిపోయారు. కాంస్య పతక బౌట్లో దినేశ్ తుర్క్మెనిస్తాన్ రెజ్లర్ సపరోవ్ను ఓడించాడు. ఆసియా చాంపియన్‌షిప్ చరిత్రలో 25 ఏళ్ల దీపక్ పూనియాకిది ఐదో పతకం కావడం విశేషం. 2021, 2022లలో రజతాలు నెగ్గిన దీపక్... 2019, 2020లలో కాంస్య పతకాలు సాధించాడు.

రాజస్తాన్ ఖాతా తెరిచింది
గువాహాటి: ఐపీఎల్ సీజన్లో వరుసగా రెండు ఓటముల నుంచి రాజస్తాన్ రాయల్స్ కోలుకుంది. తమ మూడో మ్యాచ్‌లో విజయంతో పాయింట్ల పట్టికలో బోణీ చేసింది. ఆదివారం చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్తాన్ 6 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. చెన్నైకిది వరుసగా రెండో పరాజయం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీశ్ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, రియాన్ పరాగ్ (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ (44 బంతుల్లో 63; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా... రవీంద్ర జడేజా (22 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. రాణా మెరుపులు... తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ (4) వెనుదిరగ్గా... సంజు సామ్సన్ (16 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్), రాణా కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. ముఖ్యంగా రాణా ఏ బౌలర్‌నూ వదలకుండా చెలరేగిపోయాడు. ఒవర్టన్ వరుస రెండు ఓవర్లలో కలిపి 3 ఫోర్లు, సిక్స్ కొట్టాక అశ్విన్ ఓవర్లో అతను వరుసగా 6, 6, 4 బాదాడు. ఆ తర్వాత ఖలీల్ ఓవర్లోనూ 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన రాణా 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. సామ్సన్ అవుటయ్యాక కొద్దిసేపు రాణాకు పరాగ్ అండగా నిలిచాడు. అశ్విన్ ఓవర్లో మళ్లీ వరుసగా 6, 4 కొట్టాక తర్వాతి బంతికి స్టంపౌట్ కావడంతో రాణా మెరుపు ఇన్నింగ్స్ ముగిసింది. అయితే అతను అవుటయ్యాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. చెన్నై బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించడంతో రాయల్స్ ఆశించిన స్కోరుకు చాలా దూరంలో ఆగిపోయింది. రాణా వెనుదిరిగాక 51 బంతుల్లో 58 పరుగులు మాత్రమే చేయగలిగిన జట్టు 6 వికెట్లు చేజార్చుకుంది. పవర్‌ప్లేలో 79 పరుగులు చేసిన రాజస్తాన్ మిగిలిన 14 ఓవర్లలో కలిపి 103 పరుగులు మాత్రమే సాధించింది. రుతురాజ్ హాఫ్ సెంచరీ... ఛేదనలో చెన్నై మొదటి ఓవర్లోనే రచిన్ రవీంద్ర (0) వికెట్ కోల్పోగా, ఐదు బంతుల వ్యవధిలో 3 ఫోర్లు, సిక్స్ కొట్టి ధాటిని ప్రదర్శంచిన రాహుల్ త్రిపాఠి (19 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. మరోవైపు రుతురాజ్ మాత్రం కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. సందీప్ ఓవర్లో అతను 3 ఫోర్లు కొట్టాడు. పరాగ్ అద్భుత క్యాచ్‌కు శివమ్ దూబే (18) వెనుదిరగ్గా, విజయ్‌శంకర్ (9) విఫలమయ్యాడు. 37 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన రుతురాజ్‌ను కీలక సమయంలో హసరంగ అవుట్ చేశాడు. 25 బంతుల్లో 54 పరుగులు చేయాల్సిన స్థితిలో ధోని (11 బంతుల్లో 16; 1 ఫోర్, 1 సిక్స్) క్రీజ్‌లోకి వచ్చాడు. అయితే అతనూ ప్రభావం చూపలేకపోగా, మరో ఎండ్‌లో జడేజా కూడా జట్టును గెలిపించడంలో సఫలం కాలేకపోయాడు. ఆఖరి 2 ఓవర్లలో విజయానికి 39 పరుగులు అవసరం కాగా, చెన్నై 32 పరుగులు రాబట్టగలిగింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) అశ్విన్ (బి) అహ్మద్ 4; సామ్సన్ (సి) రచిన్ (బి) నూర్ 20; నితీశ్ రాణా (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 81; పరాగ్ (బి) పతిరణ 37; జురేల్ (సి) పతిరణ (బి) నూర్ 3; హసరంగ (సి) శంకర్ (బి) జడేజా 4; హెట్‌మైర్ (సి) అశ్విన్ (బి) పతిరణ 19; ఆర్చర్ (సి) గైక్వాడ్ (బి) అహ్మద్ 0; కార్తికేయ (రనౌట్) 1; తీక్షణ (నాటౌట్) 2; దేశ్‌పాండే (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–4, 2–86, 3–124, 4–134, 5–140, 6–166, 7–174, 8–175, 9–176. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–38–2, ఒవర్టన్ 2–0–30–0, అశ్విన్ 4–0–46–1, నూర్ అహ్మద్ 4–0–28–2, పతిరణ 4–0–28–2, జడేజా 2–0–10–1. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (సి) జురేల్ (బి) ఆర్చర్ 0; త్రిపాఠి (సి) హెట్‌మైర్ (బి) హసరంగ 23; రుతురాజ్ (సి) జైస్వాల్ (బి) హసరంగ 63; శివమ్ దూబే (సి) పరాగ్ (బి) హసరంగ 18; విజయ్‌శంకర్ (బి) హసరంగ 9; జడేజా (నాటౌట్) 32; ధోని (సి) హెట్‌మైర్ (బి) సందీప్ 16; ఒవర్టన్ (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–0, 2–46, 3–72, 4–92, 5–129, 6–164. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 3–1–13–1, తుషార్ దేశ్‌పాండే 4–0–45–0, సందీప్ శర్మ 4–0–42–1, మహీశ్ తీక్షణ 4–0–30–0, హసరంగ 4–0–35–4, కార్తికేయ 1–0–10–0.

IPL 2025: ‘సన్’కు స్టార్క్ స్ట్రోక్
సన్‌రైజర్స్ ‘విధ్వంసక’ బ్యాటింగ్ బృందం మరోసారి నిరాశపర్చింది. సొంతగడ్డపై ఓటమి తర్వాత వైజాగ్ చేరిన రైజర్స్ ఆట మాత్రం మారలేదు. బ్యాటింగ్ వైఫల్యంతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. అనికేత్ వర్మ సిక్సర్లతో జోరు ప్రదర్శించినా అది సరిపోలేదు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ అలవోకగా విజయతీరం చేరింది. తొలి వికెట్‌కు 55 బంతుల్లోనే 81 పరుగులు వచ్చాక లక్ష్యం సునాయాసమైపోయింది. ఫలితంగా ఢిల్లీ ఖాతాలో వరుసగా రెండో విజయం చేరగా, హైదరాబాద్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. సాక్షి, విశాఖపట్నం: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో పరాజయాన్ని ఎదుర్కొంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 18.4 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటైంది. అనికేత్ వర్మ (41 బంతుల్లో 74; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... హెన్రిచ్ క్లాసెన్ (19 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ స్టార్క్ (5/35) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీయగా, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఢిల్లీ 16 ఓవర్లలో 3 వికెట్లకు 166 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఫాఫ్ డుప్లెసిస్ (27 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా... జేక్ ఫ్రేజర్ (32 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అభిషేక్ పొరేల్ (18 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్ లెగ్‌స్పిన్నర్ జీషాన్ అన్సారీకే మూడు వికెట్లు దక్కాయి. కీలక భాగస్వామ్యం... స్టార్క్ వేసిన తొలి ఓవర్లో ట్రవిస్ హెడ్ (12 బంతుల్లో 22; 4 ఫోర్లు) రెండు ఫోర్లు కొట్టి జోరుగా మొదలుపెట్టినా, దురదృష్టవశాత్తూ అదే ఓవర్లో అభిషేక్ శర్మ (1) రనౌటయ్యాడు. హెడ్ బంతిని ఆడి సింగిల్ కోసం ప్రయత్నించగా నెమ్మదిగా స్పందించిన అభిషేక్ క్రీజ్‌కు చేరుకునేలోగా నిగమ్ విసిరిన త్రో వికెట్లను పడగొట్టింది. ఇషాన్ కిషన్ (2) ఈ మ్యాచ్‌లోనూ విఫలం కాగా, ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య గ్రౌండ్లోకి వచ్చిన ‘లోకల్ బాయ్’ నితీశ్ కుమార్ రెడ్డి (0) తీవ్రంగా నిరాశపర్చాడు. స్టార్క్ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న రెండో బంతినే భారీ షాట్ ఆడబోయి గాల్లోకి లేపగా అక్షర్ పటేల్ చేతికి చిక్కాడు. స్టార్క్ తర్వాతి హెడ్ కూడా అవుట్ కావడంతో రైజర్స్ స్కోరు 4.1 ఓవర్లలో 37/4 వద్ద నిలిచింది. ఈ దశలో అనికేత్, క్లాసెన్ కలిసి జట్టును ఆదుకున్నారు. అప్పటికీ నాలుగు వికెట్లు కోల్పోయినా... వీరిద్దరు దూకుడు మాత్రం తగ్గించకుండా ఓవర్‌కు 11 రన్‌రేట్‌తో పరుగులు రాబట్టారు. 6 పరుగుల వద్ద పొరేల్ క్యాచ్ వదిలేయడంతో అనికేత్‌కు లైఫ్ లభించింది. స్టార్క్ ఓవర్లో క్లాసెన్ వరుసగా 6, 4 కొట్టగా, నిగమ్ ఓవర్లో అనికేత్ వరుసగా 4, 6 బాదాడు. ఆ తర్వాత అక్షర్ ఓవర్లో అనికేత్ వరుసగా రెండు భారీ సిక్స్‌లు బాదాడు. ఈ జోడీ 42 బంతుల్లో 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా, నిగమ్ అద్భుత క్యాచ్‌తో క్లాసెన్ వెనుదిరిగాడు. 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అనికేత్ మరింత చెలరేగిపోతూ అక్షర్ ఓవర్లో వరుసగా 4, 6, 6 బాదడం విశేషం. అయితే ఇతర బ్యాటర్లంతా విఫలం కావడంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. ఆరంభం నుంచే దూకుడు... ఛేదనలో ఢిల్లీకి ఏ దశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. ఓపెనర్లు జేక్ ఫ్రేజర్, డుప్లెసిస్ ధాటిగా ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టారు. దాంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఢిల్లీ 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 పరుగులు చేసింది. ఈ క్రమంలో జేక్ ఫ్రేజర్ తనకు వచ్చిన రెండు ‘లైఫ్’లను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. 26 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న డుప్లెసిస్... 40 ఏళ్లు దాటిన తర్వాత ఐపీఎల్లో హాఫ్ సెంచరీ అరుదైన ఆటగాళ్లు గిల్‌క్రిస్ట్, గేల్, ద్రవిడ్ సరసన నిలిచాడు. అన్సారీ వేసిన 10వ ఓవర్ ఆసక్తికరంగా సాగింది. తొలి బంతికి అతను డుప్లెసిస్‌ను అవుట్ చేయగా, రెండో బంతికి పొరేల్ సింగిల్ తీశాడు. తర్వాతి మూడు బంతుల్లో వరుసగా 4, 4, 6 బాదిన జేక్ ఫ్రేజర్ చివరి బంతికి అవుటయ్యాడు. షమీ వేసిన తర్వాతి ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన కేఎల్ రాహుల్ (5 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్)ను కూడా అన్సారీనే వెనక్కి పంపించాడు. 52 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన ఈ స్థితిలో పొరేల్, స్టబ్స్ (14 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు) ఇక ఆలస్యం చేయలేదు. ఫటాఫట్‌గా 28 బంతుల్లోనే అభేద్యంగా 51 పరుగులు జత చేసి మ్యాచ్‌ను ముగించారు. ఆకట్టుకున్న అన్సారీ సన్‌రైజర్స్ జట్టు తరఫున ఈ మ్యాచ్‌లో 25 ఏళ్ల లెగ్‌స్పిన్నర్ జీషాన్ అన్సారీ ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో స్వస్థలం. 5 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో బరిలోకి దిగిన అతను ఐపీఎల్‌కు ముందు యూపీ తరఫున ఒకే ఒక టి20 మ్యాచ్ ఆడాడు. 2016 అండర్–19 వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, సర్ఫరాజ్‌లతో పాటు అన్సారీ కూడా సభ్యుడిగా ఉన్నాడు. గత ఏడాది యూపీ టి20 లీగ్‌లో మీరట్ మావెరిక్స్ తరఫున ఆడి అత్యధిక వికెట్లు (24) తీయడంతో అందరి దృష్టిలో పడ్డాడు. ‘గూగ్లీ’ అతని ప్రధాన బలం. వేలంలో సన్‌రైజర్స్ జట్టు విప్రాజ్ నిగమ్‌తో పాటు అన్సారీ కోసం పోటీ పడింది. నిగమ్‌ను ఢిల్లీ సొంతం చేసుకోగానే అన్సారీని రైజర్స్ ఎంచుకుంది.స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (రనౌట్) 1; హెడ్ (సి) కేఎల్ రాహుల్ (బి) స్టార్క్ 22; ఇషాన్ కిషన్ (సి) స్టబ్స్ (బి) స్టార్క్ 2; నితీశ్ కుమార్ రెడ్డి (సి) అక్షర్ పటేల్ (బి) స్టార్క్ 0; అనికేత్ (సి) జేక్ ఫ్రేజర్ (బి) కుల్దీప్ 74; క్లాసెన్ (సి) నిగమ్ (బి) మోహిత్ 32; మనోహర్ (సి) డుప్లెసిస్ (బి) కుల్దీప్ 4; కమిన్స్ (సి) జేక్ ఫ్రేజర్ (బి) కుల్దీప్ 2; ముల్డర్ (సి) డుప్లెసిస్ (బి) స్టార్క్ 9; హర్షల్ పటేల్ (సి) అక్షర్ పటేల్ (బి) స్టార్క్ 5; షమీ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 163. వికెట్ల పతనం: 1–11, 2–20, 3–25, 4–37, 5–114, 6–119, 7–123, 8–148, 9–162, 10–163. బౌలింగ్: మిచెల్ స్టార్క్ 3.4–0–35–5, ముకేశ్ కుమార్ 2–0–17–0, అక్షర్ పటేల్ 4–0–43–0, విప్రాజ్ నిగమ్ 2–0–21–0, మోహిత్ శర్మ 3–0–25–1, కుల్దీప్ యాదవ్ 4–0–22–3. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: జేక్ ఫ్రేజర్ (సి అండ్ బి) అన్సారి 38; డుప్లెసిస్ (సి) ముల్డర్ (బి) అన్సారి 50; పొరేల్ (నాటౌట్) 34; కేఎల్ రాహుల్ (బి) అన్సారి 15; స్టబ్స్ (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (16 ఓవర్లలో 3 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–81, 2–96, 3–115. బౌలింగ్: మొహమ్మద్ షమీ 3–0–31–0, అభిషేక్ శర్మ 3–0–27–0, ప్యాట్ కమిన్స్ 2–0–27–0, హర్షల్ పటేల్ 3–0–17–0, జీషాన్ అన్సారి 4–0–42–3, వియాన్ ముల్డర్ 1–0–16–0.
బిజినెస్

బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా పీఎం విద్యాలక్ష్మీ రుణాలు
న్యూఢిల్లీ: ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన్ మంత్రి విద్యాలక్ష్మీ (పీఎం–విద్యాలక్ష్మీ) పథకాన్ని అందుబాటులోకి తెచి్చనట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. దేశంలోని టాప్ 860 నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థల్లో (క్యూహెచ్ ఈఐ) ప్రవేశం పొందిన విద్యా ర్థులు ఈ పథకం కింద రుణం కోసం అర్హులు. రూ.7.5 లక్షల వరకు రుణాలకు 75% క్రెడిట్ గ్యారంటీ కూడా ఉంటుంది. విద్యార్థులు లేదా వారి కుటుంబాలు ఎటువంటి ఆస్తులను తన ఖాగా ఇవ్వాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు పీఎం–విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి విద్యా రుణం కోసం డిజిటల్‌గా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్‌కు 8,300కి పైగా బ్రాంచ్‌లు, 12 ప్రత్యేక విద్యా రుణ ఆమోద కేంద్రాలు, 119 రిటైల్ అస్సెట్ ప్రాసెసింగ్ కేంద్రాలు ఉన్నాయి. అర్హులైన వి ద్యార్థులందరూ నాణ్యమైన విద్య పొందేందుకు అవ సరమైన ఆర్థిక తోడ్పాటు అందించ డం తమ లక్ష్యమని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ ముదలియార్ తెలిపారు.

రాబడిపై పన్ను సున్నా...
కొత్త బడ్జెట్లో ఆదాయపన్ను మినహాయింపు రాయితీలను గణనీయంగా పెంచడంతో మధ్యతరగతికి పెద్ద ఊరట లభించింది. వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్‌తో కలుపుకుని రూ.12.75 లక్షలు, ఇతరులకు రూ.12 లక్షల ఆదాయం ఉన్నా కానీ కొత్త విధానంలో రూపాయి పన్ను లేకుండా చేశారు ఆర్థిక మంత్రి. ఇప్పటికీ అధిక ఆదాయ పరిధిలో ఉండి, పన్ను ఆదా పెట్టుబడుల కోసం అన్వేషించే వారికి మెరుగైన మార్గం ఒకటి ఉంది. పన్ను ఆదా చేసే ట్యాక్స్ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవడమే. వీటి నుంచి వచ్చే రాబడిపై ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. ఇందులో ఉండే ప్రయోజనాలు, ఎలా ఇన్వెస్ట్ చేయాలి? తదితర వివరాలతో కూడిన కథనమే ఇది... బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు), చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులపై వచ్చే రాబడికి ఎలాంటి పన్ను ఆదా ప్రయోజనం లేదు. దీంతో రూ.12 లక్షలకు పైన ఆదాయం ఉన్న వారికి పన్ను ప్రయోజనం పరంగా ఇలాంటివి మెరుగైన సాధనాలు కాబోవు. ఎందుకంటే వీటిపై వచ్చే రాబడి పన్ను చెల్లింపుదారు వార్షిక ఆదాయానికి కలుస్తుంది. దాంతో చెల్లించాల్సిన పన్ను భారం పెరిగిపోతుంది. ఫలితంగా నికర ఆదాయం రూ.12.75 లక్షలకు మించిపోవచ్చు. దీనివల్ల పన్ను ఆదా రాయితీని కోల్పోవాల్సి వస్తుంది. కనుక అధిక ఆదాయం పరిధిలో ఉన్న వారికి అందుబాటులో ఉన్న మెరుగైన సాధనం ట్యాక్స్ ఫ్రీ బాండ్లే. ఎందుకంటే ఈ బాండ్లపై వచ్చే రాబడి ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలవదు. దీంతో ఈ మేరకు ప్రయోజనం పొందొచ్చు. ముఖ్యంగా రూ.12 లక్షల స్థాయిలో ఆదాయం కలిగిన వృద్ధులు (సీనియర్ సిటిజన్లు/60 ఏళ్లు నిండిన వారు) తమ రిటైర్మెంట్ నిధిలో కొంత మొత్తాన్ని ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన నిర్ణయమే అవుతుంది. తద్వారా వారి పన్ను వర్తించే ఆదాయం రూ.12 లక్షలకు మించకుండా చూసుకోవచ్చు. పలు సంస్థల నుంచి బాండ్లు.. గతంలో పలు ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసిన ట్యాక్స్ ఫ్రీ బాండ్లు ప్రస్తుతం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో క్యాష్ విభాగంలో ట్రేడ్ అవుతున్నాయి. వీటిల్లో కొన్నింటిలో మెరుగైన లిక్విడిటీ (కొనుగోళ్లు, అమ్మకాల పరిమాణం)ని గమనించొచ్చు. ఇంకా 11 ఏళ్ల కాల వ్యవధితో బాండ్లు లభిస్తున్నాయి. ప్రస్తుతం వీటిల్లో పన్ను రహిత రాబడి రేట్లు 5.5–5.9 శాతం మధ్య ఉన్నాయి. పెట్టుబడికి రక్షణ, అదే సమయంలో స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఇవి మెరుగైన ఆప్షన్ అని విశ్లేషకులు చెబుతున్నారు. 2012 నుంచి 2016 మధ్య కాలంలో 14 ప్రభుత్వరంగ ఇన్ఫ్రా ఫైనాన్స్ కంపెనీలు (ఎన్హెచ్ఏఐ, ఐఆర్ఎఫ్సీ, పీఎఫ్సీ తదితర) సెక్యూర్డ్ (రక్షణతో కూడిన) ట్యాక్స్ ఫ్రీ బాండ్లను జారీ చేశాయి. వీటి కాల వ్యవధి 10, 15, 20 ఏళ్ల చొప్పున ఉంది. ఈ బాండ్లలో పెట్టుబడులపై రాబడి చెల్లింపులు ఏడాదికోసారి చేస్తారు. వీటికి అధిక భద్రతను సూచించే ‘ఏఏఏ’ రేటింగ్‌ను క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చాయి. గతంలో జారీ చేసిన అన్ని ట్యాక్స్ ఫ్రీ బాండ్ల సిరీస్‌లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ అయి ఉన్నాయి. ఇప్పటి వరకు 193 ఇష్యూలు రాగా, అందులో 57 బాండ్ల మెచ్యూరిటీ (కాలవ్యవధి) ముగిసిపోయింది. మిగిలిన ట్యాక్స్ ఫ్రీ బాండ్లు ప్రస్తుతం స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో ట్రేడ్ అవుతున్నాయి. వీటి మెచ్యూరిటీ సగటున 11 ఏళ్ల వరకు ఉంది. ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసిన ఈ బాండ్లలో రిస్క్ చాలా చాలా తక్కువ. ఒక విధంగా ఉండదనే చెప్పుకోవాలి. దీనికితోడు పన్ను ప్రయోజనం కూడా ఉండడం అదనపు ఆకర్షణ. తక్కువ ఆదాయం ఉన్న వారికి..? ఆదాయపన్ను పరిధిలో లేకుండా.. ఆదాయం తక్కువగా ఉన్న వారు ప్రత్యామ్నాయాలను పరిశీలించొచ్చు. ‘ఏఏఏ’ రేటెడ్ కార్పొరేట్ బాండ్లలో రిస్క్ కొంత తక్కువగా ఉంటుంది. వీటిల్లో ఈల్డ్స్ 7.4 శాతం మేర ఉన్నాయి. అలాగే, వృద్ధులకు బ్యాంక్ ఎఫ్డీలపై 8 శాతం వరకు వడ్డీ రేటు ప్రస్తుతం లభిస్తోంది. కానీ, కార్పొరేట్ బాండ్లు, బ్యాంక్ ఎఫ్డీలపై వచ్చే రాబడి పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. మెచ్యూరిటీతో సంబంధం లేకుండా ఆయా పెట్టుబడులపై ఏటా వచ్చే రాబడిని ఆదాయానికి కలిపి చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అధిక ఆదాయపన్ను శ్లాబు రేటులో ఉన్న వారికి పన్ను చెల్లింపులు పోగా మిగులు నికర రాబడి 4.6–5.1 శాతం మించదు. అయితే, తక్కువ ఆదాయ శ్లాబుల్లో ఉన్న వారు, పన్ను వర్తించేంత ఆదాయం లేని వారికి.. కార్పొరేట్ బాండ్లు, బ్యాంక్ ఎఫ్డీలు తదితర సాధనాలను పరిశీలించొచ్చు. ఎందుకంటే వీటి నుంచి వచ్చే వడ్డీ రాబడి కలిసిన తర్వాత కూడా వారి ఆదాయం పన్ను పరిధిలోకి రాదు. ఎంపిక ఎలా..? ఈ బాండ్ల ఎంపిక అంత కష్టమైన విషయం కాదు. ముఖ్యంగా చూడాల్సింది లిక్విడిటీయే. అంటే ఆయా బాండ్లు రోజువారీగా ఎక్సే్ఛంజ్‌లలో ట్రేడ్ అవ్వడంతోపాటు, తగినంత ట్రేడింగ్ వ్యాల్యూమ్ కూడా ఉండాలి. దీనివల్ల కొనుగోలు, విక్రయం సులభంగా మారుతుంది. ఆ తర్వాత చూడాల్సిన మరో ముఖ్యమైన అంశం బాండ్ ఈల్డ్స్ టు మెచ్యూరిటీ (వైటీఎం). అంటే ఆయా బాండ్‌పై మిగిలి ఉన్న కాలానికి ఎంత రాబడి వస్తుందో ఇది తెలియజేస్తుంది. అధిక లిక్విడిటీ ఉన్న బాండ్‌ను మెరుగైన ధరపై కొనుగోలు చేసుకోవచ్చు. అదే లిక్విడిటీ తగినంత లేని చోట (అమ్మకాలకు ఎక్కువ మంది లేనప్పుడు) బాండ్ కొనుగోలు వ్యయం పెరిగిపోతుంది. దీనివల్ల ఈల్డ్ తగ్గిపోతుంది. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ డేటా ప్రకారం ప్రస్తుతం స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో ట్రేడ్ అవుతున్న వాటిల్లో 20 బాండ్లలో మెరుగైన లిక్విడిటీ ఉంటోంది. ఉదాహరణకు ‘ఆర్ఈసీ బాండ్ ‘871ఆర్ఈసీ28’ను 2014లో 8.71 శాతం వార్షిక రేటుపై జారీ చేయగా.. గత నెలరోజులుగా రోజువారీ ట్రేడింగ్ వ్యాల్యూమ్ ఇందులో 1,534గా ఉంటోంది. ఈ బాండ్లో ఇటీవలి వైటీఎం 5.9 శాతంగా ఉంది. ఇది అనుకూల తరుణం.. ఆర్బీఐ ఇటీవలే రెపో రేటును పావు శాతం తగ్గించింది. రానున్న రోజుల్లో మరో 50 బేసిస్ పాయింట్ల వరకు (0.50 శాతం) రేట్లు తగ్గుతాయని విశ్లేషకుల అంచనాగా ఉంది. ఇప్పటికీ దీర్ఘకాల డెట్ సాధనాలపై రాబడులు మెరుగ్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కనుక డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టుకోవాలని భావించే వారికి ప్రస్తుతం అనుకూల సమయం. పన్ను లేకపోవడం, పెట్టుబడులపై గరిష్ట పరిమితి లేకపోవడంతో ట్యాక్స్ ఫ్రీ బాండ్లు అధిక ఆదాయ వర్గాలకు మెరుగైన సాధనం అవుతుంది. పైగా ట్యాక్స్ ఫ్రీ బాండ్ల జారీ నిలిచిపోయింది. అంటే కొత్తగా బాండ్ల ఇష్యూలు రావడం లేదు. కనుక వీటిల్లో పెట్టుబడులు పెట్టుకోవాలంటే సెకండరీ మార్కెట్లో ట్రేడ్ అవుతున్న వాటి నుంచే ఎంపిక చేసుకోవాలి. ఇన్వెస్టర్లు ఇక్కడి నుంచి ఎంత కాలానికి పెట్టుబడులు పెట్టుకోవాలని అనుకుంటున్నారో.. అంత కాలంలో మెచ్యూరిటీ తీరిపోయే ట్యాక్స్ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. రిటర్నులు ఆకర్షణీయం సెకండరీ మార్కెట్లో ట్యాక్స్ ఫ్రీ బాండ్లలో పెట్టుబడులు పెట్టే వారు మార్కెట్ రేటు కంటే ప్రధానంగా ఈల్డ్స్ టు మెచ్యూరిటీ (వైటీఎం)పైనే దృష్టి సారించాలి. ఇన్వెస్టర్ ఒక బాండ్‌ను కొనుగోలు చేసిన దగ్గర్నుంచి, అది మెచ్యూరిటీ అయ్యే వరకు ఏటా వచ్చే రాబడిని వైటీఎం సూచిస్తుంది. 15 ట్యాక్స్ ఫ్రీ బాండ్ల సిరీసీస్లలో ప్రస్తుతం వైటీఎం 5.5 శాతం నుంచి 5.9 శాతం మధ్య ఉంది. ఇవి గమనించాలి.. → 30 శాతం ఆదాయపన్ను పరిధిలో ఉన్న వారికి 6 శాతం పన్ను రహిత రాబడి నిజంగా ఎంతో మెరుగైనది. పన్ను ప్రయోజనం కూడా కలుపుకుంటే 8.5 శాతం రాబడి వచి్చనట్టు. → 20 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి సైతం 7.5 శాతం రాబడి వచి్చనట్టు అవుతుంది. → 10 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి దక్కే ప్రయోజనం తక్కువే. → కార్పొరేట్ బాండ్లతో పోల్చితే ట్యాక్స్ ఫ్రీ బాండ్లు అధిక రేటింగ్ కలిగినవి. ఈ బాండ్లను జారీ చేసేవి ప్రభుత్వరంగ సంస్థలే కనుక డిఫాల్ట్ దాదాపుగా ఉండదు. → ఇన్వెస్టర్ తనకు వీలైనంత ఇందులో పెట్టుబడి పెట్టుకోవచ్చు. గరిష్ట పరిమితి ఉండదు. → స్వల్పకాల లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడులకు వీటిని ఎంపిక చేసుకోవడం సరికాదు. → వీటిల్లో ఒక్కోసారి లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. కనుక కాల వ్యవధి ముగిసేంత వరకు కొనసాగే వెసులుబాటు ఉన్న వారే వీటిని ఎంపిక చేసుకోవాలి. → కేవలం పన్ను ప్రయోజనం కోసమే వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం అనిపించుకోదు. రిస్క్ తీసుకునే వారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇంతకంటే ఎక్కువ రాబడినే (పన్ను పోను) ఇస్తాయి. పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడుల వైవిధ్యం కోసం డెట్ విభాగం కింద ట్యాక్స్ ఫ్రీ బాండ్లను ఎంపిక చేసుకోవచ్చు. → అధిక లిక్విడిటీ, మెరుగైన వైటీఎం ఉన్న వాటికే పరిమితం కావాలి. –సాక్షి, బిజినెస్‌డెస్క్

రక్షణ శాఖలోకి 2978 ఫోర్స్ గూర్ఖా కార్లు!
ఫోర్స్ మోటార్స్ లిమిటెడ్ భారత రక్షణ దళాల నుంచి ఏకంగా 2,978 ఫోర్స్ గూర్ఖా వాహనాల కోసం ఆర్డర్ పొందింది. త్వరలోనే ఈ వాహనాలు రక్షణ శాఖలోకి చేరనున్నాయి. కంపెనీ ఈ కార్లను సైనిక కార్యకలాపాలకు అనుగుణంగా తయారు చేయనుంది.ఫోర్స్ గూర్ఖా కార్లు.. ఇండియన్ ఆర్మీ, వైమానిక దళాలలో చేరనున్నాయి. ఈ కార్లు కఠినమైన పరిస్థితులను ఎదుర్కోగల సత్తా, మంచి ఆఫ్ రోడింగ్ కెపాసిటీ కలిగి ఉండటం వల్లనే సైనిక దళాలకు ఉపయోగకరంగా ఉంటాయి. కంపెనీ లైట్ స్ట్రైక్ వెహికల్ (LSV) వేరియంట్ రక్షణ శాఖకు డెలివరీ చేయనున్నట్లు సమాచారం.భారతదేశంలో ఫోర్స్ మోటార్స్ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం ఫోర్స్ గూర్ఖా (3-డోర్, 5-డోర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది), ఫోర్స్ ట్రావెలర్, ఫోర్స్ ట్రాక్స్, ఫోర్స్ అర్బానియా, ఫోర్స్ సిటీలైన్, ఫోర్స్ మోనోబస్ మొదలైనవి ఉన్నాయి. గూర్ఖా 2.6-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో 138bhp, 320Nm ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.

బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ప్రభుత్వరంగ బీమా సంస్థ టైఅప్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బీమా సంస్థ న్యూ ఇండియా అష్యూరెన్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యం కింద బ్యాంక్ ఇఫ్ ఇండియా కస్టమర్లకు న్యూ ఇండియా అష్యూరెన్స్ బీమా ఉత్పత్తులను ఆఫర్ చేయనుంది.న్యూ ఇండియాకు చెందిన హెల్త్ ఇన్సూరెన్స్, మోటారు, వ్యక్తిగత ప్రమాద, హోమ్, వాణిజ్య ఇన్సూరెన్స్ ఉత్పత్తులను బీవోఐ కస్టమర్లు సులభంగా పొందొచ్చు. సమగ్రమైన బీమా ఉత్పత్తులను అందించేందుకు ఈ ఒప్పందం అవకాశం కల్పిస్తుందని బ్యాంక్ ఇఫ్ ఇండియా ఎండీ, సీఈవో రజనీష్ కర్ణాటక్ తెలిపారు.ఈ ఒప్పందంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు బీమా ఉత్పత్తులు చేరువ అవుతాయని, నాణ్యమైన సేవలు, రక్షణ అందుతాయని న్యూ ఇండియా అష్యూరెన్స్ చైర్మన్, ఎండీ గిరిజా సుబ్రమణ్యం పేర్కొన్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దేశవ్యాప్తంగా 5,200 శాఖలున్నాయి.
ఫ్యామిలీ

50 వేల ఏళ్ల నాటి పిల్ల మమొత్..!
పిల్లలూ... ఇక్కడ మీరు టేబుల్ మీద చూస్తున్నది ఏమిటో తెలుసా? ఏనుగు. కాని ఏనుగు కాదు. పూర్వకాలపు ఏనుగు. ఐస్ఏజ్ కాలం నాటిది. ఇప్పటి ఏనుగులా కాక ఒంటి నించి రోమాలతో ఉండేది. దానిని ‘మమొత్’ అంటారు. డైనోసార్లలాగానే ఇది కూడా భారీ ఆకారంతో ఉండేది. దీనికి పెద్ద పెద్ద దంతాలు ఉండేవి. కాని డైనోసార్లలాగానే 4000 ఏళ్ల క్రితం మమొత్లు కూడా అంతరించి పోయాయి. దానికి కారణం ఏమిటో అంతుపట్టలేదు కాని ఏదైనా మహమ్మారి కావచ్చని శాస్త్రవేత్తల ఊహ. అయితే వీటి కళేబరాలు రష్యాలోని సైబీరియా మంచు ఎడారిలో దొరుకుతూనే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నది రష్యాలోని ‘ఎకుషియా’ అనే చోట మంచు పొరల కింద దొరికిన పిల్ల మమొత్ కళేబరం. ఇది పిల్ల ఏనుగే అయినా దీని బరువు 180 కిలోలు ఉంది. ఇది 50 వేల ఏళ్ల క్రితం నాటిదని శాస్త్రవేత్తలు నిర్థారించారు. ఆ కళేబరానికి ‘నెక్రోప్సీ’ చేస్తున్న ఫొటోలు ఇవి. మనిషి మృతదేహాన్ని కోసి పరీక్ష చేస్తే ‘అటాప్సీ’. జంతువులను కోసి పరీక్ష చేస్తే ‘నెక్రోప్సీ’. ఈ పరీక్షల వల్ల మమొత్లకు సంబంధించిన మరిన్ని జీవన రహస్యాలు తెలుస్తాయని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తుంటారు. (చదవండి: 'చిన్నారి జర్నలిస్టు'..! ఏకంగా యుద్ధాన్ని రిపోర్ట్ చేస్తూ..)

'చిన్నారి జర్నలిస్టు'..! ఏకంగా యుద్ధాన్ని రిపోర్ట్ చేస్తూ..
జర్నలిస్టు అంటే ఎవరు? ప్రపంచానికి వార్తలు అందించేవాడు. ప్రజలకు కీడు చేసే విషయాలను తెలిపి చైతన్యపరిచేవాడు. ప్రభుత్వాల దుర్మార్గాలను ఎండగట్టేవాడు. రాజకీయ నేతలు తమ స్వార్థం కోసం చేసే యుద్ధాలలో ఎంత విధ్వంసం జరుగుతుందో చూపేవాడు. జర్నలిస్టులు కొందరు ఆఫీసులో కూచుని పని చేస్తే మరికొందరు ఫీల్డులో ఉంటారు. ఆ ఫీల్టు యుద్ధ క్షేత్రమైతే ప్రాణాలకే ప్రమాదం. అయినా సరే జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి పని చేస్తారు.ఇప్పుడు ఇజ్రాయిల్ గాజాపై యుద్ధదాడులు చేస్తోంది. ఇది టీవీల్లో మీరూ చూసి ఉంటారు. ఇజ్రాయిల్– గాజా మధ్య జరుగుతున్న ఈ యుద్ధం కారణంగా ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో గాజాకు చెందిన 12 ఏళ్ల సుమయ్యా జర్నలిస్టు అవతారం ఎత్తింది. స్థానికంగా జరుగుతున్న అంశాల గురించి రిపోర్ట్ చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించింది.‘షిరీన్ అబూ’ అనే మహిళా జర్నలిస్టు కొంతకాలంగా గాజాపై జరుగుతున్న దాడుల గురించి అల్ జజీరా అనే ఛానెల్లో రిపోర్టింగ్ చేస్తూ ఉండేది. అయితే ఆమె మరణించింది. క్షేత్రస్థాయిలో ఆమె చెప్పే వార్తలు వింటూ ఉన్న సుమయ్యాకు ఆమె మరణం తీరని బాధను మిగిల్చింది. ఆమె ఆపిన పనని తాను పూర్తి చేయాలని భావించింది. వెంటనే ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ముందుగా వారు భయపడ్డారు. అప్పటికే వందమంది దాకా జర్నలిస్టులు యుద్ధాన్ని రిపోర్ట్ చేస్తూ ప్రాణాలు వదిలారు. అంత అనుభవం ఉన్నవారికే అలా జరిగినప్పుడు తమ కూతురు యుద్ధరంగంలో ఏమవుతుందోనని వారు ఆందోళన చెందారు. అయితే సుమయ్యా వారికి ధైర్యం చెప్పింది. స్థానికంగా జరుగుతున్న విషయాలను ప్రపంచానికి చూపించడం తన బాధ్యత అని వారికి వివరించింది. వారి అనుమతితో జర్నలిస్టుగా మారింది. అల్ జజీరా ఛానెల్లో అతి చిన్న జర్నలిస్టుగా మారింది. గాజాపై జరుగుతున్న దాడులు, అక్కడి ప్రజల స్థితిగతుల్ని ప్రపంచానికి వివరించింది. ఏమాత్రం బెరుకు లేకుండా తను చెప్పే విషయాలు అందర్నీ ఆలోచింపజేశాయి. ప్రపంచంలో యుద్ధాలన్నీ ఆగిపోవాలని, అంతా శాంతి నెలకొనాలని అంటోంది. అదే తన లక్ష్యమని, అందుకే ఈ రంగంలోకి వచ్చానని వివరిస్తోంది. తన ధైర్యానికి, ఆలోచనలకీ అందరూ శెభాష్ అంటున్నారు. (చదవండి: పిల్లలు స్కూల్ నుంచి రాగానే.. వారికి ఏం నేర్పిస్తున్నారు?)

పిల్లలు స్కూల్ నుంచి రాగానే..వారికి ఏం నేర్పిస్తున్నారు?
పిల్లలు జీవితంలో సక్సెస్ సాధించాలంటే.. వారికి చిన్న వయసులోనే మంచి విలువలు అందించాలి. బాల్యంలో నేర్పించిన విలువలు వారిని జీవితంలో ఉన్నత స్థానంలో నిలబెడతాయి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకు కచ్చితంగా నేర్పించాల్సిన అలవాట్లు కొన్ని ఉన్నాయి. వాటిని నేర్పిస్తే పిల్లలు పెద్దయ్యాక కూడా మంచి విలువలతో బతుకుతారు. ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం.పిల్లలు స్కూల్ నుంచి రాగానే వారి బ్యాగుల్ని, వస్తువుల్ని చక్కగా సర్దుకునే అలవాటు నేర్పించాలి. చక్కగా సర్దుకోవడం నేర్చుకుంటే వారి వస్తువుల్ని ఎక్కడ పెట్టారో అన్న క్లారిటీ వారికి ఉంటుంది. మార్నింగ్ స్కూల్ వెళ్లే టైమ్‌లో హడావిడి పడుకుండా తమ వస్తువుల్ని సులభంగా కనుగొంటారు. అంతేకాకుండా వారి పనుల్ని స్వయంగా చేసుకోవడం అలవాటు చేసుకుంటారు. రేపు భవిష్యత్తులో దూర్రప్రాంతాలకు వెళ్లి అక్కడ ఉండాల్సినప్పుడు ఈ అలవాటు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే పిల్లలు స్కూల్ నుంచి రాగానే బ్యాగు, వారి వస్తువులను సరైన స్థలంలో పెట్టేలా వారికి నేర్పండి.కాళ్లు, చేతులు, ముఖం కడుక్కోవడం...పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో ముఖ్యం. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే చేతులు, ముఖం కడుక్కోవడం గురించి చెప్పండి. ఇది వారిని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా వ్యాధులను దూరంగా ఉంచుతుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వారి యూనిఫామ్ తీసివేయమని చెప్పండి. ఆ తర్వాత చేతులు, ముఖం వాష్ చేసుకోమని వారికి చెప్పండి. ఈ అలవాటు నేర్చుకోవడం వల్ల పరిశుభ్రత ఎంతో కీలకమని తెలుసుకుంటారు. ఈ అలవాటు వారిని భవిష్యత్తులో మంచి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతుంది.సమయాన్ని తెలివిగా ఉపయోగించడం...పిల్లలకు తమ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకునే అలవాటును నేర్పించండి. టైమ్ మేనేజ్మెంట్ స్కిల్ వారికి ఎంతగానో సాయపడుతుంది. సకాలంలో వారి పనులు చేసుకోవడం, ఆటలు ఆడుకోవడం, చదువు, హోం వర్క్ వంటి పనులు చేయడం నేర్పించండి. దానికి తగ్గ టైమ్ టేబుల్ వేసి దాని ఫాలో అయ్యేలా ప్లాన్ చేయండి. దీంతో.. వారు సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటారు.చదువు, హోం వర్క్...స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కాసేపు పిల్లల్ని ఆడుకోనివ్వండి. ఆటల తర్వాత స్నానం చేసేలా ప్రోత్సహించండి. ఆ తర్వాత హోం వర్క్, చదువుకు టైం కేటాయించేలా వారికి అలవాటు చేయండి. ఆటలతోపాటు చదువు ప్రాముఖ్యత వారికి తెలపండి. సబ్జెక్ట్‌ల్లో ఏమైనా డౌట్లు ఉంటే దగ్గరుండి హెల్ప్ చేయండి. హోం వర్క్ పెండింగ్ పెట్టకుండా పూర్తిగా ఫినిష్ చేసేలా ప్లాన్ చేయండి. ఈ అలవాటు వల్ల వారు చదువుల్లో మెరుగ్గా రాణిస్తారు. (చదవండి: వృథాని జీరో చేద్దాం..వేస్ట్‌ని రీయూజ్ చేసేద్దాం..! ది బెస్ట్‌గా..)

వృథాని జీరో చేసేలా..ది బెస్ట్‌గా రీయూజ్ చేద్దాం ఇలా.!
యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ... మార్చి నెల 30వ తేదీని జీరో వేస్ట్ డే గా గుర్తిస్తూ 2022, డిసెంబర్ 14వ తేదీన ఒక తీర్మానాన్ని చేసింది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అప్పటి నుంచి మార్చి నెల 30వ తేదీని ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్’గా గుర్తిస్తూ ప్రపంచాన్ని చైతన్యవంతం చేస్తోంది. ఈ ఏడాది ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్ రంగాల వృథా మీద దృష్టి పెట్టింది. పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న వాయు, నీటి కాలుష్యాలతోపాటు వస్త్రాల అవశేషాలు కూడా ప్రధానమైనవి. క్లాత్‌తో డ్రస్ కుట్టిన తర్వాత వచ్చే మిగులు నదులు, కాలువల్లోకి చేరి నీటిలో, నీటి అడుగుల మట్టిలో నిలిచి΄ోతోంది. కొంతకాలానికి ఆ వస్త్రానికి అద్దిన రసాయన రంగులు నేలలో, నీటలో ఇంకుతాయి. ఇలా వేస్ట్ క్లాత్ కారణంగా కెమికల్ పొల్యూషన్ నీటిని, మట్టిని కూడా కలుషితం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దుస్తుల తయారీ విపరీతంగా పెరిగిపోయింది. 2000 సంవత్సరంలో ఉత్పత్పి 2015నాటికి రెండింతలైంది. ఏడాదికి 92 మిలియన్ టన్నుల టెక్స్టైల్ వేస్ట్ లెక్క తేలుతోంది. ఇది కాలువలు, నదుల్లోకి వెళ్తోంది. దీనిని అరికట్టడం కోసమే యూఎన్ఓ (యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్) ఈ ఏడాది ఫ్యాషన్ ఇండస్ట్రీ వేస్ట్ మీద దృష్టి పెట్టింది. ఫ్యాషన్, టెక్స్టైల్ రంగాలను జీరో వేస్ట్ దిశగా నడిపించడానికి మార్గాలను అన్వేషించాలంటోంది యూఎన్ఓ. హైదరాబాద్‌లో ఫ్యాషన్ ఇండస్ట్రీ నిర్వహిస్తున్న సుదీప కందుల ట్రిపుల్ ఆర్ (రీ యూజ్, రీ సైకిల్, రీ పెయిర్) అనే యూఎన్ఓ థీమ్‌ను రెండు దశాబ్దాలుగా అమలు చేస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది!సుదీప కందుల... ఆలన బొటీక్ పేరుతో చిన్న పిల్లల దుస్తుల డిజైనింగ ప్రారంభించి మూడు దశాబ్దాలవుతోంది. ఫ్యాషన్ ఇండస్ట్రీలో బొటీక్ కల్చర్ మొదలైన తొలినాళ్ల నుంచి బొటీక్ నడుపుతున్నారామె. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని భావించే సుదీప, ఆమె ఉద్యోగులు పాలిథిన్ కవర్ల వినియోగాన్ని తగ్గించడానికి మార్కెట్కెళ్లేటప్పుడు క్లాత్ బ్యాగ్‌ను వెంట తీసుకువెళ్తారు. బొటీక్‌లో ఉత్పన్నమయ్యే వేస్ట్ క్లాత్‌ను పునర్వినియోగంలోకి తీసుకురావడానికి అనేక మార్గాలనెంచుకున్నారు సుదీప. చిన్న ముక్కలతో నవజాత శిశువులకు, ఏడాది లోపు పిల్లలు ధరించడానికి వీలుగా కుట్టించి ఆర్ఫనేజ్‌కు ఇచ్చారు. అలా కుదరని వాటిని నగరంలోని ఒక ఎన్జీవోకి ఇస్తుంటారు. ఆ ఎన్జీవోలో అల్పాదాయ వర్గాల మహిళలకు ఆ క్లాత్‌తో చిన్న చిన్న పోట్లీ బ్యాగ్‌లు, పర్సులు తయారు చేసుకుంటారు. అలా కూడా పనికి రాని సన్నగా పొడవుగా రిబ్బన్ ముక్కల్లాంటి క్లాత్‌ని ఒక స్కూల్‌కి ఇస్తే వాళ్లు పిల్లల చేత డోర్‌మ్యాట్ మేకింగ్ వంటి క్రాఫ్ట్ ప్రాక్టీస్‌కి ఉపయోగిస్తున్నారు. ఇక ఎందుకూ పనికిరావనిపించే ముక్కలను ఒక కవర్లో జమ చేసి ఆ బొటీక్‌లో పని చేసే వాళ్లు దిండులో స్టఫింగ్‌గా నింపుకుంటారు. వ్యర్థాన్ని అర్థవంతంగా మారుస్తున్న సుదీప తన బొటీక్‌లో చిన్న ముక్క కూడా నేలపాలు కాకుండా ప్రయత్నం చేస్తున్నారు.ఉత్పత్తి– కొనుగోలు పెరిగాయిమనం కొంతకాలం వాడి ఇక పనికిరావని పారేస్తున్న వస్తువులు నిజానికి పనికిరానివి కాదు, వాటిని మరొక రకంగా మలుచుకుని ఉపయోగించుకోవడం మనకు చేతకాక΄ోవడమే. రీ యూజ్ చేయడం నేర్చుకోవాలి. నాచురల్ ఫైబర్‌తో వస్త్రాలు తయారుచేసినన్ని రోజులు వస్త్ర పరిశ్రమ, అనుబంధ పరిశ్రమల వ్యర్థాల గురించి మాట్లాడాల్సిన అవసరం రాలేదు. మ్యాన్‌మేడ్ ఫైబర్ ప్రవేశించిన తర్వాత ఎదురవుతున్న సమస్యలివన్నీ. నిజానికి వ్యర్థాల ఉత్పత్తి మనదేశంలోకంటే యూఎస్, యూరప్‌దేశాల్లో చాలా ఎక్కువ. అవసరానికి మించి ఉత్పత్తి చేయడం, అవసరానికి మించి కొనడం రెండూ పెరిగాయి.షాపింగ్ వ్యసనంఈ తరానికి షాపింగ్ ఒక వ్యసనంగా మారింది. యూఎస్, యూరప్‌ల నుంచి వాడిన దుస్తులు మూడవ ప్రపంచదేశాలకు డంప్ అవుతున్నాయి. అరేబియా షిప్పుల్లో గుజరాత్ తీరం నుంచి దేశంలోకి వస్తుంటాయవి. మన దగ్గర తయారయ్యే పాలియెస్టర్ వస్త్రాలకు తోడు ఆయాఖండాల నుంచి వచ్చిపడుతున్న దుస్తులు కూడా కలిసి డంప్ పెరిగిపోతోంది. పాలియెస్టర్ వస్త్రాలను ఫైబర్‌గా మార్చి కొత్త దుస్తులు తయారు చేసే క్రమంలో విడుదలయ్యే వ్యర్థాలు సముద్రాల్లోకి చేరి మైక్రోప్లాస్టిక్‌గా మారి తిరిగి మన మీదనే దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే పారేస్తున్న దుస్తులతో కాలువలు నిండిపోతున్నాయి.– డాక్టర్ దొంతి నరసింహారెడ్డి, పర్యావరణ నిపుణులు జీరో వేస్ట్‌తో ద బెస్ట్ప్లాస్టిక్, ఆహార వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ పరికరాల వేస్ట్‌తో ఏటా ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్ల టన్నుల చెత్త జమవుతోంది. ఇది పెరుగుతూ భూగ్రహాన్ని ముంచేసినా ఆశ్చర్యం లేదు. ఈ ప్రమాదాన్ని మన దేశంలో ముందుగా గ్రహించి అప్రమత్తమైన పప్రాంతం ఢిల్లీ, మాల్వీయ నగర్‌లోని నవజీవన్ విహార్ రెసిడెన్షియల్ సొసైటీ. రీయూజ్, రీసైకిల్ను ఫాలో అవుతూ జీరో వేస్ట్‌తో పర్యావరణప్రియమైన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది.దాదాపు ఏడేళ్ల కిందట... ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ మాల్వీయనగర్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ఒక వర్క్‌షాప్ నిర్వహించింది. అందులో పాల్గొన్న నవజీవన్ విహార్ రెసిడెన్షియల్ సొసైటీ సభ్యులు ఆ వర్క్‌షాప్‌లో చెప్పినవి, చూపించినవి తమ కాలనీలో అమలు చేయడం మొదలుపెట్టారు. అక్కడ 250 ఇళ్లున్నాయి. ఉదయాన్నే ఇంటింటికి వెళ్లి తడి చెత్త, పొడి చెత్తను ఎలా వేరుచేయాలో వివరించి, కొన్నాళ్లపాటు పర్యవేక్షించారు సొసైటీ సెక్రటరీ, కంటివైద్యులు డాక్టర్ రూబీ మఖీజా. తతిమా సభ్యుల సహాయసహకారాలతో తడిచెత్తతో కాలనీలోనే కంపోస్ట్ తయారుచేయడం మొదలుపెట్టారు. ఆ ఎరువుతో కిచెన్, బాల్కనీ, రూఫ్ గార్డెన్స్‌ను ప్రోత్సహించారు. ఒక షెడ్డు లాంటిదీ ఏర్పాటు చేశారు.. ఇళ్లల్లో పాతపుస్తకాలు, దుస్తులు, ఆటబొమ్మలు, ఉపయోగంలో లేని వస్తువుల కోసం. ఆ కాలనీలో ఎవరికైనా ఏ వస్తువైనా అవసరం ఉంటే ముందు ఈ షెడ్డుకొచ్చి చూసి, అందులో తమకు కావలసింది లేకపోతేనే కొత్తది కొనుక్కోవాలి. అలా కాలనీ వాసులు తీసుకున్నవి పోనూ మిగిలినవి స్వచ్ఛంద సంస్థలకు ఇస్తారు అవసరమైన వాళ్లకు పంచేందుకు! ఈ కాలనీలో ప్లాస్టిక్ బ్యాన్. గుడ్డ సంచులనే వాడుతారు. నీటి వృథా, ఆదానూ సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నారు. పిల్లలకు పర్యావరణం పట్ల అవగాహన కలిగించడానికి వారానికోసారి క్యాంప్ పెడతారు. అందులో పిల్లలను ఆడిస్తూ, పాడిస్తూ వాళ్లు ఎలక్ట్రానిక్ పరికరాలకు బానిసలు కాకుండా జాగ్రత్తపడుతున్నారు. వీళ్లో బ్రాడ్కాస్ట్ సిస్టమ్‌నూ ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజూ కాలనీలో జరిగే పర్యావరణపరిరక్షణ కార్యక్రమాలను వీడియోలుగా తీసి వాటిని సాయంకాలం ప్రసారం చేస్తారు. ఈ ప్రయత్నాలతో జీరో వేస్ట్‌లో దేశానికే స్ఫూర్తిగా నిలిచింది నవజీవన్ విహార్. (చదవండి: 'తోలుబొమ్మలాట'ను సజీవంగా ఉండేలా చేసిందామె..! ఏకంగా రాజధానిలో..)
ఫొటోలు


ఇంద్రకీలాద్రి : బెజవాడ దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)


విజయవాడ : ముద్దులొలికిన సంప్రదాయం..క్యాట్‌వాక్‌లు (ఫొటోలు)


బాలకృష్ణ 'ఆదిత్య 369' రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)


హైదరాబాద్ : రంజాన్ వేళ చార్మినార్ వద్ద షాపింగ్ సందడి (ఫొటోలు)


మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అంటున్న నటి ‘అనన్య నాగళ్ల’ (ఫొటోలు)


ఉగాది స్పెషల్ లుక్‌లో మహేశ్‌బాబు గారాలపట్టి సితార (ఫోటోలు)


తిరుమలలో ఉగాది వేడుకలు (ఫొటోలు)


#MEGA157 చిరంజీవి,అనిల్ రావిపూడి కొత్త సినిమా ప్రారంభం (ఫొటోలు)


శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు..భక్తజనసంద్రం (ఫొటోలు)


లక్మీ ఫ్యాషన్ వీక్ లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
International

భూకంపంలో శిశువులను కాపాడిన నర్సులు.. హ్యట్సాప్ అంటూ ప్రశంసలు
మయన్మార్‌లో భూకంప విలయం (Earthquake) కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అంచనాలకు కూడా అందని నష్టాన్ని మిగిల్చింది. భూకంప కేంద్రమైన మాండలేతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కుప్పకూలిన భవనాల శిథిలాలే. బాధితుల హాహాకారాలే వినిపిస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 7.7 తీవ్రతతో విరుచుకుపడ్డ భూకంపానికి బలైన వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. శిథిలాల నుంచి ఇప్పటికే 1,600కు పైగా మృతదేహాలను వెలికితీశారు. 3,500 మందికి పైగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య 10 వేలు దాటవచ్చని చెబుతున్నారు.మరోవైపు.. భూకంపం సందర్బంగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనాలోని ఒక చిన్న పిల్లల ఆసుపత్రికి సంబంధించిన వీడియోపై నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు. భూకంపం సందర్భంగా ఆసుపత్రిలోని మెటర్నిటీ వార్డులో చిన్న పిల్లలను నర్సులు కాపాడారు. భూకంపం ధాటికి భవనంలో కుదుపులు ఎదురైనప్పటికీ వారు కింద పడిపోతున్నా.. ఆసుపత్రిలో ఉన్న శిశువుకు ప్రమాదం జరగకుండా నర్సులు జాగ్రత్తలు తీసుకున్నారు. మరో నర్సు ప్లోర్‌పై కూర్చుని శిశువును పట్టుకుంది. ఎంతో కష్టం మీద కన్న తల్లిలాగా శిశువులను కాపాడారు. ఈ క్రమంలో నర్సుల కష్టంపై నెటిజన్లు స్పందిస్తూ ప్రశంసిస్తున్నారు.ఇదిలా ఉండగా.. మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్‌లో 12 నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భారీ భూకంపాలు (Earthquake) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ భూకంపం 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని స్థానిక భూవిజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫీనిక్స్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు (Aftershocks) వచ్చే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. భారత టెక్టానిక్ ఫలకాలు యురేషియన్ ప్లేట్స్‌ను వరుసగా ఢీకొంటుండడం వల్ల నెలల తరబడి ఆఫ్టర్‌షాక్స్ వచ్చే అవకాశం ఉందని జెస్ ఫీనిక్స్ తెలిపారు. భూ ఉపరితలానికి 10 కి.మీ లోతులోనే ప్రకంపనల కేంద్రాలు ఉన్నాయని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.Nurses in SW China protect newborn babies during earthquake in Myanmar #ChinaBuzz pic.twitter.com/Yixj3pCtZE— CGTN (@CGTNOfficial) March 30, 2025ప్రపంచ దేశాల ఆపన్న హస్తం..ఈ కష్ట సమయంలో అక్కడి ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు భారత్ ఇప్పటికే ముందుకొచ్చింది. ‘ఆపరేషన్ బ్రహ్మ’ కింద దాదాపు 15 టన్నుల సహాయ సామగ్రిని అక్కడికి పంపించింది. బాధితులకు అవసరమైన ఆహారపదార్థాలతోపాటు.. తాత్కాలిక నివాసం కోసం టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, వాటర్ ప్యూరిఫయర్లు, సోలార్ ల్యాంప్, జనరేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను మయన్మార్‌కు పంపించినట్లు సమాచారం. అంతే కాకుండా విపత్తులో ఉన్న ఆ దేశానికి సాయం చేసేందుకు 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అక్కడికి పంపుతున్నట్లు పేర్కొంది. అమెరికా, ఇండోనేషియా, చైనా, ఇతర దేశాలు కూడా అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించాయి. ప్రభావిత దేశాలకు సహాయక సామగ్రి పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో-గుటెరస్ వెల్లడించారు.Terrifying CCTV video of yesterdays M7.7 earthquake that hit Myanmar. The death toll is at least 1,644, with 3,408 people injured. Numbers are expected to rise. pic.twitter.com/5fAXXXpVDl— Volcaholic 🌋 (@volcaholic1) March 29, 2025 Nature doesn’t care about our strength, borders, or pride. The earthquake in #Thailand & #Myanmar is a stark reminder: no matter how advanced we become, nature still holds the power to shake everything. A brutal reminder of how small we really are. #earthquake pic.twitter.com/wQPZ82MB8j— Hala Jaber (@HalaJaber) March 29, 2025

Myanmar: ఇంకా తప్పని ముప్పు.. 24 గంటల్లో 15 భూ ప్రకంపనలు
నేపిడా: శుక్రవారం సంభవించిన భారీ భూకంపం మయన్మార్(Myanmar)ను అతలాకుతలం చేసింది. నాటి భయం నుంచి అక్కడి ప్రజలు కోలుకోకముందే తిరిగి పలుమార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. గడచిన 24 గంటల్లో మయన్మార్‌లో 15 సార్లు భూమి కంపించింది. దీంతో మయన్మార్‌కు ఇంకా భూ ప్రకంపనల ముప్పు తప్పలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.గడచిన 24 గంటల్లో ప్రతి రెండు గంటలకు ఒకసారి భూమి కంపించడాన్ని శాస్త్రవేత్తలు(Scientists) గుర్తించారు. భూకంపం తర్వాత మయన్మార్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో అక్కడి విషాదానికి సంబంధించిన పలు చిత్రాలు, వీడియోలు అందుబాటులోకి రావడం లేదు. భూకంపం తీవ్రతకు పలు భవనాలు, వంతెనలు కూలిపోయాయి. మయన్మార్‌లోని చారిత్రక అవా వంతెన కూడా భూకంపం తీవ్రతకు కూలిపోయింది. ఈ వంతెనను 1934లో నిర్మించారు.ఇదేవిధంగా మయన్మార్‌లోని ప్రముఖ పగోడా ఆలయం కూడా కూలిపోయింది. ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితా(UNESCO World Heritage List)లో చోటు దక్కించుకుంది. ఈ ఆలయ నిర్మాణశైలి ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఏడాది పొడవునా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు ఈ ఆలయం శిథిలమయ్యింది. మయన్మార్‌లో ఇప్పటికీ అంతర్యుద్ధం కొనసాగుతోంది. అటువంటి పరిస్థితిలో తాజాగా సంభవించిన భూకంపం మయన్మార్‌కు దెబ్బ మీద దెబ్బలా తయారయ్యింది. ఈ నేపధ్యంలో భారత్.. మయన్మార్‌కు అండగా నిలిచింది. బాధితులకు సహాయ సామాగ్రిని అందించేందుకు ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించింది.ఇది కూడా చదవండి: చైత్ర నవరాత్రుల సందడి ప్రారంభం

బంగ్లా షేక్ హసీనాకు బిగ్ షాక్
ఢాకా: అంతర్గత తిరుగుబాటు ద్వారా యూనుస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారంటూ బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాపై కేసు నమోదైంది. హసీనా, మరో 72 మందిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్(సీఐడీ) ఢాకాలోని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేసిందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న కోర్టు దర్యాప్తు చేపట్టాలంటూ సీఐడీని గురువారం కోరిందన్నారు.ఈ సందర్బంగా ‘జోయ్ బంగ్లా బ్రిగేడ్’పేరుతో ఏర్పాటైన ఆన్లైన్ వేదికపై 2024 డిసెంబర్ 19వ తేదీన కొందరు సమావేశమై దేశంలో అంతర్యుద్దం ద్వారా హసీనాను తిరిగి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టే విషయమై చర్చించినట్లు సమాచారము ఉందని సీఐడీ తన ఫిర్యాదులో పేర్కొంది. మధ్యంతర ప్రభుత్వాన్ని కొనసాగనివ్వరాదని డాక్టర్ రబ్బీ ఆలం సారథ్యంలో జరిగిన ఈ వర్చువల్ సమావేశం నిర్ణయించిందన్నారు.షేక్ హసీనా తదితరులు పాల్గొన్న ఈ భేటీ రికార్డింగ్స్ తమకు లభ్యమైనట్లు సీఐడీ తెలిపింది. హసీనా ఆదేశాల మేరకు అమెరికాలో ఉంటున్న అవామీ లీగ్ నేత ఆలం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దేశ, విదేశాలకు చెందిన మొత్తం 577 మంది పాల్గొన్నట్లు సీఐడీ తెలిపింది. ఈ కేసులో ఆలంను రెండో నిందితుడిగా పేర్కొంది. కాగా, యూనుస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వం భారత్‌లో ఉంటున్న హసీనాపై పలు ఆరోపణల కింద కేసులు నమోదు చేయడం తెలిసిందే.

వీసా రద్దు చేశాం.. తక్షణం వెళ్లిపోండి
వాషింగ్టన్: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యతిరేక విధానాలను సమరి్థంచే వాళ్లెవరూ ఇక్కడ ఉండొద్దని, తక్షణం వెళ్లిపోవాలంటూ వందలాది మంది విదేశీ విద్యార్థుల వీసాలను అమెరికా ప్రభుత్వం హఠాత్తుగా రద్దుచేసింది. వీసా రద్దయిన నేపథ్యంలో కస్టమ్స్, అండ్ బోర్డర్ ప్రొటెక్షన్(సీబీపీ) యాప్ లో నమోదుచేసుకుని స్వీయబహిష్కరణ ద్వారా అమెరికాను వదిలివెళ్లాలంటూ ఆయా వి ద్యార్థులకు ఈ–మెయిళ్లు, టెక్ట్స్ సందేశాలను పంపించింది. ఇలా బహిష్కరణ సందేశాలను అందుకున్న వారిలో భారతీయ విద్యార్థులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది.ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయంతో అక్కడ విద్యనభ్యసిస్తున్న లక్షలాది భారతీయ విద్యార్థుల్లో ఒక్కసారిగా భయాందోళనలు పెరిగాయి. గాజా యుద్ధంలో హమాస్‌కు, పాలస్తీనియన్లకు మద్దతు పలకడం, ఇజ్రాయెల్‌ను విమర్శించడం, యుద్ధం విషయంలో ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ సంబంధిత సోషల్ మీడియా పోస్ట్‌లను సోషల్ మీడియా ఖాతాల్లో లైక్ చేయడం, షేర్ చేయడం వంటి చర్యలకు పాల్పడిన వారి వీసాలను రద్దుచేశామని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్(డీఓఎస్) ప్రకటించింది. ఈ మేరకు ఎఫ్–1 వీసాను రద్దుచేస్తూ సంబంధిత విద్యార్థులకు ఈమెయిల్ పంపించింది. ఈ సందర్బంగా ‘‘అమెరికా శరణార్థి, జాతీయత చట్టంలోని సెక్షన్ 221(ఐ) ప్రకారం మీ ఎఫ్–1 వీసా గడువును తక్షణం ముగిస్తున్నాం. అమెరికాను వీడటానికి ముందు కచ్చితతంగా అమెరికా ఎంబసీ/కాన్సులేట్‌లో మీ పాస్‌పోర్ట్‌ను చూపించండి. వాళ్లు మీ వీసాను స్వయంగా రద్దు చేస్తారు. ఆ తర్వాత సీబీపీ యాప్ సాయంతో స్వీయబహిష్కరణ విధానాన్ని వాడుకుని అమెరికాను వీడండి. అలా వెళ్లకపోతే మీమే మిమ్మల్ని బలవంతంగా బహిష్కరిస్తాం. మేం పంపితే మీ స్వదేశానికే పంపకపోవచ్చు. మా వీలును బట్టి మాకు అనువైన మరేదైనా దేశానికి తరలించే వీలుంది’’ అని ఈ–మెయిల్ సందేశంలో ప్రభుత్వం పేర్కొంది. 2023–24 ఏడాదికి విదేశీ విద్యార్థులకు సంబంధించిన ‘ఓపెన్ డోర్స్’నివేదిక ప్రకారం అమెరికాలో 11 లక్షల మంది విదేశీ విద్యార్థులున్నారు. వారిలో 3.31 లక్షల మంది భారతీయ విద్యార్థులే.
National

తల్లి ఫోన్ మాట్లాడలేదనే వేదనతో..
అన్నానగర్: గుజరాత్‌కు చెందిన అబిషా వర్మ (24). ఈమె తండ్రి చిన్నప్పుడే చనిపోయిన నేపథ్యంలో తల్లి మరో పెళ్లి చేసుకుని దుబాయ్‌లో ఉంటోంది. అబిషా వర్మ 22 ఏళ్ల వయస్సు వరకు తన తల్లితో కలిసి దుబాయ్‌లో నివసించింది, ఆమెకు చెన్నైలోని విమానాశ్రయంలో ఫ్లైట్ అటెండెంట్‌గా ఉద్యోగం వచ్చింది. దీంతో కుండ్రత్తూరు పక్కనే ఉన్న తిరుముడివాక్కం ప్రాంతంలోని ఓ ప్రైవేట్ అపార్ట్ మెంట్లో తన స్నేహితులతో కలిసి ఉంటూ రోజూ పని నిమిత్తం చెన్నై విమానాశ్రయానికి వెళ్లేది. ఈ స్థితిలో గత కొన్ని రోజులుగా దుబాయ్ నుంచి వచ్చిన అభిషావర్మతో తన తల్లి ఫోన్లో మాట్లాడడం లేదని తెలుస్తుంది. దీంతో అబిషావర్మ తీవ్ర మనస్థాపానికి లోనై శనివారం తన తల్లి అబిషా వర్మకు పలుమార్లు ఫోన్ చేసేందుకు ప్రయతి్నంచింది. ఆమె నంబరు స్విచ్ ఆఫ్ రావడంతో అబిషా ఫ్యాన్‌కు ఉరివేసుకుని మరణించింది. ఆమె స్నేహితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుండ్రత్తూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Rajasthan Day: 19 రాచరిక రాష్ట్రాలు కలగలిస్తే..
నేడు(మార్చి 30) రాజస్థాన్ దినోత్సవం(Rajasthan Day). రాజస్థాన్ ఏర్పడి ఈరోజుకు 76 ఏళ్లు పూర్తయ్యాయి. 1949, మార్చి 30న రాజస్థాన్ ఒక రాష్ట్రంగా ఏర్పాటయ్యింది. ఈ రాష్ట్రంలోని అందమైన కోటలు, ప్రత్యేక సంస్కృతి, చరిత్ర ఎంతో ఆసక్తిగొలుపుతాయి. దేశంలో విస్తీర్ణం పరంగా ఈ రాష్ట్రం అతిపెద్దది. నేటి రాజస్థాన్‌ను ఒకప్పుడు ‘రాజపుతన’ అని పిలిచేవారు. అంటే రాజపుత్రుల దేశం అని అర్థం.1949లో మార్చి 30న 19 రాచరిక రాష్ట్రాలతో పాటు మూడు ప్రదేశాలను కలిపి ‘రాజస్థాన్’ను స్థాపించారు. ఈ రాచరిక రాష్ట్రాల ఏకీకరణ ఏడు దశల్లో పూర్తయిన తర్వాత దీనికి ‘రాజస్థాన్’ అనే పేరుపెట్టారు. రాజస్థాన్ రాష్ట్రం ఎనిమిదేళ్ల, ఏడు నెలల, 14 రోజుల్లో మొత్తం ఏడు దశల్లో ఏర్పడింది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక దేశ ఏకీకరణ ప్రక్రియ(Integration process) జరుగుతున్నప్పుడు, పలు సంస్థానాల రాజులు దేశంలో విలీనానికి నిరాకరించారు. కానీ దేశంలోని అన్ని సంస్థానాలను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ నేపధ్యంలోనే రాజస్థాన్‌లోని అన్ని రాచరిక రాష్ట్రాల ఏకీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. 1949లో పలు రాచరిక రాష్ట్రాలు, చిన్న రాజ్యాలు కలగలపడంతో రాజస్థాన్ పెద్ద రాష్ట్రంగా అవతరించింది. ఈ ఏకీకరణ ఘనత భారత ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు దక్కుతుంది. రాజస్థాన్ దినోత్సవం నాడు రాష్ట్ర వ్యాప్తంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ ప్రదర్శనలు నిర్వహిస్తారు.ఇది కూడా చదవండి: నాగ్‌పూర్ చేరుకున్న ప్రధాని మోదీ.. సంఘ్ కార్యాలయం సందర్శన

నాగ్‌పూర్ చేరుకున్న ప్రధాని మోదీ.. సంఘ్ కార్యాలయం సందర్శన
నాగ్‌పూర్: ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో గల సంఘ్ ప్రధాన కార్యాలయానికి ఈరోజు (ఆదివారం) చేరుకున్నారు. ఆయన 11 ఏళ్ల తర్వాత ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఇక్కడి స్మృతి మందిర్‌లో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులకు ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. ఈ సమయంలో ఆయన వెంట ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నారు.ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులలో ఒకరైన గోల్వాల్కర్ జ్ఞాపకార్థం నిర్మించిన సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ‘మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్’(Madhav Eye Clinic Premium Center)కు శంకుస్థాపన చేయనున్నారు. నాగ్‌పూర్ చేరుకున్న ప్రధాని మోదీకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి, నాగ్‌పూర్ ఎంపీ నితిన్ గడ్కరీ స్వాగతం పలికారు. వీరు ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సమయంలో ఆయనతో పాటు ఉన్నారు.ప్రధాని తన నాగ్‌పూర్ పర్యటనలో దీక్షాభూమిని కూడా సందర్శించనున్నారు. 1956లో బాబా సాహెబ్ అంబేద్కర్ వేలాది మంది అనుచరులతో కలిసి బౌద్ధమతాన్ని ఇక్కడే స్వీకరించారు. ఇక్కడ ప్రధాని మోదీ డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ కు నివాళులర్పించనున్నారు. ప్రధాని పర్యటనను ఆర్ఎస్ఎస్ చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించింది.ఇది కూడా చదవండి: Myanmar: ఇంకా తప్పని ముప్పు.. 24 గంటల్లో 15 భూ ప్రకంపనలు

వ్యభిచార రాకెట్ దందా గుట్టురట్టు.. భార్యభర్తలే ఏకంగా..
ఢిల్లీ: నోయిడాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. వ్యభిచార రాకెట్ దందాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బట్టబయలైంది. గత ఐదేళ్లుగా భార్యభర్తలు ఇద్దరూ ఈ దందా నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అలాగే, వీరికి అంతర్జాతీయంగా సంబంధాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ జంట నోయిడా ఇంటిపై దాడి చేసి రూ. 15.66 కోట్ల అక్రమ విదేశీ నిధుల్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.వివరాల ప్రకారం.. నోయిడాలో ఉజ్వర్ కిషోర్, అతడి భార్య నీలు శ్రీవాస్తవ గత ఐదేళ్లుగా వ్యభిచార రాకెట్ దందా నడుపుతున్నారు. ఈ జంట సైప్రస్‌కి చెందిన టెక్నియస్ లిమిటెడ్ అనే సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఈ సంస్థ ఎక్స్ హామ్‌స్టర్, స్ట్రిప్‌చాట్ వంటి ప్రసిద్ధ శృంగార వెబ్సైట్లను నిర్వహిస్తోంది. వీరిద్దరు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్, ప్రధానంగా ఫేస్బుక్ ఉపయగించి మోడల్లను నియమించుకుంటారు. మంచి జీతాలు ఇస్తామనే హామీలతో మోడలింగ్ అవకాశాలు అందిస్తామని ‘‘ఎచాటో డాట్ కామ్’’ అనే పేజీని క్రియేట్ చేశారు. ఢిల్లీ పరిసర ప్రాంతాలకు చెందిన అనేక మంది మహిళలు ఈ ప్రకటనల ద్వారా వీరి వలలో చిక్కారు. ఆడిషన్ల కోసం నోయిడాలోని ఆ జంట ప్లాట్‌కు వచ్చిన తర్వాత, వీరికి రాకెట్లో పాల్గొనే అవకాశం కల్పించారు. నెలకు రూ. 1 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు జీతాన్ని ఇచ్చారు.అధికారులు దాడి చేసిన సమయంలో, ఈ జంట ఉంటున్న ఫ్లాట్‌లో ఒక ప్రొఫెషనల్ వెబ్ క్యామ్ స్టూడియోని ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించారు. అడాల్ట్ కంటెంట్ ఆన్లైన్ స్ట్రీమింగ్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు ఉన్నాయి. వినియోగదారులు చేసే చెల్లింపుల ఆధారంగా మోడల్స్ టాస్క్‌లను చేసేవారు. హాఫ్-ఫేస్ షోలు, ఫుల్-ఫేస్ షోలు, వివిధ కేటగిరీలు అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలను ఉపయోగించడానికి వినియోగదారులు టోకెన్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేటగిరీని బట్టి ఛార్జీలు మారుతూ ఉంటాయి. ఆదాయంలో 75 శాతం దంపతులు ఉంచుకోగా, 25 శాతం మాత్రమే మోడల్స్‌కు ఇచ్చేవారు.కాగా, ప్రారంభంలో వినియోగదారుల నుండి క్రిప్టోకరెన్సీల ద్వారా చెల్లింపులు స్వీకరించేవారు. టెక్నియస్ లిమిటెడ్ ద్వారా రూ.7 కోట్లు ట్రాన్స్ఫర్ చేసిన నెదర్లాండ్ లోని ఒక బ్యాంక్ అకౌంట్‌ని ఈడీ కనుగొంది. ఈ నిధులను భారతదేశంలో ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులు ఉపయోగించి విత్ డ్రా చేసుకున్నారు. ఈ రాకెట్లో వేలాది మంది మహిళలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.#BreakingNews: Noida Porn Film Racket Exposed!1. ED raids a porn studio operating in Sector 105, Noida.2. The illegal business was running under the name Subdigi Ventures Pvt. Ltd.3. Directors Ujjwal Kishore and Neelu Srivastava were running the live porn studio from their… pic.twitter.com/p7vuaPjfsm— Vishal Kanojia Journalist (@Vishal0700) March 29, 2025
NRI

టీటీఏ (TTA) న్యూయార్క్ చాప్టర్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపురి
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA) న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి ఎంపికయ్యారు. టీటీఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి నాయకత్వంలో 2025-2026 కాలానికి ఈ ఎంపిక జరిగిందని కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. TTA వ్యవస్థాపకుడు, సలహా మండలి, TTA అధ్యక్షుడు, కార్యనిర్వాహక కమిటీ, డైరెక్టర్ల బోర్డు, స్టాండింగ్ కమిటీలు (SCలు) ప్రాంతీయ ఉపాధ్యక్షులు (RVP) ల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అలాగే పదవీ విరమణ చేస్తున్న RVP సత్య ఎన్ రెడ్డి గగ్గెనపల్లి అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.జయప్రకాష్ ఎంజపురి (జే)కు వివిధ సంస్థలలో సమాజ సేవలో 16 సంవత్సరాలకు పైగా అనుభవముందని ప్రపంచ మారథానర్ టీటీఏ వెల్లడించింది. న్యూయార్క్‌లోని తెలుగు సాహిత్య మరియు సాంస్కృతిక సంఘం (TLCA) 51వ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆరు ప్రపంచ మేజర్ మారథాన్లను పూర్తి చేసిన మొదటి తెలుగు సంతతి వ్యక్తి, 48వ భారతీయుడు నిలిచారు. ఈ రోజు వరకు, జే ప్రపంచవ్యాప్తంగా 18 మారథాన్లను పూర్తి చేశాడు. క్రీడలకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా, 2022లో న్యూజెర్సీలో జరిగిన TTA మెగా కన్వెన్షన్‌లో "లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్" అవార్డుతో అందుకున్నారు. సెప్టెంబర్ 2023లో, అతను ఆఫ్రికాలోని ఎత్తైన శిఖరం , ప్రపంచంలోనే 4వ ఎత్తైన పర్వతం అయిన కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించారు. అలాగే గత ఏడాది జూన్‌లో పెరూలోని పురాతన పర్వత శిఖరం సల్కాంటే పాస్‌ను జయించాడు. ఈ ఏడాది సెప్టెంబరులో జే తన తదుపరి గొప్ప సాహసయాత్రకు సిద్ధమవుతున్నాడనీ, గొప్ప సాహస యాత్రీకుడుగా ఆయన అద్భుత విజయాలు,ఎంతోమందికి ఔత్సాహికులకు పరిమితులను దాటి ముందుకు సాగడానికి ప్రేరేపిస్తున్నాడని కమిటీ ప్రశంసించింది. NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిన్యూయార్క్ బృందంలో కొత్త సభ్యులున్యూయార్క్ బృందంలో సహోదర్ పెద్దిరెడ్డి (కోశాధికారి), ఉషా రెడ్డి మన్నెం (మ్యాట్రిమోనియల్ డైరెక్టర్), రంజిత్ క్యాతం (BOD), శ్రీనివాస్ గూడూరు (లిటరరీ & సావనీర్ డైరెక్టర్) ఉన్నారు. మల్లిక్ రెడ్డి, రామ కుమారి వనమా, సత్య న్ రెడ్డి గగ్గెనపల్లి, సునీల్ రెడ్డి గడ్డం, వాణి సింగిరికొండ, హరి చరణ్ బొబ్బిలి, సౌమ్య శ్రీ చిత్తారి, విజేందర్ బాసా, భరత్ వుమ్మన్నగారి మౌనిక బోడిగం. టీటీఏ కోర్ టీమ్ సభ్యులుగా పని చేస్తారు-TTA వ్యవస్థాపకుడు: డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి -సలహా సంఘం:-అధ్యక్షుడు: డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు-సహాధ్యక్షులు: డాక్టర్ మోహన్ రెడ్డి పాటలోళ్ల -సభ్యులు: భరత్ రెడ్డి మాదాడి శ్రీని అనుగు-TTA అధ్యక్షుడు: నవీన్ రెడ్డి మల్లిపెద్ది

న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు
మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ - మాట అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. అమెరికాలోని న్యూజెర్సీలో ఉమెన్స్ డే వేడకలను అంగరంగ వైభవంగా నిర్వహించి.. వనితలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని మాట ఉమెన్ కమిటీ మరోసారి రుజువు చేసింది. ప్రముఖ సినీ నటి, ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై.. ప్రసంగించారు. సింగర్ దామిని భట్ల, దీప్తి నాగ్ తో పాటు పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అంకితా కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన మాట కార్యవర్గాన్ని అభినందించారు. అంకితా జాదవ్ నటించిన ఆల్బమ్ సాంగ్స్ ను ఈ వేదికగా ప్రదర్శించారు. ఈ వేడుకల్లో మహిళామణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కనువిందు చేశారు. ఇక వేదికపై నిర్వహించిన పలు కార్యక్రమాలు మహిళల సంతోషాల మధ్య ఆహ్లదంగా సాగాయి. యువతులు, మహిళల ఆట, పాటలతో.. సంబరాల సంతోషాలు అంబరాన్నంటాయి. అటు సంప్రదాయం.. ఇటు ఆధునికత ఈ రెండింటిని ప్రతిబింబిస్తూ ఎన్నో కార్యక్రమాలతో మహిళలు ఆకట్టుకున్నారు. శాస్త్రీయ నృత్యం, మోడ్రన్ డ్యాన్స్ రెండింటిలో తమకు సాటి లేదని నిరూపించారు.MS మాట కాంపిటీషన్, ఫ్యాషన్ షో, బ్యూటీ పాజెంట్ వంటి అద్భుతమైన ప్రదర్శనలు ఆహుతులను ఆకర్షించాయి. ఈ ప్రదర్శనల్లో మగువలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా శక్తి ఏమిటో నిరూపించారు. అందాల ముద్దుగుమ్మలు హొయలు పోతూ ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేశారు. అందాల పోటీలకు నటి అంకితా జాదవ్ తో పాటు పలువురు ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. MS మాట కాంపిటీషన్ 2025 విజేతకు కిరీటాన్ని బహూకరించారు. పోటీల్లో పాల్గొన్న మగువలకు బెస్ట్ స్మైల్, బెస్ట్ వాక్ వంటి పలు విభాగాల్లో అవార్డులు అందించారు. ఫోటో బూత్, ఇండో వెస్ట్రన్ అవుట్ ఫిట్, ఫన్ ఫీల్డ్ గేమ్స్, రాఫెల్ టికెట్స్ వంటి కార్యక్రమాలు అమితంగా ఆకట్టుకున్నాయి.వేదికపై మగువలు, చిచ్చర పిడుగులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డ్యాన్స్‌లు, డిజె మ్యూజిక్ కార్యక్రమాలు హోరెత్తించాయి. సంప్రదాయ ఫ్యాషన్ షో, గేమ్స్ తో పాటు ఇతర కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా వెండర్స్ బూత్ ఏర్పాటు చేశారు. మహిళలు షాపింగ్ స్టాల్స్ దగ్గర సందడి చేశారు. తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిఒక్కరికీ పసందైనా విందుభోజనం అందించారు. ఆహా ఏమి రుచి… తినరా మైమరచి.. అనే మాటను నిజం చేస్తూ ఎంతో రుచికరమైన భోజనాలు అందించారు. స్వీట్స్ నుంచి ఐస్ క్రీమ్ వరకు పలు వైరటీలతో రుచికరమైన వంటకాలు ఏర్పాటు చేశారు. మాట మహిళా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళా ప్రసంగాలతో పాటు అనేక సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాట నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను సత్కరించారు. సంస్థ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి మాట అధ్వర్యంలో చేపట్టిన ప్రణాళికలను నాయకులు వివరించారు. ఈ సందర్భంగా సంస్థ తరుపున చేస్తున్న పలు కార్యక్రమాలను వివరించారు. స్త్రీలు ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కుంటూ ముందుకు సాగాలని పలువురు ప్రముఖులు హితవు పలికారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మాట పలువురిని అవార్డుతో సత్కరించింది. అలాగే సభా వేదికపై పలువురిని సన్మానించి, సత్కరించారు. మాట కార్యక్రమాలు అండగా ఉంటూ, సహాయసహాకారాలు అందిస్తున్న ప్రతిఒక్కరినీ నిర్వహకులు ప్రశంసించారు. ఈ సంబరాలను అద్భుతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతిఒక్కరినీ మాట ఉమెన్ కమిటీ ప్రత్యేకంగా అభినందించింది. ఈ వేడుకకు విచ్చేసిన స్త్రీమూర్తులకు నిర్వహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. విందు - వినోదాలతో మాట - అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో ఉత్సహంగా సాగాయి. ఈ సంబరాల్లో మేము సైతం అంటూ వెయ్యి మందికి పైగా మహిళలు ముందుకొచ్చి ఉమెన్స్ డే వేడుకలను గ్రాండ్ సక్సెస్ చేశారు. సంబరమాశ్చర్యాలతో, ఆసాంతం ఆహ్లాద పరిచేలా ఈ వేడుకను కనువిందుగా నిర్వహించారు. వేలాదిగా ఆదర్శ వనితలు ఒక చోటు చేరి, అటపాటలతో, కేరింతలతో హోరేత్తించడం.. మాట విజయానికి మచ్చుతునకగా చెప్పవచ్చు.

ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో మెడికల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. 70-80 మంది ఆంకాలజిస్టులు, ప్రైమరి కేర్ డాక్టర్లు హాజరైన ఈ కార్యక్రమం, ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్‌కి ఒక వేదికగా పనిచేసిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సు ప్రముఖ కీనోట్ వక్త, డాక్టర్ బార్బరా మెకనీ, మాజీ AMA ఉపాధ్యక్షురాలు ఆంకాలజి పరిశోధన, పక్షవాతం, పేషంట్ కేర్ మొదలైన అంశాల ప్రాముఖ్యాన్ని వివరించారు.‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025 తన విజన్‌ను నిజం చేసింది. మహిళల కోసం క్యాన్సర్ సంరక్షణను ముందుకు తీసుకెళ్లడంలో వైద్య సమాజాన్ని శక్తివంతం చేయడానికి, అవగాహన నిమిత్తందీన్ని రూపొదిచామనీ, ఈమెడ్ ఈవెంట్స్, ఈమెడ్ ఎడ్ సీఈఓగా, శంకర నేత్రాలయ, యూఎస్ఏ సీఎమ్ఈ చైర్‌పర్సన్‌గా(USA CME) ఒక మహిళగా, మహిళా ఆరోగ్య సంరక్షణలో మార్పు తీసుకురావడానికి ఇదొక సదవకాశమని’ డాక్టర్ ప్రియా కొర్రపాటి సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!చైర్పర్సన్ డాక్టర్ సతీష్ కత్తుల, ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్, AAPI అధ్యక్షుడు, మహిళలలో సాధారణ క్యాన్సర్లను పరిష్కరించడం, నిరంతర అవగాహన ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. కాంగ్రెస్‌లో 10 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన వక్తలు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఆంకాలజీలో పురోగతి, సమగ్ర రోగి సంరక్షణపై దృష్టిపెడుతున్నారని డా. ప్రియా అన్నారు. ఈ కాంగ్రెస్‌ను కేవలం ఒక కార్యక్రమం కాకుండా, కంటిన్యూస్ లర్నింగ్ చేయాలనే తమ లక్ష్యాన్ని బలోపేతం చేశారన్నారు. AAPI, CAPI (టంపా నుండి స్థానిక అధ్యాయం) eMed Ed తో కలిసి చేస్తున్న సహకార ప్రయత్నాలను డా. సతీష్ అభినందించారు. ప్రత్యేక ఆకర్షణలుNFL ఆటగాడు షెప్పర్డ్ స్టెర్లింగ్ ఈ సదస్సు హాజరు కావడం విశేషం. ఆంకాలజీ వంటి క్రిటికల్ కేర్ వైద్యులలో చాలా ఉద్యోగపరైమన ఒత్తిడి అధికంగా ఉంటుంది దాని కోసం ప్రత్యేకంగా ఆంకాలజీ బర్నవుట్ సెషన్ నిర్వహించటం మరో విశేషం. డాక్టర్ వర్షా రాథోడ్, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఓర్లాండో, ఫ్లోరిడా ఈ సెషన్ నిర్వహించారు. డాక్టర్ శైలజ ముసునూరి, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, చీఫ్ ఆఫ్ సైకియాట్రి, వుడ్ సర్వీసెస్, పెన్సిల్వేనియా వారు నిర్వహించిన సైకాలజికల్ ఆంకాలజీ సెషన్ ఆకట్టుకుంది. క్యాన్సర్ కేర్ లో మెడికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా, రోగుల మానసిక, భావోద్వేగ స్థితిని కూడా సమర్థంగా నిర్వహించాలని పేర్కొన్నారు.వాలంటీర్ల దృక్పదంస్పీకర్లకి మించి, ఈ కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులకు కూడా గొప్ప అనుభవాన్ని ఇచ్చిందనీ, సెషన్లు, ఆసక్తిక్రమైన చర్చలు జరిగాయి. డాక్టర్లు అనేక ప్రశ్నలను చాలా లోతైన వివరణ, పరిస్కారాలు ఇచ్చారని, క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ చాలా ఆసక్తిగా, ఉపయోగంగా ఉందని ఆమె తెలిపారు.ఆడియన్స్ అభిప్రాయాలుమహిళల క్యాన్సర్లపై దృష్టి సారించే ఆంకాలజీ సమ్మేళనాలు అరుదుగా ఉన్నాయని, ఈ కార్యక్రమం ఆంకాలజిస్ట్‌లు, ప్రమరి కేర్ డక్టర్లు ఇద్దరికీ ఒక అమూల్యమైన అవకాశం అని అన్నారు. రోగులను ఎప్పుడు రిఫర్ చేయాలి, కొత్త చికిత్సా విధానాల ఏమున్నాయి వంటి అవసరమైన అంశాలను ఎలా నిర్వహించాలనేది తమ అభిప్రాయాల ద్వారా వెల్లడించారు.హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ భవిష్యత్తు హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2026 కాంగ్రెస్ ఓహియోలో జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రం విజయానికి సహకరించిన అందరికీ ప్రియా కొర్రపాటి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మహిళల కోసం ఆంకాలజీ సంరక్షణను ముందుకు తీసుకెళ్లే మిషన్‌లో ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తినిస్తుందని ఇప్పుడున్నఆంకాలజీని ముందుకు ముందుకు తీసుకెళ్ళటానికి కలిసి పనిచేద్దామనిఆమె పిలుపునిచ్చారు.

డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడుతున్నాయి. గత వారం విహారయాత్రకు వెళ్లి కనిపించకుండా పోయిన పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని నీటిలో మునిగి మరణించి ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు ఆదివారం ధృవీకరించారని ఏబీసీ న్యూస్ తెలిపింది. ప్రమాదవశాత్తూ నీటిమునిగి ఉంటుందని పోలీసులు వెల్లడించినట్టు తెలిపింది. మార్చి 6వ తేదీ,తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆరుగురు స్నేహితులతో రిసార్ట్‌కు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పిట్స్బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష కోణంకి ఈ నెల 6న ప్రముఖ పర్యాటక పట్టణమైన వ్యూంటా కానా ప్రాంతానికి వెళ్లింది. అక్కడ బీచ్‌లో ఒక స్నేహితుడితో కలిసి ఈతకోసం వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో మిగిలిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఆమె ఆచూకీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆమె బీచ్‌లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావించి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో గత నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భారతదేశానికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు. 20 ఏళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోణంకి పిట్స్బర్గ్ యూనివర్శిటీలోచదువుతోంది. తన కుమార్తె పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రీ-మెడికల్ స్టడీకి ముందు వెకేషన్కోసం పుంటా కానాకు వెళ్లిందని, స్నేహితులతో కలిసి రిసార్ట్‌లో పార్టీకి వెడుతున్నట్టు చెప్పిందని, అవే తనతో మాట్లాడిన చివరి మాటలని సుదీక్ష తండ్రి సుబ్బరాయుడు కోణంకి కన్నీటి పర్యంతమైనారు. తన బిడ్డ మెరిట్ స్టూడెంట్ అనీ, డాక్టర్ కావాలని కలలు కనేదని గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో స్నేహితులను పోలీసులు ప్రశ్నించారని, ఎవరిపైనా ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.
క్రైమ్

టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరో ఐదుగురి అరెస్ట్
నకిరేకల్: పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరో ఐదుగురిని శనివారం సాయంత్రం రిమాండ్‌కు తరలించామని నల్లగొండ జిల్లా నకిరేకల్ సీఐ రాజశేఖర్ తెలిపారు. ఈ నెల 21న నకిరేకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రంలో ఓ యువకుడు తెలుగు ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి సామాజిక మాద్యమాల్లో వైరల్ చేసిన విషయం విధితమే. ఈ ఘటనలో మొత్తం 12 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఈ నెల 23న చిట్ల ఆకాష్, బండి శ్రీను, గుడుగుంట్ల శంకర్, బ్రహ్మదేవర రవిశంకర్, ఓ బాలుడుని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. కేసు తదుపరి విచారణ అనంతరం శనివారం నకిరేకల్‌కు చెందిన పోగుల శ్రీరాముల, తలారి అఖిల్‌కుమార్, ముత్యాల వంశీ, పల్స అనిల్‌కుమార్, పళ్ల మనోహర్‌ను శనివారం రిమాండ్‌కు పంపామని, ఓ బాలుడు పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు. రిమాండ్ చేసినవారిలో ఇద్దరు కాంగ్రెస్, ఇద్దరు బీఆర్ఎస్, ఒకరు బీజేపీకి చెందిన వారుగా గుర్తించామని పేర్కొన్నారు.

‘హమ్మయ్యా!’ ఆ ఆరుగురు దొరికారు
అంబేద్కర్ కోనసీమ జిల్లా, సాక్షి: ఆరుగురు విద్యార్థుల మిస్సింగ్ కేసు ఎట్టకేలకు సుఖాంతమైంది. ఐదురోజుల తర్వాత.. శనివారం ఆ పిల్లల ఆచూకీ శనివారం లభ్యమైంది. తల్లిదండ్రులు మందలించారనే వాళ్లు అలా వెళ్లిపోయినట్లు సమాచారం.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండల కేంద్రమైన ఆలమూరు శివారు కండ్రిగ (యానాదుల) పేటకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఈ నెల 24వ తేదీన స్కూల్‌కు వెళ్లి తిరిగి రాలేదు. బడి, ఇల్లు తప్ప ఏం తెలియని చిన్నారులు అలా కనిపించకుండా పోయేసరికి అంతా ఆందోళన చెందారు. చుట్టుపక్కల గాలించి.. బంధువులను ఆరా తీసి చివరకు స్థానిక పోలీసులను అశ్రయించారు.ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. వాళ్లంతా బొబ్బా జయశ్రీ బాలికోన్నత పాఠశాలలోనే చదువుతున్నారు. స్థానికుల సాయంతో పోలీసులు చుట్టుపక్కల గాలించారు. వాళ్ల ఫొటోలను మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ చేశారు. డ్రోన్ సాయంతో పరిసర ప్రాంతాల్లో అన్వేషించారు. నాలుగు రోజులైనా ఆచూకీ తెలియరాకపోవడంతో అంతా కంగారుపడ్డారు.చివరకు పి.గన్నవరం మండలం పెదమాల లంకలో మొక్కజొన్న రైతులకు విద్యార్థులు కనిపించారు. అయితే వాళ్లు ఆకలితో ఉండడంతో భోజనం పెట్టి పంపించి వేశారు. ఈ క్రమంలో సిద్ధాంతం వద్ద ఉన్న లంకలో బాలబాలికను గుర్తించిన పోలీసులు చివరకు ఆలమూరుకు తరలించారు. తల్లిదండ్రులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది.

వీడు మనిద్దరికి పుట్టిన బిడ్డేనా?
అన్నానగర్: భార్యపై అనుమానం పెనుభూతమైంది. తామిద్దరూ నల్లగా ఉన్నా.. బిడ్డ మాత్రం మంచి రంగుతో జన్మించడంపై సందేహించాడు. బిడ్డ ఎదిగే కొద్దీ అనుమానం కూడా అదే తీరులో బలపడింది. చివరకు ఆ రెండున్నరేళ్ల చిన్నారిని గొంతు నులిమి హతమార్చాడు. ఊయల తాడు బిగుసుకుని మరణించిందని బుకాయించాడు. అయితే పోస్టుమార్టం నివేదికలో గొంతు నులమడం వల్లే చనిపోయిందని తేలడంతో ఆ కసాయి కటకటాలపాలయ్యాడు. వివరాలు..చెన్నై మన్నడి లింగుచెట్టి వీధికి చెందిన అక్రమ్ జావిద్ (33) పత్తి దుకాణంలో పని చేసేవాడు. అతని భార్య నిలోఫర్. వీరికి పెళ్లయి నాలుగేళ్లైంది. వీరికి రెండున్నరేళ్ల వయసున్న కుమార్తె పాహిమా ఉంది. గత 26వ తేదీ రాత్రి నీలోఫర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్ ఉపవాసం విరమించేందుకు సమీపంలోని మసీదుకు వెళ్లింది. కుమార్తెతో ఇంట్లోనే జావిద్ ఉండిపోయాడు. ఇఫ్తార్ అనంతరం ఇంటికి తిరిగొచ్చిన నీలోఫర్‌కు పాహిమా మెడ తొట్టి తాడుతో ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకుందని అక్రమ్ జావిద్ తెలిపారు. వెంటనే చిన్నారిని స్టాన్లీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం మేరకు నార్త్ కోస్ట్ పోలీస్ ఇన్స్పెక్టర్ విజయకాంత్ కేసు నమోదు చేసి చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. జావిద్‌ను ప్రశ్నిస్తే ఊయల తాడు మెడకు బిగుసుకుపోవడం వల్లే చనిపోయిందని చెప్పుకొచ్చాడు. అయితే శుక్రవారం అందిన పోస్టుమార్టం నివేదికలో చిన్నారిని గొంతు నులిమి హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నాయని వెల్లడైంది. దీంతో తమదైన శైలిలో విచారణ చేసేసరికి తానే బిడ్డను గొంతు నులిమి హతమార్చినట్టు జావిత్ అంగీకరించాడు. తాను, తన భార్య నల్లగా ఉన్నప్పటికీ పుట్టిన బిడ్డ మాత్రం మంచి రంగుతో ఉండడంతో తన భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు వాంగ్మూలమిచ్చాడు.

ప్రియురాలికి పురుగుల మందు తాగించి పరారైన ప్రియుడు..!
జంగారెడ్డిగూడెం(ఏలూరు): మండలంలోని పేరంపేటలో ఆత్మహత్యకు పాల్పడిన వివాహిత చికిత్స పొందుతూ మృతిచెందింది. దీనికి సంబంధించి ఎస్సై షేక్ జబీర్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పేరంపేటకు చెందిన హేమదుర్గా అనంత ప్రసన్నకు, కొయ్యలగూడెం మండలం యర్రంపేటకు చెందిన దార్ల రాంప్రసాద్‌తో 2014లో వివాహమైంది. వీరికి 11 సంవత్సరాల కుమార్తె ఉంది. కొయ్యలగూడెం మండలం గంగన్నగూడెంకు చెందిన మోదుగ పెద్దసాయి.. ప్రసన్నను ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. వారు ఏకాంతంగా ఉన్న సమయంలో పొటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసేవాడు. ఫిబ్రవరి 7న ప్రసన్న ఇంటికి వెళ్లి మనిద్దరం చనిపోదాం! అంటూ పురుగుల మందు తాగించాడు. కుటుంబ సభ్యులు ఆమెను కొయ్యలగూడెం ఆసుపత్రికి తీసుకువెళ్లగా, అక్కడ చికిత్స పొందిన తరువాత తండ్రి ఈశ్వరాచారి కుమార్తె ప్రసన్ననను జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు తీసుకొచ్చాడు. 15 రోజుల తరువాత పెద్దసాయి పేరంపేటకు వచ్చి గొడవ పడ్డాడు. మార్చి 26న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రసన్న ఇంటికి వచ్చిన సాయి చనిపోదాం.. అని నమ్మించి ప్రసన్నతో కలుపుమందు తాగించాడు. మందు ప్రభావాన్ని తట్టుకోలేక ప్రసన్న కేకలు వేయగా, ఆమె తల్లి పరుగున అక్కడికి వచ్చింది. ఆమెను చూసిన సాయి అక్కడినుంచి పారిపోయాడు. ప్రసన్నను వెంటనే జంగారెడ్డిగూడెంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 27న చనిపోయింది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.మృతదేహంతో ధర్నాకొయ్యలగూడెం: ప్రసన్న కుటుంబానికి న్యాయం చేయాలంటూ గంగన్నగూడెంలో బంధువులు ఆందోళన చేపట్టారు. జంగారెడ్డిగూడెం నుంచి గంగన్నగూడెంకు ప్రసన్న మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలిస్తుండగా, పోలీసులు అంబులెన్స్ డ్రైవర్‌కు ఫోన్ చేసి మధ్యలోనే ఆపించారు. దీంతో మృతదేహాన్ని మోటార్‌సైకిళ్లపై గంగన్నగూడెం తీసుకువెళ్లి ధర్నా చేశారు. ప్రసన్న మృతికి గంగన్నగూడెం గ్రామానికి చెందిన సాయి కారణమని అతని ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి ధర్నా చేశారు. ఆ సమయంలో యువకుడితో సహా అతని ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బయటే ఉండి ఆందోళన చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వారితో చర్చించి మృతదేహాన్ని తరలించేలా ఒప్పించారు.
వీడియోలు


వరుసగా రెండో ఓటమిని చవిచూసిన హైదరాబాద్


దేశ వ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు


వైఎస్ జగన్ హయాంలో ఏపీ పోలీస్ శాఖకు దేశంలోనే అత్యున్నత ర్యాంక్


పీ4..అడ్వాన్స్డ్ ఏప్రిల్ ఫూల్!


ముస్లిం సోదరులకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు


పేదలపై మరోసారి సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు


ఏపీ పోలీసులకు హైకోర్టు మొట్టికాయలు


మా ఎంపీటీసీలను కాపాడుకోవటం మా బాధ్యత: గోపిరెడ్డి


Ugadi Special: క్యూట్ కపుల్.. క్యూటెస్ట్ ఇంటర్వ్యూ


ఎర్రపుస్తకం తెల్లమొహం వేసింది..!